వెలుగు రేఖల వెతుకులాటలో…!

beautyofearth7

నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!

7 Comments so far

  1. bollojubaba on April 8th, 2009

    excellent poetry.
    fine

  2. ananda on April 8th, 2009

    baagundi

  3. kaarunya on April 9th, 2009

    Thank U Very Much… Friend :)

  4. kaarunya on April 9th, 2009

    :) :)

  5. parimalam on April 9th, 2009

    మీ కవిత , బొమ్మ కూడా పోటీ పడుతున్నాయండీ ..
    మీరేమనుకోనంటే బొమ్మకి వంద మార్కులూ ఇచ్చేయొచ్చు .అంత అధ్బుతంగా ఉంది .

  6. kaarunya on April 11th, 2009

    ఇందులో అనుకోవడానికి ఏముందండీ… మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజం. నాకు కూడా ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది. అందుకే పెట్టాను.

  7. wow power leveling on November 3rd, 2009

    Good article – plenty of food for thought.

Leave a reply

7468 pages viewed, 33 today
2891 visits, 20 today
FireStats icon Powered by FireStats