పాత చందమామలు కావాలా?
ఛందమామ పాఠకులకు, అబిమానులకు పండగలాంటి వార్త. మీ వద్ద ఉన్న అదనపు చందమామ సంచికలను మార్పిడి చేసుకోగలిగితే ఒక మంచి అవకాశం శ్రీ లక్ష్మీనారాయణ గారి రూపంలో మనందరికీ లభించనుంది. బెంగుళూరులో ఉంటున్న వీరి వద్ద దాదాపు వంద చందమామ పుస్తకాల అదనపు కాపీలు ఉన్నాయట. 1980ల నుండి 2011 వరకు గల చందమామల్లో కొన్ని ప్రతులు తన వద్ద లేవని, తను పంపుతున్న జాబితాలోని చందమామలు ఎవరివద్దయినా అదనంగా ఉంటే మార్పిడి చేసుకోగలనని వీరు చెబుతున్నారు.
మార్పిడి సాధ్యం కాకపోతే పైన చెప్పిన కాలంలోని చందమామలు ఎవరివద్దయినా ఉంటే నగదు రూపంలో చెల్లించి కూడా తీసుకోగలని చెప్పారు. ఈయన మొబైల్ తదితర వివరాలను ఈ టపా చివరలో ఇస్తున్నాము. చందమామలను ఇలా పరస్పరం పంచుకోవాలని అనుకుంటున్న చందమామ అభిమానులు, పాఠకులు వీరిని నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు. కింది చందమామ సీరియల్స్ బౌండ్ కాపీలు కూడా అదనంగా వీరి వద్ద ఉన్నాయి.
జ్వాలాద్వీపం
రాకాసిలోయ
వీటినికూడా అవసరమైన వారికి తాను అందచేయగలనని వీరు చెబుతున్నారు.
ఆలాగే బెంగుళూరులో ఉంటూ దాదాపు 20 సంవత్సరాల కన్నడ చందమామలను వీరు సేకరించారట. ప్రస్తుతం అవి తనకు అవసరం లేదని, ఎవరయినా కన్నడ చందమామ అభిమానులు కావాలన్నట్లయితే వాటిని ఇస్తానని చెప్పారు. ఇవి 1960 నుంచి 1970 వరకు ఉన్న చందమామ కాపీలట. వీటిని ఆసక్తి కలిగిన కన్నడ చందమామ పాఠకులకు ఉచితంగా కూడా ఇస్తానని వీరు చెబుతున్నారు.
లక్ష్మీనారాయణ గారి గురించిన మరిన్ని వివరాలు
చందమామ అన్నా, చందమామ కథలూ, సీరియల్స్ అన్నా ప్రాణమిచ్చే మరో ప్రముఖులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, చందమామ వీరాభిమానుల్లో వీరాభిమానిగా తమను తాము వర్ణించుకునే వీరు గత వారం ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు. రెండేళ్ల క్రితం బెంగళూరులో శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి ఇంట్లో వారితో కలిసే అవకాశం తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఆయనే తమంతట తాముగా ఫోన్ పలకరింపుతో దగ్గరయ్యారు. 1991ల మొదట్లో తిరుపతి ఎస్వీయూనివర్శిటీలో బీకాం పూర్తి చేసిన వీరు బెంగుళూరులో సిఎ కోర్సును పూర్తి చేసి అక్కడే స్థిరపడ్డారు.
ప్రస్తుతం జపాన్‌కి చెందిన ఎంఎన్‌సి కంపెనీలో అత్యున్నత స్థాయిలో ఉన్న వీరు తమ మూలాలను మర్చిపోలేదు. చందమామ చిరస్మరణీయ జ్ఞాపకాలను, తెలుగు సాహిత్య అధ్యయనాన్ని కూడా మర్చిపోలేదు. చదివే అలవాటును విపరీతంగా పెంచి పోషించిన యద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి గార్లు మాదిరెడ్డి సులోచన గారు వంటి నవలా ప్రపంచాన్ని ఏలిన రచయిత్రుల రచనలను కూడా మరవలేదు. మహిళల ప్రాభవంతో వెలిగిపోతున్న తెలుగు నవలల పంధాను ఒక్కరాత్రితో మార్చివేసిన యండమూరి గారి శకం గురించి వీరు చెబుతుంటే అలా వింటూండిపోవలసిందే.
తన వద్ద యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు, రచనలు మొత్తం సేకరణ ఉందని, ఎవరికయినా ఆసక్తి ఉంటే వాటిని ఇస్తానని వీరు చెప్పారు. చందమామలు అయినా ఇతర సాహిత్య రచనలు అయినా నిజంగా ఆసక్తి ఉన్నవారికే ఇవ్వాలనేది వీరి ఉద్దేశం. కొన్నాళ్లు ఉంచుకుని మళ్లీ వాటిని వదిలేసుకునేవారికి ఇవ్వకూడదని ఈయన అభిప్రాయం.
ఇంతవరకు చందమామ పిపాసిగా, నాలుగైదు వేల వరకు తెలుగు,ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలను కొని సేకరించి పెట్టుకున్న సీరియస్ చదువరిగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన లక్ష్మీనారాయణ గారు తన పఠనాన్ని, తన అభిరుచిని పాఠకులతో పంచుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా చందమామ తరవాత ఆయనకు విశేషంగా ఆకర్షించిన పుస్తకం బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది”. తెలుగు సాహిత్యంలోని అతి గొప్ప నవలల్లో ఒకటిగా పేరొందిన ఈ పుస్తకంలోని అమృత స్త్రీ పాత్ర అంటే ఈయనకు ప్రాణం. ఈ పాత్ర వ్యక్తిత్వం తన జీవితానికి, జీవితానుభవాలకు చాలా దగ్గరగా ఉందని ఆయన రమ్యంగా చెబుతారు.
ఇంతవరకు వీరు రచనా వ్యాసంగం లోకి దిగలేదు. ఒక ప్రపంచ స్థాయి జపనీస్ సంస్థ ఆర్థిక, ఎక్కౌంట్ విభాగాధిపతిగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ, ఫోన్ చేయడానికి కూడా వీలుపడనంత పనిభారంతో ఉంటానని చెప్పుకునే వీరు చందమామ అంటే ఇక లోకం మర్చిపోతారు. గత వారం రోజులుగా రెండు మూడు సార్లు ఆయనే కాల్ చేసి తన విశేష పఠనానుభవాన్ని అలా చెప్పుకుంటూ పోయారు.
కాస్త సమయం కేటాయించుకుని రెండురోజులు కష్టపడి తెలుగు టైప్ నేర్చుకుంటే మీరు బ్లాగ్ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించగలరని, తప్పక ప్రయత్నించమని వారిని కోరాను. ‘చివరకు మిగిలేది’ నవలలోని అమృత పాత్రతో తన అనుబంధాన్ని వివరిస్తూ ఏదైనా రాయాలని ఉందని వారన్నప్పుడు, చేతిరాతతో రాసి మీరు పంపితే తప్పక అంతర్జాలంలో ప్రచురించవచ్చని చెప్పాను. జీవితంలో తొలిసారిగా రచనకు పూనుకుంటున్న ఆయన వారంలోపు రాసి పంపుతానని మాట ఇచ్చారు కూడా.
ఇక చందమామ విషయానికి వస్తే పాత సీరియల్స్ ఒక్కటి కూడా వదలకుండా మళ్లీ ప్రచురించవలసిందిగా కోరతారీయన. మహాభారతం, రామాయణం వంటి సీరియల్స్ లేకుండా చందమామ నడవటం ఇదే మొదటి సారి అని విచారించారు. ఇప్పుడు వస్తున్న శిథిలాలయం, పంచతంత్ర సీరియల్స్‌లో ఒకటి ముగియగానే తప్పకుండా మహాభారతం మళ్లీ ప్రచురించాలని అనుకుంటున్నట్లు వారికి తెలియజేయడమైనది. యాజమాన్యం మారినా సరే మాణిక్యాల్లాంటి పాత కథలు, సీరియల్స్ పాఠకులకు అందించాలన్నా చందమామ మనగలగాలని వీరు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. చందమామలో ఇపుడున్నట్లుగా కాకుండా మూడు సీరియల్స్ -పౌరాణికం, జానపదం, ఇతర సీరియల్స్- ఏకకాలంలో ప్రచురించవచ్చని వీరి అభిప్రాయం.
చందమామ జ్ఞాపకాలు కూడా వీలైనంత త్వరగా వీరు రాసి పంపాలని మా ఆశ, ఆకాంక్ష కూడా.
చందమామ జ్ఞాపకాలను మరచిపోని వీరు చందమామ సీరియల్స్ రూపకర్త దాసరి సుబ్రహ్మణ్యం గారి ఇతర సీరియల్స్ ప్రచురణలో తమవంతుగా తప్పక సహాయపడతానని చెబుతున్నారు.
లక్ష్మీనారాయణ గారూ!
మీ ఔదార్యం లేదా బాధ్యత కలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. దాసరి గారి పుస్తకాల ప్రచురణ ఖర్చు తిరిగి వస్తే మరిన్ని మంచి పుస్తకాలు వేయడానికి అవకాశం ఉంటుందని ‘రచన’ పత్రిక శాయిగారు రెండేళ్ల క్రితం చెప్పిన విషయం గుర్తుకొస్తోంది. ఇలాంటి మంచి పనులకు మీరు అందించే తోడ్పాటు ఉత్తమ సాహిత్యానికి ఊపిరి పోస్తుందని విశ్వసిస్తున్నాము. రచన శాయిగారితో మీరు తప్పక సంప్రదించగలరు.
వీరికి కావలసిన పాత చందమామల జాబితా
లక్ష్మీనారాయణ గారు కోరుకుంటున్న చందమామ పాత పుస్తకాల జాబితా ఇక్కడ చూడవచ్చు. ఎవరయినా కింది సంవత్సరాలలోని అదనపు కాపీలు కలిగి ఉన్నట్లయితే మార్పిడి రూపంలో లేదా నగదుకు కూడా మీ వద్ద ఉన్న చందమామలను వారితో పంచుకోవచ్చు.
I need below Chandamama back issues
Year Month
1980 August
1982 October
1983 December
1984
January
February
March
April
May
June
July
August
September
October
November
December
1985 May
1988 December
1990
July
August
September
October
November
December
1991 July
1992 July
1993
January
February
March
April
May
June
1994
April
June
July
August
September
October
November
December
2000
April
August
September
October
November
December
2001
January
February
April
May
June
2002
June
September
October
2011
May, July
కింది చందమామ సీరియల్స్ బౌండ్ కాపీలు అదనంగా వీరి వద్ద ఉన్నాయి.
జ్వాలాద్వీపం
రాకాసిలోయ
పుస్తక మార్పిడి ప్రాతిపదికన వీరు తమ వద్ద ఉన్న కింది అదనపు కాపీలను మార్పిడి చేసుకుంటారట.
వీరివద్ద ఉన్న పాత చందమామల జాబితా.
Below Chandamama back issues, I have extra copies. I am ready to spare these for exchanging Chandamama’s which I don’t have.
Year Month
2000 July
2003 July
2004 Dec
2005
January
February
September
October
2006
January
February
May
August
September
October
November
December
2007
January
February
March – 2 copies
May
June
July
August
September
December
2008
January
April
May
August
September
2009
February
May
June
July
August
September
October
November
December
2010
January
May
June
July
August
2011
February
June
August
1964
February
Below Serials I have two copies, which I am ready for Exchange
1. Jwaladweepam
2. Rakasiloya
ఎవరయినా ఆసక్తి కలిగిన పాఠకులు, చందమామ అభిమానులు వీరిని కింద ఇస్తున్న మొబైల్లో కాల్ చేసి నేరుగా వీరిని సంప్రదించగలరు. పని ఒత్తిడిలోఉండి ఈయన కాల్ అందుకోలోక పోతే అపార్థం చేసుకోవద్దని, తర్వాత మళ్లీ కాల్ చేయగలరని అభ్యర్థన.
Lakshmi Narayana
(CA.)
Banglore
mobile: 07760972070
test Filed under పాత చందమామలు | Comments (3)3 Responses to “పాత చందమామలు కావాలా?”
Leave a Reply








నమస్కారం లక్ష్మి నారాయణ గారు,
చందమామ పుస్తకాలని సేకరించాలి అన్న మీ అభిరుచికి నా జోహార్లు. మీ అంత కాకపోయిన నేను కూడా చందమామ అభిమానినే. మీకు తెలియనిది కాదు అనుకోండి , ఇప్పుడు చందమామ పుస్తకాలూ మొత్తం అనగా 1947 నుండి ఇప్పటివరకు అన్ని పుస్తకాలని http://www.chandamama.com లో పొందవచ్చు. నేను కూడా మీలాగే ప్రస్తుత చందమామ లో రామాయణం కాని , మహాభారతం కాని రాక పోడానికి చింతిస్తున్నాను.
కాని మహా భారతాన్ని పైన పేర్కొన్న website ద్వార నేను మొత్తం కథ ని మల్లి చదవగలిగాను. చదవడమే కాదు ప్రతి పేపర్ని sreenshot తీసి ఒక folder గ నాదగ్గర భద్రపరచుకొన్నాను. ఎవరికైనా ఆసక్తి ఉంటె వాటిని mail ద్వార పంపగలను.
you can reach me on my mail rrnreddy@gmail.com
రామాయణం లేదా మహాభారతం మల్లి ప్రచురించడం మొదలు పెడితే మిక్కిలి సంతోషించేవాడిలో నేను ఒకడిని.
If anybody know in Bangalore where we can buy telugu book like navels, biographies etc. Please let me know. If any online purchase website is available please let me know.
Thanks Ravindra,
Do you have any of chandamama back issues with you which you can spare.
Can you drop your mobile no so that I can call you directly.
Kind regards
Which Novels you want to buy.I know few places where you can buy used books.