ఆన్‌లైన్‌లో వందలాది ఉచిత పుస్తకాలు

February 22nd, 2012

సంవత్సరాల తరబడి ప్రయత్నించినా దొరకని పుస్తకాలు మన కళ్ళ ఎదుట ఆన్‌లైన్‌లో కనబడి మిరిమిట్లు గొలిపితే…. సైన్స్, ప్రయోగాలు, ఆవిష్కరణలు, శాస్త్రవేత్తలు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, వివిధ శాస్త్రాలు వంటి మానవ విజ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకమూ కాంతులీనుతూ ఒకేచోట మన తెరపై దర్శనమిస్తే…

మాటలకందని మధుర భావన మనస్సును ఆవహిస్తుంది. చరిత్రకు సంబంధించి రెఫరెన్స్ కోసం ఈరోజు ఆన్‌లైన్‌లో శోధిస్తుంటే అనుకోకుండా ఒక లింకు కనబడి దిగ్భ్రమలో ముంచెత్తింది.

వివిధ రంగాలకు సంబంధించిన కొన్ని వందల పుస్తకాలను ఒక మహత్తర వెబ్ సైట్ ఉచితంగా, డౌన్‌లోడ్‌కు అవకాశం ఇస్తూ కనిపించింది. రెండేళ్ల క్రితమే దీన్ని చూసినప్పటికీ ఇవ్వాళ మళ్లీ కొత్తగా చూసినట్లనిపించింది.

రెగ్యులర్‌గా పుస్తకాలను ఆన్‌లైన్‌కి ఎక్కిస్తూ, చదవడానికి ఓపిక, శక్తి, అవసరం కూడా ఉన్న జాతి జనులకు అమృత భాండాన్ని అందిస్తున్న ఈ వెబ్‌సైట్ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులు, రచయిత శ్రీ అరవింద గుప్తా గారి నిర్వహణలో సాగుతోంది.

http://www.arvindguptatoys.com/

“A Million Books for a Billion People”

అనే సూక్తితో మొదలవుతున్న ఈ వెబ్‌సైట్ నిజంగానే వేల కొద్దీ పుస్తకాలను పాఠకులకు ఉచితంగా అందివ్వడానికి కంకణం కట్టుకుంది.

భారతీయ శాస్త్రజ్ఞులు, జీవ, భౌతిక, రసాయన, గణిత, ఖగోళ శాస్త్రాలు, పాపులర్ సైన్స్, విద్య. ఇజాక్ అసిమోవ్ సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచనలు, పిల్లల పుస్తకాలు, పర్యావరణం, శాంతి, సైన్స్ యాక్టివిటీస్, రష్యన్ ప్రామాణిక సైన్స్ పుస్తకాలు, అవార్డ్  విన్నింగ్ బుక్స్, ప్రేరణ కలిగించే పుస్తకాలు, సైన్స్, కామిక్స్, పిక్చర్ పుస్తకాలు, సామాజిక శాస్త్రాలు, ప్రపంచ ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఛరిత్రకారుడు డీడీ కొశాంబి సంపూర్ణ రచనలు.. ఇంకా ఎన్నిపేర్లతో కావాలంటే అన్ని పేర్లతో కూడిన అతి వైవిధ్యపూరితమైన పుస్తకాలను ఈ వెబ్‌ సైట్  ప్రపంచానికి అందిస్తోంది.

అత్యంత సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనువుగా ఉంటున్న ఈ సైట్ పుస్తక దాహం కలవారికి, పుస్తక ప్రేమికులకు నిజమైన పెన్నిధి లాంటిది. ఇంగ్లీష్, హిందీ, మరాటి, పంజాబీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి వివిధ భారతీయ భాషల్లో పుస్తకాలను వెలువరిస్తున్న ఈ సైట్ ప్రధానంగా ఆంగ్ల, హిందీ పుస్తకాలను ఎక్కువగా ప్రచురిస్తోంది.

తెలుగులో జనవిజ్ఞాన వేదిక ప్రచురించిన సంచలనాత్మకమైన పాపులర్ సైన్స్ పుస్తకాలను 40కి పైగా ఈసైట్‌లో మీరు చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

చరిత్రపై సమాచారం కోసం డిడి కోశాంబి రచనలను వెతుకుతుంటే ఈ సైట్ లింకు కనిపించింది. ఇంకేం.. అమాంతంగా కొశాంబి రచనలన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతే ఈ సైట్ గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే అధికంగా పుస్తకాలు కనిపిస్తున్న ఈ వెబ్‌సైట్ క్రమంగా భారతీయ భాషల పుస్తకాలను కూడా వీలైనంత ఎక్కువగా డౌన్‌‍లోడ్ కోసం అందివ్వగలదని ఆశిద్దాము.

పదుల సంఖ్యలో సైన్స్ ప్రయోగాలను నిమిషం నుంచి 4 నిమిషాల దాకా వీడియో రూపంలోకూడా ఉచితంగా అందించడం ఈ సైట్ ఘనత. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, మలయాళం, తెలుగు, బంగ్లా, తమిళం, కన్నడ, ఒరియా భాషలతో పాటు ఉబ్జెక్, తజిక్, రష్యన్, జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, కొరియన్ భాషల్లో కూడా సైన్స్ లఘు చిత్రాలను వీరు అందిస్తున్నారు.
www.arvindguptatoys.com/films.html

పిల్లలకు సైన్స్ గురించి సులభంగా బోధించడానికి, వందలాది బొమ్మలను కూడా ఈసైట్‌లో పొందుపర్చారు.
http://www.arvindguptatoys.com/toys.html

అరవింద్ గుప్తాగారు  కొంత కాలం క్రితం వరకు చందమామ పత్రిక కోసం ‘యురేకా’ పేరిట సైన్స్ ప్రయోగాలకు చెందిన ఒక పేజీ కథనాలను పంపించేవారు. ఆయన విశ్వరూపం ఈ సైట్‌లో మనందరికీ కనబడుతుంది.

ఇన్ని వందల పుస్తకాలను ఒకేచోట చేర్చి పుస్తక ప్రియులకోసం  ఉచితంగా అందిస్తున్న మాన్యులకు శతసహస్రాభివందనాలు.

అంకితభావంతో భారతీయ పిల్లలకు, పెద్దలకు కూడా విజ్ఞాన శాస్త్ర గ్రంధాలను, చిత్రాలను, అందిస్తున్న ఈ సైట్ కేవలం నలుగురితో కూడిన టీమ్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

Dr. Vidula Mhaiskar
Ashok Rupner
Arvind Gupta
Monil Dalal  (Photos)
ఆసక్తి కలిగిన వారందరూ ఈ వెబ్‌సైట్ ను ఒకసారి చూడగలరు. ఒకసారి లింక్ తెరిచి వెళితే ఇక వదలరని గ్యారంటీ.

http://www.arvindguptatoys.com/

“A Million Books for a Billion People”

ఈ వెబ్‌సైట్ అందిస్తున్న తెలుగు సైన్స్ పుస్తకాల వివరాలు కింద చూడగలరు. వీటన్నిటినీ  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Books in Telugu:

LITTLE SCIENCE – TELUGU ARVIND GUPTA (1.6 Mb pdf) SCIENCE ACTIVITY BOOK
STRING GAMES – TELUGU ARVIND GUPTA (4 Mb pdf) FUN WITH A STRING
MATCHSTICK MODELS & OTHER SCIENCE EXPERIMENTS – TELUGU ARVIND GUPTA
LEARNING ALL THE TIME (TELUGU) – JOHN HOLT (900 Kb ZIP) Translation V. S. Chakravarthy
BOOK OF BIRDS-ONE – TELUGU VIDYA & RAJARAM SHARMA (3.8 Mb pdf) SURESH K.
BOOK OF BIRDS-TWO – TELUGU VIDYA & RAJARAM SHARMA (3.8 Mb pdf) SURESH K.
BOOK OF BIRDS-THREE – TELUGU VIDYA & RAJARAM SHARMA (3.8 Mb pdf) SURESH K.
BOOK OF BIRDS-FOUR – TELUGU VIDYA & RAJARAM SHARMA (3.8 Mb pdf) SURESH K.
BOOK OF BIRDS-FIVE – TELUGU VIDYA & RAJARAM SHARMA (3.8 Mb pdf) SURESH K.
STORY OF PHYSICS – TELUGU T. Padmanabhan (1 Mb pdf) V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT BLACK HOLES – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT DINOSAURS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT SOLAR POWER – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT GERMS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND THE EARTH IS ROUND – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT OUTER SPACE – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT THE DEEP SEA – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT COMETS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUR HUMAN ROOTS-TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT LIFE’S BEGINNINGS-TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT NEPTUNE – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND PHOTOSYNTHESIS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT PLUTO – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT SUPER CONDUCTIVITY-TELUGU I. Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT VITAMINS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT OUR BRAIN – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT LASERS – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT VOLCANOES – TELUGU Isaac Asimov V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT OUR ATOMS – TELUGU Isaac Asimov P. Paidanna
CHEMICAL HISTORY OF A CANDLE – TELUGU MICHAEL FARADAY V. S. Chakravarthy
HOW DID WE FIND OUT ABOUT OUR ELECTRICITY – TELUGU Isaac Asimov P. Paidanna
HOW DID WE FIND OUT ABOUT OUR SUNSHINE – TELUGU Isaac Asimov P. Paidanna
ADDICTED TO WAR – TELUGU J. ANDREAS (8 Mb pdf) AMAZING ANTI-WAR BOOK
EARTH PLAY – TELUGU V. S. Chakravarthy (0.1 Mb pdf)
THE PARROT’S TRAINING – TELUGU RABINDRANATH TAGORE (0.4 Mb pdf)
NEELBAGH – TELUGU DAVID HORSBURGH (1.2 Mb pdf)
SCHOOL OF JOY – TELUGU ARVIND GUPTA (0.8 Mb pdf)
GLEAM IN THE EYE – TELUGU ARVIND GUPTA (0.9 Mb pdf)
MY MAGICAL SCHOOL – TELUGU DR. ABHAY BANG (0.5 Mb pdf)
THE BEST SCHOOL – TELUGU JOHN HOLT (0.9 Mb pdf)
HOW THE LITTLE HORSE CROSSED THE RIVER – TELUGU CHINESE BOOK
RAJA NANGA – TELUGU KAMALA BAKAYA (1.0 Mb pdf) DELIGHTFUL
KYRIL’S CAPERS – TELUGU Y. CHEREPANOV (0.9 Mb pdf) DELIGHTFUL

తెలుగు పుస్తకాలు చూడాలంటే

http://www.arvindguptatoys.com/ లోని combinations అనే విభాగాన్ని నొక్కండి. ఇది హోమ్ పేజీలో

Books – English Hindi MarathiCombinations

లో ఉంటుంది. దీంట్లోనే ఇతర భారతీయ భాషల పుస్తకాలు కూడా చూడవచ్చు.

గమనిక

విజ్ఞానాన్ని షేర్ చేస్తున్న ఇలాంటి ఉత్కృష్టమైన వెబ్‌సైట్లు మీ దృష్టిలో ఇంకా ఏవయినా ఉన్నట్లయితే మీ మిత్రులకు, తెలిసినవారికి, బ్లాగర్లకు తెలియచేస్తూ మీ వంతు సహాయం అందరికీ అందించగలరు. ప్రాజెక్ట్ గ్యుటెన్‌బర్గ్ వంటి వెబ్ సైట్లలో కొన్ని వందలూ, వేలూ కాదు కొన్ని లక్షల పుస్తకాలు డౌన్‌లోడింగ్‌కు అనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచురిస్తున్న ప్రతి టపాను, ప్రతి పేజీని ఇమేజ్ గా మార్చి, కాపీ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్న వెబ్‌సైట్లు అన్ని భాషల్లోనూ మన ముందు కొనసాగుతున్న కాలంలో ఫ్రీ సాఫ్ట్‌వేర్ లాగా , ఫ్రీ బుక్స్‌ను కూడా ఉద్యమరూపంలో అందిస్తున్న ఈ తరహా వెబ్ సైట్లను తెలిసిన పది మందికీ పరిచయం చేయండి. జ్ఞానాన్ని దాచిపెట్టడం, అందకుండా చేయడం, శతాబ్దాలుగా మానవజాతి పోగుచేసిన విజ్ఞాన వారసత్వాన్ని గంపగుత్తగా ముడ్డికింద దాచుకుని లాభార్జనకు ఉపయోగించే నికృష్ట పోటీ వ్యవస్థలో సమాజానికి నిజంగా సేవలిందించేవి ఇలాంటి అపురూప సైట్లే అని గుర్తిస్తే ఇలాంటివాటికి ప్రచారం కల్పించవలసిన అవసరం అర్థమవుతుంది.

మీకు వ్యక్తిగతంగా తెలిసిన వారందరికీ ఇలాంటి అమూల్య సమాచారాన్ని తప్పకుండా పంచుతారని ఆశిస్తూ..

ఈ వెబ్‌సైట్‌లో పుస్తకాలు మీకు ఉపయోగపడితే, మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నట్లయితే ఈ అవకాశాన్ని మీకు ఉచితంగా అందించిన అరవింద్‌ గుప్తాగారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక ఇమెయిల్ పంపండి చాలు.

arvindtoys@gmail.com

 

 

 

RTS Perm Link


7 Responses to “ఆన్‌లైన్‌లో వందలాది ఉచిత పుస్తకాలు”

 1. Phaneendra on February 22, 2012 7:08 AM

  thousand thanks are also not enough

 2. chandamama on February 22, 2012 7:28 AM

  సరిగ్గా చెప్పారు ఫణింద్ర గారూ

 3. Phaneendra on February 22, 2012 7:53 AM

  even thousand thanks are no match for the info. kudos to aravind. have started downloading.

 4. chandamama on February 22, 2012 9:42 AM

  మిత్రులందరికీ,
  ఆన్‌లైన్ ప్రసాదిస్తున్న అద్భుతాలలో ఒకటి మీ ముందుంది. ఇప్పటికే 3 వందల మంది ఈ టపాను చూస్తూ నచ్చిన పుస్తకాలను డౌన్‌లోడ్ చేస్తున్నట్లుంది. మీకూ ఒక అభ్యర్థన.

  విజ్ఞానాన్ని షేర్ చేస్తున్న ఇలాంటి ఉత్కృష్టమైన వెబ్‌సైట్లు మీ దృష్టిలో ఇంకా ఏవయినా ఉన్నట్లయితే మీ మిత్రులకు, తెలిసినవారికి, బ్లాగర్లకు తెలియచేస్తూ మీ వంతు సహాయం అందరికీ అందించగలరు. ప్రాజెక్ట్ గ్యుటెన్‌బర్గ్ వంటి వెబ్ సైట్లలో కొన్ని వందలూ, వేలూ కాదు కొన్ని లక్షల పుస్తకాలు డౌన్‌లోడింగ్‌కు అనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచురిస్తున్న ప్రతి టపాను, ప్రతి పేజీని ఇమేజ్ గా మార్చి, కాపీ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్న వెబ్‌సైట్లు అన్ని భాషల్లోనూ మన ముందు కొనసాగుతున్న కాలంలో ఫ్రీ సాఫ్ట్‌వేర్ లాగా , ఫ్రీ బుక్స్‌ను కూడా ఉద్యమరూపంలో అందిస్తున్న ఈ తరహా వెబ్ సైట్లను తెలిసిన పది మందికీ పరిచయం చేయండి. జ్ఞానాన్ని దాచిపెట్టడం, అందకుండా చేయడం, శతాబ్దాలుగా మానవజాతి పోగుచేసిన విజ్ఞాన వారసత్వాన్ని గంపగుత్తగా ముడ్డికింద దాచుకుని లాభార్జనకు ఉపయోగించే నికృష్ట పోటీ వ్యవస్థలో సమాజానికి నిజంగా సేవలిందించేవి ఇలాంటి అపురూప సైట్లే అని గుర్తిస్తే ఇలాంటివాటికి ప్రచారం కల్పించవలసిన అవసరం అర్థమవుతుంది.

  మీకు వ్యక్తిగతంగా తెలిసిన, తెలుస్తున్న ఇలాంటి అమూల్య సమాచారాన్ని అందరికీ పంచుతారని ఆశిస్తూ..

 5. లలిత (తెలుగు4కిడ్స్) on February 22, 2012 8:15 PM

  రాజు గారూ,
  అరవింద్ గుప్తా గారి వెబ్ సైట్ గురించ్ ఇతెలిసి కూడా పట్టించుకోలేదు ఇన్నాళ్ళూ.
  ఇప్పుడు ఈ టపా పుణ్యమా అని అక్కడ ఇన్ని పుస్తకాలు ఉన్నట్టు తెలిసింది.
  ఈ రోజు పొద్దుట్నుంచీ ఒకటొకటే ఆ పుస్తకాలు తిరగేస్తున్నాను.
  ఆశ్చర్యం ఏంటంటే నేను ముందు చదవడానికి ఎన్నుకున్నది తెలుగు పుస్తకాలే.
  సైన్స్ విషయాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న నాకు ఇంగ్లీషులో చదవాలనిపిస్తుంది అనుకున్నాను సహజంగా. కానీ తెలుగు పుస్తకాల వైపు అప్రయత్నంగా వెళ్ళాను. తెలుగులో చదువుతుంటే ఆ అనువాదకుల కృషిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అనువాదంలా కాక నేరుగా తెలుగులో చదివినట్టే ఉన్నాయి ఇప్పటి వరకూ నేను చదివిన కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా పాతవి. కొత్త అనువాదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి.
  చాలా మంచి విషయం తెలియజేశారు. Thanks.

 6. chandamama on February 22, 2012 11:36 PM

  లలితగారూ,
  మీకు ఇంతకు ముందే ఈ సైట్ గురించి తెలిపాననుకున్నాను. గతంలోనే నేను డౌన్ లోడ్ చేసిన తెలుగు సైన్స్ పుస్తకాలు కొందరు మిత్రులకు జీమెయిల్ ద్వారా పంపాను కూడా. మీకు పంపడం ఎలా మిస్సయిందో తెలియడం లేదు. ఈ మధ్య మనం చేసిన సైన్స్ పుస్తకం అనువాదం కోసం కూడా వీరు ప్రచురించిన పరమాణువులు వంటి పుస్తకాల సహాయం తీసుకున్నాను.

  తెలుగులో సైన్స్ పుస్తకాలు అంటే నండూరి రామ్మోహనరావు, మహీధర నళినీమోహన్ గార్లు వంటి వారి రచనలను సాధికారికంగానే తీసుకోవచ్చు కదా. ఈమధ్య కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు వీక్షణం, ప్రజాసాహితి, స్వేచ్చాసాహితి ప్రచురణల కింద జీవశాస్త్రం, మానన వరిణామం, జీవకణాలు వంటి అయిదారు రచనలు ప్రచురించిన విషయం మీకు తెలిసిందే. సైన్స్‌ను సామాజిక విశ్లేషణతో ముడిపెట్టి ప్రసాద్ గారు చేస్తున్న ప్రయత్నం సంచలన విజయం సాధించినట్లు తెలుస్తోంది.

  ఇకపోతే చెన్నయ్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీనివాస చక్రవర్తిగారు తదితర మిత్రులు ప్రారంభించిన శాస్త్రవిజ్ఞానము బ్లాగు మీరు చూసే ఉంటారు. తెలుగుతో మొదలుపెట్టి అన్ని భారతీయభాషల్లోనూ సైన్స్ రచనలను ఒకే చోట ప్రచురిస్తున్న ఈ బ్లాగు సైన్స్ రచనలలో తాజా సంచలనం.
  http://scienceintelugu.blogspot.in/

  మనలో చాలామందికి తెలియకుండానే మన కళ్ళముందు మంచి మార్పులు జరుగుతూనే ఉన్నాయి.

  అరవింద గుప్తా గారి వెబ్‌సైట్‌లో చార్లెస్ డార్విన్ స్వీయ జీవిత చరిత్ర కూడా ఉంది. వేల సంవత్సరాల మానవ చింతనను మలుపు తిప్పిన ఈ పరిణామవాది జీవిత చరిత్ర గురించి మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి.

  అలాగే అరవింద్ గారికి ఈమెయిల్ పంపడం మర్చిపోవద్దు.
  స్పందనకు ధన్యవాదాలు.

 7. Anonymous on February 23, 2012 7:16 AM

  Really nice to see such sites.
  Thanks very much for this.
  Raja

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind