అమరశిల్పి జక్కన – మనసే వికసించెరా

November 20th, 2011

ఈరోజు రాత్రి సన్ టీవీ సినిమా క్లబ్‌లో ‘అమరశిల్పి జక్కన’ సినిమా చూస్తున్నాను. ఒక అద్భుత వర్ణ చిత్ర ప్రపంచం కళ్లముందు అలా పరుచుకున్నట్లయింది. ఎంత గొప్ప సంగీతం, ఎంత మంచి పాటలు. ముఖ్యంగా ఈ నల్లని రాలలో వంటి ఈ చిత్రంలోని ప్రసిద్ధ పాటలు అందరికీ తెలుసు కాని ‘మనసే వికసించెరా’ అంటూ బి. సరోజా దేవి ఆడి పాడిన పాట విని చాలా కాలమయింది. వింటూంటే పరవశించిపోయాను.

లవకుశ -1963- తర్వాత తెలుగులో రెండో ఈస్ట్‌మన్ కలర్ చిత్రం అమరశిల్పి జక్కనే -1964- అనుకుంటాను.

ఆద్యంతం ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని, పాటలను వింటూ పిచ్చెత్తి పోత్తున్న నేపథ్యంలో మీకు మెయిల్ చేస్తున్నాను. మీలో ఎవరివద్ద అయినా ఈసినిమా సీడీ లేదా డీవీడీ ఏదయినా ఉందా.. ఉంటే శ్రమ అనుకోకుండా నాకు ఒక కాపీ పంపగలరా..

సాలూరి రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూడాలంటే ఈ సినిమా చూసి తీరాలి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘తాండ్ర పాపారాయుడు’ అనుకుంటాను. ‘అభినందన మందార మాల’ అనే పాట పాతికేళ్లుగా నన్ను వెంటాడుతూ వస్తోంది. సినీ సంగీతంలో లాలిత్యాన్ని శిఖరస్థాయిలో నిలబట్టిన మహనీయుడు కదా..

ఈ పాట కూడా ఆడియో మాత్రమే దొరుకుతోంది. సినిమా కాని, వీడియో పాట కాని లభ్యం కాలేదు. మీ వద్ద ఉంటే చెప్పండి

విజయావారి సినిమాల సెట్, కెవి రెడ్డి గారి సినిమాల సెట్ లాగా సాలూరు రాజేశ్వర రావు గారి  పాటల సెట్ లేదా సినిమాల సెట్ సేకరించుకోవాలన్నది నా చిర కోరిక.

సుశీల గారు పాడిన పాటల్లో ఆమెకు బాగా నచ్చిన పాట ‘పాల కడలిపై శేషతల్పమున శయనించేవా దేవా’ పాటకు కూడా సంగీతం రాజేశ్వరరావుగారిదే అనుకుంటాను.

మణిరత్నం ‘ఘర్షణ’ చిత్రంలో ‘నిను కోరీ వర్ణం’ అనే పాటలో వినిపించే సంగీత జలపాత ఝరి అప్పటినుంచి ఇప్పటి దాకా ఆకట్టుకుంటూనే ఉంది. అది శ్రోతగా నేను పొందిన ఆనందం. కాని ఈ మధ్యే ఒక చానెల్లో సాలూరు వారి గురించి ప్రసారం చేస్తూ ఈ పాట సంగీతానికి ప్రాణం పోసిన ఇళయరాజాను ఆయన అప్పట్లోనే బాగా ప్రశంసించారని విని పొంగిపోయాను. మనం సంగీతజ్ఞులం కాకున్నా ఏది మంచి సంగీతమో గ్రహించే బుద్ది మనకూ ఉందిలే అనే నమ్మకం దీంతో మరింత బలపడింది.

ఈ ఆనందంలో నెట్లో వెతుకుతుంటే ఎస్వీ రామారావు గారు 2006లో రాసి ప్రచురించిన ‘నాటి 101 చిత్రాలు’ పరిచయాన్ని తెవికీలో చూశాను.

నాటి 101 చిత్రాలు

ఈ లింకులో తెలుగు సినిమా ఆణిముత్యాల సమాచారం చూడవచ్చు.

శ్రీనివాస్, శ్యామ్ నారాయణ, విజయవర్ధన్ గార్లకు….

దీంట్లోని 101 చిత్రాలు మీ సినిమాల కలెక్షన్లో ఏమయినా ఉన్నాయా.. చెప్పండి.

ఏంలేదు.. నా వద్ద ఓ టెరాబైట్ హార్డ్ డిస్క్ ఉంది. మీ సంపదలో కొంత కొల్లగొడదామని దురాశ. అంతే..

ఆహా… ఇంకా సినిమా చూస్తూనే ఉన్నాను. అడుగడుగునా మంత్రముగ్ధం చేస్తున్న నేపథ్య సంగీతం..ఎందుకు మనం పాత సినిమాలను చూడాలో, పాత సంగీతాన్ని వినాలో నిరూపిస్తున్న చిత్రం. ఏమి నా భాగ్యం..

మనసే వికసించెరా.. సాలూరి వారికి పాదాభివందనాలు…

పాత సినిమాల భాండాగారాన్ని సేకరిస్తున్న కె. గౌరీశంకర్ గారి మొబైల్ నెంబర్ మీ వద్ద ఉంటే తెలుపగలరు. ఈమధ్య నా మొబైల్ పోవడంతో అందరి ఫోన్ నంబర్లు పోయాయి.

నా కొత్త మొబైల్ నంబర్

7305018409

మీనుంచి మంచి వార్త వస్తుందని ఆశిస్తూ..

కె. రాజశేఖరరాజు
చెన్నయ్

జక్కన్న నిజజీవితం గురించిన వివరాలకు కింది లింకులు చూడండి.

జక్కన్న

అమరశిల్పి జక్కనాచారి

జక్కన చెక్కిన బేలూరు

తెలుగు సినిమా ‘అమరశిల్పి జక్కన’ -1964- గురించిన వివరాలకు కింది లింకు చూడగలరు.

అమరశిల్పి జక్కన

RTS Perm Link


3 Responses to “అమరశిల్పి జక్కన – మనసే వికసించెరా”

 1. Balu on November 21, 2011 2:37 AM

  చందమామ గారు! మీకు కావల్సిన పాటకోసం మీరు ఎంతగా తపన పడుతున్నారో మీ టపా చదివితేనే అర్దమవుతుంది. ఆ పాటలు ‘సరిగమలు..గలగలలు’ బ్లాగరు వద్ద వుండవచ్చు..ప్రయత్నించండి.
  http://raaji-telugusongslyrics.blogspot.com

 2. rajendra on November 21, 2011 7:07 AM

  మనసె వికసించెరా పాట http://www.oldtelugusongs.com లో లభ్యం ఆడియోమాత్రమే
  అమరశిల్పి జక్కన లోని కొన్ని పాటల వీడియోలు ఇక్కడ
  http://www.youtube.com/results?search_query=amarasilpi+jakkanna+full+telugu+movie&oq=amarasil&aq=3&aqi=g5&aql=&gs_sm=c&gs_upl=12774l19117l0l24431l8l8l0l1l1l0l416l1895l0.2.3.1.1l7l0

 3. chandamama on November 21, 2011 8:24 PM

  బాలు రాజేంద్రగార్లకు,
  మీరు పంపిన లింకులు చూశాను. మనసే వికసించెరా ఆడియో పాట ఎంత బాగుంటుందో, వీడియోలో బి సరోజాదేవి నటన, నాట్యం, సంగీతంతో పోటీపడుతూ అత్యద్భుంగా అలరిస్తుంది. తిరుపతికి వెళితే ప్రయత్నంచాలి. సినిమా సీడీ లేదా డీవీడీ దొరికితే మనమే పాటను కట్ చేసుకోవచ్చుకదా.
  బాలుగారూ,
  మీరు పంపిన సరిగమలు గలగలలు బ్లాగు లింక్ చూశాను. కానీ, గత పాతికేళ్ల లోపు వీడియో పాటలే దీంట్లో ఎక్కువగా ఉన్నాయనుకుంటాను. అయినా సరే ఇంత ఓపికగా వందలాది వీడియో పాటల లింకులు ఈ బ్లాగులో ఇచ్చారు. చాలా సంతోషం.

  మీకు కృతజ్ఞతలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind