చందమామలు బ్లాగ్ పునర్దర్శనం

October 21st, 2011

గత నెల 20వ తేదీ తర్వాత చందమామలు బ్లాగు మళ్లీ హఠాత్తుగా మాయమయింది. బ్లాగు.కామ్ -blaagu.com అప్‌డేషన్ జరుగుతున్నందున దీంట్లోని బ్లాగులు కనిపించడం లేదని త్వరలో వీటిని తిరిగి తీసుకువస్తామని నిర్వాహకులు అలర్ట్ చేశారు. నేను గమనించక ముందు కొద్ది రోజులు, గమనించిన  తర్వాత చాలా రోజులు సుషుప్తావస్తలో ఉన్న చందమామలు బ్లాగు సరిగ్గా నెలరోజుల తర్వాత నిన్నటి నుంచి మళ్లీ ఉనికిలోకి వచ్చింది.

నా బ్లాగ్ కనిపించడం లేదని బ్లాగు. కామ్ నిర్వాహకులకు మెయిల్ పెట్టిన తర్వాత వారు ఆలస్యంగా చూసుకున్నట్లున్నారు.  మెయిల్ చూడలేదని రెండు రోజుల్లోనే ఈ లోపాన్ని సరిచేయగలమని వారు చెప్పినట్లు సరిగ్గా రెండు రోజుల్లోపే ఈ బ్లాగు మళ్లీ యాక్టివేట్ అయింది.

నెలరోజులు బ్లాగ్‌తో, బ్లాగర్లతో సంబంధాలు కోల్పోయి తిరిగీ మీముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఇంటిలో సిస్టమ్ ఈ సమయంలోనే మొరాయించి మోడెమ్ పాడవడంతో కొత్తది తీసుకోవడం లేటవుతోంది. గత ఏడేళ్లుగా నిర్విరామంగా, రిపేర్ అన్నదే లేకుండా పనిచేసిన నా సిస్టమ్ కూడా ఈ సమయంలోనే మొరాయించేసింది. వీలైనంత త్వరలో ఈ సమస్యనుంచి బయటపడగలనని అనుకుంటున్నాను. అంతవరకు రెగ్యులర్ బ్లాగ్ అప్‌డేషన్లు బహుశా సాధ్యం కాకపోవచ్చు.

ఈ సాంకేతిక సమస్యలకు తోడు కొన్ని వ్యక్తిగత సమస్యలు – కుటుంబంలో  జ్వరాలు, మొబైల్ పోవడం. పాత నెంబర్ మీదే కొత్త సిమ్ తీసుకుంటే వొడాఫోన్ వారు ఉన్న కాస్తంత ఓపికకు కూడా పరీక్ష పెట్టి విసిగించడం వంటివి- కూడా ఒకేసారి తోడై బాగా ఇబ్బంది పెట్టాయి. నంబర్ పోర్టబిలిటీకోసం ప్రయత్నం జరుగుతోంది.  ఇలా  సినిమా కష్టాలు లాగా సమస్యలన్నీ ఒకేసారి రావడంతో కాస్త తేరుకునే క్రమంలో ఉన్నాను.

నా పాత మొబైల్ నంబర్ ని నంబర్ పోర్టబిలిటీ కింద మార్చుకుంటున్న ప్రక్రియ కాస్త ఆలస్యమ వుతోంది.  పాత నెంబర్ -9884612596- సరిగా పనిచేయడం మొదలయ్యేంత వరకు నా కొత్త నంబర్ -రిలయెన్స్- ని మిత్రుల సౌకర్యం కోసం ఇస్తున్నాను.

7305018409

ఈ రెండు నంబర్లూ నావిగానే ఉంటాయి – (మళ్లీ మొబైల్ పోయేంతవరకు)

రాజు

చెన్నయ్

వరుస సమస్యలతో.. నా మరో బ్లాగు ‘నెలవంక’ కూడా అప్ డేట్ కాలేదు

kanthisena.blogspot.com

మళ్ళీ అంతర్జాలంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

సినిమా కష్టాలు అని నవ్వుకుంటామే గాని కష్టాలు ఒకేసారి వస్తాయనడం నిజమే.. సినిమా కష్టాలు అని తీసిపారేయకూడదేమో…

RTS Perm Link


2 Responses to “చందమామలు బ్లాగ్ పునర్దర్శనం”

 1. Prasad on October 22, 2011 1:18 PM

  Welcome back Raju garu

 2. chandamama on October 24, 2011 12:47 AM

  ప్రసాద్ గారూ,
  కృతజ్ఞతలు.
  మీ కామెంట్ కూడా ఆఫీసుకు వచ్చాకే చూశాను. ఇంట్లో ఇంకా సిస్టమ్, ఇంటర్నెట్ రడీ కాలేదు. మరి కొద్ది రోజులు పట్టేటట్టుంది. అందుకే మీ కథనాలు ఆపీసులో చూస్తున్నాను తప్పితే లోపలకి రాలేకపోతున్నాను.

  త్వరలో నా సమస్య తీరవచ్చు.
  మీ బ్లాగ్‌ను చాలా తరచుగా అప్‌డేట్ చేస్తున్నట్లుంది. అభినందనలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind