అంతర్జాలంలో అరుదైన కథనాలు…

December 23rd, 2011

అంతర్జాలంలో కాలక్షేప టపాలు, రచనలు సహజం. వ్యక్తుల స్యీయ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరమ ప్రజాస్వామిక రూపం బ్లాగ్. ఇది మంచికీ, చెడ్డకీ కూడా వర్తిస్తుందనుకోండి. కాని అంతర్జాలంలో, వెబ్‌సైట్లలో కొన్ని అద్భుత మైన రచనలు ప్రచురించబడుతూ శాశ్వత ప్రాతిపదికన ఆసక్తి కలగిన పాఠకులందరికీ అందుబాటులో ఉంటూ జ్ఞానాన్వేషణకు పట్టుగొమ్మలుగా మిగిలి ఉంటున్నాయి.

ఈరోజు కాస్త ఆటవిడుపుగా ఉండటంతో అంతర్జాలం నుంచి రెండు మూడు విలువైన రచనలు తెలుగు భాషపైనా, ఆధునిక తెలుగు ప్రజల ఆవిర్భావం పైనా వెదికి పట్టుకున్నాను. ఇవి ఇటీవలి కాలంలో ఒక తెలుగు బజ్ సమూహంలో చర్చకు కూడా వచ్చాయి. బ్లాగర్లలో చాలామందికి ఇవి అందుబాటులోకి వచ్చి ఉంటాయి.

కాని  వీటిని కొన్నాళ్లకు మళ్లీ మర్చిపోతానేమో అనిపించి నా బ్లాగులో వాటిని లింకులుగా ఇస్తే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వీటిని పరిశీలించవచ్చు కదా అనే భావనంతో తెలుగు భాషపై వచ్చిన కొన్ని  అపురూపమైన వ్యాసాలను కింద లింకులుగా ఇస్తున్నాను.

1.

మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

http://poddu.net/2008/%E0%B0%AE%E0%B1%8C%E0%B0%96%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B5%E0%B0%BF/

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు.

మానవజాతి మాటలు మాత్రమే నేర్చిన దశనుంచి తమ స్వంత లిపులను రూపొందించుకునే క్రమం వరకు పయనించిన మౌలిక చరిత్రను రోహిణీ ప్రసాద్ గారి ‘మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం’ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకుంది. మౌఖిక సాహిత్యం, లిపులు చరిత్రలో ఆవిర్భవించిన క్రమానికి ఇదొక పరమ ప్రామాణిక రచన. భాషల, భాషల చరిత్రపై అధ్యయనం చేయాలనుకునేవారికి ఉపయోగపడే అత్యంత ప్రాధమిక, విశిష్ట రచనగా ఈ కథనం చక్కగా ఉపయోగపడుతుంది.

2.
తెలుగు భాష వయస్సెంత?
సురేశ్ కొలిచాల గారు.

http://www.eemaata.com/em/issues/200511/43.html

దాదాపు ఆరేళ్ల క్రితం సురేష్ గారు ఈమాట వెబ్‌సైట్ కోసం రాసిన ఈ వ్యాసం గత సంవత్సరం మళ్లీ పాఠకులలో విశేష చర్చకు దారితీసింది. తెలుగు భాష చరిత్రకు సంబంధించి ఇదొక ప్రామాణిక రచన.

తెలుగు భాషా చరిత్ర, ద్రావిడ భాషల పరిణామం గురించి కూలంకషంగా, విస్తృతంగా తెలుసుకోవాలంటే ఆంద్రా యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ వెలమల సింగన గారు రాసిన “తెలుగు భాషా చరిత్ర” పుస్తకం చూడవచ్చు. దాదాపు 700 పేజీలకు పైబడిన ఈ పుస్తకం తెలుగు భాష, ద్రావిడ భాషల చరిత్రకు సంబంధించి తెలుగులో ప్రస్తుతం లభ్యమవుతున్న బృహత్ గ్రంధం. ఈ పుస్తకం గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రచురణలు పొంది ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇది అందుబాటులో లేనివారు సురేష్ గారి పై వ్యాసం లింకు తెరిచి తెలుగు భాష చరిత్రపై అత్యంత ప్రాథమిక అంశాలను వివరంగా తెలుసుకోగలరు.

3.
Origin and Evolution of Modern Telugus
యమడా కైకో
జపాన్ లోని ఇబరకీ యూనివర్శిటీ మానవ శాస్త్ర ఆచార్యులు
http://epw.in/epw/uploads/articles/15095.pdf

తెలంగాణా ఉద్యమం రగులుతున్న నేపధ్యంలో గత సంవత్సరం ఆగస్ట్ 21న ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంచికలో ఈ విశేష రచన ప్రచురించబడింది. రాజకీయ దృక్కోణం నుంచి తెలుగువారి చరిత్రను పరిశీలించిన విశిష్ట వ్యాసం ఇంది. ఇది ఇంగ్లీషులో మాత్రమే పీడీఎప్ రూపంలో అందుబాటులో ఉంది.

గమనిక: ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో గత సంవత్సరం ఆగస్ట్ 21న అచ్చయిన పై కథనం ప్రస్తుతం ఆ పత్రిక ఆన్‌లైన్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వ్యాసాన్నే తెలంగాణాఉత్సవ్ అనే బ్లాగులో కింది పేరుతో యధాతథంగా ప్రచురించారు. తెలుగుప్రజల ఉనికిని రాజకీయార్థిక ప్రాతిపదికన వివరిస్తున్న ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవగలరు.

Identity of Modern Telugus – Yamada Keiko

http://telanganautsav.wordpress.com/2010/08/28/identity-of-modern-telugus-yamada-keiko/

4.
మూడు వందల రామాయణాలు
అనువాదం : సురేశ్ కొలిచాల
మూలం : ఎ. కె. రామానుజన్

మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. ఎ.కె రామానుజన్ గతంలో రాసిన సుప్రసిద్ధ రచన మూడువందల రామాయణాలును డిల్లీ విశ్వవిద్యాలయం ఈమధ్యే చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించింది. ఈ మాట వెబ్‌సైట్ నవంబర్ సంచికలో ఈ వ్యాసం అనువాదం ప్రచురించబడి విశేష చర్చకు పాత్రమైంది. ఆ వ్యాసం లింకు కూడా ఇక్కడ ఇవ్వడమైంది.

ఈ నాలుగు వ్యాసాలు  భాషపైనా, సాహిత్య చరిత్రపైనా విశేష ప్రాచుర్యం పొందిన విశిష్ట రచనలు. ఇంతవరకు వీటి గురించి తెలియని పాఠకులకోసం మాత్రమే వీటిని ఈ బ్లాగులో లింకుల రూపంలో ఇవ్వడమైనది.

ఆసక్తి గల పాఠకులు సమయమున్నప్పుడు ఈ బృహత్ రచనలు,వాటిపై వ్యాఖ్యలతో సహా చదవగలరు.

RTS Perm Link