చందమామ ఓ అందాల భామ
October 16th, 2009

చందమామ - అందాలభామ
మధ్యయుగాల కథల కాణాచి చందమామ అని నిన్న ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కథనంపై ఎన్ కృష్ణమూర్తిగారు కవితా రూపంలో స్పందించారు. భాషాంతరీకరణ రూపంలో పంపిన ఆయన పంపిన ఈ వ్యాఖ్యను తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేశాము.
చందమామను కథల చందమామగా, అందాలభామగా వర్ణిస్తూ ఆయన పంపిన ఈ కవితాత్మక ఆప్తవాక్యాలకు చందమామ తరపున కృతజ్ఞతలు.
చందమామ అది కథల చందమామ
చందమామ అది అందాల భామ,
చందమామను చూచి పులకించు మేను,
చందమామను చూచి ఆలోచనలు రేకెత్తు మదిలో,
చిట్టి చిట్టి మనసులో నీతిని నింపు,
చిట్టి చిట్టి బుర్రబుర్రలకు పదును పెట్టు చందమామ,
భేషు భేషు చందమామ,
భావి తరాల కోసం బ్రతకాలి చందమామ.
test Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: అందాలభామ, ఆప్తవాక్యం, కథలచందమామ, కథలు, కవిత, కృష్ణమూర్తి, చందమామ, తెలుగు | Comment (0)Leave a Reply







