చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ
చందమామ శంకర్ గారు
చరిత్రలో కొన్ని ఘటనలకు అద్భుతగుణాలు, మహిమలు ఆపాదించబడుతుండటం మనకందరికీ తెలిసిన విషయమే.. హంపీ చరిత్రలో కుందేలు రేచుకుక్కను తరిమిన ధీరగాథ చాటువులుగా ఈ నాటికీ జనం నోళ్లలో నానుతూ ఉంది. ఒక సామ్రాజ్యం కాని, ఒక చరిత్ర కాని, దీర్ఘకాలం కొనసాగినప్పుడు, ఆ కొనసాగింపు వెనుక నేపథ్యం గురించి కథలు కథలుగా చరిత్రలో వ్యాప్తిలోకి వస్తుండటం కూడా కద్దు. చరిత్రను ప్రభావితం చేసిన ఘటనలు పలురూపాలల్లో జనం మధ్య ప్రచారంలో ఉంటూ రంజింపజేస్తుంటాయి కూడా.
మరి చందమామ పత్రికతో చిత్రకారుడు శంకర్ గారి అనుబంధం మాటేమిటి? దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చందమామ-శంకర్ సాంస్కృతిక బంధం మాటేమిటి? ఒక చిత్రకారుడు తన జీవితంలో ముప్పావు భాగాన్ని చిత్రలేఖనానికి అంకితం చేయటం ఏమిటి? అందులోనూ తెలుగువారి “సాంస్కృతిక రాయబారి” అని గుర్తింపుకు నోచుకున్న చందమామలో గత యాభైఆరేళ్లుగా నిర్విరామంగా బొమ్మలు గీసుకుంటూ పోవడం ఏమిటి?
ఇది బహుశా ఘనతవహించిన ఓ సామ్రాజ్యపు కథ కాకపోవచ్చు. లేక అరుదైన ఘటనలతో ఉక్కిరి బిక్కిరి చేసే చరిత్ర కానే కాకపోవచ్చు.. కాని చందమామ పత్రికలో శంకర్‌గారు చేరిన క్రమానికి తనదైన చరిత్ర ఉంది. యజమానుల విశ్వాసం, ఉద్యోగుల కృతజ్ఞత పరస్పరం అల్లుకున్న మానవీయబంధం ఈ చరిత్రతో పెనవేసుకునిపోయింది. అందుకే శంకర్‌గారు అద్భుత చిత్రకారుడిగా ఎదుగుతూ రావడం ఎంత వాస్తవమో… ఆ ఎదుగుదలలో అధికభాగం చందమామతోటే ముడిపడి ఉండటం కూడా అంతే వాస్తవం.
ఇది నాగిరెడ్డి గారి సంకల్పానికి, శంకర్ గారి విధేయత, కృతజ్ఞత తోడైన గొప్ప పరిణామానికి నాంది. జీవితం చివరి వరకు చందమామతోనే ఉంటానని శంకర్ గారు మొదట్లో ఎక్కడా ప్రకటించలేదు. కాని 85 ఏళ్ల ముదివయస్సులో పడ్డాక ఆయన తన జీవితంలో ఒకే ఒక కోరికను గట్టిగా కోరుకుంటున్నారు. చివరి శ్వాస వరకు చందమామతోనే ఉంటానన్నదే ఆ కోరిక.
ఇంతటి పటుతర బంధం చందమామతో ముడిపటడానికి దారితీసిన పరిస్థితులేమిటి, దానిపై వ్యక్తుల ప్రభావం ఏమిటి, దాన్నే శంకర్ గారు ఇలా గర్వంగా ప్రకటిస్తున్నారు. “నాగిరెడ్డి గారి పిలుపుతో నేను చందమామలో చేరాను. ఏ ముహూర్తంలో అడుగుపెట్టానో కానీ, 55 ఏళ్లకు పైగా దాంట్లోనే కొనసాగుతూ ఉన్నాను. ఆయన పిలిచారు. నేను వచ్చాను అంతే. ఆయన ఇవ్వాళ లేరు. అయినా నా సంకల్పం మారలేదు. చివరిదాకా చందమామలోనే కొనసాగాలనే కోరికా మారలేదు. వయసు సహకరించక ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇష్టమైన బొమ్మలు వేయకుండా ఉండలేను.” ఇది ఆయనకే సాధ్యమైన దృఢసంకల్పం.
చందమామ చిత్రకారుడిగా దశాబ్దాలపాటు ఆయన సృష్టించిన ఘనత, రికార్డులు మనందరికీ కొద్దో గొప్పో తెలుసు. అయితే తమిళ పత్రికలోంచి చందమామలోకి ఆయన రాక, తదనంతర పరిణామాలు గురించి ఏ కొద్దిమందికో గాని తెలిసే అవకాశం లేదు. ఈ వారం చందమామలో అడుగుపెట్టిన వేళావిశేషపు ఘనతను ఆయన ద్వారానే తెలుసుకుందాం.
ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2267
ఈ కథనం మీకు నచ్చితే దయచేసి మీ అభిప్రాయం కింది చిరునామాకు పంపండి.
చిత్రలేఖనంతో పరిచయం, ప్రవేశం, ప్రావీణ్యత ఉన్న తెలుగు బ్లాగర్లు శంకర్ గారి చిత్రలేఖన రీతుల గురించి తెలుసుకోవాలంటే వారు తమ ప్రశ్నలను కూడా పై చిరునామాకు పంపితే ఆయన సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి గల పాఠకులు, శంకర్ గారి అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాము.
శ్రీ శంకర్, చిత్రా, వపా వంటి అపరూప చిత్రకారులను చందమామ కానీ, చందమామ పాఠకులు కాని ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఎన్నటికీ మర్చిపోలేరు. చందమామను భారతీయ బాలసాహిత్యంలో, కథాసాహిత్యంలో శిఖర స్థాయిలో నిలబెట్టడానికి వీరు చేసిన కృషి అసామాన్యం. ఆన్‌సైన్ చందమామలోని చందమామ జ్ఞాపకాలు విభాగంలో శంకర్ గారిపై ఇంతవరకు 3 భాగాలు ప్రచురించాము. వాటి లింకులు కింద చూడగలరు.
చందమామ చిత్రమాంత్రికుడు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2203
చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&&stId=2211
చందమామ శంకర్ గారి జీవిత వివరాలు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2253
2 Responses to “చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ”
Leave a Reply






1963 ప్రాంతాల్లో నేను హైస్కూల్లో ఉన్నప్పుడు తరుచుగా చందమామ ఆఫీసుకు వెళ్ళి చిత్రాగారి పక్కనే కూర్చుని ఆయన బొమ్మలు వెయ్యడం చూసేవాణ్ణి. పక్క టేబ్‌ల్‌మీద కూర్చున్న శంకర్‌గారు ఒకసారి నాకు చెప్పకుండా నా బొమ్మ గీసి చూపించారు. నిక్కరుతో, గళ్ళచొక్కాతో ఉన్న నా బొమ్మ చాలాఏళ్ళపాటు దాచుకున్నాను. ఇప్పుడేమయిందో తెలియదు.
రోహిణీ ప్రసాద్ గారూ,
47 ఏళ్ల క్రితం జరిగిన ఈవిషయాన్ని ఇంకా మీరు గుర్తు పెట్టుకునే ఉన్నారు. ఈ విషయం శంకర్ గారికి చెబితే చాలా సంతోషిస్తారు. ఆయన ప్రస్తుతం వడపళని సమీపంలోని విరుగంబాక్కం ఏరియాలో దేవీ కరిమారియమ్మ థియేటర్ దగ్గర్లో ఉంటున్నారు. ఆయన చిరునామా కూడా ఇస్తున్నాను. వీలయితే ఆయనకు ఫోన్ చేసి పలకరించండి. కొకు గారి అబ్బాయి అంటే బాగా స్పందించవచ్చు కూడా. భారతీయ కాలమానం ప్రకారం ఆయన ఉదయం 9-12, సాయంత్రం 4-8 మధ్య ఆయన ఫ్రీగా ఉంటారు.
శంకర్ గారి చిరునామా ఇక్కడ చూడండి.
K.C Sivasankaran,
Flat -House- No – 4,
Ratna Castle,
Flat No. 20-21,
Ratna Nagar,
Virugambakkam,
Chennai : 600092
Land Phone : 044-64508610
Landmark: Very near to the “Devi Karimaariyamma” Theatre at Virugamabakkam -
200 meters only-
(దేవీ కరిమారియమ్మ థియేటర్)
—————
K.S.Ramakrishnan
(Son of Sri Sankar)
Mobile : 94440 86166 (Chennai)
ksramke@yahoo.com
NB: శంకర్ గారి పాత ఫోటోలు, చందమామ వడపళని ఆఫీస్ ఫోటోలు కొన్ని భద్రంగా ఉన్నాయి. వీలు చూసుకుని ఈ బ్లాగులోనే ప్రచురించగలము.మీరు నాలుగు రోజుల క్రితం చందమామ వారి ఇతర పత్రికల ఆర్కైవ్స్ గురించి పంపిన మెయిల్‌కు వివరంగానే సమాధానం త్వరలో పంపగలను. నాలుగు రోజుల పండుగ సెలవులతో సత్వరం స్పందించలేకపోయాను.