వైష్ణవీ… క్షమించు…
February 2nd, 2010

“దొంగ లం…… కొడుకులసలే మెసలే పాడులోకంలో”
నీవులేని లోకంలో, నీకు చోటులేని ఈ ధూర్తలోకంలో
మేమంతా బతికేస్తున్నందుకు,
హాయిగా బతికిపోతున్నందుకు…
అమ్మా వైష్ణవీ… క్షమించు..
మమ్మల్ని క్షమించు.
మనిషి కాటుకు గురై చిన్నారి వైష్ణవి కాలిపోయింది. ఆమె తండ్రి ప్రభాకర్ గుండె ఆగింది. రా’బంధువుల’ ఉద్దేశ్యం దీంతో పూర్తి అయినట్లేనా? పగ, ప్రతీకారం దీంతో చల్లారినట్లేనా?
test Filed under సమాజం | Comments (9)9 Responses to “వైష్ణవీ… క్షమించు…”
Leave a Reply






రెండు రోజుల వ్యవధిలో పచ్చని ఆ సంసారం ఎలా చెల్లాచెదురై కుప్ప కూలిందో అని తల్చుకుంటే అయోమయంగా ఉంది. అతి పాశవిక పరిస్థితుల్లో కూతుర్ని, ఆ విషయం ఇంకా జీర్ణించుకోకముందే భర్తను కోల్పోయిన ఆ తల్లి పరిస్థితిని తల్చుకోవాలంటేనే భయంగా ఉంది.
పగ ఎవరిమీదైనా, తనను ఎవరు తీసుకెళుతున్నారో, ఎందుకు హింసిస్తున్నారో కూడా తెలీని చిన్నారి ఆ పదేళ్ల పాప.ఆమెకు ఎందుకింత శిక్ష!
అప్పటివరకూ మొహమైనా ఎరుగని ఆ పాప మీద అంత కసి ఉన్నపళంగా ఎలా పుట్టుకొచ్చింది?
ప్రభాకర్ మరణ వార్త చూశాక మెదడంతా శూన్యంగా మారింది. ఎంత అనుబంధం పెనవేసుకుంటే కూతురితో సహజ సహగమం చేస్తాడు?
సమాజం ఇంత రాక్షసంగా ఎందుకు తయారవుతోంది?
డబ్బు తప్ప ఇక దేనికీ విలువ లేనట్లేనా?
- అమ్మలూ, నీ పేరు అనడానికీ, ఫోటోలో నీ ముఖం చూడ్డానికే సిగ్గుగా ఉంది.ఏం ప్రపంచం ఇది? ఛ.
కుటు౦బాల్లో స్వార్ద౦ పెరిగిపోయి, నైతిక విలువలు పతనమైతే పరిణామాలు ఇలాగే ఉ౦టాయి.
ఇ౦దులో ప్రభాకర్ పాత్ర కూడా విస్మరి౦చరానిది. కేవల౦ చనిపోవడ౦ వల్లే అతను సానుభూతిని పొ౦దుతున్నాడు.
భార్య వు౦డగా మరో యువతిని రహస్య వివాహ౦ చేసుకున్నాడు. కుటు౦బ సబ్యులను దూర౦ చేసుకున్నాడు. తాడి తన్నేవాడిని తలదన్నేవాడన్నట్లు విధి ఈ రూప౦లో కాటువేసి౦ది.
కాకపోతే ఈ వలయ౦లో చిన్నారి వైష్ణవి చిక్కుకుపోవడ౦ మన సమాజ దౌర్భాగ్య౦. ప్రభాకర్ మరణి౦చడ౦ దురదృష్టకర౦, స్వయ౦కృత౦. కాకపోతే సుజాతగారన్నట్లు, పాపతో అతని అనుబ౦ధ౦ విలువకట్టలేనిది.సమాజ౦ ఇటువ౦టి వాటిను౦డి, పాఠ౦ నేర్చుకు౦టు౦దనే ఆశిద్దా౦.
మన ఘనతర నాగరికత, ఘనతర సంస్కృతి అని చెప్పుకుని గర్వపడుతున్న చరిత్ర అంతా ఆ పసిపాపకు ప్రాణం పోయడంలో ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయింది. చివరకు పసిపిల్లలు కూడా మనిషిని, పరాయి మనిషిని చూస్తే నమ్మలేని, అపనమ్మకపు వ్యవస్థ తయారైపోయింది. విచ్చిన్నమవుతున్న మానవసంబంధాలు, విడాకులు, సంపద పోగుపడడం, దాని ప్రదర్శన, సంవత్సరాలుగా గూడుకట్టుకుంటున్న పగలు, ప్రతీకారాలు, వ్యక్దిగత ఆస్థి తన సర్వ వికృతరూపాలతో మనిషిని తరుముతోంది. ఈ ప్రపంచం ఇప్పుడు మంచి పుస్తకం చదువుకునేలా, మంచి పాట వినేలా, మంచి సినిమా చూసి ఆనందించేలా లేదు. ఒకే ఒక్క సంఘటన ఈ రాష్ట్రంలోని తల్లితండ్రులనే కాదు, పసిపిల్లలందరిలో అపనమ్మకాన్ని పెంచేసింది. ఇంతకు ముందు పిల్లలతో సాన్నిహిత్యంగా ఉండే అంశానికి సంబంధించి మగాడిని నమ్మవద్దని ఒక కథనంలో ఇక్కడే రాసినట్లు గుర్తు. మగాడినే కాదు, మనిషినే నమ్మలేని దుస్థితిలోకి ఈ లోకం పోతోందా?
sham to all. virimadyanaa manam jeevisthunnadhi. intakanna dharunam inkoti vundadu.
గుండె తరుక్కుపోతోంది
చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.
మానవత్వం మంట కలిసింది.
I very much feel for the family of the bereaved. Seeing Vaishnavi’s photo I cannot contro the lump in my throat. I hope the Police would be able to book the culprits and Government has the guts to punish them with Capital Punishment without heeding to the so called Human Rights activists who too should share for the deterioration in the law and order situation in the society.