భారతావని లో అతి విలువైన వివాహబంధానికి నేను కూడా చేరువైన వేళ . సుముహూర్తం April,27th 2009.
మధుర క్షణం
మోయలేని ఈ మాయ హాయిని
కనుల క్రింద కలల వాకిలిలో
బంధించాలని కనులు మూస్తే
మూసుకుంది కనురెప్పలే కాని
విచ్చుకుంది నా హ్రుదయ నేత్రం
ఇంద్రధనస్సు రంగులలో
వర్తమానం భవిష్యత్తు
కలగలిపి కనిపించే క్షణం
చిరుధరహాసానికి కారణం
తర్కించలేని తరుణం
చిలిపి ఊహలకు బంధనం
వేయలేని నిస్సహాయం
మౌనంలో మాటలు వినిపించే వైనం
మాటలలో అమృత భాండాగారం
శూన్యం లో వెన్నెల సాక్షాత్కారం
వివాహ సుముహూర్తానికి ముందు
వివాహ నిశ్చయానికి తరువాత
అనుభవించే అనుక్షణం ప్రీతిప్రాయం
అద్భుతం అమోఘం అనన్యం అసామాన్యం
అవివర్ణం అనిర్వచనీయం అసాధారణం
నిర్వ్యక్తం నిగూఢం నిత్యనూతనం
ఆ సుందర సుమధుర క్షణం
–నాగేశ్వరరావు కోటా
RTS Perm Link