మా నాన్న విషాదమరణం – కొడవటిగంటి కార్తీక్

September 9th, 2012

ప్రియమైన మిత్రులకు,
మా నాన్న డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం ముంబయ్‌లో కన్నుమూశారనే వార్తను మీకు తీవ్ర విషాదంతో తెలియజేస్తున్నాను. కొంత కాలంగా అస్వస్థతతో ఉంటున్న ఆయన కొద్దిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

నాన్న శ్రేయోభిలాషులు, రేపు  (సెప్టెంబర్ 10) ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్యలో ఆయన భౌతిక దేహాన్ని ముంబై, వడాల ఈస్ట్ లోని లాయిడ్స్ ఎస్టేట్‌లో కడసారి దర్శించవచ్చు. తర్వాత ఆయన భౌతికదేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళతాము. ఆయన కోరిక మేరకు ఆయన భౌతిక దేహాన్ని వైద్య అధ్యయనం, పరిశోధనలకు గాను సమర్పిస్తున్నాము.

మా నాన్నగారికి మీరు ఇన్నాళ్లుగా అందించిన తోడ్పాటుకు మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇన్నాళ్లుగా మీ అందరితో పరిచయాలు, సహ సంబంధాలను ఆయన ఎంతో ఆస్వాదించారు. మీతో పరిచయం తనను జ్ఞానవంతుడిగా చేసిందని ఆయన భావించేవారు.

ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుందని మీ అందరి తరపున చెప్పాలనుకుంటున్నాను.

మరోసారి, మా నాన్న, మా కుటుంబం యొక్క శ్రేయోభిలాషులుగా ఉంటూ వస్తున్న మీ అందరికీ మేము వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ధన్యవాదాలతో,
కార్తీక్ కొడవటిగంటి.

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

 

కార్తీక్ గారు,

నాన్నగారి ఫోన్ నంబర్ తప్పితే ఇన్నాళ్లుగా మీతో కాని  లలిత గారితో కాని నేరుగా సంభాషించే వీలు లేకపోయింది. ‘శరీరం చాలా బాధపెడుతున్నా తన మనస్సు, బుద్ధి చాలా చురుకుగా ఉందం’టూ ముంబై ఆసుపత్రిలో మీ మాతృమూర్తి లలితగారు పది రోజుల క్రితం ఆయన ఫోన్ నుంచి చెప్పిన మాటలే ఆయన తరపున నాకు అందిన చివరి సందేశం.

చందమామలో నా ఉద్యోగ జీవితం గడిపిన గత మూడున్నరేళ్ల కాలంలో ఆయనతో పరిచయం నా ఆలోచనలను, జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేసింది. పల్లెటూరి నుంచి జీవిక కోసం వచ్చిన వారు మహానగరాల్లో ఎదుర్కొనే జీవన సంక్లిష్టతలను ఆయన ఎంతో వివరంగా విశ్లేషిస్తూ ధైర్యం చెప్పేవారు.

అమెరికా నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి గత మూడేళ్లుగా ఎన్నిసార్లు ఆయన ఫోన్ ద్వారా సంభాషించారో, చాట్ చేశారో, మెయిల్స్ పెట్టారో లెక్క తెలీటం లేదు. దురదృష్ట మేమిటంటే రెండు వారాల ముందు ఆయనను, లలితగారిని, వరూధినిగారిని తొలిసారిగా కలిసే అవకాశం నాకు నేనుగా పొగొట్టుకున్నాను.

శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నా సాయంత్రం నాలుగు గంటల వరకు అమీర్ పేటలో బంధువుల ఇంటిలో వేచి చూశానని ఆయన చెప్పినప్పుడు నేను క్షమాపణ చెప్పాను కాని ఆయనను ఇక ఎన్నటికీ చూడలేనని కనీసంగా కూడా ఊహించలేకపోయాను.

సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్‌కు వస్తాను కాబట్టి ఈసారి తప్పక కలుస్తానని నేరుగా నాన్నగారి ఇంటికే వచ్చి కలుస్తానని ఆయనకు చెప్పాను. కాని ఇక సాధ్యం కాదని, ఆయన అప్పటికే జీవితంలో చివరి చలనం వైపు అడుగులేస్తున్నారని ఊహించలేకపోయాను.

హైదరాబాద్‌కు వచ్చి కూడా ఆయనను చూడలేకపోవడం ఘోరమైన తప్పిదం. కాని ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు?

ఇంగ్లీష్ చదవలేని తెలుగు వారికి తాను విస్తృతంగా పరిశీలిస్తున్న శాస్త్ర, సాంకేతిక విషయాలను, నూతన ఆవిష్కరణలను సులభశైలిలో పుస్తకాల రూపంలో అందివ్వాలనే మహా సంకల్పం ఆయనను అవిరామ శ్రామికుడిగా మార్చింది. ఆయన ఆయుర్దాయాన్ని కూడా ఈ మహాసంకల్ప భారమే క్షీణింపజేసిందేమో..

తండ్రి కుటుంబరావు గారి రచనా వారసత్వాన్ని కొనసాగించడంలో అత్యంత వేగంతో అక్షరాలను కూర్చి రచనలు చేయడంలో ఆయనది అనితరసాధ్యమైన మార్గం.

నండూరి రామమోహన్ రావు గారి  సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన నాన్నగారి మేధస్సు ఇంత త్వరగా ఆలోచించడాన్ని ఆపివేయడం వ్యక్తులుగా మీ కుటుంబానికి, మిత్రులకు ఎంత విషాదకరమో, తెలుగు  పాపులర్ సైన్స్ రచనలకు అంత నష్టకరమైన విషయం కూడా.

తెలిసిన విషయాలను పదిమందికి విస్తృతస్థాయిలో చెప్పడానికి పత్రికలు ముఖ్యమార్గమని, ఎక్కువమంది పాఠకులకు మన భావాలను చెప్పగలిగే అవకాశాలను ఎన్నటికీ వదులుకోవద్దని ఆయన పదే పదే చెప్పేవారు. చివరి రోజుల్లో ఆయన ఈ విషయమై నన్ను మందలిస్తూ పంపిన చివరి ఇమెయిల్‌ని ఇక మరువలేను.

నాలుగేళ్ల స్వల్పకాలంలో ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, ‘జీవకణాలు -నాడీ కణాలు,’ ‘ప్రకృతి పర్యావరణం,’ ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. శాస్త్ర సంబంధ రచనలు అంటే పెద్దగా ఆసక్తి చూపని తెలుగు పాఠకలోకంలో తెలుగు ప్రచురణల చరిత్రలో అవి ఎంత సంచలన విజయం సాధించాయో ఇవ్వాళ అందరికీ తెలుసు.

మూడేళ్ల స్వల్ప పరిచయంలో ఆయన నా పట్ల పితృసమాన వాత్సల్యాన్నే ప్రదర్శించారు. ఈ కష్టకాలంలో మీరు ఒకరికొకరు తోడుగా, ధైర్యంగా ఉంటారని, అమ్మను, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. తండ్రిగా, విజ్ఞానవేత్తగా, హేతుచింతనకారుడిగా ఆయన అందించిన ప్రేరణే మీ కుటుంబానికంతటికీ మనోధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.

తన శరీరాన్ని మట్టిలో కలపటం కాకుండా వైద్య పరీక్షలకు, మానవ శ్రేయస్సు కోసం అందివ్వాలన్న ఆయన కోరికను మీరు నెరవేరుస్తున్నందుకు ఈ విషాద సమయంలో కూడా ఒకింత సంతోషంగా ఉంది. ఒక శాస్త్రజ్ఞుడికి, హేతువాదికి, తండ్రికి మీరు మీ కుటుంబం ఇస్తున్న ఈ నివాళికంటే మించినది ఏదీ ఉండదు.

మీరు తండ్రిని పోగొట్టుకున్నారు.  కాని జీవిక కోసం చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కు మారాలనుకుంటున్న నాకు ‘మనం దేంట్లోనైనా పనిచేయగలం, కష్టపడగలం, కొత్త విషయాలను నేర్చుకోగలం, భాగ్యనగరంలో అనేక అవకాశాలున్నాయి, ధైర్యంగా రండి’ అంటూ చివరి వరకూ ప్రోత్సాహాన్ని, ప్రేరణను  అందించిన ఒక గొప్ప సహాయ హస్తాన్ని, ఆప్యాయ స్వరాన్ని నేను శాశ్వతంగా పోగొట్టుకున్నాను.

ఇన్నాళ్లుగా ఏ సమయంలో అయినా సరే  కాల్ చేయగానే ‘రాజుగారూ బాగున్నారా’ అంటూ పలుకరించిన నాన్నగారి మొబైల్ ఇక మూగపోతుందన్న వాస్తవాన్ని భరించలేకున్నాను.

ప్రస్తుతం నాకున్న ఆర్థిక వనరుల పరిమితి కారణంగా చివరి చూపుకు కూడా ముంబైకి నేను రాలేకపోతున్నందుకు క్షమించండి.

మీరు ఈ మెయిల్‌‍లో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు కాల్ చేయాలంటే కూడా సాహసించలేకపోతున్నాను.

మీరు నిబ్బరంగా ఉంటారని, ఉండాలని కోరుకుంటూ..
రాజశేఖరరాజు.
చెన్నయ్
7305018409

krajasekhara@gmail.com

…………………….

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి కుమారుడు కార్తీక్ తమ నాన్నగారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు కాస్సేపటిక్రితం ఈమెయిల్ ద్వారా కింది సమాచారం పంపారు. వారు పంపిన ఇంగ్లీష్ ఇమెయిల్ పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

Sad demise – Kodavatiganti Rohiniprasad

Dear Friends

It is with deep sorrow that I inform you of the passing of my father, Dr Kodavatiganti Rohiniprasad, yesterday afternoon in Mumbai. He had been ill for a brief while and was hospitalised during his last days.

His well wishers can pay their last respects tomorrow morning (10th Sep) between 9AM – 10.30 AM at Lloyds Estate, Wadala East, Mumbai. Thereafter he will be taken to Grant Medical College where his body will be donated for medical study and research, as per his wish.

On behalf of our family I would like to thank you all for your support to my father. He thoroughly enjoyed his interactions with you all and believed that it enriched him.

I think I can say on behalf of you all that a person of his caliber – Writer, Musician, Scientist and Rational Thinker – may not be found for a long time to come.

Once again, we sincerely thank you for being well wishers of my father and our family.

Best Regards,

Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274

Email: k_karthik@outlook.com

RTS Perm Link


10 Responses to “మా నాన్న విషాదమరణం – కొడవటిగంటి కార్తీక్”

 1. durgeswara on September 9, 2012 10:28 AM

  meeku meekutumbaaniki ee vishaadha samayamlo ee dukhaanni tattukune aatmabalaanni prasaadimchaalani bhagavmtuni vedukumtunaamu

 2. నాగరాజు రవీందర్ on September 9, 2012 10:34 AM

  కార్తీక్ గారూ ! నేను నా బ్లాగులో “సవాయి గంధర్వ సంగీత మహోత్సవం ” గురించి వ్రాస్తే , శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు స్పందించి ఇలా వ్రాశారు.

  Rohiniprasad said…
  మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.
  January 6, 2010 8:07 PM

  ఇది నేనెప్పుడూ మరచిపోలేను. దీనిని నేను ఒక అపురూపమైన వ్యాఖ్యగా భావిస్తాను ఎప్పటికీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ …

 3. Bhamidipati Phani Babu on September 9, 2012 12:11 PM

  రోహిణీ ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ…..

 4. DR,G.V.KRISHNAIAH. on September 9, 2012 10:33 PM

  మిత్రులు కార్తిక్ గారికి, ఒక దుఖాన్ని పంచుకొవడంకంటే విషాదం ఏముంటుంది. ఏఫ్రిలొ నాన్న గారిచే ”’ సమాజ ప్రగతిలొ వైజ్ఞానిక శాస్త్రాల పాత్రా”’ అనే అంశంపై కార్యక్రమం ఒంగోలులొ ఏర్పాటు చేసినపుడు వచ్చిన స్పందన మేం మరచిపోలేం . అనారొగ్యాన్ని సైతం లెక్కచేయక విజ్ణానాన్ని ప్రపంచానికి అందించడం కోసం వారు పడిన తపన , చేసిన పర్యటనలు తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు. వారు భౌతికంగా మనమధ్య లేకపోయినా వారి రచనలు, ఆలోచనలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. డా// జి.వి.కృష్ణయ్య …జనసాహితి….ఒంగోలు . ప్రకాశం జిల్లా.

 5. chandamama on September 10, 2012 9:47 AM

  Dear Karthik gaaru !

  Mail from
  Duvvuri Ramakrishnarao dvrkrao166@gmail.com

  We all miss him very much.. Very much unexpected…
  Rohiniprasad gaaru with lot of Ideas in his mind…Yet to share…
  Telugu people will remember him with proud
  We missed him..
  We are all with you !

  Convey the same to mother , sisiter and all family members…

  -Ramki

 6. chandamama on September 10, 2012 9:54 AM

  Email message came from
  Swamy Venkatayogi swamyv@gmail.com

  Dear Karthik

  It was shocking to hear about this news. I am still unable to believe it. I would like to think it as a lie. It is extremely sad and heart breaking for me. The loss is immense.I sincerely hope your family regains the strength and courage soon. I express my deepest condolences.

  Regards
  NarayanaSwamy

 7. dr.siri on September 11, 2012 2:36 AM

  andhrajyothilo rajugaru rohiniprasadgari gurinchi vrasaru.aayana goppaga vrasarani anukunnanu.kani antha goppa vyakthi gurinchi cheppalsindi inka chala undi,adi kevalam introduction matrame ani rajugaru cheppinappudu,oka goppa vyakti,itu scienceni,atu sangeeta saahithyalani tana aatmalo nimpukuni,aa aalochanalatho endaro aalochanalanu tattilepina oka maha medhavi gurinchi intha aalasyanga,ila telusukovalasi vachinanduku vishadinchalo,leka ippatikaina telusukunnanduku aanandinchalo teliyani parishithi.naalanti vaallendarooo…alantivaarandiriki rohinigarini parichayam chesina rajugariki krutagnathalu….

 8. chandamama on September 11, 2012 4:16 AM

  vanam Jwala Narasimha Rao
  7:41 ఉ (7 గంటల క్రితం)
  Raju Garu,
  Your article in Jyothi today on Rohini Prasad is great.
  Regards,
  Jwala
  in Singapore
  ……………..

  Shri Devi
  2:20 సా (25 నిమిషాల క్రితం)

  కి నాకు
  is this true Raju garu?
  shridevi

  On Sat, Sep 8, 2012 at 6:33 PM, Murali Ahobila v wrote:

  I got the sad news that my close friend Kodavatiganti Rohini Prasad passed away at Jaslok Hospital, Bombay.

  Murali
  —– Forwarded Message —–
  From: sambhu chaganty
  To: “muraliahobilav@yahoo.com”
  Sent: Saturday, September 8, 2012 4:14 AM
  Subject: RE: అకటా వికటపు రాజు

  Dear AVM,
  Extremely sad to inform demise of KRP today morning at Jaslok.Please inform our friends at US

 9. Sivalakshmi on September 11, 2012 2:50 PM

  Dear Mr.Kartik,
  We were shocked to know the sudden demise of your father, a good friend of ours. During the last stay at Hyderabad, we had several occasions to meet him and enjoyed his company and music. We cannot forget his genious in many fields like Literature, Science &,Translations. We used to wonder that the whole spectrum of music is on his finger tips. We attended his so many speeches in Hyderabad. He will be happy to sing old Hindi &Telugu songs and Gazals for us and feel so much happy when we were enjoying his music. We planned for his next music program in our house and we invited all of our music lovers and literature friends and planned for this event but we are all unfortunate that we could not make it out. When he planned to go to Nagarjunsagar by auto I offered a ride in my car but somehow it did not materialize and later we learnt that he went there by auto only.

  Our last meeting was on your marriage reception and afterwards we were not fortunate to meet him afterwards. Now we are in US and not able to share your grief personally but the moments of him will remain forever with us. He left an indeligible mark in our lives.. Please convey our condolences and heartfelt concern to Lalita garu & Yamini.

  Sivalakshmi & Rammohan.

 10. Aduri.hymavati on September 12, 2012 12:54 AM

  కొ.కార్తీక్ !

  మీనాన్నగారైవ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి కి ఆత్మశాంతికలగాలనీ, ఆయనలేని లోటు పూడ్చలేనిదేఐనా తట్టుకునేధైర్యాన్ని మీకంతా భగవంతుడు ప్రసాదించాలనీ కోరుకుంటున్నాను. పాపీచిరాయూ అంటారు ఊరికే లోకానికి ఏసాయం చేయలేనివారికి ఆయుర్దాయం వందేళ్ళు ఇస్తాడుదేవుడు , లోకానికి ఉపయోగించే నాన్నగారి లాంటివారికి తక్కువ ఇస్తాడు ! ఎంతచిత్రం ! నామనః పూర్వక సంతాపం తెలుపుకుంటున్నాను. ఈలోటు మీకుటుంబానికేకాదు సమాజానికంతానూ.నాకు నేరుగా మీనాన్నగారితో పలకరింపులు, పరిచయాలూ లేకపోవచ్చు కానీ ఆయన కధలూ,సాహిత్యమూ చదివినదాన్నిగా ఈ నా మానసిక భావాలను తెలుపుతున్నాను.
  ఆదూరి.హైమవతి.
  బెంగుళూరు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind