జానపద కథా వైశంపాయనుడు దాసరి పుస్తకావిష్కరణ

January 30th, 2011

హైదరాబాద్‌ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో జనవరి 27 సాయంత్రం జరిగిన  దాసరి సుబ్రహ్మణ్యం గారి 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతానికి ఇక్కడ చూడగలరు.  సాధారణ పాఠకుల కంటే కథకులు, రచయితలు, ప్రచురణకర్తలే అధికంగా పాల్గొన్న ఈ సభలో, చందమామ సీరియల్స్  రచయిత, జానపద కథా వైశంపాయనుడు దాసరి గారు నాలుగు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, యువ మాసపత్రికలలో రాసిన  రెండు అపరూప సీరియల్స్‌ని, ఆయన రాసిన 40 ఇతర కథలను కలిపి మూడు పుస్తకాలుగా వాహినీ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

ఎవరు లేకుంటే నేటి తరం పాఠకులకు కూడా అలనాటి జానపద సీరియల్స్ చదివే అవకాశం, చందమామ వైభవోజ్వల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండేది కాదో ఆ మంచి మనిషి రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయిగారు,  ఆయనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ బృహత్ యజ్ఞంలో తనదైన పాత్ర వహిస్తున్న శ్రీ దాసరి వెంకటరమణ గారు పది మంది మాట, చేత సాయంతో తీసుకువచ్చిన అరుదైన పుస్తకాలివి.

ప్రపంచం ఇంతగా ఎదగని మంచి కాలంలో విలసిల్లిన మన కథా సాంస్కృతిక వైభవాన్ని మళ్లీ మనముందు ఆవిష్కరించడానికి వీరు చేసిన ప్రయత్నాలు, ఉడతాభక్తిగా ఈ గొప్ప కృషిలో తలొక పాలు పంచుకున్న మాన్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు.

ఈ పుస్తకావిష్కరణ ఫోటోలను చూడటానికి ముందు చందమామ అభిమాని, మనసులో మాటలు పదిమందితో పంచుకునే సుజాత గారు హృద్యంగా తెలిపిన ఈ సభ విశేషాలను క్లుప్తంగా కింది లింకులో చూడగలరు.

వచ్చేశాయి…అద్భుత జానపద నవలలు !

http://manishi-manasulomaata.blogspot.com/2011/01/blog-post_28.html

ఒకే ఒక్క మాట. ఈ పుస్తకాలను కొని చదవకపోతే, మన పిల్లలకు, ముందుతరాల వారికి చెప్పి, చూపి చదివించకపోతే మన ఒకనాటి కథా సంస్కృతికి దూరంగా ఉన్నట్లే. తెలుగు జనపదాలలో పుట్టి పెరిగిన కథ విశ్వరూపాన్ని మనం దాసరి గారి ఈ రెండు సీరియల్స్ -మృత్యులోయ,  అగ్నిమాల- లో సమగ్రంగా దర్శించగలం.

మృత్యులోయ – బొమ్మరిల్లు పత్రికలో 39 నెలల పాటు వచ్చిన పెద్ద సీరియల్

అగ్నిమాల – చక్రపాణి గారి కోరిక మేరకు దాసరి సుబ్రహ్మణ్యం గారు యువ మాసపత్రికలో రాసిన     మహోజ్వల జానపద నవల

దాసరి సుబ్రహ్మణ్యం కథలు – విలక్షణ కథాంశాలు, అసాధారణ శిల్పం, సజీవమైన పాత్రల మేలుకలయికతో జీవితపు పలు పార్శ్వాల్ని తడిమి మనసులను చెమ్మగిల్లజేసే ఆధునిక కథలు

ఈ మూడు పుస్తకాల వెల రూ. 360 మాత్రమే.  ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుతున్న పాడుకాలంలో ఇంత వెలపెట్టి పుస్తకాలు కొనే శక్తి మనలో చాలామందికి లేకపోవచ్చు.

కాని లాభాపేక్ష అనేది లేశమాత్రంగా కూడా లేని శాయి గారు పది కాలాల పాటు మళ్లీ మళ్లీ ఇలాంటి అరుదైన పుస్తకాలను మనకు అందించాలంటే మనం పుస్తకాలను తప్పక తీసుకోవలసిందే. ఇంతకు మించి ఒక్క మాట అదనంగా చెప్పినా ఇక అతిశయోక్తిగానే ఉంటుంది. ఈ పుస్తకం ప్రచురణ ఖర్చులయినా వస్తే దాసరి గారి మరి కొన్ని సీరియల్స్‌ ప్రచురణ భారాన్ని తలకెత్తుకుంటానని శాయిగారు సభలోనే చెప్పారు కూడా.

దయచేసి ఈ పుస్తకాలను కొనండి. మంచి ప్రయత్నాన్ని ఆదరించండి.

ఈ మూడు పుస్తకాలూ దొరకు చోటు

వాహినీ బుక్ ట్రస్ట్,
1-9-286/పి/2విద్యా నగర్
హైదరాబాదు

ఫోన్ :040-27071500

మొబైల్: 09948577517 (‘రచన’ శాయి గారి సెల్‌ఫోన్)

వీలైనంత త్వరలో ఈ ఆవిష్కరణ సభ గురించి మరికొన్ని వివరాలను ఇక్కడే తెలుసుకుందాము.

ఇక సభలో తీసిన కొన్ని పోటోలను అందినమేరకు ఇక్కడ చూద్దాం.

దాసరి సుబ్రహ్మణ్యం గారు

బొమ్మరిల్లు సీరియల్

మృత్యులోయ వెనుకపేజీ

మృత్యులోయ ఇన్నర్ కవర్

మృత్యులోయ ఇన్నర్ కవర్

అగ్నిమాల - యువ సీరియల్

అగ్నిమాల వెనుకపేజీ

దాసరి కథలు కవర్ పేజీ

ఆవిష్కరణ సభలో దాసరి గారి రచనల ప్రదర్శన

భాగ్యనగరి సిటీ సెంట్రల్ లైబ్రరీ హాల్‌లో గోడ బొమ్మలు

శ్రీ విజయబాపినీడు, శ్రీ దాసరి వెంకటరమణ, శ్రీ సురేష్ - మంచిపుస్తకం ఫేమ్

శ్రీ దాసరి వెంకట రమణ

చందమామ ఫ్యామిలీ

సభకు విచ్చేసిన వారిలో కొందరు మాన్యులు

దాసరి గారి మూడు పుస్తకాల గురించి ఇక ఏమీ చెప్పనవసరం లేదు. ప్లీజ్… కొని చదవండి. మీ పిల్లలచేత చదివించండి.  వాళ్లకు  చదివే సమయం అంటూ ఉంటే…..

(దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి మరియు పుస్తకావిష్కరణకు చెందిన ఫోటోలు, పుస్తకాల కవర్ పేజీ బొమ్మలు సకాలంలో పంపిన రచన శాయి గారికి, దాసరి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు)

రాజు

చందమామ

RTS Perm Link


13 Responses to “జానపద కథా వైశంపాయనుడు దాసరి పుస్తకావిష్కరణ”

 1. SIVARAMAPRASAD KAPPAGANTU on January 30, 2011 6:16 PM

  రాజుగారూ, ఈ అద్భుత కార్యక్రమానికి రాలేని నా అశక్తత ఎప్పటికీ నన్ను బాధిస్తుంది. బొమ్మరిల్లు అనుబంధంగా వచ్చిన కథలు (రచయితా పేరు గుత్తా విజయలక్ష్మి అని పేరు వేసి ఉన్నది) దాసరివారే వ్రాశారా? అదే నిజమైతే ఆ పుస్తకాలు అన్ని నా దగ్గర ఉన్నాయి. మరొక సంపుటి ఎప్పుడు వస్తే అప్పుడు అందులో ప్రచురించటానికి నేను పంపుతాను. ఆ తరువాత, ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా చందమామలో వచ్చిన దాసరి గారి ధారావాహికలు అన్ని కూడా చిత్రా గారి బొమ్మలతో సహా ఒకే సంపుటిగా తేగలమా అన్న విషయం నిన్ననే చర్చించాము. చందమామ అభిమానులు ఆపైన దాసరి గారి జానపద ధారావాహికల అభిమానులు, ఆ ధారావాహికలలో చిత్రా బొమ్మల అభిమానులు, అందరూ పూనుకుంటే తప్పకుండా జరిగే అవకాశం కనపడుతున్నది.

 2. chandamama on January 30, 2011 9:09 PM

  నా జీమెయిల్ ఐడీ ద్వారా ఈ కథనం లింకును షేర్ చేసినప్పుడు వచ్చిన కొన్ని స్పందనలను ఇక్కడ పోస్ట్ చేయడమైనది. నా చందమామ బ్లాగు, కొత్తగా రూపొందించుకున్న కాంతిసేన బ్లాగు రెండింటికి ఒకే జీమెయిల్ ఐడీని పొందుపర్చడంతో చందమామ బ్లాగుకు వ్యాఖ్యలు రావడం పూర్తిగా నిలిచిపోయింది. వేణువు గారు ఇటీవలే పంపిన వ్యాఖ్య కూడా ఇలాగే రాలేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు నా జీమెంయిల్ ఐడీకి వచ్చే వ్యక్తిగతేతర స్పందనలను అవసరాన్ని బట్టి ఇక్కడ పోస్ట్ చేయడమవుతుంది.

  సత్వర స్పందన పంపిన లలిత, శివరాం ప్రసాద్, వి.బి సౌమ్య, రోహిణీ ప్రసాద్ గార్లకు ధన్యవాదాలు
  ————–

  Raju garu,
  Thanks for sharing.
  I read about it in Sujata garu’s blog too earlier.
  I will get a copy of this book.
  I will tell my freinds and family too.

  I also have to renew my Chandamama subscription. I will do that in next couple of days.

  Regards,
  Lalitha.
  ———————
  రాజుగారూ,
  నేను హైదరాబాదు రాలేక పోవటం నా దురదృష్టం. ఈ విషయం నన్ను చాలా రోజులు బాధ పెడుతుంది.

  నిన్న ఇక్కడ నేను శ్రీనివాస్ కలిసి ఒక అద్భుత వ్యక్తిని కలిశాము. ఆయనే రాయుడుగారు. నిస్వార్ధంగా ప్రముఖ రచయితల రచనలు సంపూర్ణ సంపుటులుగా తీసుకువస్తున్న ఒక మహా ఉద్యమం ఈయన. ఇప్పటికే కాళీపట్నం, రాచకొండ, శ్రీ శ్రీ రచనలను సమగ్రంగా ప్రచురించారు. ఇటువంటి నిస్వార్ధ సేవ ఇంకెవరు చేస్తున్నారు. ఇంతవరకు తెలియదు . ఆయనతో మన దాసరి గారి రచనల గురించి చందమామ లో వచ్చిన ధారావాహికలను అన్ని చిత్రా బొమ్మలతో సహా ప్రచురించటం గురించి చర్చించటం జరిగింది. ఆయన అదేమీ పెద్ద విషయం కాదు, కాపీ రైటు ఎవరి దగ్గర ఉన్నది. దాన్నిబట్టి మన చెయ్యచ్చు అని చెప్పారు.

  కాబట్టి, మీరు ఈ విషయంలో చొరవ తీసుకుని మీ చందమామ యాజమాన్యం తో సంప్రదించ గలరు. మీ ఉద్యోగరీత్యా ఈ విషయం మీరు చొరవ చూపిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటే, మీరు చెయ్యవద్దు. అప్పుడు, నాకు చందమామలో ఎవరితో సంప్రదించాలి, వారి ఫోన్ నెంబరు, ఈ మెయిలు వంటి వివరాలు తెలియచేయగలరు. వారితో నేను సంప్రదించగలను . చందమామ వీరాభిమానులు, ఒక వంద మంది తలా ఒక రెండువేల రూపాయలు వేసుకున్నా రెండు లక్షలు పోగవుతాయి. ఆపైన రాయుడు గారి వంటి సాహిత్య అభిమానులు ఉన్నారు. అసలు చందమామ వారి ఉద్దేశ్యం తెలిస్తే మనం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చెయ్యవచ్చు.

  దయచేసి వెనువెంటనే ఏ విషయం చెప్పగలరు. ఆత్రుతతో ఎదురుచూస్తుంటాను.

  శివరామప్రసాదు కప్పగంతు
  SIVARAMAPARASAD KAPPAGANTU
  బెంగుళూరు
  http://naablaagulu.blogspot.com/
  ——————————
  బాగుందండీ.
  థాంక్స్!
  సౌమ్య.
  Sowmya V.B.
  ————————
  Very nice Raju garu, thanks.

  K.Rohini Prasad

  చందమామ రాజు గారికి!
  కృతఙ్ఞతలు. చాలా సంతోషం.ఆ ఫోటోలో శాయిగారిపక్కన కుడి చివరగా ఉన్నది మీరేమో అనుకుంటాను. సరా! ఈకన్నడ భూమిలో ఏ తెలుగు విషయాలూ తెలీవు. పేరుతెలీకుండా రచనలు చేసి అందర్నీ మెప్పించి , మురిపించి ఆబాలగోపాలాన్నీ జానపద కధల చదువరులనుచేసిన ‘ దాసరిగారికి ‘ ప్రధమ వర్ధంతి , [ అలా అనడం బాధే ఐనా ] ప్రధమ సంస్మృతీ సభలో ఆయనకు అర్పించిన నివాళులు [3పుస్తకాలూ ] మెచ్చదగినవి. అప్పుడు అవి చదివానో లేదో గుర్తులేదుగానీ , పేర్లు విన్న గుర్తుంది. వీలువెంట చదివే ప్రయత్నంచేస్తాను.నన్ను గుర్తుంచుకుని లింకులు పంపడం మీ సహృదయం.

  చందమామ చదువరి,
  హైమవతి.ఆదూరి.

  thanks raju garu- i have bought all the three books while returning from the function.
  regards
  bhandaru srinivasrao
  ————

  రాజుగారూ, నమస్తే! మీ పోస్టు సమగ్రంగా ఉంది. నేను మాటర్ ఎక్కువవౌతుందేమో అని ఫొటోలు తక్కువ పెట్టాను. మొత్తానికి ఈ కారణంగా మిమ్మల్ని కలుసుకోవడం ….అందునా మా ఇంట్లో..ఎంతో సంతోషకరమైన విషయం!

  మీరు ప్లీజ్…అని పాఠకులను బతిమాలక్కర్లేదు సార్, అమెరికా నుంచి, జర్మనీ నుంచి ఇద్దరు స్నేహితురాళ్ళు ఈ పుస్తకాలు కావాలని ఉత్తరాలు రాశారు. అలాగే ఇక్కడ కూడా ఎంతోమంది కొంటారు చూడండి!

  దాసరి గారి మరో రచన గురించి ఆసక్తికరమైన సమాచారం నిన్ననే తెలిసింది.
  తర్వాతి మెయిల్లో రాస్తాను.

  -సుజాత

 3. Jwala Narasimha Rao Vanam on January 30, 2011 10:02 PM

  Great Event and Great memorable occasion.
  Jwala

 4. Anonymous on January 30, 2011 10:18 PM

  ముందురోజే ఆహ్వానం అందుకున్నా,దాటవేయలేని ముఖ్యమైన పని ఉండడంతో ఆనాటి అపురూపమైన సభకు రాలేకపోయాను. సుజాతగారి టపా ద్వారా సభకు సంబంధించిన విశేషాలు తెలుసుకొని ఎంతో సంతోషించాను.ఈ పుస్తకాల ముఖచిత్రాలు, వెనుక అట్టలు వాటిమీద బొమ్మలు చూస్తుంటేనే మనసు ఓ నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతోంది. ఇక చదివితేనో….దాసరి వెంకట రమణగారికి, రచన సాయిగారికి చందమామ అభిమానులుగా మనమంతా ఋణపడి ఉన్నాం. కనీసం ఈ పుస్తకాలు కొని చదివితే ఆ ఋణభారాన్ని కొద్దిగా అయినా తీర్చవచ్చునేమో.

 5. sudha on January 30, 2011 10:36 PM

  ముందురోజే ఆహ్వానం అందుకున్నా, చాలా ముఖ్యమైన పనివల్ల రావడానికి సాధ్యపడలేదు.కానీ సుజాతగారి టపావలన ఆనాటి సభావిశేషాలు తెలుసుకొని చాలా సంతోషించాను. మీరు ప్రచురించిన పుస్తకాల ముఖచిత్రాలు, అట్టవెనుక చిత్రాలు చూస్తుంటేనే మనసు 40 ఏళ్ళ వెనక్కి పరుగులు తీస్తోంది. ఇక ఆ పుస్తకాలు చదివితే ఇంకెన్ని జ్ఞాపకాల వరదలో మనిగిపోతామో.
  పుస్తకాలు కొనడం మనకోసమే అనుకోవాలి.ఎల్ కేజీ నుంచే ఎమ్ సెట్ కోచింగ్ ఇస్తున్నారంటే ఆ స్కూళ్ళలోనే మన పిల్లలను చదివించాలనుకున్నంతగా మారిపోతున్న సామాజిక నేపధ్యంలో పిల్లలు తెలుగులో ఉన్న ఈ పుస్తకాలు చదువుతారని ఆశించడం దురాశేనేమో.
  కానీ పిల్లలు పదేళ్ళవయసులోపల కథల పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పుడు పెద్దవాళ్లు కొంచెం ఓపిక చేసుకొని ఈ పుస్తకాలలో కధలు వినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళలో వాళ్ళంతట వాళ్ళు చదవాలనే ఆసక్తి కలుగుతుంది.
  దాసరి సుబ్రహ్మణ్యంగారి రచనలు అందుబాటులోకి తేవడమనే బృహత్కార్యానికి నడుం కట్టిన దాసరి వెంకట రమణ మరియు రచన శాయిగార్లకు పాఠకలోకం ఋణపడి ఉంది. ఈపుస్తకాలను కొని చదవడం వల్ల ఆ ఋణభారం కొద్దిగా అయినా తగ్గించుకోగమేమో.

 6. bhandaru srinivas rao on January 31, 2011 3:19 AM

  thanks raju garu. i bought all the three books while coming back from the function.- bhandaru srinivasrao

 7. Lekha Kocherlakota on January 31, 2011 8:51 AM

  I was lucky enough to to go the book inaugaration in Hyd( though it was on short notice, so I could not spend too much time. I had to go to take a dance class). Mrutyu loya brings back memories from more than 3 decades ago. I am planning to buy the whole book set for myself as well as gift it to my sister. In the days, when people spend Rs.500 on a pizza or getting Icecream, I really think the price is not too much. it will be a good reading habit for kids and we ourselves can become kids again.
  Lekha Kocherlakota

 8. M.V.APPARAO on January 31, 2011 9:32 AM

  రాజశేఖరరాజుగారు, ఆ అవిష్కరణ సభకు శ్రీ రచన శాయి గారు పిలిచినా
  నా ఆరోగ్య రిత్యా రాలేక పోయాను. మిమ్మల్ని అందరినీ కలిసే అదృష్టం
  కోల్పోయాను. దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనలు ఇలా అభిమానులకు
  అందజేయటంలో రచన శాయిగారి కృషిని అభినందించకుండా వుండలేము.
  ఆయన ఓపికకు హాట్సాఫ్ !

 9. mannavagangadharaprasad on January 31, 2011 10:28 AM

  O raju faru..

  you are doing very great job.

  job with loads of happiness.

  keep going

  with regards
  gangadhara mannava

 10. mannavagangadharaprasad on January 31, 2011 10:30 AM

  O! Raju gaaru!

  you are doing very good job
  the job with loads of happiness

  with regards
  gangadhara pradsad mannava

 11. chandamama on January 31, 2011 1:42 PM

  Mee mail raagaane link click cheyadam, mee fone raavadam thought waves match ayinatte.
  regards
  v3r

  2011/1/31 Raja Sekhara Raju
  —————

  Vamsi to me

  Wonderful news sir
  Thanks for letting me know
  Very bad that I cannot make it to any of those!
  And to be frank I will say that I envy you guys… 🙂
  But Oh well…. 🙂

  ఈ కథనంపై అభిమానం కురిపిస్తున్న దాసరిగారి అభిమానులందరికీ ధన్యవాదాలు. కష్టనష్టాలకోర్చి శాయిగారు మిత్రుల తోడ్పాటుతో చేపట్టిన ఈ మూడు పుస్తకాల ప్రచురణ పరిమిత కాపీలతో మాత్రమే వచ్చింది కాబట్టి (ఒక్కొక్క పుస్తకం 500 కాపీలు మాత్రమే) దాసరి గారి అభిమానులు వీలైనంత త్వరగా ఈ పుస్తకాలను తెప్పించుకోగలరు. ఈ పుస్తకాలకు దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది కాబట్టి కాపీలు అయిపోక ముందే తెప్పించుకోగలరు. లేకపోతే పునర్ముద్రణ జరిగేంతవరకు వేచి ఉండాలి.

 12. Agnaani on February 5, 2011 4:30 AM

  Raaju gaaru
  ide reetilo Dasari gaari migilina rachanalu vacche avakaasaalanu choodandi.

 13. Carla on March 8, 2012 1:55 PM

  your blog looks good. have a nice day. the blog was absolutely fantastic!http://www.agenciadempregos.com

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind