మర్చిపోలేనన్నావు కానీ….!

మర్చిపోలేనన్నావు కానీ..
క్షమించటం మరిచావు
అయినప్పటికీ…
నీ స్నేహం కావాలి
నిజంగా నీకు తెలుసో లేదోగానీ
ఊపిరాగిపోయేదాకా నీ స్నేహం కావాలి
నువ్వు నా పక్కన లేని రోజున
కాలం కదుల్తోందా అనిపిస్తుంది
నీ తియ్యటి పిలుపులను
అంతం లేని కబుర్లను
కలిసి తిరిగిన ప్రాంతాలను
పంచుకున్న ఆనందాలను
కళ్లు కన్నీటి సంద్రాలయినప్పుడు
నేనున్నానని ధైర్యం చెప్పే
నులివెచ్చటి నీ స్పర్శను
అన్నింటినీ… అన్నింటికీ
దూరంగా జరిగిపోయినట్లు
గుండెల్లో ఒకటే బాధ…
ఆరోజేం జరిగిందో…
ఎందుకు వాదులాడామో
ఎందుకు దూరమయ్యామో
మాటల గాయాలు
మళ్లీ వెనక్కి రావు
కానీ..
అన్నింటినీ మర్చిపోయి
మళ్లీ తిరిగొస్తావని
నన్ను మన్నిస్తావనీ…
మళ్లీ నిన్ను చూసే
అదృష్టాన్ని ప్రసాదిస్తావని
చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తూ…!
Comments(3)
ఆరోజేం జరిగిందో…
ఎందుకు వాదులాడామో
ఎందుకు దూరమయ్యామో
రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దమైనా వస్తుంది, ఇద్దరు దూరమయ్యారంటే వారిద్దరి పాత్ర అందులో ఉంటుంది అనేది పాతకాలం సామెత. మన ప్రమేయం లేకుండానే అవతలి వ్యక్తి చాచి చెంపపై కొడితే కూడా శబ్దం వస్తుంది. ఆపై జరిగే పర్యవసనాలకు ఇద్దరు బలి కావలసి ఉంటుంది.
ఒకటి మాత్రం నిజం.
ముందుగా కత్తి దూసినవారిదే తప్పు. ఇంతకీ మీ ఇద్దరిలో ముందుగా కయ్యానికి కాలు దువ్వింది ఎవరో? ఎందుకో?
మీరే అయితే, క్షమాపణలు కోరండి, అలా కాకుండా అవతలి వారైతే, మరో మాటకు తావు లేకుండా – “క్షమించేయండి..”
అప్పుడిక సమస్యే లేదుగా !!!
Nice it is. క్షమాపణ చాలా అవసరమండీ…
మన్నింపుకు దూరమైనా…
మనసారా నవ్వించే మనిషి కోసం…
ఎంతమంది ఉన్నా తీరని, తీర్చలేని.. ఆ నులివెచ్చటి స్పర్శ కోసం.. కళ్లు చెమర్చినా ఫర్వాలేదు. కవిత కల్పితమైతే… బాగుంది..
కల్పించనిది అయితే… అనుకన్నది అవుతుంది.