చందమామ – ఓ ఆప్తవాక్యం

కినీమా ప్రకటన
సంక్రాంతి పర్వదినం సందర్భంగా శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు నా వ్యక్తిగత మెయిల్ ఐడీకి అరుదైన మెయిల్ పంపారు. సంక్రాంతి శుభాకాంక్షలు అనే ఒక వ్యాక్యం తప్పితే ఆ లేఖ ఆద్యంతం చందమామ చరిత్రకు, చందమామతో ముడిపడిఉన్న అంశాలకు సంబంధించిన అమూల్యమైన విషయాలను తడిమింది. దీంతో లేశమాత్రంగా కూడా వ్యక్తిగతపరిధిలో లేని ఈ మెయిల్‌ను యధాతథంగా అనువదించి చందమామ బ్లాగులో పోస్ట్ చేయాలని గత రెండు రోజులుగా ప్రయత్నిస్తూ సమయాభావం వల్ల కుదరకపోవడంతో దాని ఆంగ్ల మూలాన్ని యధాతథంగా ఈ కథనం కింది భాగంలో పొందుపరుస్తున్నాము.
నిజంగానే రోహిణీప్రసాద్ గారు చందమామతో పాటు, తెలుగు సినిమా, సాహిత్యాలకు సంబంధించిన ఓ ఉజ్వల శకం విశేషాలను తన మెయిల్‌లో కూలంకషంగా తడిమారు. చందమామ పూర్తి కాపీలను ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో ఉంచుతూ (1947-2000. త్వరలోనే 2008 వరకు చందమామలను కూడా ఆర్కైవ్స్‌లో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.) చందమామ నెలకొల్పిన సరికొత్త ట్రెండ్‌ను ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూనే, మరుగునపడిపోయిన ఆంధ్రజ్యోతి, కినీమా, విజయచిత్ర, బొమ్మై-తమిళ విజయచిత్ర-, యువ, డాల్టన్ పబ్లికేషన్స్ ప్రచురణల భాండాగారానికి సంబంధించిన తేనెతుట్టెను తడిమారు.
భవిష్యత్తు తరాలవారికి చందమామలను ఆన్‌లైన్ భాండాగారంలో ఉంచడంతో సరిపెట్టుకోకుండా, చక్రపాణిగారు, తదితరులు నెలకొల్పిన పై అన్ని పత్రికలను కూడా పాఠకులకోసం ఆర్కైవ్స్ రూపంలో అందించాలని కోరుతూ ఆయన ప్రస్తుతం ఆ పత్రికల కాపీలు దొరికే ఆధారాలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు.

కినీమా ప్రకటన
దాదాపు సంవత్సరం కాలంగా ఆంధ్రజ్యోతి, కినీమా, విజయచిత్ర, బొమ్మై-తమిళ విజయచిత్ర-, యువ తదితర ప్రచురణలను పరిరక్షించి, అందించాల్సిన అవసరంపై మేం కూడా ప్రగాఢంగా ఆలోచిస్తూ వచ్చిన విషయం ఈ సందర్భంగా పాఠకులకు తెలపాలని అనుకుంటున్నాము. కానీ, పై పత్రికలేవీ చందమామ ప్రస్తుత యాజమాన్యం -జియోదెశిక్, ముంబయ్- కాపీరైట్ పరిధిలో లేనందున ఈ అరుదైన పత్రికలు, ప్రచురణలను తెలుగు వారికి అందించే మహదవకాశం ప్రస్తుతం చందమామకు లేదు.
రెండేళ్లక్రితం చందమామనుంచి విడిపోయిన బి. విశ్వనాధరెడ్డి గారు ఇటీవల విజయా పబ్లికేషన్స్ పేరిట రెండు అరుదైన పుస్తకాలను ప్రచురించారు. అవి….
“మదిలోని జ్ఞాపకాలు” – బి. నాగిరెడ్డి జీవిత చరిత్ర, విజయా పబ్లికేషన్స్
“ఆనాటి ఆనవాళ్లు” -75 సంవత్సరాల తెలుగు సినిమా – విజయా పబ్లికేషన్స్
తెలుగు సినిమా వైభవోజ్వల శకానికి సంబంధించిన 75 గొప్ప సినిమాలను, చరిత్రను తడిమిన అరుదైన పుస్తకం “ఆనాటి ఆనవాళ్లు” కు రాసిన ముందుమాటలో విశ్వంగారు తిరిగి విజయచిత్ర సినీ మాసపత్రికను తీసుకువచ్చే ఉద్దేశాన్ని వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆనాటి ఆనవాళ్లును ప్రచురించినట్లు తెలిపారు. విశ్వంగారి మాటలు సార్థకమైతే మళ్లీ తెలుగువారు ఓ కమనీయ పత్రికను వీక్షించే భాగ్యాన్ని పొందవచ్చు.
ముందే చెప్పినట్లు ఆంధ్రజ్యోతి, కినీమా, విజయచిత్ర, బొమ్మై-తమిళ విజయచిత్ర-, యువ తదితర ప్రచురణలు చందమామ ప్రస్తుత యాజమాన్యం పరిధిలో లేనందున భవిష్యత్తులో అయినా వీటిని చందమామకు లాగా ఆర్కైవ్స్‌లో భద్రపర్చి ముందుతరాలకు అందించే అవకాశం చందమామకు లేదు. చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఇది చేదునిజమే..

కినీమా ప్రకటన
పైగా, ప్రసాద్ గారు చెప్పినట్లుగా చందమామ ఆఫీసులో ప్రస్తుతం కినీమా సంచికల బౌండ్ కాపీలు లేవు. ఉంటే అవి విశ్వనాథరెడ్డిగారి స్వాధీనంలో ఉండాలి లేకుంటే శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయి ఉండాలి. ఈ మాట ఇక్కడ చెప్పడానికి కూడా మాకు బాధగా ఉంది. ఆర్కైవ్స్‌ను నిర్వహించగల సాంకేతిక సామర్థ్యం చందమామ వద్ద ఉంది. కానీ కాపీరైట్ సమస్య కారణంగా జాతికి ఉపయోగపడగల మంచి పనులను కూడా మనం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి. విశ్వం గారు లేదా మరొకరు ఇందుకు పూనుకున్నా సరే.. ఓ బృహత్కార్యం భవిష్యత్ తరాల వారికోసం ఎదురుచూస్తోంది మరి.
నిజంగా ఇది సాధ్యపడితే…. చందమామ కలలు అందంగానే కాదు…. వాస్తవ స్వప్నాలుగా కూడా ఉంటాయేమో!
రోహిణీ ప్రసాద్ గారు చెప్పినట్లుగా పై పత్రికల కాపీలను వ్యక్తిగతంగా భద్రపర్చగలిగినట్లయితే, భవిష్యత్తులో అయినా అరుదైన ఈ చరిత్రను మనం పరిరక్షించుకోగలమని భావిస్తున్నాము. యువ దీపావళి సంచికలను టోకున ఇప్పటికీ హృదయంలో దాచుకున్న రోహిణీ ప్రసాద్ గారిలాగా కినిమా, విజయచిత్ర, ఆంధ్రజ్యోతి, యువ పత్రికల కాపీలు ఈనాటికీ ఎవరివద్ద అయినా ఉన్నట్లయితే మన జాతి సంస్కృతి పరిరక్షణ కోసమైనా వాటిని అలాగే భద్రపర్చి ఒకచోటికి చేర్చే కర్తవ్యం గురించి మనమందరమూ ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. చక్రపాణి గారి బంధువులను, విశ్వం గారిని ఆయన సంబంధీకులను, రావికొండలరావుగారిని తదితరులను కూడా సంప్రదించి ఈ పనికి పూనుకోవాలి.
ఈనాటికీ ప్రింట్, ఆన్‌లైన్ మధ్య ఉన్న అగాధపు అంతరాన్ని చూసినప్పుడు ఆన్‌లైన్‌లో చర్చకు వస్తున్న ఇలాంటి అనేక విషయాలు బయటి సమాజానికి తెలిసే అవకాశం చాలా తక్కువగానే ఉంది. చందమామ ప్రింట్ పాఠకులకు, చందమామ ఆన్‌లైన్ పాఠకులకు మధ్య అంతరం కూడా తక్కువ పరిమాణంలో లేదు మరి. ఇద్దరినీ కలిపే బాధ్యతను ప్రస్తుతం చందమామ బ్లాగు, వెబ్‌సైట్, పత్రిక పరిమిత స్థాయిలో అయినా చేపడుతున్నప్పటికీ ఇది ఏమాత్రం సరిపోదు.
ప్రస్తుతం చందమామలో మానవ వనరులు చాలా పరిమితంగా ఉండడంతో పాఠకుల ఉత్తరాలకు కూడా సమాధానమిచ్చే పరిస్థితి లేదు. అక్కడికీ వ్యక్తిగత ప్రాధాన్యతకింద చందమామ పాఠకులు, అభిమానులతో సమాచార సంబంధంలోకి రావడం జరుగుతోంది. ప్రతి రచయిత, పాఠకుల లేఖలు, రిమైండర్లకు సమాధానం పంపిన, బాధ్యతపడిన చరిత్ర చందమామలో దాసరి సుబ్రహ్మణ్యం గారితోనే ముగిసిందని చెప్పాలి.
రోహిణీ ప్రసాద్ గారూ, మీ ఆప్తవాక్యాలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూనే, మీరు కదిపిన తేనెతుట్టెను గురించి సీరియస్‌గానే ఆలోచిద్దాము. ఈలోగా ఇప్పటికీ మరుగున ఉన్న, వ్యక్తుల చేతిలో ఉన్న పై అమూల్య పత్రికలను మరి కొన్నాళ్లు కాపాడుకోవడం గురించి మనం తప్పక ఆలోచిద్దాము. మీరు పంపిన ఉత్తరాన్ని చందమామ బ్లాగులో యధాతథంగా ఉంచుతున్నందుకు అన్యధా భావించరని ఆశిస్తూ.
మీ
రాజశేఖర రాజు
అసోసియేట్ ఎడిటర్
చందమామ
rajasekhara.raju@chandamama.com
krajasekhara@gmail.com
Dear Raju garu,
Wish you all a Happy Sankranti.
I wanted to mention the following points to you since a long time.
You have started a very good and big trend by providing complete archives of Chandamama. I hope that other language editions are also receiving similar treatment. This because Hindi edition is far more popular than Telugu one and although it is not ‘original’ North Indians will greatly cherish if all the old copies are made available to them online. We went to Delhi and Benares in 1966 along with my father. In spite of being introduced to the local writers and editors as a reputed writer, he received far greater regard as the chief of Chandamama! Similarly I have talked to ardent fans of the Tamil, Kannada and Marathi editions. That is why I feel it is important to preserve them in all languages.
If possible pl make similar efforts about Vijayachitra and Bommai. Unlike Chandamama’s original staff, Mr. Ravi Kondala Rao is still available for clarifications. You may have read my article:
http://www.eemaata.com/em/issues/200901/1388.html?allinonepage=1
Mr. Sambu, the cartoonist may also be there somewhere.
The next important suggestion is that you should prepare similar archives for Kinema issues which ran for 2-3 years in 1951-53 period. Chandamama office used to have bound volumes. They need to be scanned and preserved. I have a few tattered ones with me (pl see attachments). The issues were all written by my father without his name appearing anywhere.
If you see the old ads in Chandamama issues of 1948 and 1949, you will see three magazines run by Mr. Chakrapani mentioned there: Andhrajyothy (which appeared later in the editorship of Narla from Vijayawada), Yuva and Chandamama. Can you contact Mr. Chakrapani’s 2nd son Sudhakara Rao in Hyderabad (I hope he is alive) and see whether he has any old volumes with him. Andhrajyothy carried among many other writings of my father, his translation of Valley of Fear by Conan Doyle. (I have sent A Study in Scarlet for serialization in www.pranahita.org). I will be very grateful if you can dig out these old magazines.
You must also get hold of the revived edition of Yuva which was published from Hyderabad from 1961 onwards. Those issues also have several important writings by various well known authors. I have with me (in India) all the Diwali spl. issues of Yuva.
Although your interest is mainly rooted in Chandamama, the value of preserving old magazines for future generations may make you a great archivist who will be much respected by future generations.
On a parallel track, Mr. Nagi Reddy’s family (particularly Mr. Konda Reddy) has a great collection of the shehnai recordings of Bismillah Khan. They will be worth preserving. Mr. Babji (Venkatarami Reddy and Venugopala Reddy would know about them)
Dolton publications also ran two syndicated English mags for kids named Falcon and something else. The Reddys will have old copies.
Pl let me know what you think.
sincerely,
krp
—————
ఈ రోజు కూడా రోహిణీ ప్రసాద్ గారు అలనాడు డాల్టన్ పబ్లికేషన్స్ వారు నడిపిన పత్రికలపై మరికొంత సమాచారం పంపారు. కింద చూడగలరు.
On Wed, Jan 20, 2010 at 6:19 AM,
Rohiniprasad Kodavatiganti <rohiniprasadk@gmail.com> wrote:
The mags run by Dolton were Falcon and Golden Book.
krp
NB: రోహిణీప్రసాద్ గారూ, మీ పోటో ఒకటి చందమామ బ్లాగుకోసం పంపగలరా?
అలాగే ఈ ప్రత్యేక కథనాన్ని చూసినవారు, చదివినవారు వీలైనంతమంది సాహితీ ప్రియులకు, చందమామ అభిమానులకు దీనిని ఆన్‌లైన్ ద్వారా చేర్చవలసిందిగా మనవి.
ఈ కథనం కోసం ఉపయోగించిన మూడు తెలుగు చిత్రాలు అలనాటి సినిమా పత్రిక “కినీమా” లోనివి. వీటిని రోహిణీప్రసాద్ గారి కలెక్షన్‌నుంచి తీసుకోవడమైంది. అందుకు కూడా ఆయనకు కృతజ్ఞతలు.
రాజు
Filed under చందమామ భాండాగారం | Tags: ఆంధ్రజ్యోతి, కినీమా, కొడవటిగంటి, చందమామ, డాల్టన్, ఫాల్కన్ ప్రచురణలు, బొమ్మై, భాండాగారం, యువ, రోహిణీప్రసాద్, విజయిచిత్ర | Comments (5)




