శ్రీనగర్ లో తీవ్రవాదులతో జరిగిన పోరాటం లో హైదరాబాద్ కి చెందిన యువ మేజర్ కె.ఆర్.వినయ్ మరణించారు. పాపం ఇంకో నెల రోజుల్లో ఆయన పెల్లి ఉండిందంట..కేవలం హీరోల పిల్లల పెళ్ళి వేడుకల వార్తలనే కాదు, ఇలాంటి త్యాగమూర్తుల త్యాగాలని కూడా మొదటి పేజీ లో వేసి గౌరవించాలి. (కీపిటప్ ఈనాడు..)
పాపం మన సి.పి.ఐ నారాయణ గారు గాంధి జయంతి రోజున చికెన్ తింటూ పేపరోళ్ళ కంట్లో పడ్డారు. కానీ నిజాయితీ గ ఒప్పుకుని క్షమాపణ చెప్పి,ఇంకో సంవత్సరం పాటు చికెన్ తిననని ప్రమణం చేసారు——జీవితాంతం మానేస్తానని సినిమా దైలాగులు చెప్పకుండా కేవలం సంవత్సరం అని మాత్రమె చెప్పారంటే నిజంగానే చెప్పరేమో అనిపిస్తుంది.
ఏమైనా నిజాయితీ పరుల సంఖ్య లెఫ్ట్ పార్తీలల్లో కెక్కువేనంట.ఇంకో సంగతి నేను విన్నదేంటంటే, వాళ్ళ యం.పి లు , యం.ఎల్.ఏ లు వాళ్ళ జీతం లో సగం పార్టీ కార్యకర్తల జీతాలు చెల్లించడానికి ఖర్చు పెడతారంట..
పాపం కర్నాటకలో భా.జ.పా పరిస్థితే హీనంగా తయారయ్యింది.కుమారస్వామి సీట్ ఇచ్చేలాగా కనిపించట్లేదు.ఇది కమలనాథులకు రెండో అనుభవం లెండి..ఒకసారి మాయావతి తో కుడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకొని బోర్లా పడ్డారు.. అయినా మళ్ళీ అంతే..
సరే ఇంక రాజకీయాలు పక్కన పెడదాం..
ఈ మధ్య నేను ఒక సీరియల్ చూస్తున్నాను మా టి.వి లొ. అమ్మమ్మ డాట్ కాం అని..బానే ఉంటుంది కానీ ఎదవ డిటైల్స్ ఎక్కువ.. కాఫీ తాగే సీన్ ఉందనుకోండి కాఫీ చేత్తో తీస్కోవటం,గ్లాసు నోట్లో పెట్టుకొవటం, మొదటి సిప్ నుండి చివరి సిప్ దాకా మొత్తం కాఫీ అంతా అయిపొయేదాకా తాగిస్తాడు. ప్రస్తుతానికి అందులొ హీరోగారు అమెరికా లో ఉన్నారు, వాళ్ళ అమ్మ , మన హీరోయిన్ ఊళ్ళో జనాలని ఉద్ధరించటంలొ బిజీ.. ఇందులో జో అని ఒక పాత్ర ఉండెది.. మాంచి పంచ్ డైలాగ్స్ ఉన్న పాత్ర అది… ఈ మధ్య రావట్లేదు. వస్తే, మళ్ళీ ఏవైనా మాంచి దైలాగులు వినిపిస్తే మీకు చెప్తాన్లెండి.. ఇప్పుడు గుర్తులేవు ఏవీ..
ఎప్పటిలాగే మళ్ళీ ఒక జోకేస్కుని ముగిద్దాం..
మా ఆఫీసులో శంకర్ గారని చెప్పాను కదా, ఇది వారిది..
రోజూ లాగే టీ కి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచారు రమ్మని..
నేను “తాగి వచ్చాను” అని చెప్పాను..
దానికి ఆయన “ఎంటో ఆఫీసుకి తాగి కూడా వస్తున్నారు ఈ మధ్య” అని ..
మీ కబుర్లు బాగున్నాయి. ఐతే, ఒక చిన్న అచ్చు తప్పుంది పెల్లి కాదు పెళ్ళి అని వ్రాయాలి. ఇలానే మరిన్ని టపాలు వ్రాస్తూండండి.
అది టైపింగ్ మిస్టేక్ అండీ, లేఖిని ఇంకా అలవాటు కాలేదు..
నాకూ చిరాగ్గానే ఉంటుందనుకోండి అక్షరదోషాలు చూస్తే, ఇప్పటి నుండి ఇంకొంచెం బాగా రివ్యూ చేస్కుంటాను లెండి పోస్ట్ చేసే ముందు, థాంక్స్
అమ్మమ్మ డాట్ కాం నేను కూడా చూస్తున్నాను.మీకు లానే అనుకుంటూ వుంటాను.వెధవ సాగతీత.పాపం జ్యో.ఏమయిపోయిందో. “రాధ మధు” సీరియల్ చాలా నచ్చేది.ఇప్పుడు అది కూడా అన్ని జెమిని సీరియల్స్ లా అయిపోయింది.