“చందమామ జ్ఞాపకాలు” నేపథ్యం

June 6th, 2010

చందమామ ధారావాహికల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన మే నెల ప్రత్యేక సంచిక గురించి పాఠకులు, అభిమానులు పంపిన ఉత్తరాలు, వ్యాఖ్యలను రచన శాయి గారు చందమామ అభిమానులకు ఈమెయిల్‌లో పంపారు. ఆ మెయిల్‌కు స్పందిద్దామని అనుకుంటూండగానే కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు తన చందమామ జ్ఞాపకాలు బృహత్ వ్యాసం నేపధ్యం గురించి అరుదైన క్లుప్త సమాచారాన్ని పంపారు.

2006లో ఈమాట.కామ్ వెబ్‌సైట్‌లో ఆయన రాసిన “చందమామ జ్ఞాపకాలు” వ్యాసం తొలిసారిగా ఆన్‌లైన్‌లో చందమామ చరిత్ర రచనకు నాంది పలికింది.

“చందమామ జ్ఞాపకాలు”

http://www.eemaata.com/issue41/chandamama.html

తర్వాత ఈనాడు, వికీపీడియా కూడా చందమామ పత్రికపై బృహత్ వ్యాసాలు ప్రచురించాయి.

చందమామ

http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో బ్లాగర్లు చందమామ చరిత్రను లిఖితం చేస్తున్న తీరుపై ఇక్కడ మళ్లీ చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడు చందమామ గురించి పత్రికల్లోనూ, ఆన్‌లైన్ లోనూ రాయడం అంటే ఫ్యాషన్ కాదు ప్యాసన్ -passion-

http://www.chandamama.com/lang/index.php?lng=TEL

http://manateluguchandamama.blogspot.com

చందమామ జ్ఞాపకాలపై ఇంతటి చరిత్రకు నాంది పలికిన రోహిణీ ప్రసాద్ గారి కథనం నేపథ్యం గురించి ఆయన మాటల్లోనే ఇక్కడ విందామా!

“2005-6లో నేను టెక్సస్‌లో ఉన్నప్పుడు Chicago మిత్రుడు కందాళం రమానాథ్‌తో ఈమెయిళ్ళ ద్వారా పిచ్చాపాటీ కొనసాగించేవాణ్ణి. ఆ విధంగా నేను చందమామలో మా నాన్నగారు పనిచేసిన సంగతి ప్రస్తావించినప్పుడు, రచయితగా ఆయన్ని అభిమానించే రమానాథ్ ఆ సంగతి విని ఆశ్చర్యం ప్రకటించడంతో నేను ‘చందమామ జ్ఞాపకాలు’ అనే పెద్ద వ్యాసం రాసి ఈమాటకు పంపాను. అది చదివాక ఈనాడు పత్రిక కూడా చందమామ గురించిన పెద్ద feature article ప్రచురించింది.

నా వ్యాసంలో సహజంగా దా.సు.గారి ప్రస్తావన రావడంతో ఆయన గురించి కూడా నలుగురికీ తెలిసింది. ఇప్పుడు ఆయన విశేషాలతో ‘రచన’ ప్రత్యేక సంచిక అద్భుతంగా వెలువడడం ఎంతో అభినందనీయం. ఇందుకు శాయిగారితో కలిసి శ్రమించిన వారందరికీ కృతజ్ఞత చెప్పుకోవాలి.”

Rohiniprasad

RTS Perm Link


One Response to ““చందమామ జ్ఞాపకాలు” నేపథ్యం”

  1. వేణు (venu) on June 6, 2010 10:52 PM

    చందమామ చరిత్రకు సంబంధించి రోహిణీప్రసాద్ గారి వ్యాసం ఎంతో విలువైనదీ, కీలకమైనదీ. నాకెంతో ఇష్టమైన వ్యాసమిది. దీని ద్వారానే నాకు దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గార్ల గురించీ, వారి ప్రతిభా విశేషాల గురించీ తెలిసింది! పాత చందమామల్లోని (తొలి) మహాభారతం గురించీ, (అప్పటికి) నేను చదవని అద్భుత సీరియల్స్ గురించీ తెలిసింది.
    విజయవాడలో దాసరి గారిని రెండు సార్లు కలుసుకుని, మాట్లాడగలిగాను. ఈ వ్యాసం చదివాక, ఎంటీవీ ఆచార్య గారి వివరాల కోసం అన్వేషించాను. బెంగళూర్ వెళ్ళిపోయిన ఆయన అప్పటికే చనిపోయారని తెలిసి, బాధనిపించింది. లేకపోతే తప్పకుండా కలుసుకునివుండేవాణ్ణి!

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind