చందమామ కుటుంబాలకు విషాదవార్త

July 15th, 2011

గీతా ప్రియదర్శిని

చందమామ చిరకాల అభిమాని, అమ్మఒడి బ్లాగు రూపకర్త,  ఆదిలక్ష్మి గారి అమ్మాయి గీతా ప్రియదర్శిని మనందరినీ వదిలి పెట్టి ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. పోటీ చదువుల విషవలయంలో పీకలలోతు కూరుకుపోయిన ఈ ప్రపంచాన్ని శపిస్తూ ఈ పాలమీగడ…. పసిప్రాయంలోనే ఈ లోకం నుంచి దాటుకుంది.

ఈ రాత్రి 12 గంటల వేళ -15-07-2011- వలబోజు జ్యోతిగారి ఈమెయిల్ చూసి ఈ దారుణ నిజాన్ని నేరుగానే తెలుసుకుందామని గీత అమ్మకు కాల్ చేసి విఫలమై, నా బాధను ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నాను.

గత సంవత్సర కాలంగా చందమామ పనిలో భాగంగా, ఇతరత్రా సందర్భాలలో ఆదిలక్ష్మిగారితో మాట్లాడాలని ఆమె ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, ‘అమ్మలేరు అంకుల్, తర్వాత చేస్తారా, ముఖ్యమైన విషయం అయితే చెప్పండి’ అంటూ పలకరించిన ఆ లేతస్వరం ఇవ్వాళ శాశ్వతంగా మూగపోయింది. వలభోజు జ్యోతి గారిద్వారా విన్న ఈ వార్తను స్వీకరించడానికి కూడా నాకు మనస్కరించడం లేదు.

“నా తల్లిని ప్రయివేట్ కళాశాలల చేపల తోముడు అనే వికృత కోచింగ్ బారిన పడవేయను’ అంటూ ఆదిలక్ష్మిగారు కొన్ని నెలల క్రితం చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లోగింగురుమంటున్నాయి. సెలవులొచ్చాయంటే చాలు ప్రైవేట్ కాలేజీలు ఆంధ్రదేశంలో బడిపిల్లలను ‘చేపల్ని బండపై తోమినట్లు’ తోముతున్నాయని ఆగ్రహం ప్రకటించిన ఈ కన్నతల్లి ఏకైక గారాల పట్టి మనమెవ్వరూ ఊహించని కోణంలో జీవితం వద్దనుకుని వెళ్లిపోయింది.

పోటీ చదువుల భారంలో కన్నకూతురిని ముంచనివ్వనని కన్న తల్లి శపథం చేస్తే, చదువులలో డల్‌గా ఉన్నావని పాలుగారే ఈ చిన్నారిని తోటి మిత్రులు వెక్కిరించారు.

తల్లిదండ్రులు చేస్తున్న జీవన పోరాటం సంవత్సరాలుగా చూస్తూ చూస్తూ ఎదుగుతున్న ఈ లేత గుండె తన మిత్రులు పెట్టిన కోతను భరించలేక కరిగి పోయిందేమో…

జీవితానికి మార్కులొక్కటే కొలబద్ద కాదంటూ కన్నవారు చేసిన బోధకంటే…. జీవితమంటే, భవిష్యత్తు అంటే మార్కులే అంటూ గిరిగీసి మరీ నిల్చున్న ప్రపంచం నుంచి కొత్తగా ఎదురైన అవహేళనలను అర్థం చేసుకోక ఈ పసిమనసు తల్లడిల్లిపోయిందేమో… కారణం ఈ క్షణంలో స్పష్టంగా తెలీదు కాని మన కళ్లముందు మళ్లీ ఈ ఘోరం జరిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా పారిశ్రామిక వేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన ఈమె కన్నతల్లి, గత 18 ఏళ్లుగా తాను నమ్మిన విలువల కోసం రాష్ట్రం నుంచి కేంద్రం దాకా మొత్తం పాలక వ్యవస్థమీదే తనదైన కోణంలో తిరగబడిన నేపధ్యంలో, సర్వస్వం కోల్పోయి జీవితంతో తీవ్రంగా ఘర్షణ పడుతోంది.

తెలుగు బ్లాగులలోనే అరుదైన విలక్షణమయిన అమ్మఒడి బ్లాగులో కణిక వ్యవస్థ పేరిట వీరు రాసిన, రాస్తున్న కథనాలు, ఈ ప్రపంచంలోని అన్యాయం, అవినీతిపై తమదైన కోణంలో వీరు ఘర్షిస్తున్న చరిత్రకు ఓ నిఖార్సయిన ప్రతిబంబం.

భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర, నకిలీ కణిక వ్యవస్థ వంటి అంశాలపై ఇంగ్లీషులో, తెలుగులో ఆదిలక్ష్మిగారు గత కొన్ని సంవత్సరాలుగా 425 పైగా సుదీర్ఘ కథనాలు వెలువరించారు. తెలుగు బ్లాగుల చరిత్రలోనే ఉబుసుపోక కబుర్ల కోసం కాక తాను నమ్మిన దాన్ని చెప్పడం కోసం కొనసాగించిన సుదీర్ఘ కథనాల చరిత్రలో అమ్మఒడి బ్లాగుదే అగ్రస్థానం.

ఒక చిన్న అవలోకనం!
http://ammaodi.blogspot.com/

సంపదలను చవి చూసిన చోటనే పేదరికాన్ని కూడా చవి చూస్తున్న ఈ అమ్మా నాన్నలకు జీవితంలో మిగిలిన ఒకే ఒక చిరు ఆశ కూడా ఇవ్వాళ శాశ్వతంగా దూరమైపోయింది. ఆదిలక్ష్మిగారూ, లెనిన్ గారూ.. నాకు తెలిసిన ఈవార్తను ఎలా రాయాలోకూడా అర్థం కాక కుములుతున్నా.. క్షమించండి….

దాదాపు సంవత్సరం క్రితం ఆదిలక్ష్మి గారు తన అరుదైన ‘చందమామ’ జ్ఞాపకాలను పంపుతూ కన్నకూతురి ఫోటోను ప్రచురణకోసం పంపారు.

‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది.

ఆవిధంగా చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే, మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించేదట పాప. కన్నతల్లి  ఒకట్రెండుసార్లు చందమామను చదివి వినిపించి, ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

ఇదీ చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల చరిత్ర. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తూ వచ్చారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం. అంటూ చందమామ బ్లాగులో, వెబ్‌సైట్‌లో ఈ చందమామ కుటుంబం గురించి సంవత్సరం క్రితమే పరిచయం చేశాము.

ఈ సంవత్సర  కాలంగా ఆమె పంపిన రెండు కథలు చందమామలో ప్రచురించబడ్డాయి. మూడవ కథను కూడా ఈ మధ్యనే ప్రచురణకు తీసుకున్నామని, అన్ని కథలూ స్వీకరించలేకపోయినా క్రమం తప్పకుండా చందమామకు కథలు పంపిస్తూ ఉండమని ఈమధ్యే ఆదిలక్ష్మిగారికి చెప్పడం కూడా అయింది.

కానీ, ఇంతలోనే ఈ ఘోరం.

ఈ క్షణం కూడా, నాకు నడిజాములో చేరిన ఈ వార్త నిజం కాకుండా పోతే ఎంత బాగుండు అనిపిస్తోంది.

కన్నవారి సాహిత్య వారసత్వంతో ఇంటర్మీడియట్ పూర్తికాక ముందే తానూ ఒక బ్లాగును రూపొందించుకుని తన పసిమనసుకు తోచిన కథలూ, కథనాలూ పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ చిన్నారి, తన లేలేత బ్లాగును లోకంలోని పసిపిల్లలందరికీ వారసత్వంగా మిగిల్చి వెళ్లిపోయింది.

ఆహా! ఓహో!
http://paalameegada.blogspot.com/

2010 డిసెంబర్ నెలలో కొత్తపల్లి పిల్లల వెబ్ సైట్‌లో జారు బాబూ అనే తన కథ, బొమ్మ రెండూ పడితే ఆనందంగా ఈ వార్తను తన బ్లాగులో పంచుకొంది.

“కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!”
http://paalameegada.blogspot.com/2010/12/blog-post.html

ఇదే ఈ చిన్నారి చివరి బ్లాగ్ కథనం. చంద్రుని చల్లదనానికి పరవశించే చకోర పక్షుల నేపధ్యంలో రామాయణం నేపధ్యంలో ఒక  పేజీ కథను గతంలోనే ఈ చిన్నారి చందమామ పత్రికకు పంపింది. కాని, పౌరాణిక నేపథ్యం ఉన్న కథను చిన్న కారణంవల్ల చందమామ స్వీకరించలేకపోయింది.

పగలే వెన్నెలా – పరవశమాయెగా!

http://paalameegada.blogspot.com/2010/09/blog-post.html

కానీ పైన ప్రస్తావించిన ‘జారు బాబూ’ కథను చదివితే చిన్న వయసులోనే ఊహలకు అక్షరాలద్దుతున్న ఈ చిన్నారి రచనా పాటవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

సామాజిక కారణాలతో పిల్లలు వద్దనుకున్న మాకు, లోకంలోని పిల్లలంతా మా పిల్లలే అన్న సంస్కారాన్ని ఉద్యమాల పుణ్యమా అని నేర్చుకున్న మాకు, సంతాన ప్రాప్తిని స్వచ్చందంగా వద్దనుకున్న మాకు, పసిపిల్లల అర్థాంతర మరణాలు గుండె కోతను మిగిలిస్తున్నాయి.

ఆదిలక్ష్మిగారూ, వీలయితే పాపతో పాటు ఈ వేసవిలో నంద్యాల నుంచి చెన్నయ్‌కి వచ్చి మాతో కొన్నాళ్లు గడుపుతామని మాట ఇచ్చారు. కాని మీరే మీ బ్లాగులో ఈమధ్యనే అవలోకనం చేసుకున్న విధంగా ఉపాధి వెతుక్కోవడం కోసం చిన్న పట్టణం నుంచి హైదరాబాదుకు మకాం మార్చారు. కాని మీ పాపను శాశ్వతంగానే చూడలేకపోయాం. విధి అంటూ పెద్దమాటలు వాడనవసరం లేదు కాని, ఒక్కసారి మీరు ఇటు వచ్చి తర్వాత అటు వెళ్లి ఉంటే ఎంతబాగుండేదో..

ప్రపంచానికి ఎదురుతిరిగి నరక బాధలు అనుభవిస్తూ కూడా మీరు జోకులెయ్యడం, కడుపారా నవ్వడం, నవ్వించడం మర్చిపోలేదు. లక్ష బాధలు అనుభవిస్తూ కూడా మీరు కోల్పోని నవ్వును ఫోన్లో విన్నప్పుడల్లా జీవితంపై కొండంత నమ్మకం చివురించేది మాకు.

విధినిర్ణయం అనే భావనపై మాకిప్పుడు నమ్మకం లేదు. కాని ఈ క్షణం మాకు ఒకే ఆలోచన…. ఇలా జరిగి ఉండకపోతే బాగుండు…. ఇది నిజం కాకపోయి ఉంటే బాగుండు….

కాని ఒక భాధ మా హృదయాలను ఇకపై జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది..

గీతా ప్రియదర్శినీ…. చందమామ కన్నబిడ్డా!

మేం సాధారణ మనుషులం.. నిద్ర లేచింది మొదలుకుని లక్ష తప్పులు చేస్తూనే బతుకుకోసం పోరాడుతున్నవాళ్లం..

ఇంత శిక్ష వేసి వెళ్లిపోయావేమిటి తల్లీ…

 

తాజా నోట్:
రాత్రి లెనిన్ గారికి ఫోన్ చేస్తే అప్పటికే ఆలస్యమయింది కాబట్టి ఫోన్ తీయలేదు. ఈ తెల్లవారుజామున మిస్స్డ్ కాల్ చూసి తనే చేసారు. ఏ ఘోరం నిజం కాకూడదని అనుకున్నానో అదే నిజమైంది. నిన్న తెల్లవారి పాప స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి బయటకు రాలేదు. నంద్యాల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కోచింగ్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో నంద్యాలను మించిన దారుణ అనుభవాలు….

అన్నీ కరెక్టుగా రాసిన సమాధానాలకు తప్పు అని రాసి మార్కులు కోత కోయడం. వెనుకబడిన సబ్జెక్టులో సహజంగానే మార్కులు తగ్గితే టీచర్లే గేలి చేయడం… ఈ రోజుల్లో కూడా క్లాసులో అందరి ముందూ ఆమెను బెంచీపై నిలబెట్టి ఆవమానించడం..

మార్కులు రాకపోయినా ఫరవాలేదు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, ప్రశ్నలు ఎలా రూపొందిస్తారో ప్రాసెస్ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్‌కి హాజరు కామని తల్లీ దండ్రీ కొండంత ధైర్యం, భరోసా ఇచ్చినా  నేరుగా అనుభవించేది, కోచింగ్ సెంటర్లనే చేపల తోముడు బండలపై జరిగే ప్రతి ఘటననూ ప్రత్యక్షంగా భరించేదీ తను కాబట్టి ఎంత నరకం అనుభవించిందో..

కోచింగ్ కాలేజీకి పోవాలంటేనే భయం వేస్తున్న నేపధ్యంలో ఈ పసిపిల్ల ఎంత దయనీయ స్థితిలో తనకు ఇక…. వద్దు అనే నిర్ణయానికి వచ్చిందో మనకు అర్థం కాకపోవచ్చు.

తోటి పిల్లలు కాదు.. కోచింగ్ వెలగబెడుతున్న కాలేజీ నిర్వాహకులు, టీచర్లే ఒక జీవితాన్ని నిలువునా గొంతు కోసేసారు. తాముంటున్న నిజాంపేటకు దగ్గర్లోని ఓ కాలేజ్ కమ్ కోచింగ్ సెంటర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

నక్సలైట్లు పూనుకుంటే తప్ప ఈ దేశంలో ఏ ఒక్క అన్యాయ ఘటనకు సంబంధించి కూడా సహజన్యాయం, తక్షణ న్యాయం జరగదు కాదు జరగదు.. ఇది నా వ్యక్తిగతాభిప్రాయం…  కాబట్టి ఈ కాలేజీకి ఏం జరగదు.. ఈ నిర్వాహకులకు ఏం కాదు. ఆ టీచరాక్షసులకు నెల జీతం తప్ప మరే గుండెకోతలూ కనిపించవు… వినిపించవు…

అయినా ఈ రోజుల్లో కూడా పిల్లలను బెంచీ ఎక్కి అవమానించడం రాష్ట్ర రాజధానిలోనే అలవాటుగా కొనసాగుతోందా? రూపంలో కార్పొరేట్ కల్చర్.. సారంలో పక్కా ఫ్యూడల్ సంస్కృతి.. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వెలిగిపోతోందని పేపర్లలో మహామేధావుల రాతలు… పత్రికలు చెప్పేది ఎంత నిజమో…. హైదరాబాద్ ఇంత పచ్చి ఫ్యూడల్ కంపుతో ఇంత ఘోరంగా తయారయిందా!

17 సంవత్సరాలు కన్నబిడ్డకు స్వేచ్ఛనిచ్చి నిజంగా అమ్మఒడిలాగే పొదవుకుని కాపాడుకున్న అమ్మ.. నిన్న ఈ ఘోరం జరిగినప్పటినుంచి ఏడుపు ఆపటం లేదు. లెనిన్ గారితో మాట్లాడుతూంటే పక్కన హృదయవిదారకంగా ఆమె రోదన. కన్నతల్లి మాత్రమే పెట్టగల రోదనలు. ‘రాజుగారూ, అమ్మ ఒడి ఖాళీ అయింది. అమ్మ ఒడిని ఖాళీ చేశారు. అందరూ కలిసి అమ్మ ఒడిని ఖాళీ చేసేశారు..”  ఆమె ఇవ్వాళ మాట్లాడగలిగింది ఈ రెండు ముక్కలు మాత్రమే.’

24 గంటలూ ఆమెకు తోడుగా ఉండమని, ఒక్క క్షణం కూడా ఆమెను వదలవద్దని లెనిన్ గారికి సలహా ఇస్తుంటేనే మనసులో భరింపరాని బాధ…

ఆమెకు ఇవ్వాళ ఉదయమే కాల్ చేసి ఏదయినా అనువాద పని ఇస్తే చేయగలరా అని అడగాలనుకున్నాను. గత ఎనిమిది నెలలుగా వీరిద్దరూ మేం చేస్తున్న అనువాద పనులలో భాగస్వాములు. ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి మధ్యలో రెండు నెలలు గ్యాప్. మళ్లీ ఇవ్వాళ పని వస్తే చేయగలరా అని ఫోన్ చేయాలనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం..

రాజేష్ గారూ మీరన్నది నిజం. ఇక్కడ ఊహాగానాలు వద్దు. వీలయితే.. పసిబిడ్డను పోగొట్టుకున్న కన్నవారికి కాసింత ఓదార్పుగా మనం నాలుగు మాటలు మాట్లాడితే చాలు.

మొబైల్ లెనిన్ గారి వద్దే ఉంది కాబట్టి కాస్త స్వాంతనగా తనను పలకరిస్తే చాలు.

వారి మొబైల్ నంబర్: 94409 71265

కన్నబిడ్డకు దూరమై, సర్వం కోల్పోయిన ఈ “నిరుపేద” తల్లిదండ్రులకు మనం కాసింత సాయం ఆర్థికంగా కాని, ఇతరత్రా కాని ఏదయినా చేయగలమా? వాళ్లు ఏదీ నోరు విప్పి అడిగే స్థితిలో కూడా లేరిప్పుడు. కూకట్‌పల్లి దగ్గిర్లోని నిజాం పేటలో వీరు ప్రస్తుతం ఉంటున్నారు.

A/c.No. 31223689337 [Yadla Adi Laksmi].
SBI, Nandyal Branch code. 883.

Cell No: 9440971265.
leninyadla@gmail.com
adilakshmi.yadla@gmail.com

(నంద్యాల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవలే ఓపెన్ చేసిన పై ఖాతానే వీరు కొనసాగిస్తున్నట్లుంది. )

మన జీవిత అవసరాలకు పోనూ కాస్త మిగులు ఆదాయం మన వద్ద ఉంటే, ఎంత పరిమితంగా అయినా సరే, ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఈ “అనాథ”లకు కాస్త సాయం చేయగలిగితే బాగుంటుందేమో… ఆలోచించండి… ముందుగా లెనిన్ గారికి పైనంబర్ కి ఫోన్ చేసి స్వాంతన పలుకుదాం…

జరిగిన ఈ ఘోర దురంతం పట్ల మనలో ఏ ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకోరని నమ్మకముంది. కన్న కోత, గుండెకోతలు కలిసి ముప్పేట దాడికి గురయిన వీరికి వీలయితే కాసింత సహాయం చేద్దాం..

రాజశేఖర రాజు.
చందమామ
చెన్నయ్
9884612596
krajasekhara@gmail.com

కాలం నిన్న ఉదయం 7.30 గంటల తర్వాత ముందుకు కదలకుండా అలాగే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండేదో..

చదువులో మొద్దును కాను…!
సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య
న్యూస్ టుడే: ఓ బాలిక తన తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లెనిన్‌బాబు, సరిత -యడ్ల ఆదిలక్ష్మి- దంపతులు రెండు మాసాల కింద నగరానికి వచ్చి నిజాంపేట గ్రామంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి ఒక్కగా నొక్క కుమార్తె ప్రియదర్శిని (16). ఈమె నంద్యాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హైదరాబాద్‌లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇందుకు గాను ప్రస్తుతం ప్రవేశం కోసం ఆయా కళాశాలల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.శుక్రవారం ఉదయం 7.30 వరకు తన గదిలోంచి ఆమె బయటకు రాకపోవడంతో తల్లి సరిత తలుపు తట్టారు. ఎంతకీ పలకకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి లెనిన్‌బాబు తలుపులు పగలగొట్టి చూడగా ప్రియదర్శిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను చదువులో మొద్దుకానని రాసింది. తల్లిదండ్రులకు నమస్సారం అంటూ అందులో పేర్కొంది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కళ్లను ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు ఆన్‌లైన్‌లో హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన ఈ వార్త కాస్త ఆలస్యంగా అందింది. “చదువులో మొద్దును కాను…” తనను బెంచిపై ఎక్కించి నిలబెట్టి అవమానించిన ఆ ఘోరమైన కాలేజిపై -నిజాంపేట-, డల్ స్టూడెంట్ అని వట్టిపుణ్యానికి వెక్కిరించిన వారిపై ఈ పసిపాప ప్రకటించిన ధిక్కార స్వరం ఎంత నైర్మల్యంతో ఉందో గమనించండి. నిన్న ఉదయం  రెండుమూడు సార్లు తను ఉన్న గదిలోకి పాప వచ్చిందని, తనకు జరిగిన అవమానంపై ఆమె మనసులో ఇంతగా వేదన రగులుతోందని అసలు ఊహించలేకపోయానని లెనిన్‌బాబు గారు ఈ ఉదయం ఫోన్‌లో చెబుతుంటే గుండె పట్టేసింది.

రేపటినుంచి ఈ చిన్నారి కళ్లు ఈ ప్రపంచాన్ని సరికొత్తగా చూస్తుంటాయి.  మరొక మనిషికి జీవనదానంగా మారిన కళ్లు..  తను మొగ్గలా ఉన్నప్పుడు కూడా ఎవరినీ ద్వేషించని ఆ కళ్లు..  తను మొద్దును కాను అని మాత్రమే చివరిసారిగా విన్నవించుకున్న ఆ కళ్లు… బండబారిపోయిన మన మహా వ్యవస్థలను ప్రశ్నిస్తున్న ఆ కళ్లు….

టీచర్‌గా పనిచేస్తున్న నా మిత్రుడు నాగరాజు కొన్ని రోజుల క్రితం ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. దేశం మొత్తం మీద కాంపిటీషన్ పరీక్షలకు, పోటీ చదువులకు, కోచింగ్ చిత్రహింసలకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్రయోగశాలగా మారిందని, ఇక్కడ సీటు, ర్యాంకు సంపాదించుకుంటే దేశంలో ఎక్కడైనా పోయి చదివేయవచ్చని, బతికేయవచ్చని చెప్పాడు. రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఎవరికీ సీటు గ్యారంటీ అని చెప్పలేనంతగా పోటీ పెరిగిపోయిందని ఈ రాష్ట్రంలో సీట్లు సంపాదించుకోవడం అంత సులభం కాదని తన అనుభవంతో చెప్పాడు..

చదవటం, బతకడం తర్వాతి మాట.  ఎంత మంది అర్థాంతర మరణాలను, అసహజ మరణాలను ఇంకా మనం మన గొప్ప రాష్ట్రంలో చూడాల్సి ఉందో అని ఇవ్వాళ మళ్లీ భయమేస్తోంది నాకు….

RTS Perm Link


24 Responses to “చందమామ కుటుంబాలకు విషాదవార్త”

 1. chandamama on July 15, 2011 3:47 PM

  Adi Lakshmi gaaru
  Very very sad to see the demise news on Durgeswara gaari blog
  Please accept my condolences.
  I can only imagine how difficult this must be for you.
  My thoughts are with you and your family at this sad time.
  maganti.org@gmail.com
  Fri, Jul 15, 2011 at 10:06 AM

  I got this news just now. but very horrible is that the girl committed suicide. That too becos she was humiliated by her friends for being dull in studies. The girl has completed inter and joined IIT coaching
  Still in shock..
  jyothi valaboju jyothivalaboju@gmail.com
  Fri, Jul 15, 2011 at 10:12 AM

  What is this?
  Sudden, shocking, sad and very unfortunate.
  Don’t know much other than what is in these e-mails.
  Is this the same girl who maintains a blog and responds cheerfully to comments?
  Is it the same girl I came to know as she contributed a story to kottapalli magazine?
  Is it the very confident sounding Adi Lakshmi garu’s daughter?
  I am very sorry to hear the news and shocked at it too.
  May god give the strength the family needs in this situation.

  lalithag@rocketmail.com
  Fri, Jul 15, 2011 at 11:38 AM

  ఈ మెయిల్ ద్వారా విషయం తెలుసుకున్న మేం నివ్వెరపోయాం. నిజమా కాదా అనే సందేహంలో పడ్డాం. చివరికి ఈ రోజు ఉదయం ఆ చిన్నారి తండ్రి లెనిన్ గారు ఫోన్ చేయటంతో ఇది నిజమేనని అర్థమైంది.

  అమ్మఒడిని ఖాళీ చేసేసారు రాజుగారూ అంటూ ఆదిలక్ష్మిగారు మాట్లాడటంమనసును కలచివేస్తోంది. తను ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మాయి బాగుందాండీ అని అడిగితే చిట్టితల్లి ఇప్పుడే వచ్చింది.. చదువుకుంటోంది.. అంటూ.. పదే పదే చిట్టితల్లి చిట్టితల్లి అంటూ తన పాప గురించి సంబోధిస్తూ ఆదిలక్ష్మిగారు మాట్లాడేవారు… ఇప్పుడు ఆ చిట్టితల్లిని పోగొట్టుకున్న ఆ తల్లిని ఓదార్చటం మాత్రం ఎవరికీ సాధ్యం కాదేమో…

  ఒక్కగానొక్క చిట్టితల్లిని పోగొట్టుకున్న ఆమె కడుపుకోత ఇంకెవరికీ ఉండకూడదు.. నిన్నటినుంచీ ఏకధాటిగా ఏడుస్తున్న ఆ తల్లి శోకాన్ని తీర్చటం ఎవరివల్ల అవుతుంది… స్నేహితులమయిన మనకే ఆ చిన్నారి మరణం దుఃఖాన్ని కలిగిస్తుంటే… ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన ఆ తల్లి దుఃఖం ఇంకెంత ఉంటుంది… ఆదిలక్ష్మి గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…

  Shobha
  shobharaju.b@gmail.com
  Fri, Jul 15, 2011 at 8:48 PM

  Raju garu, what is this? It is really a deadly blow on all of us. In fact, I don’t know anything about Madam Adilakshmi garu, excepting the matter from ur chandamama blog. But still I feel very much for her, for her defeat in saving her dear offspring from the wicked hands of cruel friends, and for the endless pain of her motherly heart. I sincerely pray God to give her strength to bear with this tragedy, just to save hundreds and lakhs of such girls. She must become their mother in future….just to see her own in them..and just to try and try to save them. We can’t say anything more than this.
  Gayatri
  Fri, Jul 15, 2011 at 8:58 PM
  gayatri_kakinada@yahoo.com

 2. chandamama on July 15, 2011 3:54 PM

  అరచేతిలో అందాల ‘చందమామ’
  http://blaagu.com/chandamamalu/category/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/

  అరచేతిలో అందాల ‘చందమామ’
  April 9th, 2010

  ఫోటో
  గీతాప్రియ

  ‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..

  “నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.

  ’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.

  వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.

  ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”

  చందమామను రెండో సారి చదవి వినిపించమంటే కుదరదని చెప్పిన నాన్నను చూసి ఉడుక్కున్న ఈమె నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందిన క్షణాల్లో ఒకటో తరగతిలో చేరేటప్పటికి కథలు చదవటం నేర్చేసుకుంది.

  చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.

  ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.

  నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.

  చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  ఆదిలక్ష్మిగారి అరచేతిలో అందాల ‘చందమామ’ జ్ఞాపకాల పూర్తి పాఠం కోసం కింది చందమామ వెబ్‌సైట్ లింకులో చూడండి.

  http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2444

  ఈ కథనానికి గాను మార్చిన ఫోటో ఆదిలక్ష్మిగారి అమ్మాయి గీతాప్రియది. ఈమె చిన్నవయసులోనే ‘ఆహా ఓహో’ అనే బ్లాగు నడుపుతున్నారు. http://paalameegada.blogspot.com/

  ఈ బ్లాగు కూడా సహజంగా కథలకే ప్రాధాన్యత ఇస్తూండటం గమనార్హం. చూడగలరు.

 3. రాజేష్ జి on July 15, 2011 5:11 PM

  ఇక్కడ ఈ సమయంలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయితే ఒక హృదయపూర్వక విన్నపం. కారణాలకు మన ఊహాగానాలు జోడించకుండా తల్లడిల్లుతున్న ఆ తల్లి హృదయం తనను తాను ఊరడి౦చుకునే శక్తినివ్వాలని ఆ దేవుడిని కోరుకుందాం. ఆ తల్లికి ఆత్మీయులు అంటే ఆమెని అభిమానించే మనమే..బ్లాగర్లం. మీరు హైద్ లో ఉండి ఆమెని వ్యక్తిగతంగా కలిసి/ఫోన్ ద్వారా ఊరడించాలనకుంటే..ఇప్పుడు కావాల్సింది.. ఇక్కడ@9440771265.[ఆదిలక్ష్మి గారు తీవ్రమైన దుఖంలో ఉన్నారు కాబట్టి ఆమెని మనం పలకరిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. అందువల్ల ఫోన్ ని తన దగ్గర ఉంచుకోమని “లెనిన్” గారికి చెప్పాను. మీరూ లెనిన్ గారితోనే మాట్లాడగలరు]. కృతజ్ఞతలు!

 4. కెక్యూబ్ వర్మ on July 15, 2011 8:57 PM

  సర్..ఇంత విషాదాన్ని ఆదిలక్ష్మి గారినుంచి నా ఈ సందేశం దూరం చేయలేకపోయినా ఫార్మాలిటిగా కాకుండా నా మనసు ఈ పోస్ట్ చదివాక తీవ్రంగా కలతబడింది. చిన్నారి చందమామలను కోల్పోతున్న ఈ సమాజం ఎంతలా అవిటిదవుతుందో ఎవరికీ పట్టనట్లు సాగిపోతున్న మన జీవన యానం చూసి అసహ్యమేస్తోంది.. ప్రియదర్శిని నవ్వును కోల్పోయిన మనం ఎంత నికృష్టులమో…మాటలు రావడం లేదింక…

 5. chandamama on July 15, 2011 9:16 PM

  Naresh: Rajasekhar garu…

  Naresh Nunna: My daughters love me not because I am good, but because I am their dad!

  Naresh: I share ur grief..
  about the demise of a tender child

  Raja: నరేష్ గారూ,

  Naresh: It is very uncalled for..
  I also often browse through
  Amma Odi
  and also her other blogs..
  she is a wonderful lady…
  her daughter
  like her mother..
  was in making..

  Raja: naaku yela cheppalo Artham kaledu. today morning lenin garu called me and reveal the things. aa kanna talli ninna wudayam ee ghoram jariginappatinunchi eedupu aapaledu. nenu lenin garitho matladutuntee pakkanunchi ame yedupulu vinipistunnayi.

 6. chandamama on July 15, 2011 10:24 PM

  తాజా నోట్:
  రాత్రి లెనిన్ గారికి ఫోన్ చేస్తే అప్పటికే ఆలస్యమయింది కాబట్టి ఫోన్ తీయలేదు. ఈ తెల్లవారుజామున మిస్స్డ్ కాల్ చూసి తనే చేసారు. ఏ ఘోరం నిజం కాకూడదని అనుకున్నానో అదే నిజమైంది. నిన్న తెల్లవారి పాప స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి బయటకు రాలేదు.

  నంద్యాల నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కోచింగ్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో నంద్యాలను మించిన దారుణ అనుభవాలు….

  అన్నీ కరెక్టుగా రాసిన సమాధానాలకు తప్పు అని రాసి మార్కులు కోత కోయడం. వెనుకబడిన సబ్జెక్టులో సహజంగానే మార్కులు తగ్గితే టీచర్లే గేలి చేయడం… ఈ రోజుల్లో కూడా క్లాసులో అందరి ముందూ ఆమెను బెంచీపై నిలబెట్టి ఆవమానించడం..

  మార్కులు రాకపోయినా ఫరవాలేదు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, ప్రశ్నలు ఎలా రూపొందిస్తారో ప్రాసెస్ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్‌కి హాజరు కామని తల్లీ దండ్రీ కొండంత ధైర్యం, భరోసా ఇచ్చినా నేరుగా అనుభవించేది, కోచింగ్ సెంటర్లనే చేపల తోముడు బండలపై జరిగే ప్రతి ఘటననూ ప్రత్యక్షంగా భరించేదీ తను కాబట్టి ఎంత నరకం అనుభవించిందో..

  కోచింగ్ కాలేజీకి పోవాలంటేనే భయం వేస్తున్న నేపధ్యంలో ఈ పసిపిల్ల ఎంత దయనీయ స్థితిలో తనకు ఇక…. వద్దు అనే నిర్ణయానికి వచ్చిందో మనకు అర్థం కాకపోవచ్చు.

  తోటి పిల్లలు కాదు.. కోచింగ్ వెలగబెడుతున్న కాలేజీ నిర్వాహకులు, టీచర్లే ఒక జీవితాన్ని నిలువునా గొంతు కోసేసారు. తాముంటున్న నిజాంపేటకు దగ్గర్లోని ఓ కాలేజ్ కమ్ కోచింగ్ సెంటర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

  నక్సలైట్లు పూనుకుంటే తప్ప ఈ దేశంలో ఏ ఒక్క అన్యాయ ఘటనకు సంబంధించి కూడా సహజన్యాయం జరగదు కదా.. ఇది నా వ్యక్తిగతాభిప్రాయం… కాబట్టి ఈ కాలేజీకి ఏం జరగదు.. ఈ నిర్వాహకులకు ఏం కాదు. ఆ టీచరాక్షసులకు నెల జీతం తప్ప మరే గుండెకోతలూ కనిపించవు… వినిపించవు…

  అయినా ఈ రోజుల్లో కూడా పిల్లలను బెంచీ ఎక్కి అవమానించడం రాష్ట్ర రాజధానిలోనే అలవాటుగా కొనసాగుతోందా? రూపంలో కార్పొరేట్ కల్చర్.. సారంలో పక్కా ఫ్యూడల్ సంస్కృతి.. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వెలిగిపోతోందని పేపర్లలో మహామేధావుల రాతలు… పత్రికలు చెప్పేది ఎంత నిజమో…. హైదరాబాద్ ఇంత పచ్చి ఫ్యూడల్ కంపుతో ఇంత ఘోరంగా తయారయిందా!

  17 సంవత్సరాలు కన్నబిడ్డకు స్వేచ్ఛనిచ్చి నిజంగా అమ్మఒడిలాగే పొదవుకుని కాపాడుకున్న అమ్మ.. నిన్న ఈ ఘోరం జరిగినప్పటినుంచి ఏడుపు ఆపటం లేదు. లెనిన్ గారితో మాట్లాడుతూంటే పక్కన హృదయవిదారకంగా ఆమె రోదన. కన్నతల్లి మాత్రమే పెట్టగల రోదనలు. ‘రాజుగారూ, అమ్మ ఒడి ఖాళీ అయింది. అమ్మ ఒడిని ఖాళీ చేశారు. అందరూ కలిసి అమ్మ ఒడిని ఖాళీ చేసేశారు..” ఈ రెండు ముక్కలు మాత్రమే ఆమె ఇవ్వాళ మాట్లాడగలిగేరు.’

  24 గంటలూ ఆమెకు తోడుగా ఉండమని, ఒక్క క్షణం కూడా ఆమెను వదలవద్దని లెనిన్ గారికి సలహా ఇస్తుంటేనే మనసులో భరింపరాని బాధ…

  ఆమెకు ఇవ్వాళ ఉదయమే కాల్ చేసి ఏదయినా అనువాద పని ఇస్తే చేయగలరా అని అడగాలనుకున్నాను. గత ఎనిమిది నెలలుగా వీరిద్దరూ మేం చేస్తున్న వికీపీడియా అనువాదాలలో భాగస్వాములు. ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి మధ్యలో రెండు నెలలు గ్యాప్. మళ్లీ ఇవ్వాళ పని చేయగలరా అని ఫోన్ చేయాలనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం..

  రాజేష్ గారూ మీరన్నది నిజం. ఇక్కడ ఊహాగానాలు వద్దు. వీలయితే.. పసిబిడ్డను పోగొట్టుకున్న కన్నవారికి కాసింత ఓదార్పుగా మనం నాలుగు మాటలు మాట్లాడితే చాలు.

  మొబైల్ లెనిన్ గారి వద్దే ఉంది కాబట్టి కాస్త స్వాంతనగా తనను పలకరిస్తే చాలు.

  వారి మొబైల్ నంబర్: 94409 71265

  కన్నబిడ్డకు దూరమై, సర్వం కోల్పోయిన ఈ నిరుపేద తల్లిదండ్రులకు మనం కాసింత సాయం ఆర్థికంగా కాని, ఇతరత్రా కాని ఏదయినా చేయగలమా? వాళ్లు ఏదీ నోరు విప్పి అడిగే స్థితిలో కూడా లేరిప్పుడు. కూకట్‌పల్లి దగ్గిర్లోని నిజాం పేటలో వీరు ప్రస్తుతం ఉంటున్నారు.

  A/c.No. 31223689337 [Yadla Adi Laksmi].
  SBI, Nandyal Branch code. 883.

  Cell No: 9440971265.
  leninyadla@gmail.com
  adilakshmi.yadla@gmail.com

  (నంద్యాల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవలే ఓపెన్ చేసిన పై ఖాతానే వీరు కొనసాగిస్తున్నట్లుంది. )

  మన జీవిత అవసరాలకు పోనూ కాస్త మిగులు ఆదాయం మన వద్ద ఉంటే, ఎంత పరిమితంగా అయినా సరే, ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఈ “అనాథ”లకు కాస్త సాయం చేయగలిగితే బాగుంటుందేమో… ఆలోచించండి… ముందుగా లెనిన్ గారికి పైనంబర్ కి ఫోన్ చేసి స్వాంతన పలుకుదాం…

  జరిగిన ఈ ఘోర దురంతం పట్ల మనలో ఏ ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకోరని నమ్మకముంది. కన్న కోత, గుండెకోతలు కలిసి ముప్పేట దాడికి గురయిన వీరికి వీలయితే కాసింత సహాయం చేద్దాం..

  రాజశేఖర రాజు.
  చందమామ
  చెన్నయ్
  9884612596
  krajasekhara@gmail.com

 7. Snkr on July 15, 2011 10:54 PM

  It is sad to know that an innocent girl ended her life disgusted of routine(though rare these days) punishments at school. I have no words to say…

  May God Srisaila Mallanna give her strength to overcome her immense grief.

 8. Anonymous on July 15, 2011 11:04 PM

  ఎంత ఘోరం? ఎంత ఘోరం? కడుపు కోతతో తల్లడిల్లుతున్న ఆ తల్లిని పలకరించే ధైర్యం ప్రస్తుతానికి నాకైతే లేదు. కాలం తప్ప ఎవరూ ఆమెను ఓదార్చలేరేమో!

  ఏడవనీయండి! కరువు తీరా, ఏడవనీయండి ఆమెను! సమాజానికి ఎదురీదాలనుకున్న నేరానికి, విద్యా ప్రపంచంలో ఉన్నత స్థాయికి బిడ్డ ఎదగాలని కోరుకున్న ఒక సామాన్యమైన కోరిక కు ఆమెకు లభించిన ప్రతిఫలాన్ని చూసి ఏడవనీయండి!

  గీతా ప్రియదర్శినీ, అడుగు వేసేముందు అమ్మ గురించి ఒక్క క్షణమైనా ఆలోచించలేకపోయావా తల్లీ! నీవు లేక అమ్మ జీవిస్తుందనే అనుకున్నావా?

  ఎంతటి అగాధంలోకి అమ్మా నాన్నలను నెట్టివేశావమ్మా!

  ఆది లక్ష్మి గారికి ధైర్యాన్ని ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను

 9. సుజాత on July 15, 2011 11:27 PM

  ఎంత ఘోరం? ఎంత ఘోరం? కడుపు కోతతో తల్లడిల్లుతున్న ఆ తల్లిని పలకరించే ధైర్యం ప్రస్తుతానికి నాకైతే లేదు. కాలం తప్ప ఎవరూ ఆమెను ఓదార్చలేరేమో!

  ఏడవనీయండి! కరువు తీరా, ఏడవనీయండి ఆమెను! సమాజానికి ఎదురీదాలనుకున్న నేరానికి, విద్యా ప్రపంచంలో ఉన్నత స్థాయికి బిడ్డ ఎదగాలని కోరుకున్న ఒక సామాన్యమైన కోరిక కు ఆమెకు లభించిన ప్రతిఫలాన్ని చూసి ఏడవనీయండి!

  గీతా ప్రియదర్శినీ, అడుగు వేసేముందు అమ్మ గురించి ఒక్క క్షణమైనా ఆలోచించలేకపోయావా తల్లీ! నీవు లేక అమ్మ జీవిస్తుందనే అనుకున్నావా?

  ఎంతటి అగాధంలోకి అమ్మా నాన్నలను నెట్టివేశావమ్మా!

 10. chandamama on July 15, 2011 11:59 PM

  సుజాత గారూ, మీరు చెప్పింది ఎంత నిజం? ఇలాంటి ఘోరాలకు పాల్పడే కుర్రాళ్లలో ఏ ఒక్కరూ మన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరండీ. తనకి ఇరవయ్యేళ్లొచ్చినా గోరుముద్దలు పెట్టే తల్లికి తను లేకపోతే గుండె బద్దలైపోతుందని అనుకోరు. పిల్ల చచ్చిపోయింది…తల్లి చావనూ లేదు, బతకనూ లేదు. ఎంత నరకం…ఆ నరకం గురించి పిల్లలు ఒక్క సారి ఆలోచిస్తే ఎంత బాగుండును….

  లక్ష్మీ గాయత్రి
  gayatri_kakinada@yahoo.com

  మనసు కలత పడింది. ఆదిలక్ష్మి గారి ప్రియదర్శిని భగవద్గీత వాక్యమై శారీరం కేవలం కర్మకుర్వన్ అన్నట్లు మనల్ని అచేతనుల్ని చేసి తిరిగిరాని లోకానికి తరలిపోయింది. సముద్రునికి అందులోని జలముతో అర్ఘ్యమిచ్చినట్లు ఆదిలక్ష్మి గారికి శోక కన్నీటి మున్నీటితో అశ్రు తర్పణ మిస్తూ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాము ………….. మార్కండేయులు

  జొన్నలగడ్డ మార్కండేయులు
  hydjmlu@gmail.com
  Fri, Jul 15, 2011 at 11:08 PM

  చాలా బాధగా ఉంది. ఆదిలక్ష్మి గారి దు:ఖం మనందరిదీ.
  బ్లాగు నడుపుతోందంటే… తన భావాలను చక్కగా వ్యక్తీకరించగలుగుతోందనే కదా? అలాంటిది గీతా ప్ర్రియదర్శిని ఎందుకిలా తన మనసులో బాధను అమ్మానాన్నలతోనో, స్నేహితులతోనో పంచుకోకుండా తనలో దాచుకుని, ఎందుకిలా తొందరపడిందో అర్థం కావటం లేదు.

  venuniha@gmail.com
  సిహెచ్ వేణు
  Fri, Jul 15, 2011 at 11:10 PM

 11. Lakshmi Gayatri on July 16, 2011 1:46 AM

  I said “Cruel friends”…but it is not the friends or teachers that are cruel..it it the educational system that is SOOOOO cruel now a days…it it the lifestyle that has become very sadist now a days..it is the competetive world that has become very very idiotic this day…all these things take the lives of sensitive youth like Gita Priyadarsini. I STRICTLY SAY,NOW A DAYS YOUTH HAVE TO DEVELOP PITY TOWARDS THEIR PARENTS AND DEVELOP SPIRIT OF CHALLENGE TO FACE THE REALITIES OF LIFE. THIS IS FIRST…NOT THE STUDIES….

 12. chandamama on July 16, 2011 2:50 AM

  Our Deepest condolences to the Mother.Aa Talli garbhasokam evarikii vaddu

  Allamraju Venkatarao
  sudhama_51@yahoo.com
  Fri, Jul 15, 2011 at 11:37 PM

 13. దువ్వూరి వేణుగోపాల్ on July 16, 2011 2:53 AM

  పోస్టు చదువుతూంటే చాలా బాధకలిగింది.

  అమ్మఒడి చాలా పోస్టులు నేను చదివాను. అలాగే పాలమీగడ కూడాను. తనపరిచయమే చాలా బాగా చేసుకుంది – బాపు స్టైల్ లో.

  నిజమే పిల్లలకు తమతలిదండ్రుల బాధ తెలియదు.

  ఆదిలక్ష్మి గారికి, లెనిన్ గారికి మా ప్రగాఢ సంతాపాలు. విశ్వనాథుడు గీతా ప్రియదర్శిని ఆత్మకు శాంతిని ప్రసాదించు గాక

 14. chandamama on July 16, 2011 3:25 AM

  వార్త చూసి చాలా బాధ కలిగింది. ఆదిలక్ష్మి గారితో ప్రత్యక్ష పరిచయం లేకపోయినా రాజుగారి బ్లాగులో ఇచ్చిన లింకులద్వారా వారి బ్లాగు అలాగే వారి అమ్మాయి గీతా ప్రియదర్శిని బ్లాగు చూసాను. అంత ఆహ్లాదంగా తోటి బ్లాగర్లతో ఆలోచనలను పంచుకున్న ఆ చిన్నారి, తనకు తాను ‘నకిలీ బాపు’ అంటూ సంబోధించుకొని, తను వేసిన బొమ్మలపై వచ్చిన కామెంట్లను చాలా పాజిటివ్ గా తీసుకొన్న ఆ పాల మీగడ ఇంత బేలయై తన ప్రయాణాన్ని అర్ధంతరంగా ముగించడం హృదయాన్ని కదిలించింది. తనకేమైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ఎప్పుడూ వెంట వుండే తల్లిదండ్రులతో పాటూ, బ్లాగు లోకం ద్వారా ఇందరు ఆత్మీయులనీ శ్రేయోభిలాషులనీ సంపాదించుకున్న ఆ చిట్టితల్లి తన కష్టాన్ని మాత్రం తనలోనే వుంచుకొని మనందరికీ దుఖాన్ని మిగిల్చింది..!
  ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
  – రాధేశ్యాం
  radhemadhavi rudravajhala
  radhemadhavi@gmail.com
  Sat, Jul 16, 2011 at 1:20 AM

 15. chandamama on July 16, 2011 5:42 AM

  చదువులో మొద్దును కాను…!
  సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య
  న్యూస్ టుడే: ఓ బాలిక తన తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లెనిన్‌బాబు, సరిత -యడ్ల ఆదిలక్ష్మి, పేరు మారింది- దంపతులు రెండు మాసాల కింద నగరానికి వచ్చి నిజాంపేట గ్రామంలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి ఒక్కగా నొక్క కుమార్తె ప్రియదర్శిని (16). ఈమె నంద్యాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హైదరాబాద్‌లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇందుకు గాను ప్రస్తుతం ప్రవేశం కోసం ఆయా కళాశాలల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.శుక్రవారం ఉదయం 7.30 వరకు తన గదిలోంచి ఆమె బయటకు రాకపోవడంతో తల్లి సరిత తలుపు తట్టారు. ఎంతకీ పలకకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి లెనిన్‌బాబు తలుపులు పగలగొట్టి చూడగా ప్రియదర్శిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను చదువులో మొద్దుకానని రాసింది. తల్లిదండ్రులకు నమస్సారం అంటూ అందులో పేర్కొంది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కళ్లను ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఈనాడు ఆన్‌లైన్‌లో హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన ఈ వార్త కాస్త ఆలస్యంగా అందింది. “చదువులో మొద్దును కాను…” తనను బెంచిపై ఎక్కించి నిలబెట్టి అవమానించిన ఆ ఘోరమైన కాలేజిపై -నిజాంపేట-, డల్ స్టూడెంట్ అని వట్టిపుణ్యానికి వెక్కిరించిన వారిపై ఈ పసిపాప ప్రకటించిన ధిక్కార స్వరం ఎంత నైర్మల్యంతో ఉందో గమనించండి. నిన్న ఉదయం రెండుమూడు సార్లు తను ఉన్న గదిలోకి పాప వచ్చిందని, తనకు జరిగిన అవమానంపై ఆమె మనసులో ఇంతగా వేదన రగులుతోందని అసలు ఊహించలేకపోయానని లెనిన్‌బాబు గారు ఈ ఉదయం ఫోన్‌లో చెబుతుంటే గుండె పట్టేసింది.

  రేపటినుంచి ఈ చిన్నారి కళ్లు ఈ ప్రపంచాన్ని సరికొత్తగా చూస్తుంటాయి. మరొక మనిషికి జీవనదానంగా మారిన కళ్లు.. తను మొగ్గలా ఉన్నప్పుడు కూడా ఎవరినీ ద్వేషించని ఆ కళ్లు.. తను మొద్దును కాను అని మాత్రమే చివరిసారిగా విన్నవించుకున్న ఆ కళ్లు… బండబారిపోయిన మన మహా వ్యవస్థలను ప్రశ్నిస్తున్న ఆ కళ్లు….

  టీచర్‌గా పనిచేస్తున్న నా మిత్రుడు నాగరాజు కొన్ని రోజుల క్రితం ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. దేశం మొత్తం మీద కాంపిటీషన్ పరీక్షలకు, పోటీ చదువులకు, కోచింగ్ చిత్రహింసలకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్రయోగశాలగా మారిందని, ఇక్కడ సీటు, ర్యాంకు సంపాదించుకుంటే దేశంలో ఎక్కడైనా పోయి చదివేయవచ్చని, బతికేయవచ్చని చెప్పాడు. రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఎవరికీ సీటు గ్యారంటీ అని చెప్పలేనంతగా పోటీ పెరిగిపోయిందని ఈ రాష్ట్రంలో సీట్లు సంపాదించుకోవడం అంత సులభం కాదని తన అనుభవంతో చెప్పాడు..

  చదవటం, బతకడం తర్వాతి మాట. ఎంత మంది అర్థాంతర మరణాలను, అసహజ మరణాలను ఇంకా మనం మన గొప్ప రాష్ట్రంలో చూడాల్సి ఉందో అని ఇవ్వాళ మళ్లీ భయమేస్తోంది నాకు….

 16. chandamama on July 16, 2011 5:52 AM

  చందమామ మిత్రులందరికీ!

  గుండెలు పిండేసే ఈవార్త ,ఏతల్లినైకా ఏమనసున్న మానవుడినైనా బాధించక మానదు. మానవ మృగాలు ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తే పరిమాణం ఇలాగే ఉంటుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి ఏమాత్రం తగని వారు నేడు గురువులు! ఇలాంటి విద్యాసంస్థలను వెంటనే మూసేయాలి.లాయర్ నోటీసివ్వాలి.ఆ సంస్థను మూసేయాలి .ఎంతమంది తల్లుల కడుపులకు కోతపెడతారో వీరు! ఇహముందు. ఎవ్వరూ వీరిని క్షమించరు. చాలాచాలా బాధపడుతూ ..ఆదూరి.హైమవతి.

  ఈనాడువార్త రాధేశ్యాం గారు పంపగా చూశాను. ఎంత దయనీయం. అన్నీ పంచుకుని ప్రాణసమానమైన అమ్మనాన్నలకు తనబాధ చెప్పుకోక స్వంతనిర్వయం తీసుకుని వారిని దుఃఖ సాగరంలోముంచిన ఆ చిన్నారి ఆత్మకు మనశ్శాంతి కలిగించాలని దేవుని ప్రార్ధిస్తూ..ఆదూరి.హైమవతి.

 17. chandamama on July 16, 2011 9:48 AM

  మీ బ్లాగ్ లోకి వచ్చి చదివి జరిగిన విషాదం గురించి తెలుసుకున్నాను . తెలుసుకొని ఏం చేస్తాము? బాధ, సమాజం మీద కోపం, పిల్లల్ని మనం సరిగా పెంచలేక పోతున్నాం అని చికాకు, మనం బాగా పెంచుతున్నా, వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అని నిస్సహాయత.

  ఇవన్నీ బాధలు ఎదుటివారివి అయినప్పుడు…ఆ విషాదం ఆ కుటుంబానిదే కాదు, మీ సహానుభూతి తో ఇప్పుడు అది అందరిదీ…

  మీ మెయిల్ రాకపోతే ఈ దుర్వార్త తెలిసేది కాదు. అన్నీ జరిగిపోయాక మనకు తెలిసినా మాత్రం ఏం చేయగలము?

  ఆడపిల్లల స్వాభిమానం ఈ దేశంలో ఇంకా ఒక సమస్యగా ఎన్ని శతాబ్దాలు మిగిలి వుంటుందో…అర్థం కావటం లేదు.

  కల్పనా రెంటాల
  kalpana.rentala@gmail.com

 18. Advani on July 16, 2011 11:48 PM

  క్షమించండి. టీచర్లను మాత్రం ఆడిపోసుకోవడం, అలాంటి కోచింగ్ సెంటర్లని తెలిసి అందులోకే చచ్చీచెడీ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఏమాత్రం భాధ్యత లేదంటారా? టీచ్చర్లు వత్తిడి చేయకుంటే పిల్లలు ఏదో పాస్ అయ్యామనిపిస్తే తల్లిదండ్రులు అలాంటి స్కూళ్ళలో పిల్లలను చేర్పిస్తారా? ఏమిటో! సందు దొరికింది కదా అని తలా ఓ చేయి టీచర్లమీద, కోచింగ్ సెంటర్ల మీద వేయకపోతే మరీ అంత సున్నితంగా, బెంచీ ఎక్కు అన్నదానికే ‘ఆడపిల్లల స్వాభిమానం’ దెబ్బతిన్నది అంటే ఎన్ని తొడపాయసాలు, ఎన్ని ఈత బెత్తం దెబ్బలు, గోడకుర్చీలు, ఆడపిల్లలతో ముక్కు-చెంపలు వేయించుకున్న నా చిన్నతనం ఏనాడో … వీరస్వర్గంలో గడిచేది.
  అంత సున్నితమైన మనస్థత్వం వున్న పిల్లల కాస్త రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి. లేదా మామూలు స్కూళ్ళలో చేర్పించి నిధానంగా చదవమనాలి. పదోక్లాసునుంచి సివిల్ సర్వీసస్ కోచింగ్ ఇప్పించే స్కూళ్ళలో దూరిపోయి ఏదో రెండు చేతులా సంపాదిచ్చేద్దాం అనే ఆశలు కొంత ఆలోచించి తగ్గించుకోవాలి.
  నే చెప్పేదేమంటే…. ఇలాంటి విషయాల్లో 360 డిగ్రీల్లో వ్భిన్న కోణాల్లో చూడాలి. ఎర్రజెండ పాతుతాం అని చికెన్నారయణలా ఆవేశ పడిపోనవసరం లేదు.

 19. ramachary bangaru on July 17, 2011 8:44 AM

  chinnari priyadarshini aatmahatya hrudayanni kalachivesindi.mare tallidandrulaku ilaanti kadupukotha kalagavaddu ani kanipinchani aadevuniki, kanipinche peddalaku vinnavinchu kuntunnanu.vyadartha hrudayamtho inthakanna maremi rayagalanu.priyadarshini tallidandrulanu vodarchatamtho batu aadukovalasina bhadyatha manaandaridi.

 20. chandamama on July 17, 2011 2:40 PM

  “మరీ అంత సున్నితంగా, బెంచీ ఎక్కు అన్నదానికే ‘ఆడపిల్లల స్వాభిమానం’ దెబ్బతిన్నది అంటే ఎన్ని తొడపాయసాలు, ఎన్ని ఈత బెత్తం దెబ్బలు, గోడకుర్చీలు, ఆడపిల్లలతో ముక్కు-చెంపలు వేయించుకున్న నా చిన్నతనం ఏనాడో … వీరస్వర్గంలో గడిచేది. అంత సున్నితమైన మనస్థత్వం వున్న పిల్లలు కాస్త రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి” అంటూ ఈ కథనంపై అద్వాని -?- గారు చేసిన వ్యాఖ్యకు సానుకూల కోణం కూడా ఉంది.

  మా చిన్నతనంలోనూ ఇలాంటి ఘోరావమానాలు ఊరిబళ్లల్లో ఆరేడేళ్లపాటు మేం కూడా ఎదుర్కొంటూనే వచ్చాం. చదువు రాకపోతే పల్లెల్లో ఏదో ఒక వృత్తి చూసుకోవచ్చు.. సేద్యం చేసుకుని బతకవచ్చు అనే భరోసా ఆరోజుల్లో ఉండేది కాబట్టే మా తరంలో పిల్లలకు కుటుంబాలనుంచి, పాఠశాలల నుంచి పెద్దగా ఒత్తిడి ఎదురవ్వలేదు.

  కాని చదువు, ర్యాంకులు, ఉద్యోగం అనేవే జీవితానికి గ్యారంటీ కార్డులు అనే ధోరణి ప్రబలిపోయిన ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులదీ, సమాజానిదీ కూడా ఒకటే బాట. సమస్త వృత్తుల పట్ల నమ్మకం సడలుతున్న పాడుకాలంలో చదువు ఒక్కటే బతుకును నిలిపే ఏకైక వృత్తి అనే భావజాలం అందరిలో ఘనీభవించిపోయింది. కేవలం అరమార్కు వెనకబడితే వందల స్థానాల వెనక్కు నెట్టబడుతున్న వాస్తవం ఈ దేశంలో అందరినీ కాల్చివేస్తోందిప్పుడు. చదువే లక్ష్యంగా తయారైనచోట ఒకవైపు పిల్లలకు మరొకవైపు పెద్దలకు, సమాజానికి కూడా దూరం పెరిగిపోతున్నట్లుంది.

  ప్రేమరాహిత్యంతో కూడిన ఈ అసహజ మరణాలు మన సమాజానికి తప్పవు. కాని ఈ విషవలయం నుంచి బయటపడటానికి, మార్కులకు, ర్యాంకులకు వెలుపల జీవితం చాలా విశాలంగా ఉందన్న వాస్తవాన్ని పిల్లలకంటే, పెద్దలకు తెలిపేందుకు ఎలాంటి సామాజిక ప్రయత్నమూ జరగకపోవడమే అన్నిటికన్న మించిన విషాదం. చదివి ఎక్కడికో వెళ్లిపోవాలనే దురాశ, వ్యక్తిగత జీవిత సుఖాల ప్రాతిపదికగా పుడుతున్న ఈ దురాశ అన్నిస్థాయిల్లో చాలామందిని కాల్చివేస్తోంది.

  కుటుంబాలకు బయటి కారణాల వల్ల జీవితాలు అర్థాంతర ముగింపుల బారిన పడుతున్నప్పుడు అందుకు తల్లిదండ్రులనే కారకులుగా చూపటం అనేది, మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం అనే వాస్తవాన్ని పక్కకు పెట్టేస్తుందేమో ఆలోచించాలి. ఇక్కడే అందరి ఆలోచనలు వేరువేరవుతున్నట్లున్నాయి.

  చదువు లేకున్నా, కోట్లమంది తమ తమ స్థాయిలలో బతకగలుగుతున్నప్పుడు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలకు మాత్రమే ఈ వేలం వెర్రి వెంపర్లాటకు నేపథ్యం ఏమిటో ఆలోచిస్తే బాగుంటుంది. ఈ విషయం తప్పితే మీ వ్యాఖ్యను తిరస్కరించవలసిన కారణం నాకయితే కనిపించడం లేదు.

  తన బిడ్డను చేపలబండ కేసి తోమడానికి అంగీకరించము అని ప్రకటించిన కుటుంబానికే ఈ ఘోరం ఎదురైంది. ఈకోణంలోంచే ఈ దంపతులకు సానుభూతి ప్రకటించవలసిన అవసరముంది. పైగా వీళ్లు డొనేషన్లమీద డొనేషన్లు కట్టి తమ పాపను ఎక్కడికో తీసుకెళ్లగలిగేంత ఆర్థిక వనరులను కలిగి లేరు కూడా. తమ నివాస ప్రాంతానికి దగ్గర్లోని సాధారణ కోచింగ్ సెంటర్‌లోనే పాపను చేర్పించారు. ఇక్కడ కూడా పిల్లలకు ఈ ఘోరం ఎదురైతే.. ఇక వారికి రక్షణ ఎక్కడుంది?

  కన్నతల్లి కోలుకుని స్వయంగా ఏం జరిగిందని వివరిస్తే తప్ప ప్రియదర్శిని అకాల మరణం వెనుక పూర్వాపరాలు పూర్తిగా తెలియకపోవచ్చు.

 21. Chandamama on July 18, 2011 12:25 AM

  ఇప్పుడే చూస్తున్నాను. చాలా దిగ్భ్రాంతికరమైన వార్త.
  ఆదిలక్ష్మి గారి బ్లాగులు, కథలు చదివి నేను ఎంత స్పూర్తి పొందానో నాకే తెలియదు. అలాంటిది తన గారాలపట్టికి అలాంటి కథల ద్వారా ఖచ్చితంగా ఎంతో ధైర్యం నూరిపోసి ఉంటుంది. అంతటి ధైర్యాన్ని కూడా కదిలించేటట్లుగా ఆ చిన్నారిని ఎవరు బాధపెట్టారో! అంతటి అవమానం చేసిన వారిని ఊరికే వదిలిపెట్టకూడదు.

  ఈ దుఃఖం నుంచి ఆమె తొందరగా బయటపడేందుకు ఆ దంపతులకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

  ఇట్లు
  రవిచంద్ర
  ravichandra.enaganti@gmail.com
  Mon, Jul 18, 2011 at 10:38 AM

 22. chandamama on July 18, 2011 5:40 AM

  Probably I don’t have enough words to express my heart felt condolences. I was dumbstruck after I read the news in Raju gari’s blog. Neither my words nor my messages can heal the pain that poor mother is crushed with, but still, Adi Lakshmi garu please make yourself strong and I damn condemn the education system in India and may God save all the kids who are undergoing so much torture in their lives in the name of studies. It’s a shame for all the parents who are responsible for pushing our education system into such a pathetic state and not sure how many more lives this education system is going to gulp like a monster.

  With deep condolences

  Sai laxmi
  sailaxmik@gmail.com
  Mon, Jul 18, 2011 at 3:48 PM

 23. chandamama on July 20, 2011 1:51 PM

  కల్పనగారూ,

  “ఆడపిల్లల స్వాభిమానం ఈ దేశం లో ఇంకా ఒక సమస్య గా ఎన్ని శతాబ్దాలు మిగిలి వుంటుందో…అర్థం కావటం లేదు.”

  సరిగ్గా వందేళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు తన అసంపూర్ణ నవలలోనే అనుకుంటాను.. క్రాంతదర్శనం చేస్తూ ఒక మెరుపువాక్యం రాశారు.

  “ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరగ రాస్తారు”

  మగవాళ్ల అడుగులకు నాలుగడుగుల వెనుకగా మాత్రమే నడవడం అలవాటుగా చేసుకున్న ఈ దేశ మహిళలు గడచిన వందేళ్లలో చాలా దూరం నడిచారు. చరిత్రను తిరగ రాస్తూనే నడుస్తున్నారు.

  కాని ఆడపిల్లల స్వాభిమానం సమస్య ఇంకా ఎన్ని శతాబ్దాలుగా మిగిలి ఉంటుందో అర్థంకావడం లేదన్న మీ వ్యాఖ్య ప్రియదర్శిని విషాదమరణం సాక్షిగా ఇంకా ప్రశ్నలు రేపుతూనే ఉంది.

  ఒత్తిళ్ల జీవితంలోనూ మీరు ప్రకటించిన సహానుభూతికి, స్పందనకు ధన్యవాదాలు.

  ప్రియదర్శిని విషాదాంతం పట్ల సహానుభూతిని ప్రకటించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు…

 24. Facebook Fans on December 23, 2011 10:34 AM

  Extra Reading…

  […]we like to honor other sites on the web, even if they aren’t related to us, by linking to them. Below are some sites worth checking out[…]…

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind