రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్

March 8th, 2012

బాలగోపాల్

 

 

 

 

 

 

 

 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవలే ఒక అరుదైన పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. పుస్తకం పేరు “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్.” ఇది పౌర, మానవహక్కుల నేత బాలగోపాల్ సాహిత్య రచనల సంకలనం.

కె. బాలగోపాల్ (1952-2009) మానవహక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త

మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పధంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్యంపై చెదురుమదురుగానే అయినా చిక్కగా రాసిన వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు, ఇంటర్వ్యూల సంకలనమిది.

భారతీయ చరిత్ర రచన, అధ్యయన పద్దతులపై మౌలిక ప్రభావం చూపిన సుప్రసిద్ధ చరిత్రకారులు డిడి కొశాంబి రచనల అధ్యయనంతో మార్క్సిజం వైపు ఆకర్షితులైన బాలగోపాల్ 1980ల మొదటి నుంచి 2009లో ఆకస్మిక మరణం పొందేవరకు 30 సంవత్సరాలపాటు అటు అధ్యయనానికి, ఇటు తానెంచుకున్న పౌర హక్కులు, మానవ హక్కుల రంగాలలో ఆచరణకు సజీవ ఉదాహరణగా నిలిచిపోయిన విశిష్టవ్యక్తి. పౌరహక్కుల కోసం, తదనంతరం మానవహక్కుల కోసం 30 ఏళ్లపాటు భారతదేశ వ్యాప్తంగా కాలికి బలపం పట్టుకుని తిరిగిన అద్వితీయ చరిత్ర బాలగోపాల్‌ది.

పౌర హక్కుల కోసం గొంతెత్తినందుకు రాజ్య వ్యవస్థ అభిశంసనకు గురయ్యాడు. మరోవైపు ప్రజా ఉద్యమాలలో సహించరాని ధోరణులపై గళమెత్తినందుకు సమకాలీన విప్లవోద్యమం అభిశంసనకు కూడా గురయ్యాడు. అటు రాజ్యం  ఇటు ప్రజాఉద్యమం రెండు శక్తుల నుంచి నిరసన, అభిశంసనను ఎదుర్కొన్న అరుదైన చరిత్ర ఈయనది.  రాజ్యవ్యవస్థను, ఇటు ప్రజా ఉద్యమాలను వాటి గుణగుణాల ప్రాతిపదికన ఉతికి ఆరేసిన అరుదైన వ్యక్తిత్వం బాలగోపాల్‌ది.

పౌర హక్కులలో ఉద్యమాల బాధితుల హక్కులు భాగం కావా అనే విమర్శపై ప్రతిస్పందన దాని కార్యకారణ ఫలితాలు బాలగోపాల్ ఆలోచనా దృక్పధాన్ని కొత్త మలుపు తిప్పివేశాయనడం ఇప్పుడు నిర్వివాదాంశం.

ప్రపంచ పౌర హక్కుల చరిత్రలో ఏ హక్కుల ఉద్యమకారుడు, ఉద్యమకారిణి తిరగనంత విస్తృతంగా సువిశాల భారతదేశమంతటా పయనించి తన హక్కుల వాణిని మూడు దశాబ్దాల పాటు అలుపెరగకుండా వినిపించిన అరుదైన కార్యకర్త బాలగోపాల్.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా దాకా యావత్ ప్రపంచం కూడా మనిషి పట్ల, హక్కుల విధ్వంసం పట్ల బాలగోపాల్ తపనను. ఆర్తిని గుర్తిస్తూ ఆయనకు నివాళి పలుకుతోంది. ఒక తెలుగువాడు ప్రపంచ పౌర హక్కుల యవనికపై ప్రసరింపజేసిన దివ్యకాంతి మానవాళి హక్కుల చరిత్రలోనే మకుటాయమానంగా భవిష్యత్తరాలపై కూడా తనదైన ప్రభావాన్ని వేయనుంది.

పౌర, మానవ హక్కుల ఉద్యమం ప్రధాన భూమికగా జీవితాన్ని పండించుకున్న బాలగోపాల్ తెలుగు ప్రాచీన, ఆధునిక సాహిత్యంపై, రచయితలపై, సాహిత్యంలో సామాజిక ప్రతిపలనాలపై చేసిన అద్వితీయ రచనలన్నిటినీ కలిపి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్” అనే పుస్తకం ఇటీవలే ప్రచురించింది.

ఒక 30 సంవత్సరాల నిరంతర ఉద్యమ చలనంలో ఉంటూ కూడా  తెలుగు సాహిత్యం నుంచి మొదలు కుని ప్రపంచ సాహిత్యం వరకు కూడా తను సాగించిన అధ్యయనాన్ని, వ్యక్తీకరించిన అభిప్రాయాలను ఒకే చోట చేర్చి అభిమానులకు, సాహిత్య ఆసక్తి పరులకు అందించిన విశిష్ట పుస్తకం “సాహిత్యంపై బాలగోపాల్”

“ఏడుతరాలు” రాసిన  ఎలెక్స్ హేలీ దృక్పథ విశ్లేషణ నుంచి, కవిసేన నుంచి, కన్యాశుల్కం నుంచి, రావి శాస్త్రి సారా కథల నుంచి, కుటుంబరావు మధ్యతరగతి నేపథ్యం పరిమితుల నుంచి తను పరిశీలించిన ప్రతి ఒక్క రచనపైనా తనదైన మెరుపు వాక్యాలను, విశ్లేషణలను చేసి సీనియర్ విమర్శకులతో పాటు ఒకటి రెండు తరాల యువతీయువకులను కూడా విశేషంగా ఆకర్షించిన గొప్ప రచనలు ఈ పుస్తకంలో మనం చూడవచ్చు.

ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ గారు బాలగోపాల్‌ రచనల ప్రాశస్త్యంపై ఒక తరం అభిప్రాయాలకు వాణినిస్తూ ఈ పుస్తకం ముందుమాటలో ఇలా రాశారు.

“ఆ కాలపు తరగలపై తేలివచ్చిన మేధావులలో బాలగోపాల్ ఒకరు. కళ్ళు మిరుమిట్లు గొలిపి కొత్త వెలుగులు కురిపించిన యువకుడిగా బాలగోపాల్ ఒకే ఒక్కడు. ఎంతో వినయంగానే అయినప్పటికీ, తను జ్ఞానం అనుకున్న దానిమీద తిరుగులేని విశ్వాసాన్ని, ఆ జ్ఞానం మీద తనకున్న అధికారాన్ని ధ్వనింపజేస్తూ మాట్లాడేవాడు. రాసేవాడు.ఇంద్రవెల్లీ, సింగరేణీ భవిష్యత్తు మీది ఆశను ఉద్దీపింపజేస్తుండగా, ఉద్వేగాలకు బలమయిన ఆలంబన కోసం జ్ఞానదాహంతో తపించిపోయిన, అప్పుడప్పుడే కళ్లు తెరుస్తున్న మా బోంట్లం ప్రతి సృజనాక్షరాన్నీ జల్లెడ పట్టేవాళ్లం. ఒక సాధికారికమయిన గొంతు కోసం మోహం వాచి ఉన్నట్లు మధుసూదనరావుని, బాలగోపాల్‌ని ఆసక్తిగా ఆత్రంగా వినేవాళ్లం, చదివేవాళ్లం. ఎంతో తేలికగా అర్థమయ్యే వారి  రచనల ఆసరాతో అజ్ఞానపు చీకట్లను, దుష్టభావాలను అవలీలగా తరిమివేయవచ్చని అనుకునే వాళ్లం. ఎందుకో మధుసూదనరావులో ఆవేశమే ఆకర్షించేది. బాలగోపాల్‌‍ని చదివిన ప్రతిసారీ మా బుద్ది ఒక అంగుళం ఎదిగినట్లు అనిపించే్ది.”

సాహిత్య అధ్యయనం తన రంగం కాదని చెప్పుకుంటూనే, తెలుగు సాహితీ విమర్శ కలకాలం గుర్తు పెట్టుకునే మెరుపువాక్యాలు, భావాలను గుప్పించిన అరుదైన కలం బాలగోపాల్‌ది. స్వయంగా జీవిత పర్యంతమూ తానెన్నుకున్న రంగంలో ఉద్యమిస్తూ కూడా “ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.” అనే కాంతి ప్రసారిత వాక్యాలను బాలగోపాల్ కాక మరెవ్వరు ప్రకటించగలరు?

సాహిత్యంపై ఆయన భావాలలో కొన్నింటిని మచ్చుకు ఇక్కడ చూద్దాము.

“దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి కాని, సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించడమంటే, జీవితంలోని ఖాళీలను పూర్తి చేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు.”

“మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్ల గానీ, కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు. సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి.”

“సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.”

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మనవడు బాలగోపాల్. పాతికేళ్ల క్రితం “రూపం-సారం’ పేరిట తెలుగు సామాజిక, సాహిత్య ప్రతిఫలనాలపై ప్రచురించబడిన ఆయన రచనల సంకలనం నాటి తెలుగు సాహిత్య లోకంలో ఒక సంచలన ఘటన. వేల్చేరు నారాయణరావు గారు ఒక సందర్భంలో తొలిసారిగా ప్రస్తావించిన ‘మెరుపు వ్యాక్యాలు’ పదప్రయోగం బాలగోపాల్ రచనలల్లో పదుల సంఖ్యలో మనం చూడవచ్చు.

బాలగోపాల్ భావజాలంతో మనం ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు, కాని జీవిత పర్యంతమూ పౌర మానవ హక్కుల కోసం పరితపించిన వ్యక్తి సాహిత్యంపై ప్రకటించిన అభిప్రాయాలను మనం చదవడానికి ఇవేవీ అభ్యంతరాలు కాకపోవచ్చు.

బాలగోపాల్‌ జీవిత, ఉద్యమ, రచనలపై మిత్రులు రూపొందించిన అరుదైన వెబ్‌సైట్‌లో “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్” పుస్తకం పిడిఎఫ్ రూపంలో దొరుకుతోంది. మానవహక్కులపై తాత్విక దృక్పథం వంటి అరుదైన తన రచనలు కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మనం కాలం ప్రసవించిన ఈ మేటి హక్కుల నేత వాణిని మనమూ విందామా!!!

రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్

http://balagopal.org/wp-content/uploads/2012/01/5.RUPAM-SARAM.pdf

ఈ మేటి హక్కుల నేత చిన్నప్పుడు చందమామ వీరాభిమాని అనే విషయం ఆయన సోదరి మృణాళినిగారికి తప్ప ఆంద్రదేశంలో ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కింది కామెంట్‌లో ఆ హృద్యమైన విషయాన్ని చూడగలరు.

 

RTS Perm Link


6 Responses to “రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్”

 1. chandamama on March 8, 2012 5:39 AM

  పౌరహక్కుల నేత, మానవ హక్కుల కార్యకర్త, సామాజిక ఉద్యమాల విశ్లేషకుడు, నిరంతర అధ్యయన శీలి బాలగోపాల్ తమ చిన్ననాటి జీవితంలో చందమామ వీరాభిమాని అనే విషయం తెలిసినప్పుడు నివ్వెరపోయాము.

  చందమామ శ్రేయోభిలాషి శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ గారి ద్వారా ప్రముఖుల చందమామ జ్ఞాపకాలను గత సంవత్సరం మధ్యలో అందుకున్నాము. అందులో బాలగోపాల్ సోదరి, రచయిత్రీ, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.సి.మృణాలిని గారి చందమామ అనుబంధం గత సంవత్సరం జూలైలో అందుకున్నాము.

  తాతయ్య రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మగారితో సహా అందరూ చందమామ అభిమానులే ఉన్న తమ ఇంట్లో చిన్నప్పుడు చిన్నన్న బాలగోపాల్ రాకాసిలోయ సీరియల్ అందరికంటే ముందు చదివేసి ఆ సంచికలో ఏం జరిగిందో చెప్పేసి మమ్మల్ని ఏడిపించేవారని ఆమె తమ చందమామ జ్ఞాపకాలలో పేర్కొన్నారు.

  “రాకాసిలోయ అందరికంటే ముందు చిన్నన్న బాలగోపాల్ చదివేసి ఆ సంచికలో ఏం జరిగిందో చెప్పేసి మమ్మల్ని ఏడిపించడం, పరోపకారి పాపన్నను ఈనాటికీ ఇంట్లో సామెతగా వాడటం, రామాయణానికి శంకర్ బొమ్మలు, బేతాళ కథలకు చిత్రా బొమ్మలు పదే పదే చూస్తూ, ప్రతి వివరాన్ని అంత గొప్పగా అతి తక్కువ స్థలంలో ఇరికించగల వారి ప్రతిభకు ఆశ్చర్యపోవడం. ఇవీ చందమామతో బాల్యస్మృతులు.. గొప్ప సంగీత సాహిత్య పండితులయిన తాతగారు శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారు కూడా చందమామ కోసం వెతుక్కోవడం. ఇంకా రాలేదా ఈనెల అని అడగడం గుర్తే..”

  మృణాళిని గారు రెండు మూడు తరాల తెలుగు లోగిళ్లలో చందమామ కలిగించిన మహత్తర ప్రభావాన్ని అద్దంలో వలే ప్రతిబింబించారు. ముఖ్యంగా పాతికేళ్లకు ముందు విద్యార్థి, సామాజిక ఉద్యమాల్లో అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్నప్పుడు యువ బాలగోపాల్ -1983- మా తరం మొత్తానికి స్పూర్తిదాయకంగా ఉండేవారు. పౌరహక్కుల, సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో ఆయనతో కలిసి తిరిగాం, పనిచేశాం. సృజన, EPW, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తదితర పత్రికలలో ఆయన వ్యాసాలు, కథనాలను యూనివర్సిటీ లైబ్రరీల్లో పోటీలు పడి చదివేవాళ్లం. ఆసాధారణమైన సైధ్ధాంతిక అభినివేశానికి, వాస్తవ ఆచరణకు కూడా బి.జి మాకొక సజీవ ప్రతీకగా ఉండేవారు. ఎస్వీ యూనివర్సిటీలో, రాష్ట్రంలోని పలు వేదికలపై ఆయనను ఎన్ని సార్లు కలుసుకున్నామో. ఎన్నిసార్లు ఆయన మాటలు విన్నామో లెక్క లేదు. నమ్మిన భావజాల విశ్వాసానికి, ఆచరణకు మధ్య వారను తన జీవితాచరణ సాక్షిగా చెరిపివేసిన అద్వితీయ మనీషి బి.జి. ఆయన కూడా చిన్నప్పుడు చందమామ సీరియస్‌గా చదివేవారనే విషయం బహుశా ఈ తెలుగు సమాజంలో మరెవ్వరికీ తెలియని వాస్తవం.

  మృణాళిని గారూ, మీ సోదరుడు, మా బాలగోపాల్ గారి గురించి తెలియని అపూర్వ కోణం గురించి తొలిసారిగా తెలియ జేశారు. అందుకు మీకు కృతజ్ఞతాభివందనలు. మీరు చందమామ బేతాళ కథలను రేడియో నాటకంగా మల్చటం, మీ మిత్రుల సహకారంతో అవి అద్వితీయ విజయం సాధించడం. మూడు కేంద్రస్థాయి పోటీలలోనూ మీ బేతాళ కథలు నాటకానికి బహుమతి రావటం. నిజంగా అద్భుతం. ఈ కోణంలో మీ గురించి మాకు సూచనప్రాయంగా గతంలోనే తెలుసు. చందమామకు మీరెంత ఆత్మీయులో మీ జ్ఞాపకాలే తెలుపుతున్నాయి.

  మీరు రూపొందించిన ఆ చందమామ రేడియో నాటక భాగాలను ఇప్పుడు మేం వినడానికి అవకాశం ఉందా. వీలైతే ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో కూడా వాటి ఆడియో పాఠాలను పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. మీరు పూనుకుంటే ఇది సాధ్యమవుతుంది.

  మృణాళిని గారు నా ఇమెయిల్‌కి ఇచ్చిన సమాధానం కింద చూడండి.

  dear Rajasekhargaru

  very happy to receive your response. the Chandamama audio play is actually the property of World space. i will find out if i can use it or permit others to use it. and then get back to you.

  i know that everyone will be surprised to know that Balagopal used to read Chandamama. we have all been great fans of chandamama in my family; and we still remember the Ramayana of chandamama as the best Telugu rendition of Valmiki.

  will be in touch.

  shridevigaru thanks a lot for your initiative.

  regards
  Mrunalini

  మృణాళిని గారికి,

  నమస్తే.
  ముందుగా క్షమించాలి. మీ మెయిల్‌కి రిప్లై ఇవ్వడానికి రెండు వారాలు పట్టింది. 1987 ప్రాంతాల్లోనే కావచ్చు మీ కోమలి గాంధర్వం ఉదయం పత్రికలో సీరియల్‌గా వచ్చేది. సామాజిక వాస్తవికతను పట్టి చూపుతూనే కడుపుబ్బ నవ్వించిన రచన అది.కుటుంబంలోపలి పితృస్వామికతను అత్యంత సున్నితంగా,వ్యంగ్యంగా వ్యక్తీకరించిన తొలి స్త్రీవాద రచన మీదే కావచ్చు.
  అప్పుడే మీ గురించి తెలిసింది. బాలగోపాల్ గారి సోదరిగా మీ గురించి తెలుసు. కాని ఇన్నాళ్లుగా మీతో పరిచయం కాలేదు. ఊహించని కోణం నుంచి అంటే చందమామ జ్ఞాపకాల ద్వారా ఇలా కలుసుకుంటున్నాము.

  “we still remember the Ramayana of chandamama as the best Telugu rendition of Valmiki.”

  చందమామ రామాయణానికి సంబంధించినంతవరకు నాకు తెలిసి ఇది అత్యుత్తమ వ్యాఖ్య. రామాయణ పాత్రలకు మానుష గుణాలు ఆపాదించడంలో, ఎక్కడా దైవత్వానికి ప్రాధానమివ్వని నేర్పుతో పాత్రలను మల్చడంలో కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ, రామాయణం, భారతం రచనల్లో అసాధారణ ప్రతిభ చూపారు.

  పై మీ వ్యాఖ్య చూస్తుంటే చిన్న ఆశ కలుగుతోంది. వాల్మీకి రామాయణానికి ప్రతిరూపంగా చందమామ రామాయణం నిలిచిన వైనాన్ని వీలైతే వివరంగా రాసి పంపగలరా?

  అయితే సమయం మీకు అనుకూలిస్తుందో నాకయితే తెలీదు. కానీ చందమామను చదివిన కుటుంబంలో పాఠకురాలిగా చందమామ రామాయణంపై మీ కథనం వస్తే చాలా బాగుంటుందిని ఆశ. వీలు కుదిరితే ప్రయత్నించగలరు.

  దీనికంటే ముందు బాలగోపాల్ గారి సాహిత్య నేపథ్యం, స్వభావం గురించి మీరు ఇదివరకే ఎక్కడయినా రాశారా లేదంటే.. తెలుగు పాఠకులకు ఇది ఒక అమూల్యపాఠంగా ఉండగలదు. తప్పక మీరు పూనుకుని ఈ అంశంపై రాయండి. తాతయ్య దగ్గరినుంచి ఆయనకు ఎర్పడుతూ వచ్చిన సాహిత్య సంస్కారం, తీవ్రమైన అధ్యయనాసక్తికి నేపథ్యం, జీవితాన్ని పౌర, మానవ హక్కులకు అంకితం చేయడంలో ఆయన చూపిన అసాధారణ నిబద్ధత వంటి అంశాలపై సోదరిగా మీ పరిశీలన సమాజానికి చాలా అవసరం. ఇదివరకు రాసి ఉండకపోతే తప్పక ఇందుకు పూనుకోగలరు. బి.జి. ఇష్టాలు, క్రికెట్ పట్ల ఆసక్తి వంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు రాసే కథనంలో పొందుపర్చగలరు. ఆయన వ్యక్తిత్వంలోని ప్రతి అంశమూ తెలుగు సమాజానికి, పాఠకులకు అవసరమే. బాల్యంనుంచి తను ఏఏ పుస్తకాలను చదువుతూ వచ్చారు. మీకు ఏయే పుస్తకాలు చదవమని రెకమెండ్ చేశారు? ఆయన సాహిత్య ఆసక్తిపై రాళ్లపళ్లి గారి ప్రభావం ఎంత వంటి వివరాలు మీరు ఇదివరకే తెలిపి ఉంటే చెప్పండి. సోదరిగా మీ అభిప్రాయాలు బి.జి వ్యక్తిత్వ వివరణకు సాధికారతను ఇస్తాయని నా అభిప్రాయం…

  మీ చందమామ జ్ఞాపకాలను కాస్త ఆలస్యంగానే ప్రచురించగలము. మీ జ్ఞాపకాలు వచ్చేసరికే నవంబర్ సంచిక వరకు చందమామ కంటెంట్ పూర్తయింది.

  మీ స్పందనకు వేచి చూస్తుంటాను.

  మంచి జ్ఞాపకాలు పంపినందుకు..

  కృతజ్ఞతలతో.
  కె.రాజశేఖర్ రాజు

 2. పల్లా కొండల రావు on March 8, 2012 6:34 AM

  @ కె.రాజశేఖర్ రాజు గారికి ,
  బాల గోపాల్ గారి గురించి తెలుసుకుందామనుకునే సమయం లో ఈ పోస్టు తారసపడింది. పోస్టు చదివి మీరిచ్చిన లింక్ ద్వారా రూపం – సారం పీ.డీ.ఎఫ్ ఫైల్ డౌన్‌ లోడ్ చేసుకున్నాను. ఇంకా చదవలేదు. ఎందుకో ఈ పోస్టులో క్రింది వాక్యాలు ఆకర్షించాయి.

  “పౌర హక్కుల కోసం గొంతెత్తినందుకు రాజ్య వ్యవస్థ అభిశంసనకు గురయ్యాడు. మరోవైపు ప్రజా ఉద్యమాలలో సహించరాని ధోరణులపై గళమెత్తినందుకు సమకాలీన విప్లవోద్యమం అభిశంసనకు కూడా గురయ్యాడు.”
  “సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.”
  బాలగోపాల్ భావజాలంతో మనం ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు, కాని జీవిత పర్యంతమూ పౌర మానవ హక్కుల కోసం పరితపించిన వ్యక్తి సాహిత్యంపై ప్రకటించిన అభిప్రాయాలను మనం చదవడానికి ఇవేవీ అభ్యంతరాలు కాకపోవచ్చు.

 3. chandamama on March 8, 2012 7:13 AM

  కొండలరావు గారికి,
  సరైన సమయంలో మీకు బాలగోపాల్ గారిపై సమాచారం అందించినందుకు సంతోషం. ఈ అరుదైన బ్లాగులో బాలగోపాల్ రచనలు చాలా వరకు పీడీఎఫ్ రూపంలో ఉన్నాయి. వీలయితే వాటిని కూడా డౌన్ లోడ్ చేసుకోండి. అవసరమైతేనే..

  ఈ వెబ్‌సైట్‌లో ఇంతవరకు నేను కాపీ చేసుకున్న రచనల జాబితా ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

  సైన్స్‌ను గురించి రాజకీయంగా ఆలోచించడం నేర్చుకోవాలి
  ‘కొడవటిగంటి కుటుంబరావు సైన్స్ వ్యాసాలు’కు ముందుమాట
  http://balagopal.org/wp-

  content/uploads/2011/06/ScienceVys

  am.pdf

  రూపం-సారం : సాహిత్యంపై బాలగోపాల్
  http://balagopal.org/wp-

  content/uploads/2012/01/5.RUPAM-

  SARAM.pdf

  మా బాలగోపాల్
  http://balagopal.org/wp-

  content/uploads/2012/01/9.%

  20MAA%20BALAGOAPL.pdf

  కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం
  http://balagopal.org/wp-

  content/uploads/2010/05/Kadapa-

  Palegalla-Rajyam.pdf

  వ్యాఖ్యాన బాల వ్యాకరణం
  http://balagopal.org/wp-

  content/uploads/2012/01/2.NIGAH.pdf

  ధన్యవాదాలు.

 4. పల్లా కొండల రావు on March 8, 2012 7:50 AM

  ధన్యవాదాలండీ.అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను.

 5. వేణు on March 10, 2012 11:45 PM

  బాలగోపాల్ పుస్తకాలు ఆన్ లైన్లోనే లభిస్తున్న విషయం ఈ టపా ద్వారానే తెలిసింది. ‘బాల’గోపాల్ చందమామ ప్రియుడన్న సంగతి తెలియటం భలే ఉంది!

 6. chandamama on March 11, 2012 5:31 AM

  వేణుగారూ,
  బాలగోపాల్‌తో చివరివరకు కలిసి నడిచిన సహచరులు ఆయన రచనలను ఈ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచడం కంటే నిజమైన నివాళి మరొకటి ఉండదు. మానవ హక్కుల వేదిక ప్రస్తుత అధ్యక్షులు జీవన్ కుమార్ గారిని ఈ సైట్ ద్వారా నిన్ననే సంప్రదించి అచ్చురూపంలో దొరుకుతున్న బాలగోపాల్ పుస్తకాల సెట్ మొత్తంగా కావాలని అడిగితే రెండు రోజుల తర్వాత పంపిస్తామని చెప్పారు.
  S.Jeevan Kumar, President
  HUMAN RIGHTS FORUM(HRF):rightsforum@gmail.com
  Ph.040-27039519
  Mobile:9848986286
  kumjeevan@gmail.com

  మీలాగే బాలగోపాల్‌పై వెబ్‌సైట్ గురించి ఇంతవరకు నాకు కూడా తెలీదు. మొన్నే ప్రయత్నిస్తే ఇంటర్నెట్‌లో అనుకోకుండా దొరికింది.

  తెలుగు సమాజానికి పౌర, మానవ హక్కుల ప్రాతిపదికన కొత్తచూపును అందించిన ఈ విశిష్టమూర్తి రచనలు అందరికీ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచి ఆయన సహచరులు చాలా మంచి పనిచేశారు.

  గత రెండు రోజులుగా మళ్లీ ఆయన రచనలు అన్నీ వరుసగా ఈ వెబ్‌సైట్‌నుంచి చూస్తూ చదువుతున్నాను.

  ఇంతవరకు ఈ సైట్ నుంచి నేను డౌన్‌లోడ్ చేసుకున్న ఆయన రచనల పీడీఎఫ్ లింకులు ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

  బాలగోపాల్ రచనల ఆన్‌లైన్ లింక్‌లు

  ప్రాచీన భారతదేశ చరిత్ర (డిడి కొశాంబి మూలరచనకు పరిచయం)
  http://balagopal.org/wp-content/uploads/2012/01/3.MATA%20TATHVAMPAI%20BALAGOPAL.pdf

  రూపం – సారం సాహిత్యంపై బాలగోపాల్
  http://balagopal.org/wp-content/uploads/2012/01/5.RUPAM-SARAM.pdf

  దళిత
  http://balagopal.org/wp-content/uploads/2012/01/6.DALITA.pdf

  చీకటికోణాలు
  http://balagopal.org/wp-content/uploads/2010/05/chikatikonalu.pdf

  ప్రజాతంత్ర ప్రత్యేక సంచిక
  http://balagopal.org/wp-content/uploads/2009/10/balagopal-special-weekly-oct-18-24-part1.pdf

  రాజ్యం – సంక్షేమం
  http://balagopal.org/wp-content/uploads/2012/01/1.RAJYAM-SANKSHEMAM.pdf

  బాలగోపాల్ పుస్తకాలు
  http://balagopal.org/wp-content/uploads/2012/01/NAMASTE-TELANGANA1.pdf

  మా బాలగోపాల్
  http://balagopal.org/wp-content/uploads/2012/01/9.%20MAA%20BALAGOAPL.pdf

  మతతత్వంపై బాలగోపాల్
  http://balagopal.org/wp-content/uploads/2012/01/3.MATA%20TATHVAMPAI%20BALAGOPAL.pdf

  హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పథం
  http://balagopal.org/wp-content/uploads/2011/11/hakkula-udyamam-1-2-parts-11.pdf

  హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పథం
  http://balagopal.org/wp-content/uploads/2011/11/hakkula-udyamam-3-part.pdf

  సైన్స్‌ను గురించి రాజకీయంగా ఆలోచించడం నేర్చుకోవాలి
  ‘కొడవటిగంటి కుటుంబరావు సైన్స్ వ్యాసాలు’కు ముందుమాట
  http://balagopal.orgwp-contentuploads201106ScienceVysam.pdf

  కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం
  http://balagopal.orgwp-contentuploads201005Kadapa-Palegalla-Rajyam.pdf

  వ్యాఖ్యాన బాల వ్యాకరణం
  http://balagopal.orgwp-contentuploads2012012.NIGAH.pdf

  నిగాహ్ (1998-2003)
  http://balagopal.org/wp-content/uploads/2012/01/2.NIGAH.pdf

  హక్కుల పెద్దబాలశిక్ష
  http://balagopal.org/wp-content/uploads/2011/05/INDIA-TODAY.pdf

  అలాగే బాలగోపాల్ ఆకస్మిక మరణంపై 2009లో కల్పనా రెంటాల గారి స్పందనకూడా కింది లింకులో చూడండి.

  సారీ వసంతా!
  http://kalpanarentala.wordpress.com/2009/10/09/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B5%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE/

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind