సంస్కృతి నుంచి వైమానిక శాస్త్రం దాకా…

January 2nd, 2012

‘భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం’ అనే పేరిట మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాస చక్రవర్తిగారు ఇటీవల తమ శాస్త్ర విజ్ఞానము బ్లాగులో ఒక కథనం ప్రచురించారు.

“ఆధునిక విజ్ఞానం గురించి విస్తారంగా చెప్పుకోవడం ఒక విధంగా ప్రాచీన భారత విజ్ఞానాన్ని, అసలు మొత్తం భారతీయ సంస్కృతినే కించపరిచినట్టుగానిర్లక్ష్యం చేసినట్టుగా కొంత మంది భావిస్తూ ఉంటారు. ఆ ధోరణిలో ఎన్నో కామెంట్లు కూడా గతంలో చూశాం. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు స్పష్టీకరించదలచుకున్నాను.

ఆధునిక విజ్ఞానం “పాశ్చాత్య” విజ్ఞానం కాదు. విశ్వజనీన విజ్ఞానం. దాని ఆరంభంలో కొన్ని శతాబ్దాల క్రితం పాశ్చాత్యులు ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చును గాక. గత శతాబ్దాలలో కూడా వారే ఎంతో కృషి చేసి ఉండొచ్చును గాక. కాని ఈ ఇరవయ్యొకటవ శతాబ్దంలో వైజ్ఞానిక ఆవిష్కరణ ఒక అంతర్జాతీయ ప్రయాస అయిపోయింది. తూర్పుకి, పడమరకి చెందిన ఎన్నో దేశాల వారు కలగలిసి విజ్ఞానపు సరిహద్దులను ముందుకు తోస్తున్నారు. కనుక అది పాశ్చాత్య విషయం అనడం అసమంజసం.

ఇది ఇలా ఉండగా అసలు ఆధునిక విజ్ఞానం లోని తత్వం వ్యక్తులకి, జాతులకి, దేశాలకి, సంస్కృతులకి అతీతమైన తత్వం. ఏ దేశం చెప్పినా, ఏ సంస్కృతి నమ్మినా చివరి మాట ప్రకృతిదే, యదార్థానిదే. “మా సంస్కృతి చెప్పింది కనుక ఇది గొప్పది” అనడం వైజ్ఞానిక తత్వానికి పూర్తి వ్యతిరేకం. ఆ చెప్పిన విషయాన్ని యదార్థం సమర్ధిస్తోందా లేదా అన్నదాన్ని మళ్ళీ మళ్లీ పరీక్షించి తేల్చుకున్న తరువాతే దాని గొప్పదనాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది.”

చర్చ కాస్త వివాదాస్పదమయినప్పటికీ, ప్రాచీన విజ్ఞానంపై నుంచి 2,400 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి రచించిన “వైమానిక శాస్త్రం” వరకు చర్చ కొనసాగింది.  భారతీయ వైమానిక శాస్త్రంపై కాస్త అవగాహన కలిగించేందుకు తదుపరి అధ్యయనానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ వ్యాసం లింకును ఇక్కడ ఇవ్వడమైనది.

2,500 సంవత్సరాల క్రితం లేదా అంతకు మునుపు మానవ ఆలోచనల్లో మెదిలిన ‘ఎగరగలగడం’ అనే భావన ఇమేజినేషన్‌ నుంచి బయటపడి వాస్తవరూపం దాల్చిన అమోఘ చరిత్రకు సంబంధించిన సమాచార లింకులు కూడా ఈ వ్యాసం కింది వ్యాఖ్యలలో పొందుపర్చబడినవి.

భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం

http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_04.html

 

భరద్వాజ మహర్షి 2,400 సంవత్సరాల క్రితం రచించిన వైమానిక శాస్త్రం ఆంగ్ల ప్రతి ఆన్‌లైన్‌లో దొరుకుతోంది.

కింది లింకును చూడండి

The Vaimanika Sasthra

http://www.bibliotecapleyades.net/vimanas/vs/default.htm

 

 

RTS Perm Link