ఈమెకు నోబెల్ రాలేదు…

August 8th, 2012

ఈమె పేరు ఇరెనా సెండ్లర్. 2008 మే 12న 98 ఏళ్ల వయస్సులో పోలెండ్‌లోని వార్సాలో ఈమె కనుమూశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్‌లో మురికినీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది.

తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాపెట్టిన ఇరెనా, వారిని అలా ఆ శిబిరాలనుంచి నాజీలకు తెలియకుండా తరలించేది. మరింత పెద్ద వయసు పిల్లలను తరలించడానికి తన ట్రక్ వెనుకన ఆమె ఒక గోనె సంచిని పెట్టుకుని వెళ్లేది.

నాజీ సైనికులు చిత్రహింసల శిబిరంలోకి ఆమెను అనుమతించి, బయటకు పంపుతున్నప్పుడు ఇరెనా తన వెంట ఒక కుక్కను తీసుకెళ్లి అది ఆ సమయాల్లో మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది.

సైనికులు తమ ముందు మొరుగుతూ వెళ్లే ఈ కుక్కను ఏమీ చేసేవారు కారు. కుక్క మొరుగుడు ఇరెనా తరలిస్తున్న శిశువులు చేసే శబ్దాలు బయటకు రాకుండా అడ్డుకునేది.

ఇలా ఆమె 2500 మంది యూదు శిశువులను అప్పట్లో గ్యాస్ చాంబర్ల నుంచి బయటకు తరలించగలిగింది.

చివరకు ఒక రోజు ఆమె పట్టుబడింది. నాజీలు ఆమె కాళ్లూ చేతులూ విరిచి చితకబాదారు.

ఇలా తను తరలించిన శిశువుల పేర్ల చిట్టాను తన ఇంటి పెరడు లోని ఒక చెట్టు కింద గ్లాస్ జాడీలో పెట్టి భద్రపర్చింది ఇరెనా

యుద్ధం ముగిసిన తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులలో ఎవరైనా బతికి ఉంటే వారిని కనుక్కునేందుకు  ఆమె ప్రయత్నించింది. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు కూడా ప్రయత్నించింది.
కాని పిల్లల తల్లిదండ్రులలో చాలామంది గ్యాస్ ఛాంబర్లకు బలయ్యారు. ఆమె కాపాడిన పిల్లలను క్రైస్తవ శరణాలయాలు స్వీకరించాయి లేదా దత్తత తీసుకున్నాయి.

2007లో ఇరెనా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడింది. కాని ఆమె ఎంపిక కాలేదు.
భూతాపంపై స్లయిడ్ షో ప్రదర్శించిన అల్ గోరెకి ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
మరొక రాజకీయనేత బరాక్ హుస్సేన్ ఒబామా ఆక్రోన్ -ACORN- కోసం కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్నాడు.

ఇరెనా చేపట్టిన సాహసిక చర్యకు ఇప్పుడు 65 ఏళ్లు. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 65 ఏళ్లయింది.

60 లక్షల మంది యూదులు, 2 కోట్ల మంది రష్యన్‌లు, కోటి మంది క్రైస్తవులు, 1,900 మంది కేథలిక్ ప్రీస్ట్‌లు ఈ యుద్ధంలో చంపబడ్డారు, ఊచకోతకు గురయ్యారు. రేప్ చేయబడ్డారు, తగులబెట్టబడ్డారు, పస్తులతో చంపబడ్డారు, అవమానించబడ్డారు.

వీరి స్మృతిలో ఒక మెమోరియల్ చైన్‌లో భాగంగా ఈ ఇమెయిల్ పంపబడింది.

ఆ దారుణ మారణ కాండను ప్రపంచం ఎన్నటికీ మర్చిపోకుండా చేయడమే ఈ ఇమెయిల్ లక్ష్యం.
ఎందుకంటే మళ్లీ దాన్ని చేయాలని ఇతరులు అనుకుంటున్నారు మరి.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ ఇమెయిల్ చేరాలని ఉద్దేశించబడింది.
ఈ మెమోరియల్ చైన్‌లో మనమూ భాగం పంచుకుందాం.

 

Remember this lady! — no Nobel for her.

మీకు తెలిసిన వారికి ఈ ఇమెయిల్‌ను పంపండి. వారిని కూడా ఇతరులకు దీన్ని పంపమని కోరండి.

దయచేసి ఈ ఇమెయిల్‌ను డిలెట్ చేయవద్దండి. దీన్ని మరొకరికి పంపడానికి మీకు ఒకే ఒక నిమిషం సమయం పడుతుంది అంతే.

ఆల్కహాలిక్ పిల్లలు, బుజ్జి రచయిత్రి శ్రీదేవి మురళీదేవి గారు ఈ ఇమెయిల్ సమాచారాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు.

ఈ కారుణ్య కథనం చదివాక ఒక సందేహం…

ఇంతకీ…

ఇరెనా గొప్పదా…. నోబెల్ గొప్పదా….

RTS Perm Link


3 Responses to “ఈమెకు నోబెల్ రాలేదు…”

 1. SIVARAMAPRASAD KAPPAGANTU on August 8, 2012 8:46 PM

  ఇరెనా గొప్పదా…. నోబెల్ గొప్పదా….

  Undoubtedly Irena

 2. Prasad on August 9, 2012 3:29 AM

  she is great, can we suggest one more time her name to noble team for noble award. if she gets or not. she is wonderful human.

 3. chandamama on August 9, 2012 4:47 AM

  శివరాం ప్రసాద్ గారూ, బొందలపాటి ప్రసాద్ గారూ,
  క్షమించాలి. రాత్రీ చాలా లేటుగా ఈ పోస్ట్ ప్రచురించాను. ఉదయం నుంచి ఇప్పటిదాకా ఆపీసులో కరెంట్ లేదు. దాంతో మీ విలువైన వ్యాఖ్యలను చూడలేకపోయాను.

  నా బ్లాగ్‌లో ఏదో సాంకేతిక లోపం వల్ల ఇరెనా ఫోటోను టపాకు లింక్ చేయలేకపోయాను.

  Irena Sendler అని గూగుల్‌లో వెతికితే ఈమె పోటో కనబడవచ్చు.

  మీకు ఇద్దరికీ ధన్యవాదాలండీ.

  అల్‌గోరెకి నోబెల్ బహుమతి… బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి… కడుపులో దేవుతోంది నాకయితే.

  మళ్లీ మరొకసారి ఆమెపేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేయటమా.

  ప్రసాద్ గారూ, వద్దులెండి.

  “స్వర్గం” -?- నుండి కూడా ఇరెనా చిన్నబోతుంది కాబోలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind