naa kavitha

Just another బ్లాగు weblog

మధుర క్షణం

Filed under: kavithalu — go2nag at 12:36 am on Sunday, March 8, 2009

భారతావని లో అతి విలువైన వివాహబంధానికి నేను కూడా చేరువైన వేళ . సుముహూర్తం April,27th 2009.

మధుర క్షణం

మోయలేని ఈ మాయ హాయిని

కనుల క్రింద కలల వాకిలిలో

బంధించాలని కనులు మూస్తే

మూసుకుంది కనురెప్పలే కాని

విచ్చుకుంది నా హ్రుదయ నేత్రం

ఇంద్రధనస్సు రంగులలో

వర్తమానం భవిష్యత్తు

కలగలిపి కనిపించే క్షణం

చిరుధరహాసానికి కారణం

తర్కించలేని తరుణం

చిలిపి ఊహలకు బంధనం

వేయలేని నిస్సహాయం

మౌనంలో మాటలు వినిపించే వైనం

మాటలలో అమృత భాండాగారం

శూన్యం లో వెన్నెల సాక్షాత్కారం

వివాహ సుముహూర్తానికి ముందు

వివాహ నిశ్చయానికి తరువాత

అనుభవించే అనుక్షణం ప్రీతిప్రాయం

అద్భుతం అమోఘం అనన్యం అసామాన్యం

అవివర్ణం అనిర్వచనీయం అసాధారణం

నిర్వ్యక్తం నిగూఢం నిత్యనూతనం

ఆ సుందర సుమధుర క్షణం

 

                                                                              –నాగేశ్వరరావు కోటా 

RTS Perm Link

9 Comments »

295

Comment by krishna rao jallipalli

March 8, 2009 @ 2:44 am

ఏది ఏమైనా… మీ ప్రీతి గారు చాలా అదృష్టవంతులు మీలాంటి కవితాత్మ గల భర్త ను పొందుతున్నందుకు. అలాగని మీరు ప్రతిదానికీ కవితలు చెప్పి, వినిపించి …. విసిగించ కుండా …ఎంతో ప్రీతిపాత్రంగా మెలగండి.
MY HEARTY ADVANCE WISHES.

302

Comment by ramesh

March 8, 2009 @ 11:34 am

amogham

bala mitrama bala.

304

Comment by Parimala Philip

March 8, 2009 @ 12:36 pm

Hi Nagesh

అద్భుతం అమోఘం అనన్యం అసామన్యం
Awesome invitation :)

Parimala

309

Comment by Ghantasala Kiran

March 8, 2009 @ 8:10 pm

Congratulations.
Post more details about ur marriage.

313

Comment by Phani

March 8, 2009 @ 10:08 pm

మీ జీవితంలో ముఖ్యమైన అంకంలోనికి ప్రవేశిస్తున్నందుకు అందుకోండి మా హృదయపూర్వక అభినందనలు.
మీ వివాహ జీవితం సుఖః సంతోషాలతో ‘ ప్రీతి ‘ పాత్రంగా సాగాలని కోరుకుంటూ
కవిత చాలా బాగుంది
మిత్రుడు
ఫణి

322

Comment by Mandala

March 9, 2009 @ 11:02 am

Congrats Nag…..

Eppudu fix ayindhi eppudu indiaki velthunnavu?

364

Comment by sunita

March 12, 2009 @ 3:53 am

Hi nag…
Congrats……….
and ur Kavita so nice………

424

Comment by palle venkateswarlu

March 16, 2009 @ 4:24 am

Hi nag, congrats dear…
shortly i will announce mine good news also

439

Comment by krishna rao jallipalli

March 17, 2009 @ 10:44 am

THANKS. VERY GOOD…BYE

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>


 

RTSMirror Powered by JalleDa