పాత చందమామలు కావాలా?

February 16th, 2012

ఛందమామ పాఠకులకు, అబిమానులకు పండగలాంటి వార్త. మీ వద్ద ఉన్న అదనపు చందమామ సంచికలను మార్పిడి చేసుకోగలిగితే ఒక మంచి అవకాశం శ్రీ లక్ష్మీనారాయణ గారి రూపంలో మనందరికీ లభించనుంది. బెంగుళూరులో ఉంటున్న వీరి వద్ద దాదాపు వంద చందమామ పుస్తకాల అదనపు కాపీలు ఉన్నాయట. 1980ల నుండి 2011 వరకు గల చందమామల్లో కొన్ని ప్రతులు తన వద్ద లేవని, తను పంపుతున్న జాబితాలోని చందమామలు ఎవరివద్దయినా అదనంగా ఉంటే మార్పిడి చేసుకోగలనని వీరు చెబుతున్నారు.

మార్పిడి సాధ్యం కాకపోతే పైన చెప్పిన కాలంలోని చందమామలు ఎవరివద్దయినా ఉంటే నగదు రూపంలో చెల్లించి కూడా తీసుకోగలని చెప్పారు. ఈయన మొబైల్ తదితర వివరాలను ఈ టపా చివరలో ఇస్తున్నాము. చందమామలను ఇలా పరస్పరం పంచుకోవాలని అనుకుంటున్న చందమామ అభిమానులు, పాఠకులు వీరిని నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు. కింది చందమామ సీరియల్స్ బౌండ్ కాపీలు కూడా అదనంగా వీరి వద్ద ఉన్నాయి.

జ్వాలాద్వీపం
రాకాసిలోయ

వీటినికూడా అవసరమైన వారికి తాను అందచేయగలనని వీరు చెబుతున్నారు.

ఆలాగే బెంగుళూరులో ఉంటూ దాదాపు 20 సంవత్సరాల కన్నడ చందమామలను వీరు సేకరించారట. ప్రస్తుతం అవి తనకు అవసరం లేదని, ఎవరయినా కన్నడ చందమామ అభిమానులు కావాలన్నట్లయితే వాటిని ఇస్తానని చెప్పారు. ఇవి 1960 నుంచి 1970 వరకు ఉన్న చందమామ కాపీలట. వీటిని ఆసక్తి కలిగిన కన్నడ చందమామ పాఠకులకు ఉచితంగా కూడా ఇస్తానని వీరు చెబుతున్నారు.

లక్ష్మీనారాయణ గారి గురించిన మరిన్ని వివరాలు

చందమామ అన్నా, చందమామ కథలూ, సీరియల్స్ అన్నా ప్రాణమిచ్చే మరో ప్రముఖులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, చందమామ వీరాభిమానుల్లో వీరాభిమానిగా తమను తాము వర్ణించుకునే వీరు గత వారం ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు. రెండేళ్ల క్రితం బెంగళూరులో శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి ఇంట్లో వారితో కలిసే అవకాశం తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఆయనే తమంతట తాముగా ఫోన్ పలకరింపుతో దగ్గరయ్యారు. 1991ల మొదట్లో తిరుపతి ఎస్వీయూనివర్శిటీలో బీకాం పూర్తి చేసిన వీరు బెంగుళూరులో సిఎ కోర్సును పూర్తి చేసి అక్కడే స్థిరపడ్డారు.

ప్రస్తుతం జపాన్‌‌కి చెందిన ఎంఎన్‌సి కంపెనీలో అత్యున్నత స్థాయిలో ఉన్న వీరు తమ మూలాలను మర్చిపోలేదు. చందమామ చిరస్మరణీయ జ్ఞాపకాలను, తెలుగు సాహిత్య అధ్యయనాన్ని కూడా మర్చిపోలేదు. చదివే అలవాటును విపరీతంగా పెంచి పోషించిన యద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి గార్లు మాదిరెడ్డి సులోచన గారు వంటి నవలా ప్రపంచాన్ని ఏలిన రచయిత్రుల రచనలను కూడా మరవలేదు. మహిళల ప్రాభవంతో వెలిగిపోతున్న తెలుగు నవలల పంధాను ఒక్కరాత్రితో మార్చివేసిన యండమూరి గారి శకం గురించి వీరు చెబుతుంటే అలా వింటూండిపోవలసిందే.

తన వద్ద యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు, రచనలు మొత్తం సేకరణ ఉందని, ఎవరికయినా ఆసక్తి ఉంటే వాటిని ఇస్తానని వీరు చెప్పారు. చందమామలు అయినా ఇతర సాహిత్య రచనలు అయినా నిజంగా ఆసక్తి ఉన్నవారికే ఇవ్వాలనేది వీరి ఉద్దేశం. కొన్నాళ్లు ఉంచుకుని మళ్లీ వాటిని వదిలేసుకునేవారికి ఇవ్వకూడదని ఈయన అభిప్రాయం.

ఇంతవరకు చందమామ పిపాసిగా, నాలుగైదు వేల వరకు తెలుగు,ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలను కొని సేకరించి పెట్టుకున్న సీరియస్ చదువరిగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన లక్ష్మీనారాయణ గారు తన పఠనాన్ని, తన అభిరుచిని పాఠకులతో పంచుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా చందమామ తరవాత ఆయనకు విశేషంగా ఆకర్షించిన పుస్తకం బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది”. తెలుగు సాహిత్యంలోని అతి గొప్ప నవలల్లో ఒకటిగా పేరొందిన ఈ పుస్తకంలోని అమృత స్త్రీ పాత్ర అంటే ఈయనకు ప్రాణం. ఈ పాత్ర వ్యక్తిత్వం తన జీవితానికి, జీవితానుభవాలకు చాలా దగ్గరగా ఉందని ఆయన రమ్యంగా చెబుతారు.

ఇంతవరకు వీరు రచనా వ్యాసంగం లోకి దిగలేదు. ఒక ప్రపంచ స్థాయి జపనీస్ సంస్థ ఆర్థిక, ఎక్కౌంట్ విభాగాధిపతిగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ, ఫోన్ చేయడానికి కూడా వీలుపడనంత పనిభారంతో ఉంటానని చెప్పుకునే వీరు చందమామ అంటే ఇక లోకం మర్చిపోతారు. గత వారం రోజులుగా రెండు మూడు సార్లు ఆయనే కాల్ చేసి తన విశేష పఠనానుభవాన్ని అలా చెప్పుకుంటూ పోయారు.

కాస్త సమయం కేటాయించుకుని రెండురోజులు కష్టపడి తెలుగు టైప్ నేర్చుకుంటే మీరు బ్లాగ్ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించగలరని, తప్పక ప్రయత్నించమని వారిని కోరాను. ‘చివరకు మిగిలేది’ నవలలోని అమృత పాత్రతో తన అనుబంధాన్ని వివరిస్తూ ఏదైనా రాయాలని ఉందని వారన్నప్పుడు, చేతిరాతతో రాసి మీరు పంపితే తప్పక అంతర్జాలంలో ప్రచురించవచ్చని చెప్పాను. జీవితంలో తొలిసారిగా రచనకు పూనుకుంటున్న ఆయన వారంలోపు రాసి పంపుతానని మాట ఇచ్చారు కూడా.

ఇక చందమామ విషయానికి వస్తే పాత సీరియల్స్ ఒక్కటి కూడా వదలకుండా మళ్లీ ప్రచురించవలసిందిగా కోరతారీయన. మహాభారతం, రామాయణం వంటి సీరియల్స్ లేకుండా చందమామ నడవటం ఇదే మొదటి సారి అని విచారించారు. ఇప్పుడు వస్తున్న శిథిలాలయం, పంచతంత్ర సీరియల్స్‌లో ఒకటి ముగియగానే తప్పకుండా మహాభారతం మళ్లీ ప్రచురించాలని అనుకుంటున్నట్లు వారికి తెలియజేయడమైనది. యాజమాన్యం మారినా సరే మాణిక్యాల్లాంటి పాత కథలు, సీరియల్స్ పాఠకులకు అందించాలన్నా చందమామ మనగలగాలని వీరు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. చందమామలో ఇపుడున్నట్లుగా కాకుండా మూడు సీరియల్స్ -పౌరాణికం, జానపదం, ఇతర సీరియల్స్- ఏకకాలంలో ప్రచురించవచ్చని వీరి అభిప్రాయం.

చందమామ జ్ఞాపకాలు కూడా వీలైనంత త్వరగా వీరు రాసి పంపాలని మా ఆశ, ఆకాంక్ష కూడా.

చందమామ జ్ఞాపకాలను మరచిపోని వీరు చందమామ సీరియల్స్ రూపకర్త దాసరి సుబ్రహ్మణ్యం గారి ఇతర సీరియల్స్ ప్రచురణలో తమవంతుగా తప్పక సహాయపడతానని చెబుతున్నారు.

లక్ష్మీనారాయణ గారూ!
మీ ఔదార్యం లేదా బాధ్యత కలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. దాసరి గారి పుస్తకాల ప్రచురణ ఖర్చు తిరిగి వస్తే మరిన్ని మంచి పుస్తకాలు వేయడానికి అవకాశం ఉంటుందని ‘రచన’ పత్రిక శాయిగారు రెండేళ్ల క్రితం చెప్పిన విషయం గుర్తుకొస్తోంది. ఇలాంటి మంచి పనులకు మీరు అందించే తోడ్పాటు ఉత్తమ సాహిత్యానికి ఊపిరి పోస్తుందని విశ్వసిస్తున్నాము. రచన శాయిగారితో మీరు తప్పక సంప్రదించగలరు.

వీరికి కావలసిన పాత చందమామల జాబితా

లక్ష్మీనారాయణ గారు కోరుకుంటున్న చందమామ పాత పుస్తకాల జాబితా ఇక్కడ చూడవచ్చు. ఎవరయినా కింది సంవత్సరాలలోని అదనపు కాపీలు కలిగి ఉన్నట్లయితే మార్పిడి రూపంలో లేదా నగదుకు కూడా మీ వద్ద ఉన్న చందమామలను వారితో పంచుకోవచ్చు.

I need below Chandamama back issues

Year      Month

1980      August

1982      October

1983      December

1984

January
February
March
April
May
June
July
August
September
October
November
December

1985      May

1988      December

1990

July
August
September
October
November
December

1991       July

1992       July

1993

January
February
March
April
May
June

1994

April
June
July
August
September
October
November
December

2000

April
August
September
October
November
December

2001

January
February
April
May
June

2002

June
September
October

2011

May, July

కింది చందమామ సీరియల్స్ బౌండ్ కాపీలు అదనంగా వీరి వద్ద ఉన్నాయి.
జ్వాలాద్వీపం
రాకాసిలోయ
పుస్తక మార్పిడి ప్రాతిపదికన వీరు తమ వద్ద ఉన్న కింది అదనపు కాపీలను మార్పిడి చేసుకుంటారట.

వీరివద్ద ఉన్న పాత చందమామల జాబితా.

Below Chandamama back issues, I have extra copies. I am ready to spare these for exchanging Chandamama’s which I don’t have.

Year         Month
2000        July

2003        July
2004        Dec

2005

January
February
September
October

2006

January
February
May
August
September
October
November
December

2007

January
February

March – 2 copies
May
June
July
August
September
December

2008

January
April
May
August
September

2009

February
May
June
July
August
September
October
November
December

2010

January
May
June
July
August

2011

February
June
August

1964

February

Below Serials I have two copies, which I am ready for Exchange

1. Jwaladweepam
2. Rakasiloya

ఎవరయినా ఆసక్తి కలిగిన పాఠకులు, చందమామ అభిమానులు వీరిని కింద ఇస్తున్న మొబైల్‌లో కాల్ చేసి నేరుగా వీరిని సంప్రదించగలరు. పని ఒత్తిడిలోఉండి ఈయన కాల్ అందుకోలోక పోతే అపార్థం చేసుకోవద్దని, తర్వాత మళ్లీ కాల్ చేయగలరని అభ్యర్థన.

Lakshmi Narayana
(CA.)
Banglore

mobile: 07760972070

RTS Perm Link