చందమామలో ఓ చక్కటి కథ : “విమర్శ”

March 30th, 2012

చందమామ కథకులు శ్రీ తిరుమలశ్రీ గారు పంపిన ఈ కథ ‘విమర్శ’ జనవరి చందమామలో ప్రచురితమైంది.  మధ్యయుగాలకు సంబంధించిన ఈ రాజరికపు నేపథ్యంలోని కథలో ఆధునిక భావాలను అతి చక్కగా చొప్పించడంలో రచయిత ప్రదర్శించిన నైపుణ్యం సాటిలేనిది.  పాలకుడిని సామంతుడు విమర్శించినంత మాత్రానే అతడికి వెంటనే  బుద్ది చెప్పి వస్తానని ఔద్ధత్యం ప్రదర్శించిన సేనాధిపతికి రాజు ఎలా కనువిప్పు కలిగించాడో ఈ విమర్శ కథ మనోహరంగా వివరిస్తుంది.

కుటుంబ పెద్ద అభిప్రాయాలను కుటుంబ సభ్యులే  ఏకగ్రీవంగా ఆమోదించలేనప్పుడు రాజు ఆదేశాలను, నిర్ణయాలను సామంతులు, పాలితులు ఏకగ్రీవంగా ఎలా ఆమోదించగలరు అనే సార్వకాలిక ఇతివృత్తంతో ఈ కథ నడిచింది.

“అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు”

“ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే   ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది

“మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.

పాతకాలానికే కాదు ఏ కాలానికైనా  సరే వర్తించే అక్షరలక్షల్లాంటి జీవిత పాఠాలను ఈ శక్తివంతమైన సంభాషణలు బోధిస్తున్నాయి.   ఎంపిక విషయంలో ఈ కథ ఇక్కడే నిలిచి గెలిచిందంటే కూడా అతిశయోక్తి కాదు.

తిరుమలశ్రీ గారూ..  ఆధునిక భావసంస్కారాన్ని పాత రూపంలో చొప్పించి ఇంత మంచి కథను పంపినందుకు మన:పూర్వక కృతజ్ఞతలండీ..

ఈ కథ పూర్తి పాఠం ఇక్కడ చదవండి

విమర్శ

-తిరుమలశ్రీ (పి.వి.వి. సత్యనారాయణ)

జనవరి 2012 చందమామ

త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడూ, సమర్థుడూనూ.
ఒకసారి సర్వ సేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, “ప్రభూ! మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలినవారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా సవా లక్ష ప్రశ్నలు వేస్తున్నాడట. తమ ఆజ్ఞ ఐతే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను” అన్నాడు.
సేనాని ఫిర్యాదును శాంతంగా ఆలకించిన విష్ణువర్ధనుడు, “అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం,” అని అప్పటికి అతన్ని పంపేసాడు.
చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ, రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతను.
విష్ణువర్ధనుడు, శూరసేనుడితో రామాపురం గురించి గాని, అనంతవర్మ గురించి కాని ప్రస్తావించలేదు. “శూరసేనా! ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాం మేము. ఆ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము” అన్నాడు.
సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి తరచు అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తూండడం కద్దు. అందుకే, “అవశ్యం సెలవీయండి, ప్రభూ!” అన్నాడు శూరసేనుడు.
”ఆ అధ్యయనంలో ఓ భాగమైన ‘కుటుంబంలో సామరస్యతను’ గూర్చి పరిశీలించేందుకని వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి,” చెప్పాడు విష్ణువర్ధనుడు. “నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి…గత మూడు మాసాలలోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలూ, వాటిని నీ కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలూ వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి నువ్వు”.
’ఓస్, అదెంత భాగ్యం!’ అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
మర్నాడు తల వ్రేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు.
“మహాప్రభూ! తరచి చూస్తే గత మూడు మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కాని, నా ఇద్దరు కుమారులు గాని ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒకటీ అరా తప్పితే ఏవీ లేవు,” అని విన్నవించుకున్నాడు శూరసేనుడు.
విష్ణువర్ధనుడు విస్తుపోతూ, “ఆశ్చర్యంగా ఉన్నదే! మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేసావ్? వారిని దండించి నీ దారికి త్రిప్పుకున్నావా లేదా?” అనడిగాడు.
అందుకు శూరసేనుడు నవ్వి, “ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు పసివాళ్ళూ, అనుభవశూన్యులూను. నా నిర్ణయాల లోని లోతుపాతులు వారికి ఎలా అర్థమౌతాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచనా సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా  నిర్ణయాలను మార్చుకున్నాను,” అని జవాబిచ్చాడు.
అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, “రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే, శూరసేనా! అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు” అన్నాడు శాంతంగా.
“ప్రభూ!” అన్నాడు శూరసేనుడు తెల్లబోయి.
“శూరసేనా! ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే   ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది”.
ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూసాడు విష్ణువర్ధనుడు. “మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.
చక్రవర్తి నిశిత దృష్టికి, విశాల దృక్పథానికీ జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు. “నా అజ్ఞానానికి మన్నించండి, మహాప్రభూ! స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలనూ, శంకలనూ నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను,” అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు.

RTS Perm Link

చందమామ కథ : ఎద్దు బాధ

March 17th, 2012

జటాయువు

చందమామ మొదటి నుంచి మధ్యయుగాల కథలకు, రాజు రాణి, తోటరాముడి కథలకు, జానపద, పౌరాణిక, జాతక బేతాళ కథలకు పేరుమోసిందని మనందరికీ తెలుసు. కథ అనే భావనకు సార్వత్రిక నమూనాగా నిలిచిపోయిన గొప్ప కథలివి. అందుకే 1950, 60, 70ల దశకం నాటి కథలంటే చందమామ పాఠకులకు, వీరాభిమానులకు అంత పిచ్చి.

కాని మా చందమామ లైబ్రేరియన్ బాలాగారికి మాత్రం 80ల నాటి చందమామ కథలంటే ప్రాణం. చందమామ కథలు నిజంగా పరిపక్వత అందుకున్నది 80లలోనే అని తన నిశ్చితాభిప్రాయం. తెలుగు చందమామ సర్క్యులేషన్ హిందీ చందమామను అధిగమించి తొలిసారిగా లక్ష కాపీల సంఖ్యను దాటి రికార్డు సాధించింది కూడా 80ల లోనే అని తను ఉదాహరణను కూడా చూపిస్తుంటారు. ఆయన అభిప్రాయంతో మనం ఏకీభవించవచ్చు. ఏకీ భవించకపోవచ్చు.

కాని చందమామలో మధ్యయుగాల కథలే కాకుండా ఆధునిక వాతావరణం ఉన్న కథలు కూడా అప్పుడప్పుడూ తమవైన మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చందమామకు రచనలు పంపుతున్న పాత, కొత్త రచయితలు అద్భుతమైన తర్కంతో, చక్కటి ముగింపుతో కూడిన కథలను గత మూడేళ్లుగా చందమామకు అందిస్తున్నారు. పాత కొత్త కథల మేళవింపుతో ప్రతి నెలా అచ్చవుతున్న ఒక పేజీ కథలు చందమామకే హైలెట్‌గా మారుతున్నాయి. పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి కూడా.

మనుషుల బాధలు, సమాజం బాధలు గురించే పట్టించుకుంటున్న కాలంలో ఎద్దు బాధను కూడా పట్టించుకుని కథగా మలిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఎద్దు కోణం నుంచి దాని బాధను కథగా మల్చడం. ఈ మార్చి నెలలో చందమామలో వచ్చిన కొత్త కథ ఎద్దుబాధ ఈ కోణంలోంచే పుట్టింది. చెప్పిన పనల్లా గుడ్డిగా చేసుకునిపోయే ఎద్దు ఒక్కోసారి రైతుమీదికి తిరగబడుతుంది. చేస్తున్న పనిని ఆపివేసి కదలకుండా మొరాయిస్తుంది. దాదాపు ఇది పల్లెల్లోని రైతులందరికీ అనుభవపూర్వకమైన విషయమే.

మా జిల్లాలో ఎద్దులు, దున్నలు ఇలా చేస్తున్న పని ఉన్నట్లుండి ఆపివేసి మొరాయించడాన్ని అంకె వేసింది అని అంటుంటారు. ఎద్దు అంకె వేసింది అంటే ఎద్దు మెడపై కట్టిన కాడిని దిగజార్చుకుని కాలు ముందుకు కదపకుండా మడిలో, చేనులో అలాగే నిలబడిపోవటం. పనిచేస్తున్నప్పుడు ఏదైనాభరించలేని కష్టం తగిలితే దాన్ని మాటల్లో రైతుకు చెప్పలేని ఎద్దులు తమకు తోచిన విధంగా పరిష్కారం ఎంచుకుంటాయి. అంకె వేసుకోవడం ఇలాంటి పరిష్కారాలలో ఒకటి.

పొలంలో దున్నుతున్నప్పుడు విపరీతంగా అలిసిపోయినా, ఎద్దు కాలి గిట్టలకు ముళ్లు గుచ్చుకుని కాలు కదపటం కష్టమైపోయినా, విపరీతంగా దప్పిక వేసినా, వేగంగా అడుగులేయలేదని రైతు తనను మరీ బాదేస్తున్నాడనిపించినా ఇలాంటి ఎన్నో కారణాలతో ఎద్దులు పొలాల్లో అంకెలేసుకుంటుంటాయి. పని చేయలేదని మాటిమాటికి అంకె వేసుకుంటోందని రైతు దాని బాధను గుర్తించకుండా ఎద్దును మరింతగా బాదిపడేస్తే అది మరింతగా మొండికేస్తుంది. రైతుపై పొలంలోనూ బయట కూడా తిరగబడుతుంది.

చాలా కాలంగా వివిధ పత్రికలు, వెబ్‌సైట్లకు కథలు, రచనలు చేస్తున్నప్పటికీ చందమామకు ఇటీవలే పరిచయమైన శాఖమూరి శ్రీనివాస్ గారు (మరో కలం పేరు సుధారాణి) ఎద్దుబాధ అనే ఈ కథను సాపుచేసి “ఇంకా దీనికి పేరు పెట్టలేదని, ఏ పేరు పెడితే బాగుంటుంద”ని మూడు నెలల క్రితం ఫోన్‌ సంభాషణలో అడిగారు. ‘ఎద్దు కష్టం మీద ఇంత మంచి కథ రాశారు కదా ఎద్దుబాధ అని పేరు పెడితే సరిపోతుంది కదా’ అని నేను సరదాగా చెప్పాను.

ఆశ్చర్యంగా ఆయన ఆ పేరే ఖరారు చేసి పంపడం. కథల ఎంపికకు కూర్చున్నప్పుడు మా యాజమాన్యం వారికి కూడా కథ బాగా నచ్చేసి కథ తొలి యత్నంలోనే ఎంపికైపోయింది. ఎద్దు నిజంగా అలా మొండికేస్తుందా అని మావాళ్లు -వ్యవసాయం అంటే ఏమిటో తెలీదు- నిర్ధారించుకున్న తర్వాతే ఎద్దుబాధకు ఆమోదముద్ర వేశారనుకోండి.

పెద్ద కమతాలలో పనిచేస్తున్నప్పుడు పని ఎప్పుడు అయిపోతుంది అనే ఆదుర్దా, ఆందోళనకు ఎద్దులు గురయ్యాయంటే కొన్ని సందర్భాల్లో అవి మొండికేయడం, అంకె వేసుకోవడం వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ కథను విడిగా చదివినప్పుడు కాకుండా మా వాళ్లకు చదివి వినిపిస్తున్నప్పుడు నా చిన్నప్పుడు సేద్యంతో, ఎద్దులతో నా అనుబంధం కళ్లముందు రీల్ లాగా తిరిగింది.

‘ఎద్దును ముద్దు చేయవద్దురా అది చెప్పినమాట వినదు’ అంటూ తాత పదే పదే చెబుతున్నా జంతువులంటే అపారమైన అభిమానంతో విశ్రాంతి సమయంలో వాటి దగ్గరకు పోయి నూపురం, మెడను దువ్వడం, స్పర్శతో దానికి పరవశం కలిగింపజేయడం చేసేసరికి కొన్నాళ్లకు అవి నిజంగానే పొలంలో నా అరుపులు, అదిలింపులను పట్టించుకోకుండా వాటిపాటికవి నడుస్తూ పోవడం జరిగేది.

35 సంవత్సరాల క్రితం నాటి నా బాల్యాన్ని, పల్లె జీవితాన్ని మళ్లీ ఒకసారి నాకు గుర్తు చేసిన కథ ఎద్దుబాధ. ఆ తర్వాత ‘మీ కథ ఎద్దుబాధ సాక్షిగా ఎంపికయిపోయిందండీ’ అని శ్రీనివాస్ గారితో చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాము. “చందమామను ఎద్దుబాధతో కొట్టారండీ… ఎంపికకాక తప్పుతుందా వేసుకోక తప్పుతుందా..’ అని నేనంటే “కథకు పేరు పెట్టింది మీరే కదా..” అని ఆయన నవ్వడం…

ఎద్దుకు కూడా బాధ ఉంటుందని అది పైకి చెప్పుకోలేకపోయినా ఏదో ఒకరకంగా దాన్ని ప్రదర్శిస్తుందని చెప్పిన అందమైన కథ ఎద్దుబాధ. ఈ మార్చి నెల చందమామలో ఈ మంచి కథ వచ్చింది. చదవకపోతే తీసుకుని చదవండి. పత్రిక అందుబాటులో లేకపోతే ఇక్కడ ఈ కథను చదువుకోండి.

ఎద్దుబాధ
శ్రీరంగాపురంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ ఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి చురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే మొరాయించసాగింది. బలవంతపెడితే కదలకుండా కూర్చుంటుంది. పనిచేయని ఆ ఒక్క ఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి, రెండింటినీ విక్రయించాలనుకున్నాడు రామేశం. ఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ పొరుగూరు నుంచి వచ్చాడు. అతను సామాన్య రైతు. “వర్మా.. ఇటీవలే కొన్న నా ఎద్దుల జతను సగం ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే కొనుగోలు చేసుకువెళ్లు. పైకం కూడా నీకు వీలున్నప్పుడివ్వు,” అన్నాడు రామేశం.

పక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ వాటిని కొని తన వెంట తీసుకెళ్లాడు. అంత సులువుగా అవి అమ్ముడవడం రామేశానికి ఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక ఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. వెంటనే స్నేహితున గ్రామం బయలు దేరాడు. దారిలోనే ఉన్న పొలం వద్ద స్వరవర్మ కనిపించాడు.

అక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతంగా పొలాన్ని దున్నడం గమనించాడు రామేశం. ఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా నాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది.

మిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ “ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ పనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి, ఏ లోపం లేదని నిర్ధారించుకున్నాకే కొన్నాను. ఎద్దు మొండికేయడానికి కారణం.. నీకున్న విశాలమైన, గట్లు లేని పొలాన్ని చూసి గొడ్డు చాకిరీ చేయాలని అది భయపడటమే! మోర ఎత్తితే గట్లు కనిపించే నా చిన్న కమతాన్ని ప్రయాస లేకుండా దున్నుతోంది. నువ్వు దాని బాధను అర్థం చేసుకోలేక పోయావు,” అన్నాడు. సందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి, మిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో పొగిడాడు.
–ఎస్. సుధారాణి

RTS Perm Link

ఆకలి తప్ప మాకేమీ తెలియదు….

February 24th, 2012

శ్రీ దాసరి వెంకటరమణ గారికి,
చందమామకు పంపిన మీ కథ ‘విత్తనం గింజ’పై నా అభిప్రాయాన్ని రాత పూర్వకంగా పంపమని చెప్పారు. చాలా ఆలస్యం చేసినందుకు క్షంతవ్యుడిని. శంకర్ గారు ఈ కథకు బొమ్మలు వేస్తున్నారు కనుక ఆయన అభిప్రాయాన్ని కూడా మీకు చెబితే బాగుంటుందనే ఇన్నాళ్లుగా మీకు సమాధానం పంపలేదు.

ఇక కథ విషయానికి వస్తే… పొగడ్డం తప్ప ఇక ఏమీ చేయలేనన్నదే వాస్తవం.

ఈ కథను ప్రచురణకోసం చదువుతున్నప్పుడే మాకు నోటి మాట రాలేదంటే నమ్మండి. పిల్లల్ని విత్తనం గింజలుగా పోల్చి రెంటినీ సమానంగా జాగ్రత్తగా పరిరక్షించుకోవలసిన అవసరం గురించి ఈ కథలో హృద్యంగా చెప్పారు. చందమామ కథలకు సంబంధించి ఏలాంటి వంకలు లేకుండా, సందేహాలు లేవనెత్తకుండా ఆమోదముద్ర పడిన అతి కొద్ది కథల్లో ‘విత్తనం గింజ’ ఒకటి అని మా బలమైన నమ్మకం.కథ గమనం, కథలో హేతువు, బిగి సడలని శైలి, చక్కటి ముగింపు వంటి చందమామకు ప్రాణాధారమైన అంశాలలో సవాలక్ష వడపోతలను దాటుకుని ఏక ధాటిన మీ కథకు పైవారి ఆమోదముద్ర లభించేసింది.

కథను నేను చదివి వినిపిస్తున్నప్పుడే, ముగింపు సమీపించే కొద్దీ నాకే గగుర్పాటు కలిగింది. చందమామకు మీరు పంపిన అత్యుత్తమ కథల్లో ఇదొకటి అని చెప్పడానికి సాహసిస్తున్నాను. ముగింపులో ప్రసంగ ధోరణి కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ మనస్సుపై కథ కలిగించిన మౌలిక ప్రభావాన్ని అది ఏమాత్రం దెబ్బతీయలేదు. మీ కథ అక్కడే నిలిచింది.. గెలిచింది కూడా…

“… పిల్లలు పుట్టగానే వాళ్లు మనకే సొంతమనే భ్రమలో ఉంటాం. దాదాపు వాళ్లను మన ఆస్థిలో భాగంగా భావిస్తాం. వాస్తవానికి పిల్లలు జాతీయ ఆస్తులు. ఒక ఎకరం పొలమున్న నీవే విత్తనం గింజల్ని ఇంట్లో ఇంత జాగ్రత్త చేస్తున్నావే… మరి జాతీయ ఆస్తులైన ఈ పిల్లలు కూడా విత్తనం గింజల్లాంటివారే వారిని మరెంత జాగ్రత్తగా పోషించాలి? నీవు పొలంలో విత్తనం వేస్తే మొలిచే మొక్క ఏం కాయ కాస్తుందో నీకు ముందే తెలుస్తుంది. కానీ ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కుమారుడికి కిరణ్ అని ఎందుకు పేరు పేట్టావో కాని వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవజాతికే వెలుగవుతాడు….”

రమణ గారూ! ఈ కథను మీరు చందమామకు పంపించినందుకు, ముందుగా మేమే కథను చదివినందుకు మా జన్మ సార్థకమైందనుకుంటున్నాము. బాలకార్మిక వ్యవస్థను దాని నిజమైన అర్థంలో ఎందుకు నిర్మూలించాలో చాటి చెప్పిన కథ ఇది. పిల్లలు చిన్నవయసులో కూడా తమ తమ వృత్తులకు సంబంధించిన పనులు చేయవలిసిందే, నేర్చుకోవలిసిందే.. కాని వారి భావిజీవిత పయనానికి ఈ పనులు అడ్డంకులు కారాదు.

మేం చిన్నప్పుడు పల్లె బడుల్లో చదువుకునేటప్పుడు చాలా మంది పిల్లలు బడికి రాలేక, చదువుకోలేక, వ్యవసాయ సంబంధ వృత్తిపనులు చేసుకుంటూ చదువుకు దూరమైపోయారు. ఊహతెలియని ఆ వయసులో మాలో కొందరు ఎందుకు చదువుకు దూరమవుతున్నారో అర్థమయ్యేది కాదు కాని, లోకంలో చాలామందికి లేని అవకాశాలు మాకు లభించాయని, ఆర్థికంగా కాస్త ముందు పీఠిన ఉండటం అనే ఒకే ఒక్క అంశం మమ్మల్ని చదువుల బాట పట్టించిందని తర్వాత మాకు అర్థమయింది. మీ కథలో, పిల్లవాడిని చదివించలేక పల్లెలో ఆసామీ కింద పనికి పెట్టిన పేద తండ్రితో టీచర్ మాధవయ్య నుడివిన మంత్రసదృశ వాక్యాలు చూడండి..

“ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కుమారుడికి కిరణ్ అని ఎందుకు పేరు పేట్టావో కాని వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవజాతికే వెలుగవుతాడు….”

పేదవాళ్లు చదువుకుంటే చిన్న గెనెమూ పెద్ద గెనెము తేడా లేకుండా పోతుందని -ఒక పొలానికి మరొక పొలానికి మధ్యన ఉండే పొడవాటి లేదా పొడవు తక్కువ అడ్డుకట్టలు. మా ప్రాంతంలో దీన్ని గెనెం, గెనాలు అని అంటాము-, అందరూ చదువుకు పోతే ఊర్లలో పనిపాటలెవరు చేస్తారనే పెద్ద కులాల వికృత ప్రకటనలు,వాటి రాజకీయ వ్యక్తీకరణలు కూడా ఇటీవలిదాకా వింటూ వచ్చాము. కొంతమంది సుఖాల కోసం చాలామంది ఈ దేశంలో బతుకులు కోల్పోతూ రావడమే ఈ దేశంలో ఇప్పటికీ జరుగుతున్న విషాద పరిణామం.

దాదాపు 20 ఏళ్ల క్రితం అనుకుంటాను జంటిల్‌మన్ అనే సినిమాలో, ఎండమావిలా మెరిపిస్తున్న డాక్టర్ చదువు చదవాలనే కోరికకు అడుగడుకునా తూట్లు పడుతుండటంతో, తన కోసం తల్లి జీవితాన్ని కూడా బలి పెడుతున్న ఘటనను చూడకముందే తాను రోడ్డుమీద బస్సుకింద తలపెట్టి చనిపోయిన ఆ అబ్బాయి ఇప్పటికీ నా తలపుల్లో గింగురుమంటూనే ఉంటాడు. మన ఘనమైన అహింసా దేశంలో ఇలాంటి హింసలు లక్షల్లో కళ్లముందు జరుగుతూనే ఉన్నాయి.

కాళీపట్నం రామారావు గారు రచించిన యజ్ఞం కథలో, తన కొడుకు తనలాగా అప్పులపాలై బానిస బతుకు బతకకూడదని సీతారావుడు తన కన్న కొడుకును కత్తితో నరికివేసిన భయానక చర్య తెలుగు సాహిత్య లోకాన్ని కదిలించేసింది. జీవితవాస్తవాన్ని ఇంత భీభత్సంగా, భయానకంగా చూపించాలా.. ఇది సరైన పరిష్కారమేనా అంటూ ఈ కథపై చాలా విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి.

కాని ఎన్ని వందల వేల, లక్షల జీవితాలు మన చుట్టూ నేటి హైటెక్ యుగంలో కూడా భీభత్సంగానే ముగుస్తున్నాయో మనకందరికీ తెలుసు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, ఆంగ్లాన్ని అనర్ఘళంగా ఔపౌసన పట్టినా చదవడానికి శక్తిలేక, డబ్బుల్లేక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు కేరళకు పోయి బిచ్చమెత్తుకుని చదువుకు కావలసిన డబ్బులు ఏరుకుంటోందని నిన్న కాక మొన్ననే చదివాము. ఇంతకు మించిన భయానక జీవనవాస్తవికతను మనం కథల్లో చూడగలమా?  ఎంతమంది పేద పిల్లల బతుకులు, చదువుల గడివరకూ రాలేక బాల కార్మిక జీవితపు తొలి అడుగులను పదేళ్ల ప్రాయంలోనే వేస్తున్నాయో మనందరికీ తెలుసు.

రమణ గారు,
విత్తనంగింజను రైతు భద్రంగా చూసుకుని వచ్చే పంటకోసం దాపెడుతున్నట్లుగా పిల్లలను కుటుంబాలు భవిష్యత్తు కోసం భద్రంగా దాచిపెట్టాలని చెబుతున్న ఈ కథను వీలైతే ఇంగ్లీష్ భాషలో కూడా ప్రచురించే ఏర్పాట్లు చేయండి. ఈ మార్చి నెలలో 12 భాషల చందమామల్లో మీ కథ ప్రచురిస్తున్నాము. ఇతర భాషల్లో అనువాదం కోసం దీన్ని ఆంగ్లంలో బ్యాక్ ట్రాన్స్‌లేషన్ చేయించాము కాబట్టి మీకు ఆంగ్ల అనువాద ఫైల్ కూడా పంపుతాము. ఇంగ్లీష్ చందమామలో కూడా ఈ కథ వస్తే బాగుంటుంది కాని ప్రాంతీయ చందమామలకు, ఇంగ్లీష్ చందమామ లే అవుట్‌కు ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి ప్రచురించలేకపోతున్నాము.

దాదాపు మీ కథ చందమామలో మూడున్నర పుటలు రావడంతో అనివార్యంగా కథను కొంత కుదించి 3 పుటలకు తీసుకురావలిసి వచ్చింది. వర్ణణలు, అలంకారాలు, అదనపు పదాలు వంటి దర్జీ పనికి దొరికే వాటినే తొలగించాము తప్ప మూలకథకు మార్పు చేయలేదనే అనుకుంటున్నాము. పత్రిక చేతికందాక చూసి చెప్పండి.

కొసమెరుపు
మీ కథకు బొమ్మలు వేయవలసిందిగా సీనియర్ చిత్రకారులు శంకర్ గారికి పంపించాము. ఆయన చందమామ ఆఫీసుకు వచ్చి పని చేస్తున్న కాలంలో తెలుగు కథను ఒకటికి రెండు సార్లు చదివించుకుని అర్థం చేసుకుని తర్వాతే బొమ్మలు వేసేవారు. ఇంటిపట్టునే ఉంటూ ఇప్పుడు బొమ్మలు వేస్తున్నారు కనుక కథ ఇంగ్లీష్ అనువాదాన్ని పంపిస్తే దాని రెండు సార్లు చదివి తర్వాతే బొమ్మలేయడానికి కూచుంటారు. కథలో ఏమాత్రం సందేహం వచ్చినా, బొమ్మకోసం పంపిన వర్ణనలో కాస్త తేడా ఉందని గమనించినా వెంటనే ఫోన్ చేసి బొమ్మను కాస్త మార్చవచ్చునా అని అడుగుతుంటారాయన.

ఆయన మీ కథ ముందుగా చదివారు. అతిశయోక్తి అనుకోకుంటే మీ కథ చదివాక ఆయన నిజంగా కదిలిపోయారు. సందేహ నివృత్తికోసం ఫోన్‌లో మాట్లాడుతూ, తనను విశేషంగా ఆకర్షించిన ఒక వ్యాక్యాన్ని పదే పదే తల్చుకుని ప్రస్తావించారు.

“చిన్న పిల్లవాడిని బడికి పంపకుండా పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్యా, అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం. తెలుసా!” అంటూ టీచర్ మాధవయ్య, పిల్లవాడి తండ్రిని మందలిస్తే, “తెలియదయ్యా, ఆకలి తప్ప మాకేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవటం లేదు,” అంటాడు ఆ పేద తండ్రి.

శంకర్ గారు ‘ఆకలి తప్ప మాకేమీ తెలియదు’ అనే ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నారు. ‘ఎంత గొప్ప వ్యక్తీకరణ.. ఆకలి ముందు ఈ ధర్మసూత్రాలూ పనిచేయవ’ని చెబుతూ, ఇలాంటి కథలు చందమామకు ప్రాణం పోస్తాయంటూ ఆయన కదిలిపోయారు. రచయితలను ప్రోత్సహిస్తే, రచనలు పంపమని వారి వెంటబడి మరీ ఒత్తిడి పెడితే చందమామకు కథలు కరువా..! అంటూ ఆయన ఏకవాక్యంతో మీ కథను శిరసున పెట్టుకున్నారు.

ఈ నవ వృద్ద చిత్రకారుడికి కథ నచ్చిందంటే, చందమామ కధ సగం విజయం సాధించినట్లే లెక్క. ఎందుకంటే 60 సంవత్సరాలుగా ఆయన చందమామ కథలను వింటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. పనిపాటలు చేసుకునే పాటక జనానికి కాస్త ఓదార్పు నిచ్చి అలసట తీర్చేదే కథ అంటూ ఆయన చందమామ కథా రహస్యాన్ని ప్రతిసారీ విప్పి చెబుతుంటారు.

రమణగారూ,
కేవలం శంకర్ గారి అభిప్రాయం రావాలనే మీ కథపై రాతపూర్వక స్పందనను ఇంత ఆలస్యంగా పంపుతున్నాను. అందుకు క్షమించాలి. అపార్థం చేసుకోరనే ఆశిస్తున్నాను. జీవిక రీత్యా, బాలసాహిత్య పరిషత్ బాధ్యతల రీత్యా తీవ్రమైన పని ఒత్తిడులలో ఉంటూ కూడా అడపా దడపా చందమామకు మీరు కథలు పంపుతూనే ఉన్నారు. పిల్లలనూ, పెద్దలనూ హృదయపు లోతులకంటా వెళ్లి స్పర్శించే ఇలాంటి మంచి కథలను మీరు చందమామకు ఎప్పటికీ పంపుతారని, పంపుతూండాలని కోరుకుంటూ..

మన:పూర్వక కృతజ్ఞతలతో
మీ
చందమామ.

RTS Perm Link

మా అమ్మ పేపరు చదవటం

December 20th, 2011ఇది అరవై ఏళ్ల క్రితం చందమామలో వచ్చిన ఒక పేజీ కథ. 1953 జనవరి సంచికలోనిది. చందమామ అంతర్గత పనుల్లో  భాగంగా దీన్ని ఇవ్వాళ టైప్‌ చేయవలసి వచ్చింది. చదవగానే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది.  సామాజిక స్పృహ అనే పెద్ద పెద్ద పదాలు వాడకుండానే చందమామలో సమకాలీన సమాజ చిత్రణ ఎంత స్పష్టంగా, ఎంత మనోహరంగా చిత్రించబడేదో చెప్పడానికి ఈ కథ ఈనాటికీ ఒక సజీవ ఉదాహరణ.

కుటుంబ సభ్యులందరి పనులూ చేసిపెట్టే అమ్మ పేపర్‌ చదవటానికి ఎంత హైరానా పడుతుందో, పని చేసి కోల్పోయిన శక్తిని ఎంతగా కూడగట్టుకోవలసి వస్తుందో, కనీసం పేపరు చదవడానికి కూడా ఆమె ఎంత స్ట్రగుల్‌ అవ్వాల్సి వస్తుందో విశాఖ పట్నంకి చెందిన లక్ష్మీబాయి గారు 1953 లోనే అత్యద్భుతంగా ఈ చిన్ని కథనంలో వర్ణించారు.

ఇంట్లో అందరూ విసిరేసిన పేపర్‌ ముక్కలను ఏరుకోవడం, పరుపుమీదికి చేరాక కళ్లద్దాలు మరిచిపోవడం, ఇల్లంతా వెతకడం, తీరా కళ్లద్దాలు దొరకటం, తర్వాత పేపర్‌ కనబడకుండా పోవడం. దిండు కింద పెట్టి మర్చిపోవడం. ఇన్ని కష్టాలు పడ్డాక పేపర్‌ చదవడం అనే పని మొదలు పెట్టి చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోవడం.  తీరా ఆ పేపరు ఆరోజుదు కాదు నిన్నటిదో మొన్నటిదో అని గ్రహించి కుటుంబ  సబ్యులంతా నవ్వటం. కాని ఆ పాత వార్తలనే అమ్మ మర్నాడు పూస గుచ్చినట్లు చెప్పడం..

తెల్లారు జామునే లేచి పని చేసి  కుటుంబాన్ని లేపి, బయటకు పంపే అమ్మ పేపర్‌ చదవడానికి ఎంత కష్టపడుతుందో మరి. అంత పని చేసి అమ్మకు నిద్ర రాదంటే రాదా మరి. “ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అంటూ మగ మహారాజులం ఎన్ని లక్షలసార్లు మన అమ్మలనూ, మన జీవన సహచారిణిలనూ ఇన్నాళ్లూ అని ఉంటామో. అమ్మ కష్టాలు అమ్మకే అర్థమవుతాయోమో మరి.

మనుషులు చేసే శ్రమలన్నింటిలోనూ నిస్సారమైందీ, మనిషిని నిర్వీర్యం చేసేదీ, సమాజం దృష్టిలో ఎలాంటి విలువ లేనిదీ ఇంటిపనే అని లెనిన్‌ వందేళ్ల క్రితం ఢంకా భజాయించి చెప్పాడు. దానికి పరిష్కారంగా మహిళలను పెద్ద ఎత్తున సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లోకి తీసుకురావాలని, ఉయ్యాలలూపే చేతులు రాజ్య వ్యవహారాలలో పాలు పంచుకోవాలని లెనిన్‌ ఒక మహత్తర స్పప్నాన్ని అప్పట్లోనే ఆవిష్కరించారు. దానికనుగుణంగా అక్టోబర్‌ విప్లవం విజయవంతమయ్యాక సోవియట్‌ రష్యాలో పురుషులతో సమానంగా స్రీలు సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు.

ప్రపంచ చరిత్రలో మహిళలకు ఉత్పత్తి వ్యవహారాల్లో సమాన భాగస్వామ్యం  కల్పించిన మొట్ట మొదటి దేశంగా సోవియట్‌ యూనియన్‌ నిలిచింది కూడా. హిట్లర్‌ దండయాత్ర కాలంలో ఒక తరం యుపకులు మొత్తంగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టవలసిన విపత్కర పరిస్థితుల్లో సోవియట్‌ మహిళలు దేశంలోని మొత్తం కర్మాగారాలలో ఉత్పత్తి సజావుగా కొనసాగే పాత్రను చేపట్టారని అప్పట్లో ఫ్యాక్టరీల్లో పని చేసిన స్ర్తీపురుషుల నిష్పత్తి 70:30గా ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. కాని ఆ స్వర్గం తనంతట తాను కూలిపోయింది. కారణాలు లక్షోపలక్షలు.

ఆశ్చర్యకరమైనదేమిటంటే ఇంట్లో  మహిళలు చేసే వంటపని లోని శ్రమను గుర్తించి దానికి 3 వేలరూపాయల ఆర్థిక విలువను లెక్కగట్టి చెప్పడానికి భారత సర్వోన్నత న్యాయస్థానానికి దాదాపు 65 సంవత్సరాల సమయం పట్టింది. మన అమ్మ.. మనందరి అమ్మ… కుటుంబం కోసం తన శక్తియుక్తులను ఫణంగా పెట్టేది. తన జీవితం మొత్తాన్ని కుటుంబంకోసం త్యాగం చేసేది. నా దృష్టిలో పేపరు చదువుతూ అలాగే నిద్రపోయే అమ్మ మన సామాజిక జీవిత చిత్రణకు నిలువెత్తు దర్పణం. సమాజంలో సగభాగానికే కాదు… యావద్దేశానికే అన్నం వండి పెడుతున్న మహాత్మురాలు.

పైసా ఆదాయం అడగకుండానే, కుటుంబానికి సమస్త చాకిరీలు చేసిన, చేస్తున్న  జీవిత ఔన్నత్యానికి మన కాలపు ప్రతీక అమ్మ. మన సహచరికి కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలోపల, ఇంకా చెప్పాలంటే  మన వెనుక ఉన్న అమ్మలూ, అర్దాంగినులూ మన వ్యక్తిగతానికి సంబంధించిన అన్ని పనులూ చాకరీలు చేసిపెడుతూ సామాజిక మానవులుగా, ఉత్పత్తిలో పాలుపంచుకునే మానవులుగా మనల్ని తీర్చిదిద్దుతుంటారు. మనం సమాజ కార్య కలాపాల్లో పాల్గొంటూ విశ్రాంతి సమయంలో అపుడప్పుడూ తీరిగ్గా  సిద్దాంతాలు కూడా చేస్తుంటాం.

తీరా మహిళ బయట పనిచేయక తప్పని అనివార్య పరిస్థితులు వచ్చి పడిన నేటి కాలంలో కూడా ఇంటికి రాగానే వంటపని, ఇంటిపని వంతు మహిళ స్వంతంగానే ఉంటోంది. “అయినా ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అని మనం అంటూనే ఉంటాము. మగ మహారాజులం కదా. ఆమాత్రం అనకపోతే మన మగతనం ఏమైపోవాలి..

చాకిరీ చేసే అమ్మా, ఇంటిల్లిపాదినీ బయటపనులకు తయారు చేసి పంపే అమ్మా, పేపరు చదువుతూ, చదువుతూ అలానే నిద్రపోయే అమ్మా.. నువ్వు చదువుతూనే నిద్రపోవే అమ్మా! ఈ ప్రపంచం ఏమీ మునిగిపోదు.

(అమ్మ గొప్పతనాన్ని, అమ్మతనం లోని విలువను మరోసారి గుర్తుకు తెచ్చిన చందమామ అలనాటి కథకు జోహార్లు.)

ఆ అలనాటి అపురూప కథ పూర్తి పాఠాన్ని  ఇక్కడ చదవండి.

మా అమ్మ పేపరు చదవటం

మా అమ్మ సాయంత్రం పూట పేపరు ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూశారూ? ఏ సంగతి మరిచినా అమ్మ పేపరు చదవడం మాత్రం మరవదు. పాపం, ఇంటిపనంతా ముగించుకుని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ  ఒక్క చోటున ఉండవు. నాలుగు వేపులా నాలుగు కాగితాలూ ఇంట్లో పడి ఉంటాయి. మేడమీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్యపేజీ, ఇవన్నీ ఏరుకుని వచ్చి అమ్మ పడుకుని చదవడానికని ఆసక్తితో పరుపుమీదకు వెళుతుంది.

అమ్మకప్పుడు జ్ఞాపకమొస్తుంంది. తన కళ్లద్దాలు మరచిపోయనట్లు. వాటికోసరం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకు అప్పుడు జ్ఞాపకమొస్తుంది ఎక్కడుంచిందీ, ఎలాగో కళ్లద్దాల పెట్టె దొరుకుతుంది. కాని, అది తీసి చూసేసరికి అందులో కళ్లద్దాలు ఉండవు. మళ్లీ ఐదు నిమిషాలు గాలించుతే కళ్లద్దాలు దొరుకుతాయి. ఆఖరుకి పరుపు దగ్గిరికి వెళితే, పేపర్లు ఏవి! ఇక్కడే పెట్టానే అనుకుంటుంది.

కొంత సేవు వెతికిన తర్వాత కళ్లద్దాల కోసం వెళ్లేముందు ఆ పేపర్లు తలగడ కిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకమొస్తుంది. ఇన్ని బాధలు పడి. ఎలాగో పేపరు చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క ఘడియ చదువుతుందో లేదో చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది.

ఇంతలో మానాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి, ఒక్కసారిలా వచ్చి చూడండి, అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకూ అసలా పేపరు ఆ రోజుదే కాదు. నిన్నటిదో, మొన్నటిదో తారీకు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలూ, విశేషాలూ, వార్తలూ చక్కా పూసగుచ్చినట్లు చెపుతుంది. మరి ఎలా చెప్పగలుగుతుంమదో ఏమో..!
-లంకలపల్లి లక్ష్మీబాయి – వాల్తేరు

RTS Perm Link

చందమామ కథల పునాది…

January 11th, 2011

“బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి…పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు…దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు…కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ”. -కొడవటిగంటి కుటుంబరావు

చందమామకు కథలు రాయాలనుకునేవారికి, కథలు పంపాలనుకునేవారికి కరదీపికలాంటిదీ చిన్న పేరా. అప్పుడూ, ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా చందమామ కథలకు దిశానిర్దేశం చేయగల ప్రామాణికతకు ఈ చిన్ని పేరా ఒక ప్రతీకగా నిలుస్తుంది. దయ్యాల పేరు ఎత్తితేనే అశాస్త్రీయమనే తప్పు వైఖరినుంచి బాలసాహిత్యాన్ని మళ్లించి, -దయ్యాలు, భూతాలు, రాక్షసులు, మంత్రాలు, మహత్తుల వంటి కాల్పనిక ప్రపంచపు ప్రామాణిక అంశాలను మనుషుల్లో మంచిని నిలబెట్టడానికి ఉపయోగించే క్రమంలో చందమామ కథలు ఒక అద్భుత ప్రయత్నం చేశాయి.

రాత్రిపూట కదిలే చెట్ల నీడను చూసి దయ్యమనుకుని దడుచుకునే లక్షలాది మంది పిల్లలు చందమామలో చింతచెట్టు దయ్యాల కథలు చదివి మహానుభూతిని పొందారు. చందమామ దయ్యాలు అటు పిల్లలను ఇటు పెద్దలను భయపెట్టకపోగా వారు దశాబ్దాలుగా చింతచెట్టు దయ్యాల కథలను చదువుతూనే ఉన్నారు రామాయణ భారతాలు, ధారావాహికలు, బేతాళ కథలు, పాతికేళ్లనాటి కథలు తర్వాత చందమామ పాఠకులు ఈనాటికీ మర్చిపోకుండా ప్రచురించమని కోరుతున్న కథలు చింతచెట్టు దయ్యాల కథలే.

“ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి..కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ.” అంటూ కుటుంబరావుగారు కథల స్వభావం గురించి చేసిన వ్యాఖ్య చందమామ కథలకు ప్రాణ ప్రతిష్ట కల్పిస్తోంది.

రామాయణం, భారతం ఐతిహాసిక గాధలను చందమామలో చదివితే మహిమలు, విశ్వాసాలు, భక్తి వంటి వాటికంటే, మానవ స్వభావంలోని పాత్రలు మాత్రమే మనకళ్లముందు కనబడి ఆనందం కలిగిస్తాయి. మంచి చెడ్డల మధ్య విచక్షణను తేల్చుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడతాయవి. ఏ కథ చదివినా, ప్రాథమికంగా మనిషి యత్నమూ, మనిషి సద్బుద్ధీ మాత్రమే చివర్లో నెగ్గడం చందమామ కథల లక్షణం.

కొత్తగా చందమామకు కథలు పంపేవారు కూడా ఈ ధర్మసూత్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే చందమామలో ఎలాంటి కథలు ప్రచురణకు తీసుకుంటారో, ఏ కథలు సాధారణంగా ఎంపికవుతాయో సులభంగా అర్థం అవుతుంది. మంచిని మాత్రమే చెబుతాం చెడు ఉన్నా చెప్పం అనే సూత్రం చందమామ కథలకు కూడా వర్తిస్తుంది. అది మరి కాస్త ముందుడుగు వేసి మంచికి మాత్రమే పట్టం గడతాం, మంచిని మాత్రమే గెలిపిస్తాం అనే స్థాయికి చందమామ కథలు పరిణమించాయి.

చందమామ కథల స్వభావానికి సంబంధించిన ఈ రహస్యాన్ని పట్టుకున్నారు కనుకే చందమామ కథకులు దశాబ్దాలుగా చందమామకు అర్హమైన కథలను మాత్రమే పంపుతూ చందమామ విజయగాథకు కథల వన్నెలద్దారు. సమాజంలోని, మనుషుల్లోని దుర్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వడం -హైలెట్ చేయడం- కాకుండా ఆ దుర్గుణాలపై అంతిమంగా మానవ విజయానికి ప్రాధాన్యమిస్తూ ముగిసే కథలు చందమామకు శాశ్వత కీర్తిని అందించాయి.

వరుసగా రెండు మూడు చందమామ సంచికలలోని కథలను చదివి పరిశీలిస్తే చందమామ కథల ఫార్మాట్ సులభంగా బోధపడుతుంది. ఈ ప్రాతిపదికన చందమామకు కథలు రాసి పంపగలరని కొత్త కథకులను కోరుతున్నాము.

చందమామలో గత 15 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో కొత్త కథలు –పాత, కొత్త రచయితలు రాసి పంపుతున్నవి- ప్రచురించబడుతున్నాయి. ఒక్క డిసెంబర్ సంచికలో శ్రీనివాస కల్యాణం సీరియల్‌తోపాటు 12 కథలు కొత్తవి ప్రచురించబడ్డాయి. ఇక జనవరి నెలలో మొత్తం 14 కథలు కొత్తవి –అంటే గతంలో ప్రచురించబడనివి- వచ్చాయి.

చందమామ సైజు ప్యాకెట్ సైజ్‌కు కుదించుకు పోయి మళ్లీ కాస్త పెద్దదయిన సందర్భాన్ని పాఠకులు మెచ్చనప్పటికీ, ఇన్ని కథలు కొత్తవి వేయడం, ఒకే సంచికలో 18 కథలు రావడం చూసి పాఠకులు, అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

దశాబ్దాలుగా చందమామ కథల శైలికి అలవాటుపడిన మాన్య కథకులు, ఇతర పత్రికలలో వందల కథలు రాసినప్పటికీ చందమామకు ఇప్పుడు కొత్తగా కథలు రాసి పంపుతున్నవారు, జీవితంలో ఒకసారయినా చందమామలో కథ ప్రచురించబడాలనే చిర ఆకాంక్షతో కథలు పంపుతున్నవారు. –వీరు కూడా మంచి విషయాన్నే ఎంచుకుంటున్నారు- కొత్తగా కథలు రాస్తున్నవారు చందమామకు ఇటీవల కాస్త ఎక్కువగానే కథలు పంపుతున్నారు. కథలు పంపినప్పటికీ, అవి ప్రచురణకు తీసుకుంటున్నదీ లేనిదీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే చెప్పలేకపోతున్నప్పటికీ, కథకులతో ఫోన్ ద్వారా రెగ్యులర్ సంబంధంలో ఉండటం ద్వారా చందమామకు, కథకులకు ఒక విశ్వాస బంధం చెక్కుచెదరకుండా కొనసాగుతోందనే భావిస్తున్నాము.

గతంలో వలే పోస్ట్ కార్డ్ ద్వారా కమ్యూనికేషన్ ఇప్పుడు దాదాపు అసాధ్యమయ్యే పరిస్థితి రావడంతో వీలైనంత మేరకు ఫోన్, ఈమెయిల్ ద్వారానే సంప్రదింపులు జరుగుతున్నాయి. పాఠకులు,  కథకులు కూడా అవకాశముంటే తమ ఫోన్ లేదా మొబైల్‌ని పంపితే నేరుగా వారితో సంప్రదించడానికి వీలవుతుంది.

ఈ పరిమితిని, ఈ సౌలభ్యాన్ని పాఠకులు, అభిమానులు, కథకులు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా తమ ఫోన్ సంఖ్యలు, ఈమెయిల్‌ని చందమామ చిరునామాకు పంపవలసిందిగా అభ్యర్థన.

తెలుగు చందమామకు కథలు, ఉత్తరాలు పంపేవారు నేరుగా చెన్నయ్ లోని చందమామ కార్యాలయానికే పంపవచ్చు.

K. Rajasekhara Raju,
Associate Editor (Telugu) – Online
Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone :  +91 44 43992828 Extn: 819
Mobile : +91 9884612596

Email :  rajasekhara.raju@chandamama.com
Visit us at telugu. chandamama.com
blog : blaagu.com/chandamamalu

లేదా ఎడిటర్ పేరుతో కూడా పై చిరునామాకు పంపవచ్చు. తెలుగులో కథలు టైప్ చేసి పంపలేని వారు తాము రాసిన కథలను స్కాన్ చేసి నేరుగా ఈమెయిల్ రూపంలో కూడా కథలు పంపవచ్చు. అయితే స్కానింగ్ సరిగా చేయాలి. కథ అటూ ఇటూ చెరిగిపోకూడదు. ఇక పోస్ట్ ద్వారా కథలు పంపే ప్రక్రియ ఎలాగా కొనసాగుతోంది.

సంక్రాంతి సందర్భంగా చందమామ పాఠకులకు, అభిమానులకు, కథకులకు, చంపిలకు చందమామ హార్దిక శుభాకాంక్షలు.

RTS Perm Link

దేవధర్మం

November 23rd, 2009

devadharmam 2

చాలాకాలం క్రితం కాశీరాజుకు పట్టపు రాణియందు ఇద్దరు కొడుకులు కలిగారు. రాజు వారికి మహింసాసుడనీ, చంద్రకుమారుడనీ పేర్లు పెట్టాడు. మహింసాసుడే బోధిసత్వుడు. చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే తల్లి తీరని వ్యాధి సోకి హఠాత్తుగా చనిపోయింది.

అప్పుడు రాజు మరొక భార్యను పెళ్ళాడి, ఆమెను పట్టపురాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగానూ, అనుకూలవతిగానూ ఉంటూ, కాలక్రమాన తాను కూడా ఒక అందమైన పిల్లవాణ్ణి కన్నది. వాడికి సూర్యకుమారుడని పేరు పెట్టారు. రాజు ఒకనాడు ఈ పుత్రుణ్ణి చూసి ఎంతగానో సంతోషించి పట్టపురాణితో, ‘‘నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను కోరుకో,’’ అన్నాడు.

‘‘మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అయితే, ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను,’’ అన్నది పట్టపురాణి.

కొంత కాలానికి సూర్యకుమారుడు యుక్తవయస్కుడయ్యాడు. అప్పుడు పట్టపురాణి రాజుతో, ‘‘నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు. జ్ఞాపకం ఉన్నది కదా? ఇప్పుడా మాట చెల్లించి, నా కొడుక్కు రాజ్యం ఇయ్యండి,’’ అన్నది.

‘‘అగ్నిజ్వాలల లాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరుండగా నీ కొడుక్కు రాజ్యం ఇవ్వటం ఏ ధర్మమూ అంగీకరించదు. అందువల్ల అది సాధ్యం కాదు,’’ అన్నాడు రాజు.

రాణి ఆగ్రహం చెందింది కాని, అప్పటికేమీ మాట్లాడకుండా మౌనం వహించింది.

ఆమె తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన ఒకనాడు మహింసాసుణ్ణీ, చంద్రకుమారుణ్ణీ చేర పిలిచి, ‘‘అబ్బాయిలూ, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి ఒక వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు సూర్యకుమారుడికి రాజ్యం ఇవ్వమని కోరుతున్నది. నేను అందుకు అంగీకరించలేదు. అయితే దురాశ ప్రళయాంతకమైనది. అది రాజ కుటుంబంలో మరింత హాని కలిగిస్తుంది. ఆమె మీకు ఏదన్నా కీడు చేయవచ్చు. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి, నేను కన్ను మూశాక తిరిగి వచ్చి, ఈ రాజ్యం ఏలుకోండి,’’ అని చెప్పాడు.

ఇదేమీ సూర్యకుమారుడు ఎరగడు. ఒక నాడు తన అన్నలు చెప్పాపెట్టాకుండా రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండటం చూసి, ఆశ్చర్యపోయాడు. అన్నలతోపాటు బయలుదేరాడు.

ముగ్గురు అన్మదమ్ములూ కొన్నాళ్ళకు హిమాలయాల మీదికి వెళ్ళారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సూర్యకుమారుడితో, ‘‘తమ్ముడూ, ఆ కనిపించే కొలనుకు వెళ్ళి, స్నానం చేసి, దాహం తీర్చుకుని, మా ఇద్దరికీ తాగటానికి తామరాకులతో నీరు పట్టుకురా,’’ అన్నాడు.

ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడి కిచ్చి, దేవధర్మం ఎరిగిన వారిని విడిచి పుచ్చమనీ, అది తెలియనివాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమనీ, కొలనులోకి దిగనివారి జోలికి పోవద్దనీ చెప్పాడు.

అది మొదలు ఆ యక్షుడు కొలనులో దిగిన ప్రతి మనిషినీ, ‘‘దేవధర్మం ఏమిటి?’’ అని అడిగి, చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత, సూర్యకుమారుడు కొలనులోకి దిగగానే ఆ యక్షుడు అతణ్ణి అడ్డుకుని, ‘‘నీకు దేవధర్మం తెలుసునా?’’ అని అడిగాడు.

‘‘తెలుసు; దేవధర్మం అంటే ఆకాశంలో వెలుగుతూన్న సూర్యచంద్రులు,’’ అన్నాడు సూర్యకుమారుడు.
‘‘నీకు దేవధర్మం తెలియదు,’’ అని యక్షుడు సూర్యకుమారుణ్ణి కొలను లోపల ఉన్న తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు.

జాతక కథలులో భాగంగా చందమామలో వచ్చిన ఈ కథ పూర్తిపాఠాన్ని కింది లింకులో చదవండి.
దేవధర్మం

RTS Perm Link

మౌనమే దీటైన సమాధానం

November 12th, 2009

పిల్లల కథల్లో మనదే పెద్ద స్థానం. పంచతంత్ర కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, జాతక కథలు, బేతాళ కథలు…. ఇలా మనకున్న కథా సంపద అపారం. 16వ శతాబ్దంలో పేరొందిన కథల్లో ముఖ్యమైనవి బీర్బల్ కథలు. మాట విరుపుతో, మెరుపు యోచనతో ఎంత క్లిష్టమైన పరిస్థితినయినా ఎలా అధిగమించవచ్చో తెలిపే చక్కటి కథలివి.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడిలాగా, అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్‌ది తిరుగులేని స్థానం. -తెనాలి, బీర్బల్ ఇద్దరూ ఓ రకంగా సమకాలికులు కూడా-. ఈ స్థానమే తోటి సభికులకు, రాజోద్యోగులకు కంటగింపుగా మారి, చక్రవర్తి సమక్షంలో బీర్బల్‌ను కుయుక్తులతో పడగొట్టాలని వారు ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ బీర్బల్ తనకే సముచితమైన సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాలను వమ్ము చేస్తాడు.

మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరని, అసంబద్ధ ప్రశ్నలకు మౌనమే దీటైన సమాధానమని ఈ వారం బీర్బల్ ధారావాహిక 18వ భాగం కథ “మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం” బోధిస్తోంది. అదేంటో ఇక్కడ చూడండి.
 
మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం

విజయం విజేతకు ఆనందాన్నిస్తుంది. అతడి మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ సంతోషాన్నిస్తుంది. తక్కిన వారిలో ఈర్ష్యాసూయలకు కారణమవుతుంది. ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు. అసూయతో కుతకుతలాడిపోతారు. బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.

బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకు పోయేవారు. బీర్బల్‌ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు.

వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకుని, అది గనక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడి పోయారు!

మరునాడు అలాంటి అసూయాపరుల నాయకుడు షైతాన్‌ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికీ, ఆసక్తికరమైన విశేషాలు వినడానికీ సమాయత్తమయ్యాడు.

షైతాన్‌ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. ‘‘చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘షహేన్‌షా! మనకందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.

‘‘గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్ సంతోషంగా.

‘‘నిజమే షహేనషా! చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతే కాదు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్‌కు సాటి కాలేము,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.

ఆ తరవాత అతడు స్వరం తగ్గించి, ‘‘బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా వున్నాడు. మరి, ఆయన్ను కన్నతండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా?’’ అన్నాడు చక్రవర్తితో.

ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకువచ్చింది. ఇన్నాళ్ళు తనకీ యోచన రానందుకు ఆశ్చర్యపోయాడు.

ఈ కథ పూర్తి భాగంకోసం ఇక్కడ చూడండి.

బీర్బల్ కథలు ధారావాహికలో ఇంతవరకు ఆన్‌లైన్ చందమామ ప్రచురించిన 18 కథలు చూడాలంటే, ఈ లింకుపై క్లిక్ చేయండి.

RTS Perm Link

దేవుడికంటె గొప్పవాడు!

October 27th, 2009

(ఏక రాజ్యంగా ఉండవలసిన ఓ గొప్ప దేశం ప్రాంతీయ పక్షపాతం అనే మకిలి పాలక ప్రతినిధులలో దూరిన క్షణంలో నాలుగు చిన్న దేశాలుగా మారి అంతవరకు సాధించిన ప్రగతిని తనకు తానుగా మసకబార్చుకుంది. ప్రపంచాన్ని సృష్టించాడని అందరూ అంటున్న దేవుడు గొప్పా లేదా ఆ దేవదేవుడే గీసిన గీతను చెరిపివేసిన మనిషి గొప్పా అనే ధర్మసందేహాన్ని ఈ కథ చెబుతోంది.

సాక్షాత్తూ రాజుకే కనువిప్పు కలిగించిన ఈ ఘటనను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చదవండి.)
మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకరదేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించాడు. ఆయన రాజ్యం నాలుగు దిక్కులా బాగా విస్తరించింది. మారుమూలల నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమయింది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి, నాలుగు ప్రాంతాలనూ పాలించటానికి దక్షత గల రాజ ప్రతినిధులను నియమించమన్నారు.
 
వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి, నాలుగు భాగాలకూ నలుగురు విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. నలుగురు రాజప్రతినిధులూ నెల నెలా రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించీ, వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించీ నివేదికలు పంపుతూ వచ్చారు. వారిలో ప్రతి ఒకరూ తన రాజ్యభాగం మిగిలిన మూడింటి కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీ పడ్డారు.
 
ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టారు. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ప్రజలలో ఎప్పుడో వెనకబడిపోయిన జాతి వైరాలు తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించారు. ఇంతేగాక, ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు.
 
ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది, కాని నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షణ ప్రాంతపు నేతగాళ్ళకు అందేది; దేశంలో మేలురకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది. కాని ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షణానికి పోనివ్వక, తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు.
 
దేవుడికంటే గొప్పవాడు అనే ఈ కథ పూర్తిపాఠం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

 

ఆన్‌లైన్ చందమామలో ఇంతవరకు ప్రచురించిన 428 కథలు చదవాలంటే ఈ లింకును క్లిక్ చేయండి.

RTS Perm Link

పాతాళదుర్గం – 6

October 25th, 2009

Patala-durgam_400-350

కుంభీరుడూ, కాలశంబరుడూ చెరొక గుహలోకీ పారిపోయారు. సోమకుడు చెట్టు గుబురు కొమ్మపై నుంచి కంఠానికి గురిపెట్టి విడిచిన బాణం కదంబరాజు ఉగ్రసేనుణ్ణి భుజం మీద గాయపరిచింది. ఉగ్రసేనుడు రాజద్రోహులని ప్రకటించిన ధూమక సోమకులకు, కుంతలదేశ మంత్రి గంగాధరుడు అభయం ఇచ్చాడు. వాళ్ళిద్దరూ చెట్టుకొమ్మల్లో నుంచి ఆనందంతో కిందికి దూకారు. -తరవాత

ధూమక సోమకులను చూస్తూనే, కదంబ రాజు ఉగ్రసేనుడు కంపించిపోతూ, ‘‘మహా మంత్రీ! వీళ్ళకు మీరు అభయప్రదానం చేయటం ఏమీ బాగాలేదు. వీళ్ళు అరాజక వాదులు. ఒక రాజుకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు మరో రాజుకు ద్రోహం చెయ్యరన్న నమ్మకం ఏమిటి?’’ అన్నాడు.

ఇంతలో ధూమకసోమకులిద్దరూ మంత్రి గంగాధరుడి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆయన ముందు సాష్టాంగ పడి పోయారు. గంగాధరుడు వాళ్ళను లేవవలసిందిగా ఆజ్ఞాపించి, ‘‘ఇప్పుడు మీరిద్దరూ నిజమైన యోధుల్లా కనిపిస్తున్నారు. మీరు పితృ భ్రాతృ హంతకులన్న మాట నేనేమాత్రం నమ్మలేదు. మీకు యోధులకు తగిన దుస్తులు ఇప్పిస్తాను. మహారాజును గాయపరిచిన వాళ్ళు మీ ఇద్దర్లో ఎవరు?’’ అని అడిగాడు.

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి అద్భుత సృష్టి పాతాళదుర్గం. ఆన్‌లైన్ చందమామలో ప్రచురించిన ఈ ధారావాహిక 6 వ భాగం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చెయ్యండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138&stId=2288

దాసరి సుబ్రహ్మణ్యం గారి పరిచయ వ్యాసం కోసం కింది లింకును తెరవండి.
http://blaagu.com/chandamamalu/2009/09/10/చందమామ-కథలు-పాతాళదుర్గం/

RTS Perm Link

ఈ వారం బేతాళ కథ – రెండు నెమళ్లు

October 22nd, 2009

bethala kathalu new 450-350

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు  అనుమానం కలుగుతున్నది. కానీ, ప్రకృతిలోని వైపరీత్యాలూ, అందులోని జీవరాసుల ప్రవర్తనా గురించిన అంచనా వేయవలసి వచ్చినప్పుడు, పండితులూ, పామరుల మధ్య ఎంతో భేదభావం గమనించగలం. ఇందుకు ఉదాహరణగా నీకు, చంద్రశర్మ అనే ఒక చిత్రకారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు:

ఒకానొకప్పుడు సువర్ణదేశాన్ని పాలించిన సువర్ణదేవ మహారాజు గొప్ప భూతదయాపరుడు. తనదేశంలోని ప్రకృతి పరిసరాలను కాపాడుకోవాలనీ, అందుకుగాను చెట్లకూ, అక్కడ నివసించే పశుపక్ష్యాదులకు కూడా ఎలాంటి హానీ జరక్కుండా రక్షించుకోవాలనీ అందరికీ  చెబుతూండేవాడు. ఆయన ప్రతి సంక్రాంతికి  ఎడ్లకు పరుగుపందాలతో పాటువాటిలో చూడముచ్చటగా వుండేవాటికి మంచి బహుమతులు కూడా ఇస్తూండేవాడు. ప్రకృతిదృశ్యాలను అందచందాలతో చిత్రించిన చిత్రకారులను కూడా ఘనంగా సన్మానించేవాడు.

రాజధానికి దాపునగల ఒక గ్రామంలో వున్న చంద్రశర్మ మంచి చిత్రకారుడు. ఎవరైనా తమ రూపచిత్రం కావాలని కోరితే, కొద్దిసేపట్లో చిత్రించి ఇచ్చేవాడు. అందువల్ల, ఎంతోమంది ధనవంతులు అతడిచేత తమ చిత్రాలను గీయించుకునేవారు.  ఒకసారి చంద్రశర్మ, రాజుగారు సంక్రాంతి నాడు ఏర్పాటుచేసే చిత్రకళా పోటీలలో పాల్గొనదలచి – రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుగల చెక్కపలక మీద, రెండు అందమైన నెమళ్ళు పురివిప్పి ఒకదానికొకటి ఎదురుగా నాట్యం చేస్తున్నట్టు చిత్రించాడు.

ఆ చిత్రాన్ని చూసిన ఒకడు, ‘‘ఆహా, ఎంత అద్భుతం!  పురివిప్పిన నెమళ్ళు కళ్ళ ఎదుట నాట్యం చేస్తున్నట్లే వుంది. దీన్ని ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీస్తే, ఇంటికే చెప్పరానంత కళ వస్తుంది,’’ అంటూ మెచ్చుకున్నాడు. చిత్రకళలో పరిచయం వున్న మరొకవ్యక్తి, ‘‘మన చంద్రం, నెమలి కంఠం రంగులు బాగా కలిపాడు. ఆ రంగులు అలా ఎవరూ కలపలేరు; ఒకవేళ కలిపినా,  ఆ మెరుపు రాదు. రాజుగారు చూస్తే, దీనికి వంద బంగారు నాణేలిచ్చి తనదిగా చేసుకుంటారు,’’ అన్నాడు.

ఈ వారం బేతాళ కథ పూర్తి పాఠం -4 పుటలు- కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2287

గమనిక: ఈ కథ చివరలో బేతాళుడు సంధించిన ప్రశ్నకు విక్రమార్కుడు ఇచ్చిన జవాబును ముందుగా చదవకుండా మీరే ఆలోచించి సమాధానం చెప్పండి చూద్దాం. సమాధానం తెలిసీ చెప్పకపోయారో…. మీ శిరస్సు….. అంతే…….

ఆన్‌‌లైన్ చందమామలో ఇప్పటివరకు ప్రచురించిన 64 బేతాళ కథలు చదవాలని ఉందా?
అయితే కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97 

మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.

RTS Perm Link

తెనాలి రామలింగం

October 12th, 2009

ఇది 1947 చందమామ తొలి సంచిక -జూలై- లోని కథ. చందమామ సుప్రసిద్ధి గాంచిన తన కథా, చిత్ర రూపురేఖలకు ఇంకా అలవాటుపడని కాలంలో బొమ్మలు లేకుండా వచ్చిన కథ ఇది. కాళికాదేవి వెయ్యితలలను మనిషి దృక్పధంలోంచి చూసి పక్కున నవ్విన ధీరుడి కథ ఇది. అదేంటో తెలుసుకోవాలంటే దీనిని పూర్తిగా చదవండి.

తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగమయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు.

చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. అతనికి నదురు బెదురు ఏ కోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని వెక్కిరించడంలో మొనగాడు.

ఒకరోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తిమంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు :

“నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది.” అని చెప్పి యోగి వెళ్లిపోయాడు.

ఒక మంచిరోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్థరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమో ఫక్కున నవ్వాడు.

ఈ కథ పూర్తి పాఠం చదవాలంటే.. కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2271

RTS Perm Link

పండుటాకుల పాట

October 11th, 2009
చందమామ 1947

చందమామ 1947

ఇది 1947 జూలై చందమామ మొదటి సంచికలోని కథ. దీనిని ఆన్‌లైన్ చందమామ పాఠకులకు అందిస్తున్నాం. పచ్చనాకు ఎండుటాకును వెక్కిరిస్తే, నీకూ నాగతే అంటూ ఎండుటాకు నవ్విందనే కథ దాదాపుగా మనందరికీ తెలిసిందే..

దాన్ని మరొక రకంగా దాదాపు 62 ఏళ్ల క్రితం చందమామ తన తొలిసంచికలో ఎంత అద్భుతంగా ఈ చిన్ని కథలో వివరించిందో చూడండి.

పండుటాకుల పాట
“…..అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆచెట్టు మీద పెద్ద కొమ్మ. ఆ కొమ్మకొక చిన్ని రెమ్మ. ఆ రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలు కొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు.

అంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఆ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్నసన్నగా వినిపించింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి.

చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది. అని చెప్పింది పక్క ఆకు.

రాలి కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు…..”
 
ఈ కథ గురించిన పూర్తి పాఠం చదవాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2270

మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.

RTS Perm Link

పాతాళదుర్గం – 5

October 6th, 2009
పాతాళదుర్గం - 5

పాతాళదుర్గం - 5

అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో దాసరి సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చందమామ పత్రికలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.

“….రాకుమారి కాంతిసేనను ఎత్తుకుపోయిన కుంభీరుడనే రాక్షసుడు, కొండప్రాంతం చేరి, గుహలో ప్రవేశించబోతూండగా కాలశంబరుడనే మాంత్రికుడి వల్ల గాయపడ్డాడు. చెట్టు మీదినుంచి ధూమకసోమకులు ఇదంతా గమనించారు. హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక బాణం వచ్చి, కాలశంబరుడికి తగిలింది. ఆ వెంటనే అతడూ, రాక్షసుడూ దాపులనున్న గుహల్లోకి పరిగెత్తారు.     

కదంబ సైనికులు కొందరు, ‘‘అడుగో, రాక్షసుడు! అడుగో, రాక్షసుడు!’’ అని కేకలు పెడుతూ గుహల కేసి పరిగెత్తుకు రావటం, చెట్టు మీద వున్న ధూమక సోమకులు చూశారు. శత్రువుల కంటబడకుండా వుండేందుకు వాళ్ళిద్దరూ మరింత గుబురుగా వున్న చెట్లకొమ్మల్లోకి ఎగబాకారు.

‘‘రాక్షసుడెక్కడ? వాడు పారిపోకుండా చుట్టుముట్టండి!’’ అంటూ ఒక ఆశ్వికుడు కత్తి ఝళిపిస్తూ సైనికుల మధ్యకు వచ్చాడు. అతడు కదంబరాజు ఉగ్రసేనుడు. అతణ్ణి చూస్తూనే సోమకుడు పళ్ళుకొరికి బాణం ఎక్కుపెట్ట బోయేంతలో, ధూమకుడు చప్పున అతణ్ణి వారిస్తూ, చెవిలో మెల్లిగా ఏమో చెప్పాడు.

అంతలో నలుగురైదుగురు కదంబ సైనికులు ఉగ్రసేనుడి దగ్గిరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మహారాజా! రాక్షసుణ్ణి మేం గాయపరిచాం. ఇదుగో చూడండి, ఇక్కడ భూమ్మీద నెత్తురు గుర్తులు. కాని, వాడు చీకట్లో ఏదో గుహలోకి పారిపోయాడు,’’ అన్నారు…..”

ఈ వారం ప్రచురించిన పాతాళదుర్గం 5వ భాగం పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138&stId=2266

పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

ఈ ధారావాహికపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

చందమామలో కుందేలు….!

October 5th, 2009
చందమామ

చందమామ

(ఈ కధ 1954 నవంబర్ చందమామ సంచికలోనిది. దాదాపు 55 ఏళ్ల క్రితం అచ్చయిన ఈ కథ అలనాటి చందమామ కథల గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం.. చందమామలో కుందేలు ఉన్న విషయం మీరు ఒప్పుకుంటే, మీ భావనా ప్రపంచంలో ఇలాంటి కాల్పనిక ఊహలు మీకు పరవశం కలిగిస్తూ ఉంటే, దయచేసి ఈ కథను చదవండి.)

పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య  కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ మానవధర్మాలు చెబుతూ, పశుత్వంనుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది.

మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవేగాని కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. ఎందుచేతనంటే కోతి చపలచిత్తం గలది. నక్క జిత్తుల మారిది, మానుపిల్లి దొంగబుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు.

ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆరోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో “అన్నలారా! ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి, పొద్దూకగానే అతిథులకు ఆహారం పెట్టి, అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను. మీరు కూడా అదేవిధంగా చేయవలసిందని నా కోరిక” అన్నది.

కోతీ, నక్కా, మానుపిల్లీ తలలు ఊపి, తాము కూడా పగలల్లా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒకదారినా బయలు దేరాయి.

మిగతా కథ కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2265

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

ఇష్టం లేని పని చేయవలసి వస్తే….

September 29th, 2009

ఇష్టపడి చేసేది కష్టమైనా సరే సంతోషంగా చేస్తారు అని నానుడి.. మరి, లౌకిక వాంఛలవల్ల కలిగే అనర్థాలను గుర్తించి, సన్యాసం అవలంబించి, యాభై ఏళ్ళపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపిన కృష్ణద్వైపాయనుడు కాని, జగత్ప్రసిద్ధి పొందిన దాతలు తాతా, తండ్రీ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన మాండవ్యుడు కాని, పసితనంలోనే ఓ భర్తకు భార్యగా మెట్టింటికి వచ్చి జీవితం గడిపిన మహిళ కాని ఎందుకు తమ తమ విధులను ఇష్టంగా చేయలేకపోయారు.

అందుకు వారికి జీవితంలో ఒరిగిందేమిటి….? చివరికి వారికి మిగిలిందేమిటి…? పేమాభిమానాలు లేకుండానే సంవత్సరాల పాటు కాపురం చేసిన భార్య చివరకు అనివార్య పరిస్థితుల్లో ఈ చేదునిజాన్ని భర్తకే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, తర్వాత ఆ భార్య గతి ఏమిటి? వంటి మౌలిక విలువల సారాన్ని తెలుసుకోవాలంటే ఈ కింది కథను చదవండి. అనుభవం ప్రాతిపదికగా మనిషిలో కలిగే పరివర్తనను అద్భుతంగా చెప్పిన ఈ జాతక కథను మీరు తప్పక కింది లింకులో చదవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2254

మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.

RTS Perm Link

ఏదుపందికి పొట్టి తోక ఏర్పడింది!

September 27th, 2009

మనం చిన్నప్పుడు అనేక కథలను వినే ఉంటాం.. చందమామపై చెట్టుకింద ముసలమ్మ ఒకతే కూర్చుని ఎందుకు దోసెలు పోస్తా ఉంది? అనేది ఓ కథ. బహుశా ఈ కథను అందరూ తమ తమ ప్రాంతాల సంస్కృతి, వాడుకకు అనుగుణంగా వినే ఉంటారు. ఇంకో అద్భుత కథ. పిల్లి రెంటికి పోయాక ఎందుకు మట్టివేసి మూసిపెడుతుంది?

ఇలాంటివే మరికొన్ని కథలు… ఉడతకు వీపు మీద చారలు ఎందుకు ఏర్పడ్డాయి? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే ఎందుకుంటుంది? కుక్క ఒంటికి పోసే ప్రతిసారీ ఎందుకు వాసన చూస్తూ ఉంటుంది? మన నిత్య జీవితంలో మనం చూసే ప్రతి జంతువు, చెట్టు, రాయి.. ఇలా కంటికి కనిపించే వస్తువులన్నింటిమీదా మనుషులు అల్లుకున్న అద్భుతమైన కాల్పనిక కథలు ఇవి.

శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ పై ప్రశ్నలకు మనం హేతుపూర్వకంగా సమాధానాలు పొందవచ్చు. అవి మరింత హేతుబద్ధంగా ఉండవచ్చు కూడా.. కాని పల్లెటూళ్లలో బాల్య జీవితం అప్పటికీ ఇప్పటికీ కూడా కాల్పనిక ప్రపంచం, కాల్పనిక ఊహల మీదే ఆధారపడి ఉందనిపిస్తుంది.

ఉడత వీపు మీద చారలు ఫలానా జన్యుమార్పుల వల్ల కలిగిందని సైన్స్ చెబుతున్నా.. సేతువు కట్టడంలో ఉడత చేసిన సాయానికి రాముడు ప్రేమగా దాని వీపు నిమిరితే దాని గుర్తుగా చారలు ఏర్పడ్డాయి అనే కథ పిల్లల మనస్సులపై, బాల్యపు ఊహలపై ఎంత గట్టి ప్రభావం వేస్తుందో మాటల్లో చెప్పలేం…

శాస్త్రీయ విజ్ఞానం సమాజానికి ఎంత అవసరమో.. పిల్లల ఊహా ప్రపంచానికి వన్నెలద్దే కాల్పనిక కథలు కూడా అంతగానే అవసరమే.. అందుకే భవిష్యత్తు సమాజాలు సైతం పిల్లల కాల్పనిక కథలకు పెద్ద పీట వేయాల్సిందే… సోషలిస్టు పునాదుల మీద ఏర్పడ్డ సోవియట్ సమాజం ప్రపంచ బాల సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన వందలాది కాల్పనిక చిత్రకథలను పెద్ద ఎత్తున ప్రచురించిన విషయం తెలిసిందే కదా..

ఏ సమాజమైనా జంతువులు పాత్రలుగా మానవ మనస్తత్వాన్ని విపులీకరించే బాల సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.

ఏదుపందికి పొట్టి తోక ఎలా ఏర్పడింది అనే కథ కూడా ఈ కోవకు చెందిందే..

ఇదొక చెరూకీ కథ. ఇప్పటి జంతువులకన్నా పూర్వకాలం నాటి జంతువులు పెద్దవిగానూ, దృఢంగానూ, తెలివిగలవిగానూ ఉండేవని చెరూకీ జాతివాళ్ళు విశ్వసించేవారు. అవి మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ సరిసమానంగా ఉండేవని కూడా వాళ్ళు నమ్మేవారు.

ఆ కాలంనాటి ఒక ఏదుపందికి ఒకనాడు విపరీతంగా ఆకలి వేసింది. ఎవరైనా తన బొరియలోకి ఇంత తిండి పడేస్తే ఎంత బావుణ్ణు! అన్న ఆశతో ఆలోచించసాగింది. కొంతసేపటికి దానికి కొన్నాళ్ళ క్రితం మనుషులుంటున్న ఇంటివైపుగా తాను పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటూండగా తన చెవిని పడ్డ, ‘కోరికలే గుర్రాలయితే, మూర్ఖులే వాటి మీద స్వారీ చేస్తారు’ అనే సూక్తి గుర్తుకు వచ్చింది. అది చటుక్కున లేచింది.

తన మూర్ఖత్వం కాకపోతే, ఎవరు పనికట్టుకుని తన బొరియలోకి ఆహారం తెచ్చిపెడతారు? తనే వెళ్ళి సంపాయించడం తప్ప మరో మార్గంలేదనుకున్నది. తను వెలుపలికి వెళ్ళక తప్పదు. అంటే సురక్షతమైన తన బొరియను వదిలిపెట్టాలి. వెలుపల తనను వేటాడే జంతువుల కంటబడకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి, తనను పట్టి తినేయగలవు. మరుక్షణమే తనలోని భయాన్ని తలుచుకుని నవ్వుకున్నది. తను ఎన్నిసార్లు చావు నుంచి తప్పించుకోలేదు? అపాయం నుంచి తప్పించుకోవడానికి తనకు ఎన్నెన్ని ఉపాయాలు తెలుసు!

ఈ కథ కావాలంటే కింది లింకును చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&&stId=1402

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.

RTS Perm Link

ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగినా…

September 25th, 2009
గోవిందుడి లంఘనం

గోవిందుడి లంఘనం

చందమామ కథలు దశాబ్దాలుగా పిల్లల ఊహా ప్రపంచంలో ఓ భాగమయ్యాయి. పిల్లల్లో సహజసిద్ధంగా ఉండే కాల్పనిక ప్రపంచపు ఊహలను ఆవి సంతృప్తి పర్చాయి. చందమామ కథలు నీతి నియమాలను సర్వ సాధారణ రీతిలో బోధిస్తాయి. ప్రతి చందమామ కథలోని సారాంశం పిల్లల్లోనే కాక పెద్దల్లో కూడా మంచి భావాలను పెంచి పోషిస్తూ వచ్చింది. చాలా వరకు ఇదంతా పనిగట్టుకుని బోధించినట్లుగా కాకుండా, సహజాతిసహజంగా, స్వచ్చందంగా జరుగుతూ వచ్చింది.

మన ప్రాచీన మేధో సంపదను కథ రూపంలో చందమామ మనముందుకు తీసుకువచ్చింది. పల్లె సీమల గురించిన మన అవగాహనను, జాతి మహత్తర సంస్కృతిని, నాగరికతను చందమామ కథలు మరింత ఉద్దీప్తం చేశాయి.

‘విద్యావంతుడు’ అనే శీర్షికతో వచ్చిన బేతాళకథ దీనికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఇది చందమామ మరో కథల మాంత్రికుడు వసుంధర గారు రాసిన కథ. 2003 సంవత్సరం చందమామ సంచికలో ఇది అచ్చయింది. అంతకు ముందే కూడా ఇది ముద్రణ పొందిందేమో తెలియదు.

రామాయణ కాలంనాటి వానరులకు మల్లే ఆకాశంలోకి అమాంతంగా ఎగురగలిగిన అమోఘ శక్తి మనిషికి సిద్ధించడం అనే ఊహే మనిషి మనస్సును పరవశింపజేస్తుంది. నా చిన్నప్పటి స్వప్న ప్రపంచంలో నేను కూడా కోతి కొమ్మచ్చి ఆట ఆడుతూ చెట్టు మీదనుంచి ఆటలో భాగంగా దుముకుతున్నప్పుడు కింద పడకుండా అలాగే పైకి ఎగిరి పోయేలాంటి కలలు చాలాసార్లే వచ్చాయి.
 
మనిషిలో అద్భుతశక్తులు నిజంగా ఉంటే కూడా అవి మనిషి ఇబ్బందులను తీర్చాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు, స్వార్ధాలకు, ధనసంపాదనకు ఉపయోగపడకూడదనే మానవీయ విలువను ఈ కథ అతి సరళంగా చాటి చెబుతోంది.

‘‘జీవితం కొత్త విద్యలు నేర్చుకునేందుకేనా! హాయిగా రోజులు వెళ్ళిపోవడానికి డబ్బు సంపాదించాలి. ఉన్నంతలో నలుగురికీ సాయపడాలి. జీవితమంతా కొత్త విద్యలు నేర్చుకుంటూ గడిపివేయడం, నాకిష్టముండదు,’’ అంటూ ఈ కథలో వాదించిన గోవిందుడు చివరకు రాజశేఖరుడి వంటి గొప్ప కీర్తిమంతుడే తన వద్దకు శిష్యరికం కోసం వచ్చినప్పుడు, మనసు పొరల్లో కరడు గట్టిన అహాన్ని చంపుకున్నాడు. మానవ జీవన పరమార్థాన్ని ఆకళింపు చేసుకుని వినయమనే ఉత్తుంగ శిఖరాలను చేరుకున్నాడు.

ఇది నీతి కథ కాదు. జాతి కథ. విశ్వ మానవాళి ఆచరించి తీరవలసిన కథ.

విద్యావంతుడు కథను తప్పకుండా కిందిలింకులో చదవండి..
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=36&sbCId=97&stId=2251

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపగలరు.

RTS Perm Link

మద్యపాన ఫలితం

September 23rd, 2009

బోధిసత్వుడి శిష్యుల్లో ఎన్నదగిన వాడు సాగతస్థవిరుడు. మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడు, అసామాన్య ధైర్యశాలి. మహాభయంకరమైన విషసర్పానికి సైతం జంకక దానితో ఢీకొని కోరలు పీకి ప్రాణాలతో వదిలిన ధీశాలి.

అలాంటి వాడు జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటుకు బురదపామును సైతం ఏమీ చేయలేని దుస్థితికి దిగజారిపోయాడు.

ఆ పొరపాటు ఏమిటి? ఏమా కథ అని తెలుసుకోవాలనిపిస్తే… దయచేసి కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2237

ఈ కథపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link

చందమామ కథలు : పాతాళదుర్గం

September 10th, 2009
దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం

చందమామలో ప్రారంభం నుంచి మంచి మనుషులు, మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు.

ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు “చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు” దాసరి సుబ్రహ్మణ్యం గారు.

ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో  రెండు, లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.

“కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన” తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.  జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు.

ప్రపంచానికి హ్యారీ పాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, ‘తోకచుక్క’తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి – చందమామ లోని ఈ ధారావాహికలు!

తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట – 1958
జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం – 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి.

బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం కూడా మళ్లీ చందమామను పెద్దలకు లాగే హత్తుకోవాలనే ఆకాంక్షతో ఆయన 1966లో రాసిన ‘పాతాళదుర్గం’ సీరియల్‌ను తిరిగి ఆన్‌లైన్ చందమామలో ప్రచురిస్తున్నాం.

అద్భుతమైన ఊహాశక్తి, నిసర్గ పద సౌందర్యంతో, కల్పనా చాతుర్యంతో సుబ్రహ్మణ్యంగారు 1950, 60, 70లలో చెక్కిన అపరూప కథాశిల్పాల్లో ‘పాతాళ దుర్గం’ ఒకటి. ఆయన 1972లో రాసిన ‘యక్షపర్వతం’ ధారావాహిక (13 భాగాలు) ను ఇప్పటికే telugu.chandamama.com లో ప్రచురించిన విషయం తెలిసిందే.

పాతాళదుర్గం ధారావాహిక కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

చందమామ ధారావాహికల కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=36&sbCId=138

దాసరి సుబ్రహ్మణ్యం గారి విశేషాలు తెలుసుకోవాలంటే వేణుగారి బ్లాగ్ చూడండి.

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు
http://venuvu.blogspot.com/2009/07/blog-post_18.html

“చందమామ రచయితను కలిసిన వేళ….”
http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html

‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’
http://koumudi.net/Monthly/2009/april/index.html

RTS Perm Link

మచ్చరకోశియుడి పిసినారితనం

August 31st, 2009
మచ్చరకోశియుడు

మచ్చరకోశియుడు

చాలామంది పిసినారులను చూసే ఉంటాం. కానీ మచ్చరకోశియుడి తరహా పిసినారితనం గురించి మీరు ఇంతకు ముందెన్నడూ ఎరిగిఉండరు.

ఈ మచ్చరకోశియుడు, అతడి కథా కమామిషు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఈ వారం ఆన్‌లైన్ చందమామ జాతక కథను కింది లింకులో చదివి ఆనందించండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2159&pg=1

RTS Perm Link