కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”

August 26th, 2012

బొమ్మరిల్లు బాస్కర్ గారూ,
నమస్కారం,

ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో “నన్ను మార్చింది మా నాన్న కన్నీరే” శీర్షికతో వచ్చిన మీ ఇంటర్ప్యూ చూశాను. 35 ఏళ్ల ముందటి నా బాల్య జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపారు మీరు. పుస్తకాల విషయంలో సరిగ్గా నాలాగే ఉన్నారు మీరు. ఇంట్లో, లైబ్రరీలో పుస్తకాలు చదవటం అయిపోతే, రోడ్డుమీద నడుస్తూ దార్లో కిందపడిపోయి ఉన్న కాగితం ముక్కలో ఏముందోనని తీసుకుని చదివిన బాల్యం నాది కూడా.

చిన్నప్పుడు మా నాన్న చందమామ పత్రికను తీసుకొచ్చి,’ జ్ఞానం వస్తుంది చదవండిరా!’ అన్నారు. జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు కాని వందల వేల పుస్తకాలను ఆబగా చదివేసిన అపురూప బాల్యం మాత్రం నా స్వంతమైంది. 35 సంవత్సరాల క్రితం చందమామ నా బాల్యాన్ని ఆడిస్తే ప్రస్తుతం అదే చందమామలో తెలుగు అసోసియేట్ ఎడిటర్‌‌గా పనిచేస్తున్నాను. నా చందమామ బాల్యానికి, ప్రస్తుతం దాంట్లోనే నా పనికి ఎంత కో ఇన్సిడెన్స్ ఉందో చూడండి. -కాని మరో పది రోజుల్లో చందమామ నుంచి బయటపడవలసిన పరిస్థితి.-

నాన్న కన్నీరు మీ జీవితాన్ని మార్చింది. అది బొమ్మరిల్లయి కోట్లాది తెలుగువారి హృదయాల్లో కన్నీరొలికించింది. ఒక కమర్షియల్ దర్శకుడికి జీవితంలో ఇంతకు మించి ఏం కావాలి?

1980ల మొదట్లో రాయచోటి పట్టణంలో శంకరాభరణం సినిమాను 13 సార్లు చూసి -అదే మొదటి సారి చివరిసారి కూడా-  ‘దొరకునా ఇటువంటి సేవ’ పాట వింటూ, చూస్తూ 13 సార్లూ ధియేటర్లోనే ఏడ్చిన అనుబవం నాది. ఇప్పటికీ ఈ పాటను లేదా సినిమాను చూస్తే కన్నీళ్లు అలాగే ఒలికిపోతాయి నాకు. (ఆ సినిమా సారాంశంతో నేను ఏకీభవించినా ఏకీభవించకున్నా..)

బాలచందర్ గారి ‘ఆకలిరాజ్యం’ సినిమాలో కమల్ హసన్ తన ప్రియురాలు కూడా దూరమవుతున్న విపత్కర క్షణంలో పాడుకున్న శ్రీశ్రీ గీతం ‘ఏదిసత్యం ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ’ ని వింటూ బావురుమని విలపించడం కూడా మర్చిపోలేను నేటికీ. ఇప్పటికీ ఆ గీతం విన్నా, చూసినా అదే ఏడుపు. విషాదం సామాజికరూపం తీసుకున్నప్పుడు మనుషుల ఉద్వేగాలను అమాంతం తట్టిలేపే కమనీయ దృశ్యమిది.

తర్వాత అన్నమయ్య సినిమాలో ‘అంతర్యామీ.. అలసితీ..’ అనే చివర్లో వచ్చే పాట అలాగే ఏడిపించిది. ఇప్పటికీ అది నన్ను ఏడిపిస్తోనే ఉంది. భక్తిసాహిత్య చరిత్రలో మనకాలంలో వచ్చిన అద్వితీయ రచన ఇది.

ఆ తర్వాత మీ బొమ్మరిల్లు.. ‘మొత్తం మీరే చేశారు’ అంటూ సిద్ధూ తండ్రిపై చేసిన ఆరోపణ.. కోట్లమంది యువతరాన్నే కాదు తల్లిదండ్రులనే కాదు. ఒక సమకాలీన సమాజాన్నే తీవ్రంగా కదిలించివేసింది. పిల్లలు ఏం తినాలి, ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని చేసుకోవాలి అనే సమస్త అశాలనూ తల్లిదండ్రులే నిర్దేశిస్తున్న, శాసిస్తున్న సమాజానికి సిద్ధూ ఆక్రోశం ఒక పొలికేకలా తగిలింది.

అడుగడుగునా పిల్లల బాల్యం ఖండితమవుతోదిక్కడ. పిల్లల ఇష్టాలు ఖండితమైపోతున్నాయి. వాళ్ల ఉద్వేగాలు, భావాలు సమస్తమూ ఖండించబడుతున్నాయిక్కడ

ఖండిత భావాలు, ఖండిత ఆలోచనలు, ఖండిత ఇష్టాలు, ఖండిత ఉద్వేగాలు… ఇలా బాల్యం బాల్యమే ఖండించబడుతున్న సమాజానికి బొమ్మరిల్లు సినిమా ఒక మేలుకొలుపు అయింది కాబట్టే తెలుగు సమాజం ఆ సినిమాలో తనను తాను పోల్చుకుంది.

నాన్న కన్నీరు మిమ్మల్ని మారిస్తే, బొమ్మరిల్లు సినిమాలో ఆ ఒక్క సంభాషణతో కోట్లమందికి కన్నీరు తెప్పించారు.

బొమ్మరిల్లు ధనికవర్గ జీవితానికి పట్టం కట్టి ఉండవచ్చు…. టేకిట్ ఈజీ అనే మన కాలపు తారకమంత్రాన్ని అది దృశ్యరూపంలోకి మార్చి ఉండవచ్చు..

కాని అది కోట్ల హృదయాలను ఒక్క సింగిల్ డైలాగ్‌తో ఊగించింది. బాల్యం అనే ఖండిత జ్ఞాపకాలకు, పిల్లల బాధలకు, ఆరాటాలకు ఆక్రోశాలకు శ్వాసగా, ప్రతిరూపంగా మారింది.

ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా కళను దీప్తిమంతం చేసిన డైలాగ్ అది.

అందుకే మీరు నిలిచిపోయారు. తెలుగు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిల్చిపోయారు. సమకాలీన ప్రపంచం గుండెల్లో బొమ్మరిల్లు కట్టుకుని ఉండిపోయారు. బొమ్మరిల్లు ముందూ, తర్వాతా మీకు మరేమీ లేదన్నంతగా ఈ తరం జ్ఞాపకాల్లో మిగిలిపోయారు.

బొమ్మరిల్లు భాస్కర్ గారూ! ఈ ఆదివారం ఒక కమ్మటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తుచేసి చెమ్మగిల్లజేసినందుకు మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు..

మీకు యూనికోడ్ గౌతమి ఫాంట్‌లోని ఈ తెలుగు ఇమెయిల్ అందుతుందో లేదో, బిజీ షెడ్యూల్‌లో మీరు ఈమెయిల్స్‌ చూడగలరో లేదో తెలియదు.
అందుకే నా చందమామలు బ్లాగులో కూడా నా ఈ స్పందనను ప్రచురిస్తున్నాను.

కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”

blaagu.com/chandamamalu

రాజశేఖర రాజు.
చందమామ
7305018409

 

బాల్యం ఖండించబడుతుండటానికి సంబంధించి నా మరో బ్లాగులో కింది కథనం గతంలో ప్రచురించాను. వీలయితే చూడండి.

పాలు ఒలికిపోయినప్పుడు

http://kanthisena.blogspot.in/2010/12/blog-post_1521.html

 

RTS Perm Link

ద్రావిడ భాషల యుగకర్త భద్రిరాజు కృష్ణమూర్తి ఇక లేరు….

August 11th, 2012

భాషా శాస్త్ర చరిత్రలో, ప్రత్యేకించి ద్రావిడ భాషా శాస్త్ర అధ్యయన చరిత్రలో ఒక యుగకర్త ఇక లేరు. 20వ శతాబ్దిలో ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో ద్రావిడ భాషా పరిశోధన చేసి ద్రావిడ భాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను సాధించిపెట్టిన మేటి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ శనివారం ఉదయం కన్నుమూశారు.

గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారంగా చర్చించిన ‘ద్రవిడయన్ లాంగ్వేజెస్’ ఉద్గ్రంథానికి ఈయనే కర్త. వర్తమాన తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా నిలిచిన యుగకర్తృక రచన ఇది. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు సాహిత్య, భాషా శాస్త్ర విభాగాల్లో ఆయన రచించిన భాషాధ్యయన గ్రంథమే దశాబ్దాలుగా పాఠ్యంగా ఉంటూ వస్తోంది. ద్రావిడ భాషా తత్వం గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఆయన ఎన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించారు.

ద్రావిడ భాషల అధ్యయనంలో కొత్త అధ్యాయంగా మారి నిలిచిన ఆచార్యుడు భద్రిరాజు కృష్ణమూర్తి ఈ రంగంలో ఆధునిక తులనాత్మక అధ్యయన పద్ధతిని ప్రవేశపెట్టిన పరిశోధకుడిగా చరిత్రకెక్కారు. రెండు శతాబ్దాల క్రితం ఆంగ్ల భాషా శాస్త్రజ్ఞుడు బిషప్ రాబర్ట్ కాల్డ్‌వెల్ ద్రావిడ భాషల అధ్యయనానికి కొత్త బాటలు తీస్తే, ఆయన మార్గంలో ముందుకు సాగిన భద్రిరాజు 1949 నుంచి ఎన్నెన్నో అపూర్వమయిన పరిశోధన పద్ధతులు అమలు చేస్తూ పోయారు.

అచ్చమైన పరిశోధన
ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ పరిశోధన మొదలుపెట్టే నాటికి ఆ శాస్త్రం శిశుప్రాయంలో ఉంది. బిషప్ కాడ్వెల్, డాక్టర్ ముర్రె బి.ఎమెనో, బరో, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి హేమాహేమీల అద్వితీయ కృషి ఫలితంగా ఈ రోజున ద్రావిడ భాషా శాస్త్రపరిశోధన కొమ్మలూ రెమ్మలతో విస్తరించి మహావృక్షంగా ఎదిగింది. “మన దేశంలో మాత్రమే కాదు- అంతర్జాతీయంగానే ఈ అధ్యయన విభాగానికి అపారమయిన ప్రాముఖ్యం దక్కుతోంది ఇప్పుడు. సాహిత్యం- భాష- శాసన పరిశోధన- సాంస్కృతిక చరిత్రలాంటి రంగాల్లోనే కాకుండా మానవశాస్త్రం, సమాజ పరిణామ శాస్త్రం, ఆచార వ్యవహారాల అధ్యయనం, సాంస్కృతిక సంప్రదాయాల విశ్లేషణ, పండగలూ పబ్బాల అన్వయం- ఇలా అనేక అధ్యయన విభాగాల్లో భద్రిరాజు పరిశోధనలకు కీలకమయిన ప్రాధాన్యం ఉంటోంది.”

వృత్తి పద కోశాల నిర్మాణం. వ్యవసాయం నుంచి మొదలుపెట్టి, చేనేత తదితర వృత్తులవాళ్లు వినియోగించే పారిభాషిక పదాలను ఒకచోట చేర్చి, చరిత్ర కోసం భద్రపరచడం కృష్ణమూర్తి గారి మార్గదర్శకత్వంలో సాగిన అద్భుతమయిన కృషి. భారతదేశ భాషా చరిత్రలోనే మొట్టమొదటి మేటి కృషి ఇంది. ఆరు దశాబ్దాలకు పైగా, ద్రావిడ భాషల్లో పరిశోధనా కృషితో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు దక్కింది.

1986-87 ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన ఒక సెమినార్ సందర్భంగా భద్రిరాజు గారు తిరుపతికి వచ్చినప్పుడు అప్పటి నా పరిశోధన గైడ్ పి.సి నరసింహారెడ్డి తరపున వీరిని ప్రత్యక్షంగా కలిసిన అనుభవం నాకు దక్కింది.

సమకాలీన భారతీయ భాషాశాస్త్రవేత్తల్లో, మౌలిక భాషా పరిశోధకుల్లో, ఆధునిక నిఘంటు నిర్మాతల్లో అగ్రగణ్యులయి ప్రపంచప్రఖ్యాతి పొందిన ఒకే ఒక్కరు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. గిడుగు గురజాడల వారసులుగా వ్యావహారిక భాషోద్యమ లక్ష్యాన్ని, సర్వోన్నత విద్యాస్థాయివరకు విస్తరింపజేసి కృతకృత్యులయి తెలుగు భాష సమగ్రాభివృద్ధికి బహు విధాలుగా కృషి చేసిన మహనీయుడీయన.

తెలుగు క్రియా ప్రాతిపదికల మీద పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ అందుకున్న భద్రిరాజు కృష్ణమూర్తి గారిని అనేక విదేశీయ విద్యాలయాలు, అమెరికా, జపాన్, జర్మనీ, రష్యా వంటి దేశాల్లోని సంస్థలూ, భద్రిరాజు వారిని ఆచార్య పదవితో ఆహ్వానించాయి. యునైటెడ్ కింగ్‌డమ్ లోని రాయల్ సొసైటీ అఫ్ ఎడింబర్ వరిష్ఠ విశిష్ట సభ్యత్వం ఈ సందర్భంలో చెప్పుకోదగ్గది. 2004లో మొత్తం భారతీయుల్లో ఈ గౌరవాన్ని పొందినవారు భద్రిరాజు కృష్ణమూర్తి గారొక్కరే.

తెలుగు ధ్వనుల ఉచ్చారణ గురించి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్‌లో వీరు చేసిన కృషి విశిష్టమయినది. దేశవిదేశాల్లోని అనేక ఉన్నత విద్వత్ సంస్థల నుండి ఇంత గుర్తింపూ ఇన్ని గౌరవాలూ పొందిన వారు కోట్ల మందికి ఒక్కరుండటం అరుదు!

“భారతదేశం మొత్తం మీద తొలిసారిగా విదేశాల్లో భాషాశాస్త్రాధ్యనం చేసి పరిశోధన కావించారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషాశాస్త్ర సిద్ధాంతాల అనువర్తనం గాని, వివిధ కోణాల్లో భాషాధ్యయనం గాని, భారతీయ భాషల్లో మరో భాషలోనూ జరగనంత కృషి తెలుగు జరగడానికి ప్రధాన కారకులు వీరే. దక్షిణాసియా భాషల్లో ఆధునిక భాషా శాస్త్ర పద్ధతిలో వృత్తిపదకోశాల నిర్మాణం తొలిసారిగా తెలుగులోనే జరగడానికి కారకులు వీరు. తెలుగులోని ఆధునిక భాషా మండలాలను వర్గమాండలికాల స్వరూపాన్ని తొలిసారి శాస్త్రీయంగా నిరూపించిన వారూ, ప్రమాణ భాషా లక్షణాలనూ ప్రయోజనాలనూ నిర్దిష్టంగా నిర్వచించి స్పష్టపరిచిన వారు కృష్ణమూర్తిగారు. అన్ని స్థాయిల పాఠ్య పుస్తకాల్లోను వాడుక భాషను ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నంలో సఫలత సాధించి సత్ఫలితాలు చూపించారు.”

“విదేశీయులకు, వివిధ భాషీయులకు ఇంగ్లీష్ ద్వారా తెలుగు బోధించడానికి సాధన సామగ్రిని తయారు చేశారు. తెలుగు-ఇంగ్లీష్ నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. తెలుగు అకాడమి చేపట్టిన సామాజిక భాషా పరిశీలన పథకానికి స్వరూప స్వభావాలను, విధివిధానాలు నిర్ణయించారు. ఆధునికమైన తెలుగు భాషకు ఇంగ్లీషులో (గ్విన్ గారితో కలిసి) వ్యాకరణ గ్రంథం రచించారు. భాషాయోజనావశ్యకతను, భాషాభివృద్ధి వ్యూహాలను విపులంగా చర్చించారు. తెలుగులోనూ ఇతర భారతీయ భాషల్లోను ప్రతికా భాషలో కనిపించే నూతన పద కల్పన విధానాలను పరిశీలించడానికి వీరు దేశంలో ప్రప్రథమంగా ఒక జాతీయ సదస్సు నిర్వహించి దాని ఫలితాలను పుస్తకరూపంలో ప్రచురించారు. దీని ప్రేరణవల్ల పత్రికాభాష ఒక ప్రత్యేక పరిశోధన రంగంగా దేశంలో విస్తరించింది. చదువురాని వయోజనులకు తెలుగు నేర్పడానికి తగిన పుస్తకాలను శాస్త్రీయంగా తయారు చేశారు.”

డాక్టర్ మర్రీ బి. ఎమెనో గారి ప్రియశిష్యులు
కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారత దేశం వెళ్ళి, ఆ జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయ భాషలూ, శబ్దాలూ, శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన భాషామహర్షి డాక్టర్ మర్రీ బి. ఎమేనో గారి ప్రియశిష్యులు భద్రిరాజు కృష్ణమూర్తి. ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పని చేసిన కీ.శే. బర్రో తో కలిసి ఎమెనో ప్రచురించిన ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (Dravidian Etymological Dictionary,aka. DED)’ తరతరాలకూ నిలిచిపోయే ఉద్గ్రంథం.

ఎమెనో గారికి భద్రిరాజుగారు భాషాధ్యయనంలో శిష్యుడైన చరిత్రను ఆయన మాటల్లోనే విందాము.
“కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని నన్ను కోరారు. నాకు భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు, మరి అతనేమో తెలుగులో ఉద్దండుడు. అలా మా జంట సరిగ్గా కలిసింది. చాల మంచి పరిశోధనలు చేశాం మేమిద్దరమూ కలిసి. అతను, చాలా మంచి మనిషి. గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడూ, పరిపాలనాదక్షుడు కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు, నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు. నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ, మక్కువానూ. నా ప్రియ శిష్యుడిచ్చింది కదా!”

(దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో
http://www.eemaata.com/em/issues/200209/73.html  నుంచి)

తెలుగు వ్యాకరణం, మాండలిక భాషలు, నిఘంటు నిర్మాణం, అక్షరాస్యతా వ్యాపనం, ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనం వంటి విషయాల్లో కృష్ణమూర్తిగారిది మార్గదర్శకమైన కృషి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమకాలీన ప్రముఖ భాషావేత్తల మన్ననలందుకున్న భద్రిరాజు గారు ద్రావిడ భాషా శాస్త్ర అధ్యయనంలో యుగకర్తృత్వ రచనలు చేశారు.

ఇప్పటి వరకు భద్రిరాజు వారు తెలుగులోను, ఇంగ్లిషులోను ప్రచురించినవి 25 గ్రంథాలూ, నూటికి పైగా పరిశోధన వ్యాసాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఇంగ్లిష్ పుస్తకాలు

1. A Grammar Of Modern Telugu by Bhadriraju Krishnamurti, J.P.L. Gwynn
2. Telugu Verbal Bases: A Comparative And Descriptive Study
3. Comparative Dravidian Linguistics: Current Perspectives
(This volume is a contribution both to comparative Dravidian studies and to the theory of language change and linguistic reconstruction. It makes available the author’s most important published articles on Dravidian over the last forty years and includes a new and substantial introduction to the field. The book concludes with a survey of Dravidian language studies over the last thousand years and a critical account of work since 1950. Those articles reprinted in the work appear substantially unchanged, with individual comments.)

4. Language, Education and Society
5. The Dravidian Languages (published 2003 — 2 editions)
(The Dravidian languages are spoken by nearly 200 million people in South Asia and in diaspora communities around the world. They include Tamil, Malayalam, Kannada and Telugu, as well as over 20 non-literary languages. Bhadriraju Krishnamurti, one of the most eminent Dravidianists of our time, provides a linguistic overview of the Dravidian language family. He describes its history and writing system, discusses its structure and typology, and considers its lexicon. Distant and more recent contacts between Dravidian and other language groups are also covered.)

6. Konda or Kubi A Dravidian Language (Hyderabad Government of Andhra Pradesh, 1969)
7. Gold Nuggets An Anthology of Selected Post-independence of Telugu Short Stories in English (Translations) (ed with C. Vijayasree)

కృష్ణమూర్తిగారు తెలుగులో ప్రచురించిన గ్రంథాల్లో ఆరింటికి సంపాదకత్వం వహించారు
1. మాండలిక వృత్తిపదకోశం (తొలి సంపుటం) – వ్యవసాయ పదాలు (1962)
2. మాండలిక వృత్తిపదకోశం (రెండో సంపుటం) – చేనేత పదాలు (1971)
3. తిక్కన పదప్రయోగకోశం – మూడు సంపుటాలు (1971, 1974, 1977) (మరో ఇద్దరు సంపాదకులతో కలిసి)
4. తెలుగు భాషా చరిత్ర (1974 – తరువాత ఏడెనిమిది సార్లు పునర్ముద్రణ అయింది)

వీరు స్వయంగా రచించినవి:
1. జనవాచకం – ఐదు పుస్తకాలు (ఈశ్వరరెడ్డిగారితో కలిసి) (1980)
2. తేలిక తెలుగు వాచకం – రెండు భాగాలు (1993)
3. చిన్ననాటి పద్యాలు (1998)
4. భాషా-సమాజం-సంస్కృతి (1999) ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ సామాజిక భాషా శాస్త్ర సంబంధమయినవి.

మన కాలపు మేటి భాషా శాస్త్రవేత్త అయిన ఈ యుగకర్తపై ఆన్‌లైన్‌లో గత కొంత కాలంగా నేను సేకరించిన ప్రామాణిక సమాచారాన్ని లింకులతో సహా ఇక్కడ ఇస్తున్నాను. భాషా శాస్త్ర అధ్యయనకారులకు, ద్రావిడ భాషల చరిత్రపై జిజ్ఞాసువులకు ఈ కింది లింకులలోని సమాచారం ఉపయోగపడుతుందని నా ఆశ.

భద్రిరాజు కృష్ణమూర్తి గారికి నివాళిగా రూపొందిన ఈ కథనంకు సోర్స్‌గా నిలిచిన ఈమాట.కామ్ రచనలు, వివిధ పత్రికలు, వెబ్‌సైట్లకు నా కృతజ్ఞతలు.

నిన్న రాత్రి ప్రచురించిన ఈ కథనం లింకులకు అదనంగా ఇవ్వాళ వివిధ పత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు, కథనాల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. వీటి తర్వాత వివిధ వెబ్‌సైట్లలో భద్రిరాజు కృష్ణమూర్తి గారిపై గతంలో వచ్చిన కథనాల లింకులను యధాతథంగా చూడవచ్చు.

భద్రిరాజు కృష్ణమూర్తిపై ప్రధాన వార్తలు – పత్రికలు

మన కాల్డ్‌వెల్ కన్నుమూశాడు!_ఈనాడు ప్రధాన వార్తాకథనం
నేలకొరిగిన భాషా శిఖరం – భద్రిరాజు కృష్ణమూర్తి అస్తమయం
http://www.eenadu.net/Homeinner.aspx?item=news/panel7

ఆచార్య భద్రిరాజు అస్తమయం_సాక్షి ప్రధాన వార్త
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=429970&Categoryid=1&subcatid=33

భాషా రారాజు.. భద్రిరాజు ఇకలేరు_ఆంధ్రజ్యోతి ప్రధాన వార్త
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/aug/12/main/12main10&more=2012/aug/12/main/main&date=8/12/2012

భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూత

http://telugu.oneindia.in/news/2012/08/11/andhrapradesh-linguist-bhadriraju-krishnamurti-passes-away-104020.html

 

భద్రిరాజు కృష్ణమూర్తిపై తాజా పత్రికా కథనాలు – నివాళి

భాషా శాస్త్ర రారాజు_ఈనాడు కథనం
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
http://www.eenadu.net/Editorial/vyakyanaminner.aspx?qry=opini2

విశిష్ట భాషావేత్త!_సాక్షి కథనం
నివాళి
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=46985&Categoryid=1&subcatid=18

భద్రిరాజుకు పీసీఎన్ నివాళి_సాక్షి
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=429733&subcatid=7&Categoryid=3

భాషకు రారాజు!_సాక్షి కథనం
Written by MK On 8112012 50300 PM
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=46918&Categoryid=28&subcatid=0

భాషా శాస్త్ర మహోపాధ్యాయుడు_ఆంధ్రజ్యోతి కథనం
ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/12/edit/12edit4&more=2012/aug/12/edit/editpagemain1&date=8/12/2012

ఆధునిక తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి_ ఆంధ్రభూమి కథనం
-సామల రమేష్ బాబు తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు 12082012
http://www.andhrabhoomi.net/content/bhadriraju

భాషే శ్వాసగా మిగిలిన భద్రిరాజు

http://aksharajalam.wordpress.com/2012/08/12/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B1%87-E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D/

 

వివిధ వెబ్‌సైట్లలోని పాత కథనాల లింకులు

 

భద్రిరాజు కృష్ణమూర్తి
http://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF

భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
రచన  సి. పి. బ్రౌన్ అకాడమి
http://www.eemaata.com/em/issues/200805/1255.html

మేరు నగ మేధావి
రచన : కె. కె. రంగనాథాచార్యులు
http://www.eemaata.com/em/category/library/bhadriraju/

ఆలోచింపచేసిన మనిషి
రచన : వెల్చేరు నారాయణరావు
http://www.eemaata.com/em/issues/200806/1289.html

భాషాశాస్త్రానికి పర్యాయపదం భద్రిరాజు
రచన  చేకూరి రామారావు
http://www.eemaata.com/em/issues/200806/1292.html

మాండలిక వృత్తి పదకోశం
రచన  ఆరుద్ర
http://www.eemaata.com/em/issues/200806/1290.html

మాండలిక వృత్తిపదకోశ నిర్మాణం: భద్రిరాజువారి మార్గదర్శకత్వం
రచన : బూదరాజు రాధాకృష్ణ
http://www.eemaata.com/em/issues/200806/1287.html

Bhadriraju Krishnamurti
http://www.engr.mun.ca/~adluri/telugu/language/linguistics/krishnamurti.html

Bhadriraju Krishnamurti
http://en.wikipedia.org/wiki/Bhadriraju_Krishnamurti

భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ
రచన : సుమనస్పతి
http://www.eemaata.com/em/issues/200807/1301.html

ప్రామాణిక భాష ప్రాంతాన్ని తెలిపేది కాదు!
http://vrdarla.blogspot.in/2009/08/blog-post_28.html

2005లో 101 ఏళ్ల వయసులో తన గురువు శ్రీ మర్రి ఎమెనో అమెరికా కాలిఫోర్నియాలోని బర్క్‌లీలో కన్నుమూసిన సందర్భంగా ఆయనకు నివాళి పలుకుతూ ఆయన శిష్యుడు భద్రరాజు కృష్ణమూర్తి గారు పంపిన నివాళిని ఈ లింకులో చూడవచ్చు
Homage to a Western Indologist
by Bh. Krishnamurti, PhD
http://linguistics.berkeley.edu/people/emeneau/homage.html

దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో
రచన : మాధవ్ మాచవరం
http://www.eemaata.com/em/issues/200209/73.html
(తెలుగు భాషా, సాహిత్య చరిత్రలోకెల్లా అతి గొప్ప ఇంటర్వ్యూలలో ఒకటి. శ్రీ మర్రీ ఎమెనో  ప్రియ శిష్యుడు భద్రిరాజు కృష్ణమూర్తి గారు)

తెలుగు భాష చరిత్ర
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0

భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101
రచన : సురేశ్ కొలిచాల
http://www.eemaata.com/em/issues/200701/1049.html?allinonepage=1

తెలుగు భాష వయస్సెంత
రచన  సురేశ్ కొలిచాల
http://www.eemaata.com/em/issues/200511/43.html

ద్రావిడ భాషలు
http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81

Telugu is 2,400 years old, says ASI
Special Correspondent
http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm

తెలుగు భాషా చరిత్ర
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0(%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%82)

Murray Barnson Emeneau
http://en.wikipedia.org/wiki/Murray_Barnson_Emeneau

Professor Murray Emeneau Remembered
http://linguistics.berkeley.edu/people/emeneau/tributes.html

T. Burrow and M.B. Emeneau
http://sangamtamilforeignscholars.wordpress.com/t-burrow-and-m-b-emeneau/

Murray Emeneau — famed UC Berkeley linguist
Patrick Hoge, Chronicle Staff Writer
Published 0400 a.m., Monday, September 12, 2005
http://www.sfgate.com/bayarea/article/Murray-Emeneau-famed-UC-Berkeley-linguist-2569700.php

RTS Perm Link

ఈమెకు నోబెల్ రాలేదు…

August 8th, 2012

ఈమె పేరు ఇరెనా సెండ్లర్. 2008 మే 12న 98 ఏళ్ల వయస్సులో పోలెండ్‌లోని వార్సాలో ఈమె కనుమూశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్‌లో మురికినీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది.

తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాపెట్టిన ఇరెనా, వారిని అలా ఆ శిబిరాలనుంచి నాజీలకు తెలియకుండా తరలించేది. మరింత పెద్ద వయసు పిల్లలను తరలించడానికి తన ట్రక్ వెనుకన ఆమె ఒక గోనె సంచిని పెట్టుకుని వెళ్లేది.

నాజీ సైనికులు చిత్రహింసల శిబిరంలోకి ఆమెను అనుమతించి, బయటకు పంపుతున్నప్పుడు ఇరెనా తన వెంట ఒక కుక్కను తీసుకెళ్లి అది ఆ సమయాల్లో మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది.

సైనికులు తమ ముందు మొరుగుతూ వెళ్లే ఈ కుక్కను ఏమీ చేసేవారు కారు. కుక్క మొరుగుడు ఇరెనా తరలిస్తున్న శిశువులు చేసే శబ్దాలు బయటకు రాకుండా అడ్డుకునేది.

ఇలా ఆమె 2500 మంది యూదు శిశువులను అప్పట్లో గ్యాస్ చాంబర్ల నుంచి బయటకు తరలించగలిగింది.

చివరకు ఒక రోజు ఆమె పట్టుబడింది. నాజీలు ఆమె కాళ్లూ చేతులూ విరిచి చితకబాదారు.

ఇలా తను తరలించిన శిశువుల పేర్ల చిట్టాను తన ఇంటి పెరడు లోని ఒక చెట్టు కింద గ్లాస్ జాడీలో పెట్టి భద్రపర్చింది ఇరెనా

యుద్ధం ముగిసిన తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులలో ఎవరైనా బతికి ఉంటే వారిని కనుక్కునేందుకు  ఆమె ప్రయత్నించింది. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు కూడా ప్రయత్నించింది.
కాని పిల్లల తల్లిదండ్రులలో చాలామంది గ్యాస్ ఛాంబర్లకు బలయ్యారు. ఆమె కాపాడిన పిల్లలను క్రైస్తవ శరణాలయాలు స్వీకరించాయి లేదా దత్తత తీసుకున్నాయి.

2007లో ఇరెనా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడింది. కాని ఆమె ఎంపిక కాలేదు.
భూతాపంపై స్లయిడ్ షో ప్రదర్శించిన అల్ గోరెకి ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
మరొక రాజకీయనేత బరాక్ హుస్సేన్ ఒబామా ఆక్రోన్ -ACORN- కోసం కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్నాడు.

ఇరెనా చేపట్టిన సాహసిక చర్యకు ఇప్పుడు 65 ఏళ్లు. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 65 ఏళ్లయింది.

60 లక్షల మంది యూదులు, 2 కోట్ల మంది రష్యన్‌లు, కోటి మంది క్రైస్తవులు, 1,900 మంది కేథలిక్ ప్రీస్ట్‌లు ఈ యుద్ధంలో చంపబడ్డారు, ఊచకోతకు గురయ్యారు. రేప్ చేయబడ్డారు, తగులబెట్టబడ్డారు, పస్తులతో చంపబడ్డారు, అవమానించబడ్డారు.

వీరి స్మృతిలో ఒక మెమోరియల్ చైన్‌లో భాగంగా ఈ ఇమెయిల్ పంపబడింది.

ఆ దారుణ మారణ కాండను ప్రపంచం ఎన్నటికీ మర్చిపోకుండా చేయడమే ఈ ఇమెయిల్ లక్ష్యం.
ఎందుకంటే మళ్లీ దాన్ని చేయాలని ఇతరులు అనుకుంటున్నారు మరి.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ ఇమెయిల్ చేరాలని ఉద్దేశించబడింది.
ఈ మెమోరియల్ చైన్‌లో మనమూ భాగం పంచుకుందాం.

 

Remember this lady! — no Nobel for her.

మీకు తెలిసిన వారికి ఈ ఇమెయిల్‌ను పంపండి. వారిని కూడా ఇతరులకు దీన్ని పంపమని కోరండి.

దయచేసి ఈ ఇమెయిల్‌ను డిలెట్ చేయవద్దండి. దీన్ని మరొకరికి పంపడానికి మీకు ఒకే ఒక నిమిషం సమయం పడుతుంది అంతే.

ఆల్కహాలిక్ పిల్లలు, బుజ్జి రచయిత్రి శ్రీదేవి మురళీదేవి గారు ఈ ఇమెయిల్ సమాచారాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు.

ఈ కారుణ్య కథనం చదివాక ఒక సందేహం…

ఇంతకీ…

ఇరెనా గొప్పదా…. నోబెల్ గొప్పదా….

RTS Perm Link