‘రచన’లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు

March 5th, 2010

చందమామ అభిమానులైన మీకు నమస్కారం.  చందమామ కథా మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు దివంగతులైన సంగతి మీకు తెలిసిందే. ఆయనకు నివాళిగా  రచన శాయి గారు రచన ఏప్రిల్ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్ రచనా విధానం వైవిధ్యమైనది. తన మనో ప్రమేయం ఏమాత్రం లేకుండా ఎవరో తోస్తే చటుక్కున బాలల సీరియల్ రచనా  తటాకంలో పడి వెంటనే తేరుకొని చిన్న చిటికేసి, ఒక నూతన ఒరవడితో అందమైన జానపద ధారావాహికలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా బాలలకు వరప్రసాదంగా తోకచుక్క మొదలుకొని భల్లూకమాంత్రికుడు వరకు 12 ధారావాహికలను అందించారు.

భల్లూక మాంత్రికుడు

ఆ సీరియల్స్‌ను మీరు అభిమానిస్తున్నట్లయితే ఏదైనా ఒక సేరియల్‌ను ఎన్నుకొని ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసం రాయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతున్నది. కొంతమంది అభిమానులు ఈ క్రింది సీరియల్స్‌ను ఈ క్రింది వారు రాస్తే బాగుంటుంది అని సూచించారు.

తోకచుక్క (Jan-54 – June-55 ) -శ్రీ దాసరి వెంకటరమణ
మకరదేవత (July-55 – December 56)
ముగ్గురు మాంత్రికులు (January-57 – June 58) -శ్రీ త్రివిక్రమ్
కంచుకోట (July-58 – Dec-59) -శ్రీ వేణు
జ్వాలాద్వీపం (Jan-60 – June-61)  -శ్రీ రచన శాయి
రాకాసిలోయ (July-61 – May-64) -

పాతాళదుర్గం (May-66 – Dec-67)  – రాజశేఖర రాజు
శిథిలాలయం (Jan-68 – Sept-70) – శ్రీ శివరామ ప్రసాద్
రాతిరథం (Oct-70 – April-72)
యక్షపర్వతం (May-72 – June-74)
మాయా సరోవరం (Jan-76 – June-78) -శ్రీమతి సుజాత
భల్లూక మాంత్రికుడు (July-78 – April-80)

పై సేరియల్స్ పై విశ్లేషణ రాసేముందు…
 

పాతాళదుర్గం

క్లుప్తంగా కథా, శ్రీ సుబ్రహ్మణ్యం గారు సంఘటనలతో కథను నడిపించిన తీరు, పాత్రలు- తీరు తెన్నులు , చదివింప చేసే అంశాలు , అంతర్లీనంగా అందచేసిన సందేశం మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోగలరు.

పై సూచన గమనించి మీరు ఎంచుకున్న సీరియల్ పేరు వెంటనే తెలియచేయగలరు.. ఎందుకంటే ఒకే సీరియల్ మీద ఇద్దరు వ్రాయడాన్ని నివారించాలనే ప్రయత్నం.

ఆ తర్వాత  మీ వ్యాసం నేరుగా శ్రీ రచన శాయి (cell no 9948577517) rachanapatrika@gmail.com
గారికి ఈ నెల పది లోగా పంపగలరు. 

సత్వరమైన మీ స్పందన గురించి ఎదురు చూస్తూ…….

సెలవు.

PS; క్లుప్తత చందమామ కథల విశిష్ట ప్రత్యేకత. దానిని దృష్టిలో వుంచుకొని మీ వ్యాసం అచ్చులో నాలుగైదు పేజీలు మించకుండా జాగ్రత్త పడగలరు.

Sri Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com
 
Sri Y.V.S.R.S. Sai
1-9-286/2/P, విద్యానగర్ (రాం నగర్ గుండు దగ్గర)
హైదరాబాద్-500 044
040-27071500 (O)
040-27077599 (R)
09948577517 (M)
email: rachanapatrika@gmail.com

RTS Perm Link


6 Responses to “‘రచన’లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు”

  1. M.V.AppaRao on March 5, 2010 9:02 AM

    ఎంత మంచి ఆలోచన.చందమామ అభిమానిగా మీ కృషిని
    అభినందిస్తున్నాను. రచన శాయి గారికి ప్రత్యేక సంచికను
    తీసుకొస్తున్నందుకు,ఇలాటి మంచి పనులు చేయటంలో
    శాయి గారు ఎప్పుడూ ముందుంటారు……..సురేఖ*

  2. SIVARAMAPRASAD KAPPAGANTU on March 5, 2010 9:38 AM

    బాగున్నది కాని రాజుగారూ, బ్లాగాగ్ని గారు కంచుకోటను తానూ రిజర్వు చేసుకున్నారు. అసలు మీరు బ్లాగాగ్ని ఎలా మరచారు. మనం ఇంతగా చందమామ గురించి పడే తపనను మళ్ళి పైకి తెచ్చిన ఘనత అతనిది.

    మన తెలుగు చందమామ బ్లాగుకు కంచుకోట మీద సమీక్ష వ్రాస్తానని వాగ్దానం చేసారు. మీరుకూడా ఆయనను ఒకసారి అడిగి కంచుకోట ఆయన పరం చెయ్యండి.

    శిధిలాలయం నేను ఇప్పటికే వ్రాసాను అదే మిగిలిన పాత్రలు, ఇప్పటికే వ్రాసిన పాత్రలతో మరికొంత మాట్లాడించి సమీక్ష పూర్తీ చేస్తాను.

  3. chandamama on March 5, 2010 1:06 PM

    శి్వరాంగారూ క్షమించాలి. ఇది ఉదయం దాసరి వెంకటరమణ గారు పంపిన ప్రకటన. సాయంత్రం గాని పోస్ట్ చేయలేకపోయాను. తర్వాత మళ్లీ ఇప్పుడు నెట్‌లోకి వచ్చాను. మధ్యాహ్నం శాయిగారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, తర్వాత మెయిల్ పెట్టినప్పుడు వ్యక్తిగతంగా మన చందమామ అభిమానులను, చంపిలను సంప్రదించి మిగతా సీరియల్స్‌ను రాసే బాధ్యత అప్పగించమని చెప్పాను. రోహిణీ ప్రసాద్ గారూ, బ్లాగాగ్ని గారు, చందమామ అపర వీరాభిమాని శ్రీ ఎంవి అప్పారావు-సురేఖ- గారు తదితరులను కూడా ఈ పనిలోకి దింపాల్సి వుంది. అంతవరకు సంప్రదించిన వారినుంచి ఆమోదం పొందిన తర్వాతే పైన ఉదహరించిన వారి పేర్లను ఖరారు చేస్తూ దాసరి రమణగారు, శాయిగారు ఈ ప్రకటన పంపటం జరిగింది. బ్లాగాగ్ని గారిని పైన పేర్కొన్న వారిని మరిచే ప్రశ్నే లేదు. ఇంకా ఎవరయినా దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలను సమీక్షిస్తామని ముందుకు వస్తే సంతోషంగా వారిని నేను తీసుకున్న పాతాళదుర్గం సీరియల్‌పై సమీక్ష చేయమని కోరడానికి నేను రెడీ.

    బ్లాగాగ్ని గారు కంచుకోట సమీక్ష చేస్తానన్న విషయం శాయిగారికి, దాసరి వెంకటరమణ గారి దృష్టికి వచ్చిందో లేదో నాకు ఇంకా తెలీలేదు. అయితే చందమామ బ్లాగులో ఈ పోస్ట ప్రచురించిన తర్వాత ఇంకా మిగిలిన రచనలపై సమీక్షకు ముందుకు వచ్చేవారి వివరాలు తీసుకుని ఈపోస్ట్‌నే దినవారీగా కూడా అప్‌డేట్ చేద్దామని శాయి గారు చెప్పారు. అందరి ఆమోదాలను తీసుకుని ఒకేసారి సమీక్షకుల జాబితాను ప్రకటిస్తూ పోస్ట్ చేసి ఉంటే బాగుండేది. కాని సమయం తక్కువగా ఉంది కాబట్టి పిబ్రవరి 10కే సమీక్షలు పంపాల్సి ఉంది కాబట్టి ఆమోదం తెలిపిన వారి వివరాలు ముందు ఆన్‌లైన్‌లో పెడితే మిగతా వారు కూడా స్పందించడానికి వీలవుతుందని నేను చొరవ తీసుకుని చందమామ బ్లాగులో ప్రచురిస్తానని చెబితే శాయి గారు అంగీకరించారు. బ్లాగాగ్ని గారు ఈ మధ్య మరీ నల్లపూస అవుతున్నారన్న బాధే తప్ప ఆయనను విస్మరించే ప్రసక్తే లేదు. చందమామను జాతిపరం చేసిన విశిష్టవ్యక్తి ఆయన. తనను విస్మరిస్తే మనల్ని మనం మర్చిపోయినట్లే. రచన తరపున వస్తున్న ఈ మంచికార్యం ఎలాంటి వివాదాలకు గురికాకూడదు కాబట్టి శాయిగారు తప్పక ఈ విషయంపై దృష్టి పెట్టాలి. దానికి మనవంతు సహాయం తప్పక చేద్దాము. బ్లాగాగ్ని గారి సమీక్ష రచన ప్రత్యేక సంచికలో రాకపోతే అది లోటుగానే ఉండిపోతుంది కాబట్టి ఈ విషయంలో మీరూ మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే అప్పారావు గారిని, రోహిణీ ప్రసాద్ గారిని కూడా.. శాయిగారు ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం రాలేదు.

    అప్పారావు గారూ, మీరు అభినందనతోనే సరిపెట్టుకుంటే ఎలా? అన్ని చందమామలను కలిగి ఉన్న అరుదైన ‘చంపి’లు మీరు. తప్పకుండా ఈ సమీక్షా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నా మనవి. ఇంకా ఎవరైనా సమీక్షిస్తామని ముందుకు వస్తే, వారికి దాసరిగారి ధారావాహికలు మిగులక పోతే నేను తీసుకున్న పాతాళదుర్గం సీరియల్ వారికి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరమూ నాకు లేదు.

    శివరాం గారూ మీ సూచనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బ్లాగాగ్ని గారికీ వీరతాడు వేసి ముగ్గులోకి లాగడంలో మీ వంతు ప్రయత్నం తప్పక చేయండి. ఆయన ఇప్పటికే శాయిగారికి తన ఆమోదం తెలిపి ఉంటే మరీ మంచిది. సాయంత్రం పోస్ట్ చేసాక ఇంతవరకూ నెట్‌లోకి రాలేదు. లేకుంటే అప్పుడే మీకు, శాయిగారికి సమాధానం,సమాచారం పంపేవాడిని. ఇప్పటికయినా మించిపోయింది లేదు లెండి. మనందరం కలిసి బ్లాగాగ్ని గారిని, తదితరులను ఆహ్వానిద్దాం..

  4. chandamama on March 5, 2010 1:58 PM

    శివరాం గారూ, మీరు ప్రస్తావించిన అంశాన్ని, పై కామెంట్లను శాయిగారికి, దాసరి వెంకట రమణగారికి మెయిల్ చేశాను. ఇంతవరకూ నెట్‌లో ఉన్న వెంకటరమణగారు స్పందిస్తూ, బ్లాగాగ్ని గారిని తాము ఇప్పటికే సంప్రదించామని, అయితే ఆయన నుంచి సమాధానం ఇంకా రాలేదని చెప్పారు. మళ్లీ ఒకసారి తనకు రిమైండ్ చేయమని, మీకు వివరణ ఇవ్వమని రమణ గారికి సూచించాను. బ్లాగాగ్ని గారికి కింది మెయిల్‌లో గతంలో మెయిల్స్ పెడితే సమాధానం రాలేదు.
    phaniks@gmail.com,

    ఇప్పడేమో వెంకటరమణ గారు కింది మెయిల్ బ్లాగాగ్నిగారిదిగా పేర్కొంటూ నాకు పంపారు.
    bloogagni@gmail.com,

    ఈ రెండూ ఆయనవేనా లేదా ఏదైనా వేరువేరా తెలుపగలరు.

    అలాగే దాసరి గారి సీరియల్స్ సమీక్షపై వసుంధర గారిని సంప్రదించారా అని రమణ గారిని అడిగాను. ఇంకా సమాధానం రాలేదు. ఇప్పటికి ఇదీ విషయం.

  5. chandamama on March 5, 2010 2:12 PM

    వసుంధరగారిని కూడా దాసరి గారి దారావాహికల సమీక్షలపై సంప్రదించారట. దాసరి వారి అన్ని సీరియల్స్‌ను సమీక్షించవలసిందిగా ఆయనే మొదట కోరారట. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం సమీక్షించలేనని, ఇతర అభిమానులు, చంపిలు సమీక్షించగా మిగిలితే తర్వాత తప్పక సమీక్షించగలనని వసుంధర గారు చెప్పారట. కాబట్టి రచన వారు ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నట్లుంది. ఒకటి రెండు రోజుల్లో ఇది ఒక కొలిక్కి వస్తుందనుకుంటాను.

  6. SIVARAMAPRASAD KAPPAGANTU on March 5, 2010 7:57 PM

    ఓ కే రాజుగారూ. సమస్యేమి లేదు. ఇప్పుడే నేను రమణగారికి వారి మైలుకు స్పందిస్తూ, ఈ విషయం మీద మన తెలుగు చందమామ బ్లాగుకు వ్రాద్దామనుకున్న సమీక్షల గురించి తెలియ చేశాను. అదే టపాను వేణు గారికి ఫణి గారికి కూడా పంపాను. ఇందులో పెద్ద సమస్య ఏమీ లేదు. దాసరి గారి ధారావాహికల మీద ఉన్న జనాదరణ కనపడుతున్నది.

    ఫణి గారికి మరొక మెయిలు ఇప్పుడే పంపుతున్నాను.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind