మొదటి సారి
మొదటి సారి
ప్రపంచపు ప్రమిద ను వెలిగించే సూర్యునిపై
మొదటి సారిగా నాకు కోపం వచ్చింది
సూటిగా నా కను రెప్పలను తాకి
నా స్వప్నాన్ని కనుమరుగు చేసినందుకు
అందమయిన పున్నమి నాటి చందమామపై
మొదటి సారిగా నాకు జాలి వేసింది
నా చెలి నగుమోము ముందు తన అందం వెలవెల పోతున్నందుకు
మనసుని మురిపించె చిరు చినుకులపై
మొదటి సారిగా నాకు ఈర్ష్య కలిగింది
నా చెలిని తాకిన అదృష్టాన్ని పొంది
అందమయిన ముత్యం గా మారుతున్నందుకు
వికసించి విరపూసే విరిజాజులపై
మొదటిసారిగా నాకు ప్రేమ కలిగింది
నా చెలి సిగలో చేరి
ఆ అందాన్ని తనలో నిలుపుకున్నందుకు
ప్రకృతి అందాలన్ని తనలో నిలుపుకుంది
తాను మాత్రం నా హృదయం లో నిలిచిపోయింది
నాగేశ్వర రావు కోటా.