బదులేమీ చెప్పలేకున్నా…!!

ఎందుకిలా అవుతోంది
ఏ అనుభూతులు నాలో
జీవం పోసుకుంటున్నాయి
అసలు నువ్వు లేకుండా
ఒక్క క్షణం కూడా గడవదే
ఎంతమందితో ఉన్నా
నీతో ఉన్న అనుభూతి లేదే
ఎందుకిలా అవుతోంది
నీ పిలుపుకి.. నీ నవ్వుకి..
నీ అలకలకి.. బుంగమూతికి
నీతో కలిసే అడుగులకు
నీకై కలిపే అన్నం ముద్దలకు
నీకోసం వెతికే కళ్లకు
బదులేమీ చెప్పలేకున్నా
తొందరగా వచ్చేసేయ్.. ప్లీజ్…!!
Comments(5)
చాలా బాగుందండీ.. ఇష్టమైన మనుషులు, ప్రేమతో పలకరించే వారు పక్కనే లేకుంటే ఎంత బాధేస్తుందో కళ్లకు కట్టినట్లు మీ కవిత ద్వారా చెప్పారు. నైస్…!
“ప్రతి ఎడబాటు మరొక కలయిక కోసమే..
ప్రతి కలయిక మరొక ఎడబాటు కోసమే..”
24 గంటలూ వెలుగే ఉంటే ఎలా చెప్పండి. చీకటీ ఉండాలిగా. కాసింత చేదు కూడా ఉంటేనేగా, తీపి విలువ తెలిసేది, పెరిగేది. అలాగని జీవితంలో చేదు పాళ్లు పెంచేసుకోకండి.
ఇంతకీ మీ బుంగమూతి బిడ్డకి పెళ్లయ్యిపోతే మీ పరిస్థితేంటి?? ఇప్పటినుంచే అలవాటు పడండి మరి. ఏమంటారు
i was wondering about the photos. what a beauty.
then was astonished while reading the poem. what a poetry.
with best wishes
bollojubaba
సంతోషంతో నా కసలు మాటలు రావటం లేదండీ… గూగుల్ ఫోటోలకు నాకు తెలిసిన కాస్తంత ఫోటోషాప్ పరిజ్ఞానాన్ని జోడించి బ్లాగులో చొప్పించానంతే…!
కృతజ్ఞతలతో…
కారుణ్య
Good post! I plan to move into this stuff after I’m done with school, as most of it is time consuming. It’s a great post to reference back to. My blog needs more time to gain in popularity anyway.