చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

శంకర్ గారి బేతాళ కథలు
చందమామ చిత్రకారుడు శంకర్ గారి మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఉద్యోగ జీవితం 1946లోనే మొదలైంది. 1952లో చందమామలో చేరారు. అంటే ఆయన మొత్తం ఉద్యోగ జీవిత కాలం ఇప్పటికి 64 ఏళ్లు. వయస్సు 85 ఏళ్లు. దేహం పండిపోయి, సహకరించని కాళ్లతో, భారంగా అడుగులేస్తూ కూడా, పనిచేయకపోతే పొద్దు పోదనే పాత తరం సంస్కృతికి నిలువెత్తు అద్దంలా నిలుస్తూ, చందమామతో నిండు జీవితం పండించుకున్న నిరుపమాన వ్యక్తి శంకర్ గారు.
నాగిరెడ్డి గారి పేరు చెబితే నిలువెల్లా కదిలిపోవడం శంకర్ గారి నైజం. కేవలం వారు తనకు అందించిన మంచి అవకాశం కారణంగానే చందమామతో తన జీవితాన్ని ముడివేసుకున్నానని చెబుతారాయన. ఇదే విషయంపై మాట్లాడుతూ ‘Till my last breath… I will be with Chandamama’ (చివరి శ్వాస వరకు చందమామతో ఉంటా..) అని ఉద్వేగంగా ప్రకటించారు.
చిత్రాగారు కుంచెతో, తాను చేతితో గీసే విధానం పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయిన సందర్భంలో ‘చిత్రా, శంకర్‌లు చందమామలో జోడెద్దుల్లాంటి వారు. పని సజావుగా సాగేంతవరకు వారి ఇచ్ఛప్రకారమే పనిచేయవచ్చు’ అని నాగిరెడ్డిగారు గతంలో అన్న వ్యాఖ్యలను తలచుకునీ మరీ కదిలిపోయారు.

శంకర్ గారితో సంభాషణ
చివరిశ్వాస వరకు చందమామతోనే ఉంటా అని ప్రకటించుకోవడం శంకర్ గారి మూర్తిమత్వపు గొప్పే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక చిత్రకారుల ఉద్యోగ జీవితాలతో పోలిస్తే ఆయన ఎవరూ ఊహించలేనంత తక్కువ వేతనం ప్రాతిపదికనే చందమామలో దశాబ్దాలుగా పనిచేశారు. దానికి ఆయన ఏ రోజూ బాధపడింది లేదు.
శంకర్ గారి పరిచయం రెండో భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2211
శంకర్ గారి పరిచయం తొలి భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203
మీ స్పందనను abhiprayam@chandamama.com కు తప్పక పంపండి.
test Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: ఆచార్య, ఎంటీవీ, చందమామ, చిత్ర, చిత్రకారులు, జాతకకథలు, పాపయ్య, బేతాళ కథలు, మహాభారతం, రామాయణం, వడ్డాది, వపా, శంకర్ | Comment (0)Leave a Reply





