చందమామ బ్లాగు పునర్దర్సనం

April 21st, 2010

చందమామ బ్లాగుకు మళ్లీ జీవం పోసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 13 నుంచి ఉన్నట్లుండి మాయం కావటంతో గాభరా పడ్డది నిజం. మనతెలుగుచందమామలో నా వ్యాఖ్య చూసినప్పటినుంచి సాంకేతిక సహాయాన్ని స్వచ్చందంగా అందించి, సహానుభూతి చూపిన ప్రతిఒక్కరికీ చందమామ తరపున అభినందనలు. గత కొద్దిరోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా పోయిందన్న వార్తపై స్పందనలకు, పరామర్శలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

చందమామ బ్లాగు పోయిందనే వార్త వినగానే స్పందించిన వారు శివరాంగారు. మనతెలుగుచందమామ బ్లాగులో నా వ్యాఖ్య చదివి బ్లాగు.కాం వారిని సంప్రదించి, తెలుగు బ్లాగర్ల సముదాయంలో ఈ వార్త పెట్టి నా బ్లాగు సురక్షితంగా ఉందనే వార్తను బ్లాగు.కాం జాలయ్య గారి ద్వారా వినిపించిన వారు ఇనగంటి రవిచంద్రగారు. విషయం తెలియగానే ప్రయత్నించి Google cache నుంచి నా బ్లాగ్ సమాచారాన్ని -బొమ్మలు మినహా- పైళ్ల రూపంలో రాబట్టి పంపిన విజయ్ వర్థన్ గారు, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ బ్లాగు.కాం వారికి ఈ విషయం తెలియజేసి వారినుంచి సమాచారం అందించిన పెద్దలు సీబీరావు గారు.. సహానుభూతి తెలుపుతూ సత్వర స్పందనలు పంపిన సర్వశ్రీ రాజేంద్ర కుమార్, సుజాత, వంశీ, జెబీ గార్లకు, తెలుగుబ్లాగర్స్. కాం లో స్పందించిన మిత్రులందదరికీ కృతజ్ఞతలు. డేటాను భద్రపర్చుకోవడంలో నా తాత్సారానికి మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను క్షమాపణలు.
రాజు.
 
ఏప్రిల్ 18 సాయంత్రం ఆఫీసునుంచి వస్తూ జీమెయిల్ తెరిస్తే బ్లాగు తిరిగి కనబడుతున్నట్లు మెయిళ్లు. బ్లాగు తెరిచి చూస్తే ‘నా వల్ల ఎవరి పనీ ఆగకూడదు’ అని 12వ తేదీన శంకర్ గారి జీవన సహచరి శ్రీమతి షణ్ముఖవల్లి గారి అనారోగ్యంపై పోస్ట్ చేసిన కథనం.  ఆ దంపతుల ఫోటోలు కనిపించాయి.
 
8నెలలు శ్రమకోర్చి సేకరించిన చందమామ అమూల్యమైన చరిత్ర ఇక చూడలేమేమో అని విచారపడుతున్న సందర్భంలో బ్లాగుకు ఏమీ  కాలేదని భద్రంగా ఉందని శ్రీ జాలయ్యగారి భరోసా. చెప్పినట్లే ఇవ్వాళ -18-04-2010- బ్లాగు.కామ్ పునర్దర్సనం.
 
ఎనిమిది నెలలుగా బ్లాగు.కామ్ లో రూపొందించుకున్న చందమామ బ్లాగు ఎలాంటి ఇబ్బందికీ గురికాలేదు. ఇకపై కూడా ఇబ్బందులు ఏర్పడవని, రాకూడదని నమ్ముతున్నాం. బ్లాగు.కాం తో మా అనుబంధం కొనసాగుతుంది
 
మాట, చేత సహాయం అందించిన అందరికీ, భరోసా ఇచ్చి మాట నిలుపుకున్న జాలయ్య గారికి నిండు కృతజ్ఞతలు.

రాజశేఖర రాజు
చందమామ.

గమనిక: చందమామ బ్లాగు తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మిత్రులతో జరిపిన సంబాషణలో కొంత భాగం ఇక్కడ ఇస్తున్నాను.

శ్రీ విజయవర్ధన్ గారికి వేవేల కృతజ్ఞతలు. చందమామ బ్లాగు -blaagu.com/chandamamalu- ఉన్నట్లుండి పనిచేయక పోవడంతో  కలవరపడ్డాను. 8 నెలల శ్రమ పూర్తిగా పోయిందేమో అనుకుని బాధపడ్డాను. కానీ చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు నిన్న తెలుగు బ్లాగర్ల గ్రూప్ లో ఈ సమస్యను పోస్టే చేయడంతో బ్లాగు.కామ్ ప్రతినిథి జాలయ్యగారు నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, డేటా ఓవర్ లోడ్ కావడంతో బ్లాగ్ హోస్ట్ వారు తాత్కాలికంగా నిలిపి ఉంచారని, త్వరలో అన్ని బ్లాగులూ తిరిగి అందుబాటులోకి వస్తాయని సందేశం పంపారు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి. జాలయ్య గారి మాటలు నిజమై మళ్లీ చందమామ బ్లాగు పనిచేస్తుందనే ఆశిస్తున్నాను.

ఈరోజు మరింత మంచివార్త మీ నుంచి విన్నాను. “Google cache నుంచి రాబట్టిన blog posts (text మాత్రమే. photos cache చేయరు) జతచేసాను.” అని మీరు పంపిన చందమామ బ్లాగు కంటెంట్‌ను ఫైల్ రూపంలో తీసుకున్నాను. కోల్పోయిన పెన్నిధిని మీరు తిరిగి అందించారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు.

(నిన్ననే ఇనగంటి రవిచంద్ర గారు తన మార్గంలో బ్లాగు.కామ్ వారిని సంప్రదించి నా -చందమామ బ్లాగు- భద్రంగానే ఉందన్న సమాచారం తెలియి జేసారు. దాన్ని నా వ్యక్తిగత మెయిల్ నుంచి మనతెలుగుచందమామ బ్లాగులో వెంటనే తెలియపర్చలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి దాకా సిస్టమ్ ‌కు అందుబాటులో లేకపోవడమే కారణం.)

ఈ మంచి వార్తను అందరికీ తెలియజేస్తున్నాను. బ్లాగు.కామ్ తిరిగి పనిచేయగానే చందమామ బ్లాగులోని పోస్టులు అన్నీ బ్యాకప్ చేయడానికి శివరాం ప్రసాద్ గారు సిద్దంగా ఉన్నారు. ఈ దెబ్బకు ఆయన కూడా తన సాహిత్య అభిమాని బ్లాగు sahitya-abhimani.blogspot.com- , మన తెలుగు చందమామ బ్లాగు -manateluguchandama.blogspot.com- లను కూడా పూర్తిగా బ్యాకప్ తీసుకున్నట్లు తెలిపారు.

బ్లాగు మొత్తాన్ని ఒకేసారి బ్యాకప్ చేసుకునే సులభమార్గం ఉంటే ఆయననుంచి తెలుసుకోవాలి. మీకూ తెలిసి ఉంటే అందరికీ తెలియజేయండి. ఈ సమస్యకు ఇదే శాశ్వత పరిష్కారం కదా. నా వెబ్ దునియా బ్లాగులోని అన్ని పోస్టులను గతంలో హెచ్‌టీఎమ్‌ఎల్ రూపంలో సేవ్ చేసుకున్నాను. కానీ చందమామ బ్లాగు విషయంలో కాస్త ఏమారాను. అందుకే ఇంత కలవరం. అయినా చెప్పా పెట్టకుండా, కనీసం నోటీసు కూడా లేకుండా ఇలా మొత్తం బ్లాగులన్నింటినీ హోస్ట్‌లు అడ్డగించి వేస్తే ఎంత ఇబ్బంది పడతారో వారికీ తెలీదా? ఇలా ఎవరయినా ఎప్పుడైనా చేయగలరు కాబట్టి అందరూ తమ తమ జాగ్రత్తలో ఉంటేనే చాలా మంచిదనిపిస్తుంది.

కథనాలకు జోడించిన చిత్రాలు పోయినా దాదాపుగా మొత్తం కంటెంట్ గాలించి ఫైల్లో పంపారు. ఇది నాకు చాలా మంచి వార్త. థ్యాంక్యూ.

సమస్య తెలియగానే తన వంతు సహాయం అందించిన శివరాం గారికి, రవిచంద్రగారికి, మీకూ, స్పందించిన రాజేంద్ర కుమార్, సుజాత గార్లకు, సీబీ రావు గారికి, వంశీగారికి, జెబీ గారికి నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, భద్రంగా ఉందని నిన్ననే హామీ ఇచ్చిన జాలయ్య గారికీ, ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.

గమనిక: నా blaagu.com/chandamamalu బ్లాగు కనబడకుండా పోయిన విషయాన్ని మనతెలుగుచందమామ.బ్లాగ్‌స్పాట్.కామ్‌ లో శివరాం గారికి పోస్ట్ రూపంలో పంపిన వ్యాఖ్యలో “ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్‌లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది.” అంటూ నోరు జారి రాశాను.

http://manateluguchandamama.blogspot.com/2010/04/blog-post.html#comments

8 నెలల శ్రమ, అరుదైన సమాచారం పోయిందే అనే బాధ, ఉద్రిక్త క్షణాల్లో ఈ దూషణ వ్యాఖ్య చేశాను. ఈ సమస్యకు పరిష్కారం ఉండదేమో అనే బీతితో విచక్షణ మరిచిన క్షణంలో నేను చేసిన, చేయకూడని వ్యాఖ్య ఇది. నిన్న కూడా ఇనగంటి రవిచంద్ర గారికి కూడా మెయిల్ చేస్తూ నా టంగ్ స్లిప్ గురించి బాధపడ్డాను. పొరపాటు జరిగిపోయింది కాబట్టి దాన్ని క్షమాపణతోటే సవరించుకుంటున్నాను. నా వ్యాఖ్యను సీరియస్‌గా తీసుకోవద్దని జాలయ్యగారిని – <jaalayya@gmail.com> అభ్యర్థిస్తున్నాను. ఈ విషయమై మీకు విడిగా మెయిల్ కూడా పంపుతున్నాను.

ఈ ఘటన దాదాపుగా మనందరికీ మేలుకొలుపులాగే ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. తాము విలువైనదిగా భావిస్తున్న సమాచారాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత వ్యక్తుల, సంస్థల స్వంత బాధ్యతే అనేదే ఆ మేలు కొలుపు. పని ఒత్తిళ్లలో కూరుకుపోయి సమాచార భద్రతను మర్చిపోవద్దనే ఈ ఘటన పాఠం నేర్పుతోంది కదా.

(బ్లాగ్ మాయమైందన్న విషయం తెలియగానే తన బ్లాగులు రెండింటిలో ఈ విషయం పోస్ట్ చేసి అందరికీ తెలిపి సత్వర సహాయానికి దారి కల్పించిన మిత్రులు శివరాం ప్రసాద్ గారికి, తెలుగు బ్లాగర్ల సముదాయానికి విషయం పోస్ట్ చేసి జాలయ్యగారినుంచి భరోసా తెప్పించి ఇచ్చిన రవిచంద్రగారికి, బ్లాగు మొత్తాన్ని గూగుల్ సెర్చ్ నుంచి లాగి నోట్ పాడ్ పైళ్లను పంపించిన విజయవర్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బ్లాగులోని కంటెంట్ మొత్తాన్ని భద్రపర్చే ప్రయత్నంలో ఉన్న శివరాంగారికి కృతజ్ఞతలతో సరిపెట్టలేనని భావిస్తూ…)

రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu

RTS Perm Link


2 Responses to “చందమామ బ్లాగు పునర్దర్సనం”

  1. JB on April 21, 2010 11:37 PM

    మీకు అభినందనలు , మీకు తోడ్పడిన వారందరికి కృతజ్ఞతలు! హమ్మయ్య – పాతవన్ని నేనిపుడు చక్కగా చదువుకొనవచ్చు.

  2. కెక్యూబ్ వర్మ on April 24, 2010 8:59 PM

    అమావాస్య చీకట్లు తొలగి చంద్ర దర్శన భాగ్యం కలిగినంత ఆనందంగా వుంది. చందమామ పునఃప్రతిష్ఠకు సహకరించిన తెలుగు బ్లాగ్ సాంకేతిక నిపుణులు, మిత్రులందరికీ చందమామ తరపున నా కృతజ్నతలు కూడా తెలియచేసుకుంటున్నా. నాకు అంత సాంకేతిక పరిజ్నానం లేదు. నా మొదటి బ్లాగు వెన్నెలదారి కూడా కొత్త పోస్టులు రాయకుండా ఎడిట్ ఆప్షన్స్ పోయిన నాడు చాలా బాధకలిగింది. దాంతో కొత్త బ్లాగు ప్రారంచించుకున్నా. అయినా చందమామ రాజుగారు సేకరించిన విలువైన సమాచారం కోల్పోతే తెలుగు బ్లాగ్ లోకంకు నిజంగానే విషాదం మిగిలేది. సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రాజు గారికి శుభాకాంక్షలు.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind