మద్యపాన ఫలితం

September 23rd, 2009

బోధిసత్వుడి శిష్యుల్లో ఎన్నదగిన వాడు సాగతస్థవిరుడు. మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడు, అసామాన్య ధైర్యశాలి. మహాభయంకరమైన విషసర్పానికి సైతం జంకక దానితో ఢీకొని కోరలు పీకి ప్రాణాలతో వదిలిన ధీశాలి.

అలాంటి వాడు జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటుకు బురదపామును సైతం ఏమీ చేయలేని దుస్థితికి దిగజారిపోయాడు.

ఆ పొరపాటు ఏమిటి? ఏమా కథ అని తెలుసుకోవాలనిపిస్తే… దయచేసి కింది లింకును తెరవండి.

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2237

ఈ కథపై మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

RTS Perm Link


4 Responses to “మద్యపాన ఫలితం”

 1. chandamamalu on September 23, 2009 2:10 AM

  ‘మద్యపాన ఫలితం’ అనే ఈ కథను ఆన్‌లైన్ చందమామలో పోస్ట్ చేస్తూ చదివినప్పుడు మామూలు కథలాగే ఫీలయ్యాను. కాని, నిన్ననే మా బంధువుల కుటుంబంలో మద్యపానం కారణంగా తీవ్రమైన సంక్షోభం నెలకొన్నప్పుడు మళ్లీ ఈ కథ మరోసారి చదివితే కథలోని అంతస్సారం మరింత బాగా బోధపడింది.

  పాఠకుడిగా కథ చదివినప్పుడు కలిగే అనుభూతికి, కథలోని ఘటనలు మన నిజజీవితంలో సంభవించినప్పుడు కథ చదవగా వచ్చే కలిగే అనుభూతికి చాలా తేడా ఉంటుందని మద్యపాన ఫలితం కథ సాక్షిగా మరోసారి బోధపడింది.

  వ్యక్తుల జీవితాలను స్పర్శించే కథలు, ప్రతిబింబించే కథలు మనసు మూలలను గట్టిగా తాకుతాయని ఈ అనుభవం నాకు మరోసారి రుజువు చేసింది.

 2. చందమామలు on September 23, 2009 3:04 AM

  తాగుబోతులే మంచివాళ్లా అనే పేరుతో శివరాం ప్రసాద్ గారు ఇటీవల తన బ్లాగులో మన పక్కనే నిల్చుని, కూర్చుని పొగతాగి మన జీవితాలను విషమయం చేసే పొగరాయుళ్లను దునుమాడుతూ పోస్ట్ చేశారు. దాంట్లో అక్షరాక్షరమూ నిజమే అయినప్పటికీ చదివినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని మా బంధువుల కుటుంబంలో స్వంత అనుభవం కలిగాక మాత్రం శివరాంగారి ఆ పోస్ట్ పరమ ఆత్మీయంగా కనిపిస్తోంది.

 3. kcubevarma on September 23, 2009 8:51 AM

  వ్యసనం ఏదైనా అది మనిషి పతనానికే దారితీస్తుంది అని ఈ కథ ద్వారా బాగా చెప్పారు. చందమామలో ఇలాంటివి మరిన్ని రావాలి. బాలల మనసుకు హత్తుకునేట్లు ఈ స్తేజిలోనే చెప్తే వారికి భావిష్యద్దర్సినిగా వుంటుంది.

 4. chandamamalu on September 23, 2009 8:39 PM

  వర్మగారూ.. చక్కటి మాట.. ఒక మనిషి సక్రమంగా లేకపోతే మొత్తం కుటుంబానికి కుటుంబమే ఎలా ఇక్కట్ల పాలవుతుందో ఇటీవలే నా అనుభవంలోకి వచ్చింది.సరిగ్గా ఈ సమయంలోనే ఈ కథను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం యాదృచ్చికమే అనుకోండి. కథ సారాంశం జ్ఞానబోధ చేస్తున్నట్లుగా ఉంది.

  వ్యాఖ్యకు ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind