గణపతి చరిత్ర

September 1st, 2011

ఆదిమసమాజంలో గణవ్యవస్థ రూపుదాల్చిన క్రమంలో సమాజ సంరక్షణ కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడే గణపతి లేదా గణనాయకుడు లేదా గణాధిపతి. ప్రతి గణానికి ఒక గుర్తు లేదా సంకేతం పాము, ఎలుక, ఏనుగు, కుక్క, చిలుక, తాబేలు, పక్షి మొక్క మొదలైన పేర్లు చిహ్నాలుగా ఉండేవి. గణపతికి ఏనుగుతల ఉండటం ఆ గణం యొక్క ఆధిపత్యాన్ని లేదా మిగతా గణాలపై గల సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది.

ఆ గణ సంకేతాలే నేటి సమాజంలో గోత్రాలుగా కొనసాగుతున్నాయి. ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, నోములు, వ్రతాలు, పూజలు పరిశీలిస్తే ఆదిమ సమాజ లక్షణాలు కనబడతాయి. గోత్రనామం తెలుగు అర్థం తెలుసుకుంటే సమాజపరిణామంలో మనిషి మూలాలు తెలుస్తాయి.

ఆదిమ సమాజంలో భక్తి వ్యక్తిగతం. రాజ్యవ్యవస్థ, వ్యక్తిగత ఆస్థి ఏర్పడిన తర్వాతే భక్తి ప్రదర్శనగా మారింది. నేడు భక్తి వ్యాపారమైంది. ఇప్పుడు పూజా ద్రవ్యమూ సరుకే. దేవుడూ సరుకే. భక్తి కూడా సరుకే. పెట్టుబడిదారీ సమాజంలో సరుకు ఉత్పత్తి లాభం కోసమే. ప్రదర్శన వ్యాపార లక్షణం. గణేశ ఉత్సవంలో కనిపిస్తున్న తీరుకి ఇది నిదర్శనం. భక్తి వేలం వెర్రిగా మారటం సామ్రాజ్యవాద సంస్కృతి తలకెక్కి తైతక్కలాడటమే.

భయం+అజ్ఞానం దేవుడు. భయానికి కారణం అభద్రత, అజ్ఞానానికి హేతువు విచక్షణా జ్ఞానం కొరత. విచక్షణే సైన్స్ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

— డా. జి,వి. కృష్ణయ్య. drgvkrishnaiahkp@gmail.com

డాక్టర్ గారూ, మన చరిత్ర సైన్స్‌కి సంబంధించిన మంచి విషయాన్ని ఇవ్వాళే ఈమెయిల్ ద్వారా పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ.

క్లుప్తంగానే అయినా గణపతి భావన వెనక ఉన్న ఒక సుదీర్ఘ చరిత్రను ప్రస్తుతం దాని వికృత పరిణామాలను సుస్పష్టంగా వివరించారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు ‘గణపతి’ పేరిట, దేవీప్రసాద్ చటోపాధ్యాయ రచించిన ప్రామాణిక పుస్తకం ‘లోకాయత’లోంచి చిన్న భాగాన్ని పుస్తకంగా వేశారు. భగవద్గీత చారిత్రక పరిణామాలపై, గణపతిపై ఇతర అంశాలపై వీరు ప్రచురించిన చిన్న పుస్తకాలు అప్పట్లో సంచలనం కలిగించాయి. కాని ఆ సంప్రదాయాన్ని, తరం తర్వాత తరానికి అందవలిసిన శాస్త్రీయ జ్ఞాన వారసత్వాన్ని ప్రస్తుతం ఎవరూ కొనసాగిస్తున్నట్లు లేదు.

ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించిన వందకు పైగా పుస్తకాలు తెలుగు పిల్లల, పెద్దల జ్ఞాన దాహాన్ని, శాస్త్రీయ చింతనను ఒకరకంగా తీరుస్తున్నాయని చెప్పవచ్చు. వీటిలో నలభైపుస్తకాలు ఆన్‌లైన్‌లో కూడా పీడీఎఫ్ రూపంలో ఉచితంగా అందుబాటులో ఉండటం చాలా మంచి విషయం.

పండుగలు, సంప్రదాయాలు, పేరుకుపోతున్న మౌఢ్యం వంటివాటి వెనుక చారిత్రక అంశాలను వివరించి చెబుతున్న ఇలాంటి రచనలను ప్రతి పండుగ పూటా గుర్తు చేయడం, ప్రత్యామ్నాయ పత్రికలు ప్రచురించడం చాలా అవసరం. నిఖిలేశ్వర్ గారు పాతికేళ్ల క్రితం ఉదయం పత్రికలో అనుకుంటాను. శ్రామికవర్గ పండుగల గురించి చాలా మంచి వ్యాసం రాశారు. అలాంటివి తరం తరానికి అందాలి. కనీసం ఆన్‌లైన్ ప్రతులుగా అయినా అందరికీ అందుబాటులో ఉంటే మంచిదేమో..

మనుషులు జరుపుకుంటున్న ప్రతి పండుగ వెనుక ఎంత  చరిత్ర దాగి ఉందో.. మన వ్యవసాయ సంస్కృతిని వందల సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వస్తున్న పండుగలు ఇప్పటి వేలం వెర్రిలో, తెప్పలుగా పారుతున్న భక్తి రసం వెల్లువలో తమ రూపాన్ని, సారాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి.

‘లోకాయత’ భారతీయ తాత్వికచింతనలో హేతువుకు, నాస్తిక వాదానికి పట్టం గడుతూ దశాబ్దాల క్ర్రితమే దేవీప్రసాద్ చటోపాధ్యాయ రాసిన పరమ ప్రామాణిక రచన. మోర్గాన్ రాసిన ‘పురాతన సమాజం’ తో సరిపోలగల గొప్ప రచన. కాని 700 పేజీల ఈ ఉద్గ్రంతం తెలుగు పాఠకులకు ఈనాటికీ అందుబాటులో లేదు. నిజమైన విషాదం.

కొడవటిగంటి కుటుంబరావు గారి రచనల సంకలనాలలో విరసం గతంలో ప్రచురించిన “సంస్కృతి వ్యాసాలు” సంపుటిలో మన ప్రాచీన ఆచార వ్యవహారాలు, పండుగలు, సంప్రదాయాలు గురించిన విశ్లేషణాత్మక రచనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి గోత్రాల వెనుక నేపథ్యంపై, వివిధ కుల, వర్గ సమూహాలు చరిత్ర క్రమంలో పాటిస్తూ వచ్చిన నిషేధాలపై చక్కటి వివరణ ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం త్వరలో ప్రచురణ కావచ్చు.

వందేళ్ల క్రితం కందుకూరి, గురజాడ తదితరులు తెలుగు సమాజానికి అందించిన హేతుపూర్వక భావ సంస్కారం ఇప్పుడు కనుమరుగవుతున్నట్లోంది.

హితసూచిని : రాజశేఖర చరిత్ర

http://kanthisena.blogspot.com/2010/12/blog-post.html

వీధికొక గుడి, గుంపులుగా దందాలు.. ‘తెలుగునాట భక్తిరసం కుప్పలుగా పారుతోంది…’ అంటూ తెలుగు కవి చేసిన అద్భుత వ్యక్తీకరణ ఇప్పుడు మరింత వాస్తవంగా మారుతోంది.

కృష్ణయ్యగారూ,
హేతు దృష్టిని, శాస్త్రీయ చింతనను ప్రోత్సహించే ఇలాంటి మంచి రచనలను వీలైనప్పుడల్లా తప్పక పంచుకోగలరు. చరిత్ర పట్ల, సైన్స్ పట్ల మమకారం గల మీరు సైన్స్, ఆధ్యాత్మికత అంశాలపై తెలుగు బ్లాగుల్లో కొనసాగుతున్న చర్చలో కూడా పాల్గొంటే మంచిదేమో.. ఆలోచించండి.

బొందలపాటి సీతారాం ప్రసాద్ గారు మతం, సైన్స్, ఆధ్యాత్మికత వంటి అంశాలపై గత కొంత కాలంగా తన బ్లాగులో తన కోణంలో తను చర్చిస్తున్నారు. ప్రాథమికంగా ఈయన మత వ్యతిరేకీ కాదు, సైన్స్ వ్యతిరేకీ కాదు. తన వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, పరిశీలన ద్వారా మతం, సైన్స్ పట్ల తనకు ఏర్పడుతున్న భావాలను అక్షరీకరిస్తున్నారు.

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్

http://bondalapati.wordpress.com

సైన్స్ పరిధికి, సైన్స్ పరిమితికి అవతల ఉంటున్న అంశాలను ఆధ్యాత్మిక కోణంలో పరిశీలించవచ్చు అని ఈయనా, ఇతర మిత్రుల అభిప్రాయం.  సైన్స్‌ని సైన్స్‌గానూ, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతగానూ పరిశీలించడానికి, సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి సీతారాం గారి కింది రచనలు ఉపయోగపడతాయనుకుంటాను.

ముఖ్యంగా సైన్స్ ఎన్నటికీ కనిపెట్టలేని అంశాలు, సైన్స్‌కు సాధ్యం కాని ఆవిష్కరణలు, భౌతిక సూత్రాలకు అతీతంగా, నిరూపితం కాని వాస్తవాలు అంటూ ఈయన పంచుకుంటున్న స్వంత ఆలోచనలపై సమగ్ర అవగాహనకోసం కింది లింకులను అధ్యయనం చేయవలసిన  అవసరముంది.

సైన్స్‌‌లో లోతుగా ప్రవేశమున్నవారు -సైన్స్ రచనలు చదువుకున్నవారు, సైన్స్ పట్ల అభిమానం ఉన్నవారు, విశ్వాసం ఉన్నవారు కాదు అని కాదు- ఈ చర్చలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని నా ఉద్దేశం.

రోహిణీ ప్రసాద్ గారూ, శ్రీనివాస చక్రవర్తి గారూ -శాస్త్రవిజ్ఞానము బ్లాగు,  http://scienceintelugu.blogspot.com – మీ అమూల్యమైన సమయాన్ని కాస్త ఈ ప్రతిపాదిత అంశాలపై వెచ్చిస్తే ఈ చర్చ ఫలవంతమవుతుందని భావిస్తున్నాను. ఏ మాత్రం వీలున్నా మీరు కింది లింకులను చూడగలరు.

బ్లాగు రూపంలో చర్చ కష్టమనుకుంటే నేరుగా సీతారాం గారితోటే మీరు చర్చించవచ్చు. తన ఈమెయిల్ ఐడీ కింద చూడగలరు.

sitarama.prasad@gmail.com

 

అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

అలౌకిక అనుభవాలు: నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..

జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..

మానవ జాతి పయనం ఎటు వైపుకి?

విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!

స్వేఛ్ఛాఇఛ్ఛ, లేక ఫ్రీ విల్, ఉందా..లేదా..?

మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…

రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు

NB: సైన్స్‌తో, ఆధ్యాత్మికతో బాగా పరిచయం ఉన్న, అవగాహన ఉన్న ఇతర మిత్రులు ఎవరయినా సరే ఈ చర్చలో పాలు పంచుకోవచ్చు. శాస్త్ర జ్ఞానంపై, సైన్స్ ఆవిష్కరణలపై, భౌతిక సూత్రాల పరిమితిపై, ఆధ్యాత్మికతపై కూడా చర్చ జరగడం తెలుగులో చాలా, చాలా తక్కువ.  అందులోనూ ఆరోగ్యకరమైన చర్చ జరగటం మరీ తక్కువ. తెలుగులో, ఇంగ్లీషులో కూడా పై లింకులలో మీరు చర్చించవచ్చు. మీ అవగానలను పంచుకోవచ్చు.

శాస్త్రవిజ్ఞానం

http://scienceintelugu.blogspot.com

శాస్త్ర విజ్ఞానం – ఆధునిక సమాజాల ఆయువుపట్టు అనే  కేప్షన్‌తో తెలుగులో ఒక నిబద్ద సైన్స్  బ్లాగ్ పాఠకులందరికీ అందుబాటులో ఉంది. విజ్ఞాన శాస్తంలోని వివిధ విభాగాలపై కథ, నవల వంటి ఆకర్షణీయ శైలితో రెగ్యులర్‌గా ఈ బ్లాగును నడుపుతున్నారు. శాస్త్ర విషయాలను ఇంత విస్తృతంగా రోజువారీగా పోస్ట్ చేస్తున్న బ్లాగు మరొకటి తెలుగులో లేదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ విశిష్ట బ్లాగు ఇతర భారతీయ భాషలలో కూడా వస్తోంది.

కలైడోస్కోప్‌ఇండియా

http://www.kaleidoscopeindia.blogspot.com/

 

తెలుగులో సైన్స్ మీదే రాస్తున్న కొన్ని బ్లాగులను కింద చూడండి.

http://scienceintelugu.blogspot.com/
http://lolakam.blogspot.com/
http://rohiniprasadkscience.blogspot.com/
http://emitiendukuela.blogspot.com/2010/05/what-is-raman-effect.html

 

NB: ఇప్పుడే చూస్తున్నాను సాహిత్యాభిమాని బ్లాగులో చందమామ అభిమాని శివరాంప్రసాద్ గారు వినాయకచవితి పేరిట జరుగుతున్న పనికిరాని ఆర్భాటాలపై చక్కటి వ్యంగ్య రచన ప్రచురించారు. కింది లింకులో చూడండి.

అమ్మో వినాయక చవితి!

http://saahitya-abhimaani.blogspot.com/2011/09/blog-post.html

శివరాంప్రసాద్ గారూ, ఆధ్యాత్మికతను పాటిస్తున్నప్పటికీ పండుగల పేరుతో సాగుతున్న వేలంవెర్రిని దుయ్యబడుతూ చక్కటి కథనం ప్రచురించినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లు ఎవరో ఒకరు మూడో కన్ను తెరవనంతవరకు పండుగ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట పడదనుకుంటాను.

మరోసారి అభినందనలు.

 

 

 

రాజశేఖర రాజు
http://blaagu.com/chandamamalu
http://kanthisena.blogspot.com

krajasekhara@gmail.com

 

RTS Perm Link


11 Responses to “గణపతి చరిత్ర”

 1. SRRao on September 1, 2011 4:57 AM

  మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

  శిరాకదంబం వెబ్ పత్రిక

 2. chandamama on September 1, 2011 11:20 AM

  రావుగారూ,
  ఆలస్యంగా స్పందిస్తున్నాను క్షమించాలి. మీకు, మీ కుటుంబం యావన్మందికి కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.

 3. chandamama on September 1, 2011 1:02 PM

  రాజశేఖర రాజు గారు,
  ధన్యవాదాలు. మన పండుగల వ్యాపారీకరణ గురించి కృష్ణయ్య గారి మరియూ మీ యొక్క అభిప్రాయాలతో అంగీకరిస్తాను! ఈ రోజు యధావిధి గా నా శ్రీమతి వినాయక వ్రతకల్పం చదవమంది. మా అబ్బాయిలు గణేశా స్టోరీ చెప్పమన్నారు. మా పిల్లలకు బాల సాహిత్యం లా వినాయకుడి కథ చెప్పి ముగించాను.
  ఈ విషయాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను. నా అభిప్రాయాలు శిలాక్షరాలేమీ కాదు. సత్యాన్వేషణా ప్రక్రియ లో అవి తప్పని తేలితే సవరించుకోవటానికి నేను ఎల్లప్పుడూ సిధ్ధం.
  మీ,
  ప్రసాద్.
  01-09-2011

  సీతారాం ప్రసాద్ గారూ,
  నమస్తే. మీకు అంత పెద్దగా పట్టింపు ఉన్నా లేకున్నా ఇంట్లో దైవ భావన పట్ల విశ్వాసం ఉన్నవారు ఎక్కువమంది ఉంటున్నప్పుడు అనివార్యంగా ఆస్తికత్వంతో రాజీపడటం తప్పదు. అస్తి, నాస్తి అనేవి వ్యక్తుల విశ్వాసాలకు సంబంధించిన హక్కులు. వీటిపై ఎవరూ ఎవరినీ గాయపర్చకూడదనే నా అభిప్రాయం.

  “నా అభిప్రాయాలు శిలాక్షరాలేమీ కాదు. సత్యాన్వేషణా ప్రక్రియ లో అవి తప్పని తేలితే సవరించుకోవటానికి నేను ఎల్లప్పుడూ సిధ్ధం.”
  నిజాయితీతో కూడిన మీ వినమ్రతకు జోహార్లు. ఈ నిజాయితీనే సైన్స్, ఆధ్యాత్మికతపై చర్చను కొనసాగిస్తుందని, ఆరోగ్యకరంగా ముందుకు సాగుతుందని నమ్ముతున్నాను. మీ బ్లాగులో రచనలు చదవటం ద్వారా సైన్స్ పుస్తకాలు చదవటం మాత్రమే కాకుండా భిన్న భావాలను, విశ్వాసాలను, వ్యక్తుల ప్రగాఢ నమ్మకాలను, అనుభవాలను కూడా చదవవలసిన, పట్టించుకోవలసిన మహా భారం నామీద పడింది.

  గత రెండు రోజులుగా మీ ‘పుణ్యమా’ అని, అరుణ్ చంద్ర గారి ‘పుణ్యమా’ అని తెలుగులో సైన్స్ బ్లాగులను ప్రధానంగా ‘శాస్త్ర విజ్ఞానం’ బ్లాగును మధిస్తున్నాను. ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి, భౌతిక శాస్త్రంలో అసంభావ్యతలు గురించి ఈ బ్లాగులో పొందుపర్చిన మంచి సమాచారమంతటినీ సేకరించి ఒక చోట చేరుస్తున్నాను. నిజంగా మనందరి అవగాహనను మెరుగుపర్చే, పదునుపెట్టే మంచి వ్యాసాలు దీంట్లో ఉన్నాయి.

  పైగా, ప్రాచీన కాలంలో ప్రపంచానికే వర్తకం నేర్పిన భారతదేశం, అమేయ సంపదలను కూడగట్టిన భారతదేశం మధ్యయుగాల్లో విజ్ఞానపరంగా ఎలా గిడచబారిపోయిందనే విషయంపై చాలా సమాచారమే వస్తోంది. దీన్నంతటినీ క్రోడీకరించి మీకు తప్పక వాటి లింకులను పంపుతాను. భావాలను పంచుకోవడం, ఘర్షించడం మనల్ని మంచివైపుకే నెడుతుందని నా నమ్మకం.

  సైన్స్ పరిధిలో లేని, సైన్స్‌ పరిధికి అందని విషయాలను ఎలా అర్థం చేసుకోవడం అనేదే మన ప్రధాన సమస్య. దీనికి పరిష్కారం ఉంటుందని ఆశిస్తున్నాను. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ మధ్య ప్రచురించిన నాలుగు సైన్స్ పుస్తకాలు మీరు చదివారా. తప్పకుండా తీసుకోండి. కొద్ది నెలలకే మూడు నాలుగు ప్రచురణలు జరిగిన ఈ పుస్తకాలు మనకాలంలో సైన్స్‌ని ప్రతిభావంతంగా ప్రదర్శించిన మంచి పుస్తకాలు. రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ బ్లాగులో కూడా వీటి వివరాలు లభ్యమవుతున్నాయి.

  రోహిణీ ప్రసాద్ గారూ, మీకూ సీసీలో ఈ మెయిల్ పంపుతున్నాను. మీ నాలుగు సైన్స్ పుస్తకాలు ఎక్కడ లభిస్తాయో చెబితే సీతారాం గారు వాటినితీసుకోవచ్చు. తన బ్లాగులో ఆయన ప్రతిపాదించిన విషయాలు మీకు సమయం ఉన్నప్పుడు తప్పక చూడండి. మీకు ఇంతకుముందే బొందలపాటి బ్లాగులోని లింకులను పంపాను. సైన్స్‌పై, ఆధ్యాత్మికతపై చర్చ మనందరికీ అవసరమే అనుకుంటున్నాను.

  మీవద్ద “ప్రాచీన భారతదేశంలో ప్రగతి-సంప్రదాయికత” అనే సర్దేశాయి గారి పుస్తకం ఉందా? 1990ల మొదట్లో విశాలాంద్ర వారు ప్రచురించిన ఈ పుస్తకం ప్రగతి-సంప్రదాయికత భావనలను అర్థంచేసుకోవడానికి సహకరించిన గొప్ప పుస్తకంగా నాకు గుర్తుండిపోయింది. దీన్ని కూడా తర్వాత అనివార్యంగా పొగొట్టుకున్న తర్వాత ఎంతగా ప్రయత్నించినా నాకు దొరకలేదు.

  హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం ముఖ్య నేతల వద్ద గాని, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో గాని ఈ పుస్తకం దొరుకుతుందనుకుంటున్నాను. దాన్ని ఎలా సేకరించాలో నాకు అర్థం కావడం లేదు. తొలుత మరాఠీలో అచ్చయిన ఈ పుస్తకం తర్వాత అన్ని భారతీయ భాషల్లోనూ ప్రచురించబడింది. ఎక్కడయినా, ఎవరివద్దయినా ఉంటే ఈ పుస్తకం జిరాక్స్, పోస్టల్ ఛార్జీలు అన్నింటినీ నేనే భరిస్తాను.
  ధన్యవాదాలు.
  రాజు.
  01-09-2011

 4. DR.G.V.KRISHNAIAH on September 1, 2011 9:50 PM

  ee box telugu aksharalatho poorinchadam ela? dayachechi sahakaringhandi.mee charchalo bhagaswaminayye avakasamivvandi. DR.G.V.KRISHNAIAH. 9866381977.

 5. kothapalli ravi babu on September 1, 2011 11:03 PM

  this is the first time i have seen your blog. it is interesting to know that so much discussion is going on in blogs. certainly i will regularly follow and participate in the discussion.
  did u get the copy of Sardesai book? if not xerox will be sent to you.
  we published the first volume of Rohini prasad’s essays collecting from our series published every month in our praja sahiti.
  ravibabujs@yahoo.co.in

 6. chandamama on September 1, 2011 11:54 PM

  రాజశేఖర రాజు గారు
  మీ బ్లాగు చాలా ఆసక్తికరంగా ఉంది. నాకు కూడా ఈ ‘సైన్స్ – అధ్యాత్మికత’ అన్న అంశం మీద కొంత ఆసక్తి ఉంది.

  ఆధునిక నాడీవిజ్ఞానంలో ‘చైతన్యం’ అన్న అంశం మీద ఎంతో చర్చ జరుగుతోంది. ఆ కోణం నుండి ఎప్పుడైనా రాయడానికి ప్రయత్నిస్తాను.
  ధన్యవాదాలు
  శ్రీనివాస చక్రవర్తి

  V. Srinivasa Chakravarthy, PhD
  Department of Biotechnology,
  Indian Institute of Technology Madras
  Chennai 600036
  India.
  Tel: (044) 2256 4115
  URL: http://www.biotech.iitm.ac.in/Srinivas
  Blog: http://www.scienceintelugu.blogspot.com

  2011/9/2 naga prasad
  – Show quoted text –

  Forwarded message
  From: Raja Sekhara Raju
  Date: 2011/9/2
  Subject: Discussion on Science and spirituality
  To: nagaprasad27@gmail.com

  ప్రియమైన నాగప్రసాద్ గారికి,

  మనం చాన్నాళ్ల క్రితం చాట్‌లో కలిశాము. గత రెండేళ్లుగా మీ శాస్త్ర విజ్ఞానం బ్లాగు రెగ్యులర్‌గా చదువుతున్నప్పటికీ మన మధ్య పరిచయం పెద్దగా లేదు. గత రెండు రోజులుగా మీ బ్లాగును ఓ అవసరం కోసం మధిస్తున్నాను.

  సైన్స్, ఆధ్యాత్మికత‌పై ఒక తెలుగు బ్లాగులో జరుగుతున్న చర్చలో భాగంగా నేను ఇవాళే చందమామలు బ్లాగులో కింది కథనం పోస్ట్ చేశాను. వీలయితే డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారి ఈమెయిల్ ఐడీని ఇవ్వండి లేదా కింది లింకును ఆయనకు తెలియజేయండి.

  గణపతి చరిత్ర
  http://blaagu.com/chandamamalu/2011/09/01/%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/

  సైన్స్, ఆధ్యాత్మికతలపై మీ బ్లాగులో కూడా పొందుపర్చిన కొన్ని రచనలు చూశాను. భారతీయ ప్రాచీన విజ్ఞానం, భౌతికశాస్త్రంలో అసంభావ్యతలు వంటి వ్యాసాలను మీ బ్లాగులోంచి కాపీ చేసుకున్నాను. సైన్స్‌ని అధ్యయనం ద్వారా కాకుండా ఆచరణ ద్వారా మధిస్తున్న కొడవటి గంటి రోహిణీప్రసాద్ గారు, శ్రీనివాస చక్రవర్తి గారు, మీ వంటి వారు పై చర్చపై పాలు పంచుకోవడం చాలా అవసరమని భావిస్తున్నాను.

  సీతారాం ప్రసాద్ గారు సైన్స్‌ని, ఆధ్యాత్మికతను తన వ్యక్తిగత అనుభవాలు, పరిశీలనల ద్వారా అధ్యయనం చేస్తూ, చర్చిస్తున్నారు కనుక వీలైనంత సంయమనంతోనే ఆయన చర్చకు తీసుకువస్తున్న అంశాలను అర్థం చేసుకోగలగాలి. చర్చను కూడా సున్నితంగానే కొనసాగించాలి.

  ఆ అవసరాన్ని సైన్స్‌తో ప్రత్యక్ష జ్ఞానం కలిగిన మీవంటివారు సమర్థవంతంగా తీరుస్తారని నమ్ముతున్నాను. మీ సహకారం ఈ విషయంలో అవసరం. బ్లాగు రూపంలో చర్చ కొనసాగించడం సాధ్యం కాదనుకుంటే సీతారా గారి జిమెయిల్ ఐడీకి మీ వ్యాఖ్యలు, చర్చలు పంపవచ్చు. తప్పక పరిశీలించగలరు. ఈ విషయాన్ని శ్రీనివాస చక్రవర్తి గారికి తప్పక తెలియజేయగలరు.

  రాజశేఖర రాజు
  చందమామ
  98846 12596

  http://blaagu.com/chandamamalu

  http://kanthisena.blogspot.com

 7. chandamama on September 2, 2011 4:55 AM

  డాక్టర్ జీవీ కృష్ణయ్య గారికి,
  ఆలస్యానికి క్షమించాలి. మీరు తెలుగులో టైపింగ్ చేయడం ఎలా, బ్లాగ్ కామెంట్లలో తెలుగు అక్షరాలను పొందుపర్చడం ఎలా అనే సందేహాలను తెలిపారని అర్థం చేసుకుంటున్నాను. తెలుగులో టైపింగ్‌ని అత్యంత సులభంగా, మంచి నీళ్ల ప్రాయంలా నేర్చుకునేందుకు ప్రాథమికంగా ఒక మంచి వెబ్‌సైట్ ఉంది.

  http://lekhini.org/

  దీన్ని మీ ఇంటర్నెట్ బ్రౌజర్లో (Internet Explorer or Firefox or Google Chrome) ఓపెన్ చేసి కింద వచ్చే బాక్సులో ఇంగ్లీషులో
  టైప్ చేయండి. మీరు ఇంగ్లీషులో టైప్ చేసే అక్షరాలు ఆ బాక్స్‌కు కొంచెం కింది బాక్స్‌లో తెలుగులో సరిసమాన అక్షరాలుగా టైప్ అవుతూ
  కనబడుతుంటాయి.

  ఉదా:
  Amma
  Aawu
  Illu
  Eega
  Wuuyela
  kiTiki

  ఇలా ఏ అక్షరాలు ఇంగ్లీషులో టైప్ చేస్తే వాటి సమాన అక్షరాలు తెలుగులో టైప్ అవుతుంటాయి. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా సులభం. ఒకసారి అక్షరాలు అన్నీ సరిగా టైప్ చేయడం వచ్చాక రోజూ మీరు టైప్ చేసే క్రమంలో స్పీడ్ దానంతటదే వస్తుంది.

  కొన్ని తెలుగు పదాలకు ఇంగ్లీషులో కేపిటల్ లెటర్స్‌లో టైప్ చేయవలసి ఉంటుంది. లేదా షిఫ్ట్ కీ పట్టుకుని సంబంధిత అక్షరాన్ని టైప్ చేయవలసి ఉంటుంది.లేఖిని.ఆర్గ్ ఓపెన్ చేశాక మోనిటర్ కుడిభాగంలో తెలుగు కీబోర్డు, దాని కింద హెల్ప్ కేటగిరీ ఉంటాయి. టైపింగ్ క్రమంలో మీకు ఎదురయ్యే ఇబ్బందులకు లేఖిని హెల్ప్ టూల్ చాలా సులభంగా పరిష్కారం చూపుతుంటుంది.

  మోనిటర్ కింది భాగంలో లేఖిని, సహాయము, బ్లాగ్ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇవి మీకు ఇన్‌స్టంట్‌గా తెలుగు టైపింగ్ తదితరాలపై పాఠాలు చెబుతాయి.

  లేఖిని.ఆర్గ్ వారి హోమ్ పేజీలో (http://lekhini.org) కనిపించే ఆ తెలుగు కీ బోర్డ్ లేఅవుట్‌లో అక్షరాలను కాస్సేపు మీరు గమనిస్తే చాలు. ఏ తెలుగు అక్షరానికి ఏ ఇంగ్లీష్ అక్షరం టైప్ చేయాలో మీకే తెలిసిపోతుంది.

  తెలుగు టైపింగ్ ఏ మాత్రం తెలీని వారికి, ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులో టైప్ అవుతూ కనిపింపజేసే చక్కటి సైట్ ఇది. ముందుగా పదాలు పదాలుగా నేర్చుకుంటూ టైప్ చేస్తూ పోతుంది. స్పీడ్ గురించి గాభరాపడవద్దు. దానికదే వచ్చేస్తుంది. అలవాటు పడ్డాక అవసరమనుకుంటే ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డ్ లే అవుట్‌ వంటి టైపింగ్ సాధనాలను నేర్చుకోవచ్చు లేదా లేఖినిలోనే కొనసాగవచ్చు.

  ముందు బాక్స్‌లో రోమన్ లిపిలో టైప్ చేయడం మొదలెట్టండి.
  మీ కళ్ల ముందే ఒక సాంకేతిక అద్భుతం తెలుగురూపంలో ఆవిష్కరించబడుతుంది..
  ఎలాంటి చిన్న సందేహాలు వచ్చినా ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తెలుపండి. పరస్పరం నేర్చుకుందాము.

  మీ
  రాజశేఖర రాజు.
  9884612596

  NB: ఒక సెలవు రోజు మీరు ఒకటి రెండు గంటలు కష్టపడ్డారంటే మీకు తెలుగు టైపింగ్ పూర్తిగా వచ్చేస్తుంది. టైప్ చేస్తున్నకొద్దీ స్పీడ్ దానికదే మెరుగవుతూ వస్తుంది. ప్రయత్నించండి.

  మీ కంప్యూటర్‌‌లో -XP system – లో తెలుగు ఫాంట్ ఉందో లేదో చెప్పండి. గౌతమి ఫాంట్ మీ సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయి ఉంటే సరే. లేదంటే నేను మీకు గౌతమి ఫాంట్ పంపుతాను.

 8. DR.G.V.KRISHNAIAH on September 4, 2011 12:21 PM

  చాలా సంతోసం మీరు నాకు ఎంతో సహాయ పఢ్డారు.నా ప్రయత్నం వెంట్నే ప్రారంభించాను.
  Dr.g.v.krishnaiah.

 9. chandamama on September 4, 2011 10:52 PM

  శ్రీనివాస చక్రవర్తి గారు,
  ఆలస్యంగా రిప్లయి పంపుతున్నందుకు క్షమించాలి. చెన్నయ్‌లో ఇంత దగ్గరగా మీరు ఉండి కూడా మీ వివరాలు తెలుసుకోలేకపోయాను. మీరు ఏ విజయవాడ ప్రాంతంలోనో ఉండి ఉంటారనుకుంటాను కాని మన చెన్నయ్ లోనే ఉంటారని ఊహించలేదు.
  తెలిసిన తర్వాత మరీ సంతోషం..

  తెలుగులో సైన్స్‌ని ఇంత ఓపికగా, ఆర్తిగా, పాఠకులపై ప్రేమతో రాయగల బ్లాగు గురించి కొన్నేళ్లక్రితం అయితే ఊహించలేము. అలాంటిది మీరు అసాద్యాన్ని సుసాధ్యం చేశారు. భారతీయ విజ్ఞానం, భౌతిక శాస్త్రంలో అసంభావ్యతలు వంటి కేటగిరీలు మీ బ్లాగులో చాలా చాలా బాగున్నాయి. సాంప్రదాయిక భారతీయ విజ్ఞానం అంటేనే అన్ని వేదాల్లోనే ఉన్నాయిష అనే సాంప్రదాయిక భావాలవైపు చదువుకున్న వారు కూడా కొట్టుకుపోతున్న నేపథ్యంలో శాస్త్ర, చారిత్రక ధోరణితో మన సాంప్రదాయిక విజ్ఞానం గొప్పతనాన్ని వివరించడం మాటలు కాదు. దాని ఫార్మాట్‌ని మీరు సాధించారు.

  మీరు వీలైనంత విస్తృతంగా ఈ కేటగిరీలో రచనలు చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మధ్యయుగాల్లో మన విజ్ఞాన చింతన నిజంగా వెనుకపట్టు పట్టిందా లేదా బ్రిటిష్ వాళ్లు అణిచిపారేయటం వల్లే మన ప్రాచీన శాస్త్రీయ మూలాలు అంతరించిపోయాయా? ప్రాచీన కాలంలోనే కాకుండా మధ్యయుగాల్లో కూడా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం. వర్తక వాణిజ్య రంగాల్లో సాటిలేని ప్రతిభ చూపిన భారతదేశం విజ్ఞాన వికాసయుగంలో యూరప్ స్థాయిని అందుకోలేకపోవడానికి బ్రిటిష్ పాలనలో అడుగంటిపోవడమే ప్రధాన కారణమా? శతాబ్దాలుగా సుగంధద్రవ్యాలు, మసాలా దినుసులు, దేవాలయ ఉత్పత్తులు కొనసాగించడం తప్పితే యూరప్ దేశాల్లో మాదిరిగా జాతీయ పెట్టుబడిదారీ వర్గం మన దేశంలో 17,18 శతాబ్దాల్లో ఏర్పడకపోవడానికి బ్రిటిష్ పాలనే కారణమా. ఇతరత్రా కారణాలేవయినా ఉన్నాయా?
  1600 సంవత్సరం నాటికి భారతీయ వ్యాపారం ప్రపంచంలోనే తిరుగులేని స్థానం సంపాదించిందని నేను 15 ఏళ్ల క్రితం EPW 1996 సంచికలలో ఒక దానిలో చదివాను. ఈ సుసంపన్న స్థితి తర్వాతి దశాబ్దాలలో పారిశ్రామిక పురోగతికి, నూతన ఆవిష్కరణలకు మన దేశంలో దారితీయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? వీటికి సమాధానాలు దొరికినట్లయితే భారతీయ విజ్ఞానంపై సరైన అంచనాకు రావడానికి వీలవుతుందనుకుంటున్నాను. వీటికి సంబంధించి ఏ ఆధారాలు దొరికినా మీరు రాసి ప్రచురించగలరు. చరిత్ర ప్రసిద్ధ కెక్కిన మన ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులు క్రీ.శ 1000కి ముందు లేదా ఇంకా అంతకుముందే కనిపిస్తున్నారు తప్పితే మధ్యయుగాల పొడవునా వీరి ఉనికి కానరాకుండా పోయిందెందుకు? ఈ చారిత్రక దశలో మన విజ్ఞాన వారసత్వం గిడచబారిపోయిందనటం వాస్తవమేనా? మన దేశంపై బ్రిటిష్ అణచివేత ప్రభావాల గురించి మీ బ్లాగులో ఒకటి రెండు వ్యాసాలు చూశాను. వీలైనంత విస్తృతంగా వీటిని సేకరించి ప్రచురించగలరు.

  నేను ఈ రాత్రి బెంగళూరు బయలుదేరి మంగళవారం చెన్నయ్ వస్తాను. 8 లోపల మళ్లీ మెయిల్ చూస్తాను. తిరిగి మంగళవారమే నెట్ ద్వారా కలుసుకుందామండీ.

  మీతో పరిచయం కావడం చాలా సంతోషం కలిగిస్తోంది. ధన్యవాదాలు.
  మీ
  రాజు.
  – Show quoted text –

 10. DR.G.V.KRISHNAIAH on September 5, 2011 1:32 PM

  నమష్కారం! వినయక చవితి చివరి ఘట్టంలో ఉన్నాంగదా! చిరు అనుమానాలను తీర్చుకుందాం!!
  గణపతి స్త్రీ రూపమా? పురుష రూపమా? మూషికం, వినాయకునివాహనం ఎందుకయ్యింది? వినాయకుని చేతిలో వివిధ ఆయుధాలు దేనికి సంకేతం ? వినాయకున్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు ? చారిత్రక కోణం లో పరిశీలించుకుందాం శ్రుతి కలపండి !ఙాన జ్యోతి వెలుగు అందరికీ అవసరమే గదా! డాక్టర్: జి.వి.క్రిష్ణయ్య . drgvkrishnaiahkp@gmail.com

 11. chandamama on September 8, 2011 11:17 PM

  రవిబాబు గారికి,
  చాలా ఆలస్యంగా మీకు సమాధానం పంపుతున్నందుకు క్షమించండి. సైన్స్, ఆధ్యాత్మికతలపట్ల చర్చను చూస్తున్నందుకు, చర్చలో పాల్గొంటానని ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు. ప్రజాసాహితి తరపున మీరు ప్రచురించిన రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ వ్యాసాల పుస్తకం తప్పకుండా కావాలి. ఆయన పుస్తకాలు రెండు లేదా మూడు నావద్ద ఉన్నాయి. అలాగే సర్దేశాయి గారి రచన “ప్రాచీన భారతదేశంలో ప్రగతి సంప్రదాయకత” నాకు తప్పకుండా కావాలి. ఇది వెదకబోయిన పెన్నిధి లాంటిదే. మీవద్ద ఉన్న కాపీని జిరాక్స్ చేసి నా చిరునామాకు పంపగలరా? దీని జిరాక్స్, పోస్ట్ తదితర ఖర్చులు, అలాగే రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ పుస్తకం వెల మొత్తంగా మీకు పంపిస్తాను. మీకు శ్రమ కలిగిస్తున్నందుకు చింతిస్తున్నాను.

  K. Rajasekhara Raju,
  Associate Editor (Telugu) – Online
  Chandamama India Limited
  No.2 Ground Floor, Swathi Enclave
  Door Nos.5 & 6 Amman Koil Street
  Vadapalani, Chennai – 600026
  Phone : +91 44 43992828 Extn: 819
  Mobile : +91 9884612596

  Email : rajasekhara.raju@chandamama.com
  Visit us at telugu. chandamama.com
  blog : blaagu.com/chandamamalu

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind