మనం కోల్పోయిన ఆలోచనా ధార

September 10th, 2012

తెలుగు సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. నండూరి రామమోహన్ రావు సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన రోహిణీ ప్రసాద్ మేధస్సు ఇంత త్వరగా ఆగిపోవడం పెద్ద విషాదమే.

ఒక కుటుంబం తన ప్రియతముడిని కోల్పోయింది. మిత్రులు తమ ఆప్తుడిని కోల్పోయారు. కానీ ఒక సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. తెలుగు సమాజానికి ఇటీవల కాలంలో అద్వితీయ సైన్స్ రచయితగా పరిచయమైన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ శనివారం మన నుంచి దూరమైనారు.

మిత్రులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి స్మృతిలో ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించబడిన నా నివాళి పూర్తిపాఠం కింది లింకులో చూడగలరు.

మనం కోల్పోయిన ఆలోచనా ధార

http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/11/edit/11edit4&more=2012/sep/11/edit/editpagemain1&date=9/11/2012

రాయగలిగిన శక్తి, అధ్యయనంపై ఆసక్తి ఉండి కూడా మెయిన్‌స్ట్రీమ్ పత్రికలకు రచనలు పంపకుండా బ్లాగ్ రచనలకు ఎందుకు పరిమితమవుతున్నారు అంటూ రోహిణీప్రసాద్ గారు గత కొంత కాలంగా నాకు ప్రేరణనిస్తూ, ప్రోత్సహిస్తూ, మందలిస్తూ హెచ్చరించేవారు. బ్లాగ్ రచనలు కొన్నాళ్లు ఆపివేయండంటూ కూడా నాపై విసుక్కున్నారు.

కాని ఆయనకు నివాళి పలకడం ద్వారానే మెయిన్‌స్ట్రీమ్ పత్రికా రచనలోకి అడుగుపెట్టవలసి ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. జీవితంలో ఎన్నడూ చూడని, ఇక చూడలేని ఈ గురుసమానుడికి, ప్రేరణకర్తకు ఈ విధంగా గురుదక్షిణ ఇవ్వాల్సి ఉందని ఎన్నడూ అనుకోలేదు.

………………………..

అలాగే.. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అరుణపప్పు గారు గతంలో ప్రచురించిన రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలను ఇక్కడ చూడగలరు.

మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలని నమ్మే రోహిణీప్రసాద్‌ గారు సంగీతం, సాహిత్యం, శాస్త్రం వంటి విభిన్న రంగాల్లో ఇంత వైవిధ్య పూరితమైన కృషి చేయడం ఎలా సాధ్యమో హృద్యంగా ఇక్కడ చెప్పారు.

“…ఇన్ని డైమెన్షన్‌లు ఎట్లా అంటే  ఏదో ఒకదానిలో తలమునకలై కూరుకుపోవడం, తీరికలేనట్లు ఉండటం, ఎంత జ్ఙానం సంపాదించినా ఇంకా మిగిలే వుందని అనుకోవడం… ఎవరి భావనలు వారివేకదా! అందుకే సైన్స్‌ వ్యాసాలు రాసే నేను, కాలచక్రం పత్రికకూ ఎడిటర్‌గా వుండగలిగాను. భౌతిక విషయాలను మాత్రమే నమ్మే నేను సాయి చాలీసా రాశాను.”

“….పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’

తన బాల్యంలో  విద్యా, ఉద్యోగ జీవితంలో మిగిల్చుకున్న అరుదైన జ్ఞాపకాలను హృద్యంగా ఆయన మాటల్లోనే వినాలంటే కింది లింక్ చూడండి. ఇది కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది.

రోహిణీప్రసాద్ గారికి నివాళి
http://arunapappu.wordpress.com/2012/09/10/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5/

 

RTS Perm Link


3 Responses to “మనం కోల్పోయిన ఆలోచనా ధార”

 1. వేణు on September 11, 2012 3:32 AM

  రోహిణీ ప్రసాద్ గారి ప్రతిభావిశేషాలకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని మీ నివాళి ఆవిష్కరించింది!

 2. chandamama on September 12, 2012 3:42 AM

  వే్ణుగారూ,
  చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి. వీలయితే వారబ్బాయి కార్తీక్, అమ్మ లలితగారితో మాట్లాడండి. కుమారుడిని కోల్పోయిన అమ్మ వరూధిని గారు శోకమూర్తిలా విలపిస్తున్నారట. పరిచయమున్న వారు తమ స్పందనను, స్వాంతనను నేరుగా వారికే తెలిపితే ఇంకా మంచిది.
  కృతజ్ఞతలు
  రాజు.

 3. శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె « జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ on October 27, 2012 5:26 AM

  […] రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి […]

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind