తెలుగు వారి ఆహార చరిత్రపై అద్బుత బ్లాగ్
శ్రీ పూర్ణచంద్ గారూ,
ఫేస్బుక్లో మీ తెలుగువారి ఆహార చరిత్ర చూసిన తర్వాత మీ బ్లాగులోకి రావడం ఇదే మొదలు. పెన్నిధి దొరికినట్లుంది నాకయితే. పొద్దున్న చద్దన్నం తినడం తప్ప ఇంకేమీ ఎరగడండీ అంటూ శంకరాభరణంలో చంద్రమోహన్ని వాళ్ల బామ్మ శంకరశాస్త్రికి పరిచయం చేసిన డైలాగ్ విని అప్పట్లో పరవశించిపోయాము.
ఎందుకంటే అప్పటికి మేము పల్లె సంస్కృతిని వదలకుండా, చద్దన్నం మాత్రమే తింటూ బతికేవాళ్లం. ముప్పై ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు మహానగరాల బతుకైపోయాక మనది అనిపించుకుంటున్న సమస్తమూ వదిలేస్తున్నాం.
మళ్లీ మీరు మన చద్దన్నం గొప్పతనం గురించి మనసు కరిగేలా, పరవశించేలా చెప్పారు. ధన్యవాదాలు. తెలుగు వారి ఆహార చరిత్ర గురించి రమ్యంగా చెబుతున్న మీ బ్లాగును నా చందమామ బ్లాగులో జోడిస్తున్నాను.
వీలయినంత ఎక్కువమంది తెలుగువారు మీ బ్లాగులోని అంశాలను చదవాలని నా ఆకాంక్ష. గతంలో తెలుగు ప్రజల మూలాలు, సాహిత్యం, ఆహార చరిత్ర గురించి మీరు వ్రాసిన వెలకట్టలేని కథనాలన్నీ ఈ బ్లాగులోనే ప్రత్యేత విభాగాలలో ప్రచురించగలరు.
ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు బ్లాగుల్లో ఉత్తమమైన వాటి సరసన మీ బ్లాగ్ నిలబడనుంది. మీ సృజనాత్మక రచనలన్నింటినీ బ్లాగు ద్వారా కూడా పంచుకోగలరు.
మీరు రాసిన పుస్తకాల జాబితా వీలయినంత త్వరలో బ్లాగులో ప్రచురించండి.
‘నడుస్తున్న చరిత్ర పత్రిక’లో ఆంధ్రుల చరిత్రపై మీ కథనాలు గత మూడేళ్లుగా వరుసగా చదువుతూ వస్తున్నానండి. ఇప్పుడు మళ్లీ బ్లాగు ద్వారా మీతో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
చివరగా మీ అద్భుతమైన శైలికి మనస్సుమాంజలులు. తెలుగుకు ప్రాచీన భాష హోదా రావడానికి కారణమైన దిగ్ధంతులలో మీరూ ముఖ్యపాత్ర వహించినందుకు అభినందనలు.
రాజశేఖరరాజు
చందమామ
7305018409
సరికొత్తలోకంలోకి అడుగుపెట్టాలంటే డాక్టర్ పూర్ణచంద్ గారి బ్లాగు తప్పక చూడండి
http://drgvpurnachand.blogspot.in
తెలుగు భాష, స౦స్కృతి, ఆహార౦, ఆచారాలు::
History of Food & Heritage of Telugu People
చద్దన్న౦ వద్దనక౦డి!
చద్దన్న౦ వద్దనక౦డి!
డా. జి వి పూర్ణచ౦దు
http://drgvpurnachand.blogspot.in/2012/02/blog-post_1956.html