naa kavitha

Just another బ్లాగు weblog

పైశాచిక ఆనందం

Filed under: Uncategorized — go2nag at 10:50 am on Wednesday, January 2, 2013

పైశాచిక ఆనందం

ఆనందానికి,పైశాచిక ఆనందానికి మధ్య తేడా తెలియకుండ
పయనిస్తోంది మన మానవ మనుగడ..
మన క్రియల ద్వార ఎదుటి వారిని నొప్పించకుండా వచ్చేది ఆనందం
ఎదుటి వారి భాధల నుండి మనకి పుట్టేది పైశాచికం.
ఆనందానికి ఆయువు అనంతమైతె
పైశాచికానందానికి ఆయువు అణుమాత్రం
ఎదుటి వారికి మన ద్వారా కలిగే కన్నీటి బొట్టు
మన చితికి ఆజ్యంలా పనికి వచ్చే నూనె బొట్టు..
ఒక పురుషుడు స్థ్రీని బలాత్కరించడం ఒక్కటే కాదు సమస్య..
రెండు జాతులు లేక రెండు విభాగాల మధ్య జరిగే
నిరంతర అతి జుగుప్సా కరమైన ఆదిపత్య క్రీడ
పేద వాడి గుడిసె తగలపడితె ..
ఉన్నవాడు దాని మంటలో చలి కాచుకుంటాడు.
అందమైన స్త్రీ కనపడితే..
తన మానాన్ని దోచుకుంటాడు పురుషుడు.
మన చేతికే దెబ్బ తగిలితే..
మన కన్ను భాధపదకుండా సంతోషపదుతుందా…
మన సమాజాన్ని కూడా ఒకే శరీరం లా గుర్తిద్ధాం
అందులో మనమందరం అవయవాలు…
ఒకరిని భాధించటం ద్వారా వచ్ఛే పైశాచిక ఆనందాన్ని..
పాతాళంలో పాతర వేసేద్దాం…

కె నాగేశ్వరరావు

RTS Perm Link

జన్మదిన శుభాకాంక్షలు

Filed under: Uncategorized — go2nag at 3:16 pm on Thursday, April 9, 2009

పరికించి చూస్తే రెప్పపాటుది మనిషి జీవితం
అందులో చీకటిలాంటి దుఖం అరక్షణం ఆక్రమిస్తే
ఆనందపు వెలుగులకు మిగిలేది ఇంకో అరక్షణం మాత్రమే
సరిగమపదని లు సప్తస్వరాలే అయినా
వాటితో కోటి రాగాలు పలికించినట్లు 
ఆకాశాన్ని ఆవరించిన అనంతమైన తారల్లా
విరిజాజుల పరిమళ చిరునవ్వుల దరహాసాన్ని
నీ పెదవుల పూతోటలో ప్రతీక్షణం  పూయించాలని
ఈరోజే ఆ మహోత్సవానికి శ్రీకారం చుట్టాలని
ప్రేమతో ప్రీతికి  జన్మదిన శుభాకాంక్షలు …..

Nageswar Rao K
 

RTS Perm Link

మధుర క్షణం

Filed under: kavithalu — go2nag at 12:36 am on Sunday, March 8, 2009

భారతావని లో అతి విలువైన వివాహబంధానికి నేను కూడా చేరువైన వేళ . సుముహూర్తం April,27th 2009.

మధుర క్షణం

మోయలేని ఈ మాయ హాయిని

కనుల క్రింద కలల వాకిలిలో

బంధించాలని కనులు మూస్తే

మూసుకుంది కనురెప్పలే కాని

విచ్చుకుంది నా హ్రుదయ నేత్రం

ఇంద్రధనస్సు రంగులలో

వర్తమానం భవిష్యత్తు

కలగలిపి కనిపించే క్షణం

చిరుధరహాసానికి కారణం

తర్కించలేని తరుణం

చిలిపి ఊహలకు బంధనం

వేయలేని నిస్సహాయం

మౌనంలో మాటలు వినిపించే వైనం

మాటలలో అమృత భాండాగారం

శూన్యం లో వెన్నెల సాక్షాత్కారం

వివాహ సుముహూర్తానికి ముందు

వివాహ నిశ్చయానికి తరువాత

అనుభవించే అనుక్షణం ప్రీతిప్రాయం

అద్భుతం అమోఘం అనన్యం అసామాన్యం

అవివర్ణం అనిర్వచనీయం అసాధారణం

నిర్వ్యక్తం నిగూఢం నిత్యనూతనం

ఆ సుందర సుమధుర క్షణం

 

                                                                              –నాగేశ్వరరావు కోటా 

RTS Perm Link

విరహం

Filed under: kavithalu — go2nag at 2:48 pm on Saturday, September 20, 2008

dedicated to forced bachelors  of my team

 విరహం

నుదిటి పై వ్రాలిన నీ ముంగురులును
నా చూపుడు వేలి తో సవరిస్తూ
నీ చెక్కిలి పై చుంభనానికి చేరువైనపుడు
సిగ్గుతో నన్ను విదిలిస్తూ విసిరినపుడు

నీ పెదవులపై పరిమళించిన చిరునవ్వుని
నా మనస్సు తెర పై పదెపదే ఆవిష్కరించుకొని
ఆత్యంత క్లిష్టమైన ఈ కాలాన్ని కష్టంగా వెల్లదీస్తున్నాను

పూర్వ జన్మలో ఏదో చేసిన పాపానికి
పరిహారం ఈ విరహమని అప్పుడే తెలిస్తే
దాని చెంత కూడా చేరే సాహసం చేసేవాడిని కాదేమో

కలలో నిన్ను చూడటానికే నిద్రపోతూ
తిరిగి నిన్ను చేరుకోవటానికే శ్వాసిస్తూ
మనం కలిసి ఉన్న ఆ క్షణాలనే ఊహిస్తూ

మన మధ్య అల్లుకున్న దూరాలు
గాలి కుడా చూరనంత చేరువగా చేరాలని
ఆ అనంత ఆనంద క్షణాలకొరకై వేచి చూస్తూ
నీ ………………………………………..

                                               –  నాగేశ్వర రావు కోటా

RTS Perm Link

ఏవరు నువ్వు

Filed under: kavithalu — go2nag at 2:13 pm on Saturday, August 2, 2008

ఏవరు నువ్వు
స్వప్నం లో కనిపించి నిదురలేపినావు

నవ వసంత కోకిలవా
సంవత్సరం వరకు వేచిచూడాలేమో

పున్నమి వెన్నల జాబిలివా
పక్షం రోజుల వరకు రావేమో

అందమైన సంధ్యాసమయానివా
పన్నెండు గంటలు గడపాలెమో

మిరుమిట్లు గొలిపే మెరుపువా
క్షణ కాలమే కనిపిస్తావేమో

ఎండమావి లోని నీరువా
ఎప్పటికీ కనిపించవేమో

               

                                  నాగేశ్వర రావు కోటా

RTS Perm Link

నువ్వు తప్ప

Filed under: kavithalu — go2nag at 10:25 am on Sunday, July 13, 2008

నిన్ను చూసినప్పుడు తప్ప

నా కన్నులు చూసేది శూన్యం

 నువ్వు విన్నప్పుడు తప్ప

నా పెదవి పలికేది మౌనం

నీ మాట మధురిమ తప్ప

నా చెవిని చేరేది నిశబ్ధం

నీ మల్లెల పరిమలమే తప్ప

నాకు లేదు ఏ సువాసన

నీ చల్లని చూపే తప్ప

నను తడమదు ఏ స్పర్శ

నీ పెదవికి చిరునవ్వు తప్ప

నా మనస్సు కు లేదానందం

నువ్వుండే ప్రాంతం తప్ప

నాకేదీ వేరే స్వర్గం…

                                                       నాగేశ్వర రావు  కోటా.

RTS Perm Link

నిరీక్షణ

Filed under: kavithalu — go2nag at 10:53 am on Wednesday, July 9, 2008

నేను నేనుగా లేని నాలో నిలిచిన నీతో

నా లో నీ లా నేను కూడా నీలొ ఉన్నానా అని అడిగితే

మౌనమే నీ సమాధానమైతే

మౌనం అర్ధంగీకారమనుకునేనా

అసలు అర్ధవంతమైన అభిప్రాయమేదీ లేదనుకునేనా!

  

ఎటు చూసినా నీవే కనిపిస్తున్నా 

ఆమె నీ చెంత లేదనే భాధ ఎందుకని

నా మనస్సు ని ప్రశ్నిస్తే

ఎంతైనా అది ఊహేగాఅని తిరిగి ప్రశ్నిస్తే 

నీ సమాధానం కోసం ఎదురుచుస్తున్నాను

కోటి వరాల ఆ సంతోషం కోసం నిరీక్షిస్తున్నాను

                                    నాగేశ్వర రావు  కోటా.
 

when I asks you whether I am there In you are not

Like you are there in me,

if silence is ur answer should i treat it as yes or it doesnt hav ny meaning?

 

where ever I see ur there…I asked my heart that then what is ur problem,why ur sad…

then it replies nyway it ur imagination only…

I am waiting 4 ur reply and the happiness of ur positive reply…

 

 

RTS Perm Link

నీ …. తోటె

Filed under: kavithalu — go2nag at 10:36 am on Friday, July 4, 2008

నీ నవ్వుల వెల్లువ చూసే
నా హ్రుదయం స్పందిస్తుంది

నీ అడుగుల సవ్వడి తోటె
నా ప్రాణం స్వాసిస్తుంది

నీ చల్లని చూపులు తాకే
నా పెదవులు వికసిస్తొంది

నీ మాటల మధురిమ తోటే
నా అణువణువూ పులకిస్తొంది

నీ సుందర నగుమొమే గా
నను నడిపే అశాదీపం

వీటన్నిటికి దూరంగా నేను
ఊహించటమే చాలా కష్టం

నా కన్నీటికి పని కల్పించే
అవివర్ణ ప్రాణ సంకటం

                                                        నాగేశ్వర రావు  కోటా.

(True Translation into english may not be meaningful) 

BY your laughing storm only,My heart is beating

By listening the sound of ur foot steps only,My life is taking breathe

By the touch of ur cool eye sight only,My lips will blossoms

By the sweetness of ur words only,My every pat of parts be joyful

You beautiful smiling face only,Making me to keep a hope alive

By being far away from these,Its too horrible to think itself

Which starts me  to weep,And I have no words to explain this.

RTS Perm Link

మొదటి సారి

Filed under: kavithalu — go2nag at 10:52 am on Wednesday, June 25, 2008

                  మొదటి సారి
ప్రపంచపు ప్రమిద ను  వెలిగించే  సూర్యునిపై
మొదటి సారిగా నాకు  కోపం వచ్చింది
సూటిగా  నా కను రెప్పలను తాకి 
నా స్వప్నాన్ని కనుమరుగు చేసినందుకు
అందమయిన పున్నమి నాటి చందమామపై
మొదటి సారిగా నాకు జాలి వేసింది
 నా చెలి నగుమోము ముందు తన అందం  వెలవెల పోతున్నందుకు
మనసుని మురిపించె చిరు చినుకులపై 
మొదటి సారిగా నాకు ఈర్ష్య కలిగింది
నా చెలిని తాకిన అదృష్టాన్ని పొంది 
అందమయిన ముత్యం గా మారుతున్నందుకు
వికసించి విరపూసే విరిజాజులపై 
మొదటిసారిగా నాకు ప్రేమ కలిగింది
నా చెలి  సిగలో చేరి 
 అందాన్ని తనలో నిలుపుకున్నందుకు
ప్రకృతి అందాలన్ని  తనలో నిలుపుకుంది
తాను మాత్రం నా హృదయం లో నిలిచిపోయింది

                                                     నాగేశ్వర రావు  కోటా.

RTS Perm Link

నమస్కారములు…

Filed under: Uncategorized — go2nag at 10:27 am on Tuesday, June 24, 2008

నమస్కారములు
 నా  బ్లాగు నందు నేను ఉంచు నా కవితలు చదివి మీ అబిప్రాయాలు తెలుపగలరు.
మీ
నాగేశ్వర రావు  కోటా.

RTS Perm Link


 

RTSMirror Powered by JalleDa

css.php