నాకు నేను పసిపాపనే…!

నేను భవిష్యత్తునెదుర్కొంటాను
అది నాకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
నేను ఎదురుచూసినట్లుగా ఏమీ ఉండదు
నా కోసం ఏదీ ఎదురుచూస్తూ ఉండదు కూడా…

అలాంటప్పుడే నాదైన స్వప్నం
ఈ భూమ్మీదకు వాలిపోయింది
కాలం గడిచేకొద్దీ…
నావైన చిన్ని ప్రపంచాలు
కలలు, ఆశలు, ఆరాటాలు
అన్నీ అలా.. కొద్ది కొద్దిగా…
నాకు దూరంగా వెళ్లిపోయాయి

మళ్లీ ఆ రోజులకు వెళ్లలేను
ఇంకెప్పటికీ అవి తిరిగి రాలేవు
అయినప్పటికీ…
నాకు నేను ఎప్పుడూ పసిపాపనే..
ఎందుకంటే…
ఓ చిన్ని పాపకో… లేక
ఈ ప్రపంచానికో
అమ్మను కాబోతున్నాను కదా…!

2 Comments so far

  1. Sree on February 2nd, 2009

    బ్లాగు.కామ్‌కు స్వాగతం కారుణ్య గారు. కవిత, కవితకు మీరు ఎంచుకున్న చిన్నారి ఫోటో.. రెండూ అద్భుతంగా ఉన్నాయి. మరిన్ని కవితలతో పాఠకులను అలరిస్తారని ఆశిస్తున్నాను. మీ బ్లాగ్‌రోల్‌లో నా బ్లాగును జోడించినందుకు ధన్యవాదాలు.. :)

  2. wow power leveling on November 3rd, 2009

    Good post,This was exactly what I needed to read today! I am sure this has relevance to many of us out there.

Leave a reply

7466 pages viewed, 33 today
2891 visits, 22 today
FireStats icon Powered by FireStats