సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ : దువ్వూరి

September 8th, 2009

“రాష్ట్ర రాజకీయ, సామాజిక జీవితంపై… ఆమాటకొస్తే.. భారత రాజకీయాలపై వైఎస్ వేసిన ముద్రను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. సమకాలీన ప్రపంచంలో కొన్ని కోట్లమంది గుండెలను కరిగించిన మనిషిని, రాజకీయనేతను మనం ఇప్పట్లో చూడలేం. ఒక ముఖ్యమంత్రి ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించడం చరిత్రలోనే లేదు. ఒక దివంగత నేతకోసం ఇన్ని కోట్లమంది విలపించిన ఘటనం సమాకాలీన చరిత్రలో మనమెప్పుడూ చూడలేదు.”

ఇది ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పత్రికలూ, టీవీలూ, ప్రసారసాధనాలు, పార్టీలు, ముక్తకంఠంతో గత నాలుగైదు రోజులుగా చెబుతూ వస్తున్న మాట. వైఎస్ రాజకీయాలను పాలకవర్గ రాజకీయాల్లో భాగంగా మదింపుచేస్తూ, తీవ్రమైన విమర్శనాత్మక దృష్టితో చూస్తూ వచ్చిన వామపక్ష, విప్లవ పార్టీల మేధావులు సైతం వైఎస్ వ్యక్తిత్వ మూర్తిమత్వాన్ని ఇవ్వాళ గుర్తుతెచ్చుకుంటున్నారు.

81 ఇరిగేషన్ ప్రాజెక్టులు. లక్షా నలబై కోట్ల రూపాయలు. ఒక ప్రాజెక్టు కట్టినందుకే తెలుగు జాతి కాటన్ దొరను గత 150 ఏళ్లుగా తమ గుండె గుడిలో పెట్టుకుని ఆరాధిస్తోంది. అయిదేళ్ల పరిపాలనలో 81 ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మహా సాహసమూర్తికి రేపటి తరాలు ఇంకెంత రుణపడి ఉంటాయనే వ్యాఖ్యానాలతో ప్రసార సాధనాలు పదే పదే ప్రత్యేక ఎపిసోడ్లను ప్రసారం చేస్తున్నాయి.
 
కుయ్ కుయ్ కుయ్ కుయ్ అంటూ రాష్ట్రం నలుమూలలా ప్రజలముంగిటకు వెళుతున్న ఆరోగ్య శ్రీ పథకాలు, వృద్ధులకు ఫించన్లు, మహిళలకు అభయహస్తం… విద్యార్థులకు పీజుల రీఎంబర్స్‌మెంట్… ముస్లింలకు రిజర్వేషన్లు, క్రైస్తవులకు రిజర్వేషన్లు.. ఇవి ఏ సమాజానికైనా కోరని వరాలు… ఒక భీభత్సకర పాలన నుంచి బయటపడి ఊపిరాగిన పరిస్థితిలో కొట్టుకులాడుతున్న జాతి ప్రజలకు ప్రాణంపోసే ప్రాణవాయువులివి.

సమాజంలోని అన్నివర్గాలకు మేలు చెయ్యాలనే తపన.. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సహాయం ప్రభుత్వం నుంచి అందివ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ పథకం వెనుక పథకం ప్రకటిస్తూ పోయిన ఆ ఖలేజా వెనుక దాగిన శక్తి ఏమిటి?

ఒక జాతి ప్రజల హృదయాలను ఇంతగా కదిలించిన, రగిలించిన, ఊగించిన ఈ రాజకీయ నేత దృక్పధం ఏమిటి? ఎంతమంది గొప్ప వ్యక్తుల ఆలోచనలు కలిసి ఒకచోట చేరితే ఓ సమాజ భవితవ్యాన్ని నిర్దేశించగల పరిణామాలు ఈ రాష్టంలో గత అయిదారేళ్లుగా జరుగుతూ పోయాయి?

సెజ్‌ల పేరిట వందలాది వేలాది సాగుభూములను, బీడుభూములను టోకున కొనుగోలు చేసి సమాజాన్ని వణికించిన చరిత్రను మనం మర్చిపోనక్కరలేదు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలను దొడ్డిదోవన తీసుకువచ్చి సుతిమెత్తగా వాటిని అమలుచేస్తున్న దళారీ విధానాలను కూడా మనం మర్చిపోనక్కరలేదు.

కానీ… రైతు ఊపిరి నిలుపని సమాజం మనలేదనే సరికొత్త వ్యవసాయ  విజన్‌తో వైఎస్, అతడి సహాయ బృందాలు సాగించిన వ్యవసాయ యజ్ఞం కథా నేపథ్యం ఏమిటి భారత రాజకీయ, సామాజిక  చరిత్రలో వ్యవసాయం, వైద్యం, విద్యుత్ వంటి విభిన్న విషయాల్లో వైఎస్ తెచ్చిన పెను మార్పు ప్రభావం ఏమిటి? 

దువ్వూరు సోమయాజులు గారు… వైఎస్ వ్యవసాయ విధానాల మెంటర్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, వ్యవసాయ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్ దువ్వూరు సోమయాజులు గారితో సాక్షి టీవీ 06-09-09 రాత్రి 11 గంటలకు ప్రసారం చేసిన ఇంటర్వ్యూ దీనికి వివరణాత్మక సమాధానాలు చెప్పింది. సాక్షి పత్రిక వైఎస్ జగన్ పత్రిక కాబట్టి అది ఏమైనా చెప్పగలుగుతుందిలే అని కొట్టిపారేయని రీతిలో వైఎస్ సంస్కరణల నేపధ్యాన్ని అత్యంత సహజంగా ఈ ఇంటర్వ్యూ వివరించింది.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు దువ్వూరు సోమయాజులు గారితో వైఎస్‌కు 1998 నుంచి 2009 దాకా కొనసాగిన బంధం చరిత్ర ఇది. పరిచయం అయింది మొదలుకుని ప్రతిరోజూ, ప్రతి గంటా.. వైఎస్, సోమయాజులు జరుపుతూ వచ్చిన చర్చలకు ఈ ఇంటర్వూ అద్దం పట్టింది.

ఆదివారం రాత్రి ఈ ఇంటర్‌వ్యూను మొదటినుంచి ఫాలో అవుతూ సోమయాజులుగారికి, సాక్షి యాంకర్‌కు మధ్య జరిగిన సంభాషణలను అలాగే సిస్టం ముందు కూర్చుని టైప్ చేస్తూ పోయాను. మళ్లీ ఓ గంట తర్వాత తిరిగి దాన్ని ప్రసారం చేసినప్పుడు పాత పాఠానికి మెరుగులు దిద్దుతూ మొత్తం మీద కింది విషయాలను సాపుచేసాను.

ఈ ఇంటర్‌వ్యూను చదివితే రాష్ట్రంలో గత అయిదేళ్లుగా జరిగిన వ్యవసాయ సంస్కరణల నేపథ్యం అర్థమవుతుంది. దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత సాహసోపేతంగా మొదలెట్టిన తమ పథకాలను కేంద్రం ఆమోదముద్ర సాధించుకోడానికి వైఎస్, నిపుణుల బృదం పడిన ప్రయాస దీంట్లో మనకు కనిపిస్తుంది.

మీ ఆలోచనలు అమలయితే ఆంధ్రప్రదేశ్ కొలాప్స్ అవుతుంది, కుప్పగూలిపోతుంది అంటూ హెచ్చరిస్తూ, స్కూలు పిల్లకాయ ఆలోచనల్లా ఉన్నాయని వ్యాఖ్యానించిన ప్రణాళికా సంఘం చైర్మన్ నాలుగేళ్ల తర్వాత “ఎకనమిక్స్‌ను మళ్లీ నేర్చుకోవడానికి మీవద్ద రెండుగంటలు కూర్చుంటాను. ఏం మాయ చేశారు ఆంద్రప్రదేశ్‌లో” అంటూ అదే సోమయాజులు గారిని కోరిన బ్యాక్ హిస్టరీ ఈ ఇంటర్వ్యూలో ఉంది.

యాంకర్ ప్రశ్న, దువ్వూరి జవాబు తరహాలో సాగిపోయిన ఈ ఇంటర్వూ సారాంశాన్ని బిట్లుబిట్లుగా కింద చూడవచ్చు.

ఒక సూర్యుడే ఆగిపోతే ఎలా ఉంటుంది. ఎన్ని గుండెలు ఆగిపోతాయి
ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంత అభిమానాన్నిపొందిన రాజకీయనాయకుడిని  ప్రపంచ చరిత్రలోనే ఇటీవలికాలంలో చూసి ఉండం.
ఈ అభిమానాన్ని ఎలా పొందగలిగారు వైఎస్.

`ఒక్క పైసా కూడా కొత్త పన్నులు వేయకుండా మా రెవెన్యూలను 26 వేల కోట్లనుంచి 60 వేల కోట్లకు గత 5 ఏళ్లలోపెంచుకోగలిగాం.

ప్రజలు క్రియేట్ చేస్తున్నటువంటి వెల్త్ వారికే చెందాలి. లక్షా 45 వేల కోట్ల రూపాయలు జలయజ్ఞం కోసం ఖర్చు పెట్టాలి అని వైఎస్ మొదట్లో అంటే రాష్ట్ర మంత్రులూ, అధికారులే దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. స్కూలు పిల్లకాయ ఆలోచనల్లా ఉన్నాయని పిచ్చివాడిని చూసినట్లు చూశారు.

కాని మాకున్న (వైఎస్, దువ్వూరి) వ్యవసాయ స్ట్రాటజీతోటే అంత సాహసోపేత చర్యకు పూనుకున్నాం.
పరిచయం అయింది మొదలుకుని 1999నుంచి 2002 వరకు ఒక్కోసారి రోజుకు నాలుగైదు గంటలపాటు వ్యవసాయి విధానాలు, వ్యవసాయ సంస్కరణలు, గ్లోబల్ ప్రభావాలు, సంస్కరణల దుష్ప్రభావాలు, ఎకనమిక్ రిఫార్మ్స్ వీటన్నింటి మీదా చర్చలు జరిగాయి మా ఇద్దరి మధ్య…

1998కి ముందు పదిహేనేళ్లకాలంగా రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు… కారణం ఏమిటి అనే ప్రశ్నతో, దానిపై కూలంకషమైన చర్చతో మా ప్రయాణం కొనసాగింది. అంతవరకు వ్యవసాయ, ఆర్థక సంస్కరణలు అంటే ఏమిటో, ఎకనామిక్స్ అంటే ఏమిటో ఆయనకూ తెలీదు, నాకు అసలే తెలీదు.

రైతుల సమస్యలు, వారి బాధలు, కన్నీళ్లు అనే సమాజ వాస్తవం ప్రాతిపదికగా వైఎస్ పరిశీలన సాగింది. చివరకు ఈ ఆలోచన సంఘటిత రూపం దాల్చిన ఫలితమే ప్రస్తుతం ఆంద్రప్రదేశ్‌లో జరగుతున్న ఇరిగేషన్, అబివృద్ది విప్లవం.

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటే అన్ని రంగాల్లో పెట్టుబడులు, అవకాశాలు పెరుగుతాయి.
ఎకనమిక్ యాక్టివిటీస్‌ని పెంచితే చాలు అన్నీ అవే సర్దుకుంటాయని నమ్మాం మేము. అది పనిచేసింది
సామాన్య ప్రజలను వైఎస్ అర్థం చేసుకున్న ప్రాతిపదిక ఆధారంగానే రాష్ట్రంలో వ్యవసాయ రంగం చరిత్రలో విప్లవం మొదలైంది.
పావర్టీని నిర్మూలించకపోతే మన పథకాలన్నీ విఫలమవుతాయి అనేదే వైఎస్ కనుగొన్న సత్యం.

ఎపిలో గత ఐదేళ్లలో సిమెంట్ ఉత్పత్తి రెట్టింపయ్యింది. పెట్టుబడులు పెరిగాయి. నిర్మాణరంగం విపరీతంగా పెరిగింది. ఇవన్నీ మన వ్యవసాయరంగంలో వచ్చిన అనూహ్య అభివృద్ది ఫలితాలే.

వ్యవసాయం మీద మాట్లాడాలంటే గంటలు టైం వెచ్చించేవారు వైఎస్. ఆయన బేసికల్లీ రైతు, వ్యవసాయం తెలుసాయనకు.. స్పూన్ పీడింగ్ అంటే బంగారు స్పూన్‌తో తిండితినే సంపద్వంత కుటుంబంలో పుట్టినప్పటికీ… రైతుల సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలకు ఏరోజూ దూరంగా లేడాయన.

‘దేశంలోని రైతులందరికీ మేలు చేయగల పాలసీలను తయారు చేయండి. ప్రధానిని కలిసి మాట్లాడదాం’ అని మాకు సూచించారాయన.
‘వ్యవసాయంలో మోర్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకుంటే ఏ రంగంలోనూ కొనుగోళ్లు పెరగవు.’

ఇదే వైఎస్ ప్రతి సమావేశంలో మాట్లాడింది.

రైతుల ఆదాయం ఎంత పెరిగింది అనే దానిమీదే దేశ ప్రగతి ఆధారపడి ఉంది.
వ్యవసాయం పట్ల వైఎస్‌కు ఎంత విశాలమైన దృక్పధం ఉందంటే ఆయన ఆలోచనలు మొత్తంలో అంత అగ్రస్థానం పొందిన ఆలోచన మరొకటి లేదు.

ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తొలిసారి వ్యవసాయ రంగ స్తితిగతులపై చర్చించినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ ప్రస్తావనకు వచ్చింది. కేంద్రప్రభుత్వ ఆర్థిక విధానాలకే ఈ ఉచిత విద్యుత్ అనేది వ్యతిరేకమని ప్రధానితో సహా అందరూ అప్పుడు వాదించారు. వైఎస్ ఒకే ఒక మాట చెప్పారు. దేశంలో ఎక్కడా లేనన్ని వ్యవసాయ పంపు సెట్లు, 28 లక్షల పంపుసెట్లు ఆంద్రప్రదేశ్‌లోనే ఉన్నాయనే విషయం వైఎస్ ప్రదాని, ప్రణాలికా సంఘ చైర్మన్ తదితరులకు గుర్తు చేసారు.

ఈ 28 లక్షల పంపుసెట్లమీద ఆధారపడిన 65 లక్షల మంది వ్యవసాయదారులు ఇప్పటికిప్పుడు వ్యవసాయం మానివేయమన్నా మానివేస్తారని, మీరు ప్రతిరైతుకూ నెలకు రెండు వేల రూపాయల జీతం ఇవ్వగలిగితే లేదా ఉద్యోగాలు కల్పించగలిగితే అందరూ వ్యవసాయం మానివేసి ఉద్యోగాలకే మల్లతారని, రైతులకు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి దేశంలో ఉందని వైఎస్ ఆ సమావేశంలో వాదించారు.

వ్యవసాయ రంగం మెరుగు పడాలంటే దానిపై మరింత అదనంగా పెట్టుబడులు గుమ్మరించాలని సూచించారు. ఆయన చెప్పిన మార్గంలో వెళ్లిన ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాళ అని జాతీయ అభివృద్ది సూచికల్లోనూ అగ్రస్థానంలో ఉంది. జాతీయ ప్రణాళికల్లో రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే అన్ని ప్రత్యేక పథకాల వినియోగంలో ఆంధ్రప్రదేశే ముందు పీఠిన ఉంది.
 
భారత దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జలయజ్ఞం పేరిట భగీరథ ప్రయత్నం వైఎస్ చేపట్టారు. కేంద్రాన్ని ఒప్పించనిదే, ప్రధానిని, ప్రణాళికా సంఘాన్ని ఒప్పించందే ఇంత భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓ రాష్ట్రంలో జరుగుతూండటం అసంభవం.

మరొకటి… వైద్యం.
కుయ్.. కుయ్., కుయ్.. అంటూ ఆరోగ్యశ్రీ వాహనం సౌండ్‌ను ఆయన తన నోటిద్వారా పలికించి జనాన్ని ఉర్రూతలూగించేవారు.
108 అంబులెన్స్ వచ్చినప్పుడు కుయ్ కుయ్ కుయ్ కుయ్ అంటోందా లేదా… అని ఆయన ప్రజలనే అడిగేవారు.

108, 104 సేవలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు బతుకునిచ్చాయి. ఆశలు రేపాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వాళ 99 శాతం రాష్ట్ర ప్రజలకు ఈ వైద్య సేవలు గురించి తెలుసు. పై రెండు నంబర్లకు ఫోన్ చేస్తే చాలు అంబులెన్సు నేరుగా తమ ఇంటికే వస్తుందనే విషయం మాత్రమే వారికి తెలుసు. ఇది 104, 108 సేవలు సాధించిన అద్బుత విజయంగానే చెప్పాలి.

రాష్ట్రంలో వైఎస్ పాలనలో జరిగిన ఎకనమిక్ యాక్టివిటీస్, కన్‌స్ట్రక్టరీ యాక్టివిటీస్ నభూతో నభవిష్యతి…

ఈరోజు 10రాష్ట్రాల్లో ఈ ఆరోగ్య శ్రీ సేవలు అమలవుతున్నాయంటే దానికి ఒకే ఒక్కరు కారణం. వైఎస్.
ఉచిత వైద్యం అనే భావనే తెలీని అమెరికాలో సైతం ఇవ్వాళ జాతీయ వైద్యవిధానంలో మౌలిక మార్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అది ఆంధ్ర ప్రదేశ్‌లో 108, 104 సేవలు సాధించిన విజయం అనే చెప్పాలి.

ప్రభుత్వం సహాయం చేయకుంటే, ప్రభుత్వ పాత్ర లేకుంటే ఆరోగ్యశ్రీ ఇంత విజయం సాదించేది కాదు.

వైయస్ మన గుండె చప్పుడు., మన శ్వాస.. వారి జీవితమే మనకు సందేశం, వారి దార్శనికతే మన బతుకును ముందుకు తీసుకుపోయే మార్గం.

రాష్టంలో ఏ మూలకు వెళ్లినా వైఎస్ ఏం చేశాడనేది అందరికీ కనబడుతుందిప్పుడు.

కామన్ మేన్‌కి ఉచితంగా వైద్యం చేస్తామనే ప్రతిపాదన బ్రిటన్లో, అమెరికాలో ఎక్కడా మనం చూడం. ఇది మీరెలా చేయగలిగారు.

ఆయన స్వయంగా వైద్యుడు. గ్రామీణ ప్రాంతంలో కుటుంబాలకు కుటుంబాలే అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకోలేక పడుతున్న బాధలను ఆయన సంవత్సరాలుగా దగ్గరనుంచి పరిశీలించారు. ఆహారం, ఆరోగ్యం ఇవి రెండూ రైతాంగానికి సమర్థంగా అందించినప్పుడే వారి జీవితాల్లో వెలుగు వస్తుందని భావించిన అరుదైన రాజకీయ వేత్త వైఎస్.

అందుకే ఆయన మరణం ఇంతగా బాధపెడుతోంది. వ్యక్తిగతంగా ఇంతకు మించిన దుస్సంఘటన నా జీవితంలో మరొకటి ఉండదు. 

He is the greatest humanist i have ever seen in my life – duvvuri-

ఒక మనిషి బాధపడుతుంటే చూడలేని తత్వం వైఎస్‌ది. ఆయన ఇంటికి వచ్చేవాళ్లు సామాన్య ప్రజలు వారి బాధలు చూసి చూసీ మనసు కరిగిన తత్వంతోటే వాళ్లకు ఏదో ఒకటి చేయాలని తపించిపోయేవారు.

వ్యక్తి జబ్బు, వ్యసనం మొత్తం కుటుంబాన్నే దగ్థం చేస్తున్న పరిస్థితిని ఆయన కళ్లారా చూసాడు. ఎందుకు రైతులు అప్పులు చేయవలసి వస్తోంది అనే ప్రశ్నకు సమాధానం కనుగొన్న మొదటి వ్యక్తి ఆయన. ఆరోగ్యశ్రీకి ఇక్కడే పునాదులు పడ్డాయి.

ఐదేల్లుగా ఏ ఒక్కరిమీదా పన్నులు వేయని ప్రభుత్వం. సమకాలీన చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయలేదు.

ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 85 శాతం వైట్ కార్డులే ఉన్నాయి. ఇవి ఆరోగ్య శ్రీలో ప్రజలకు ఉపయోగపడిన అంశం

మనిషిని ముందుగా బ్రతికించాలి ఇదీ ఆయన పాలసీ

ఒకపక్క రైతుల ఆదాయం పెంచడం, అన్నిరకాల ఖర్చులను తగ్గించాం. ఇదే మేజర్ మార్పు

ఒక్క ప్యామిలీలో పదేళ్లకాలంలో ఏ ఒక్క కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో ఆసుపత్రికి పోయినా సరే వాళ్లు పదేళ్లుగా సంపాదించిన మొత్తం ఆదాయం కరిగిపోతుంది. మరో పదేళ్లవరకు వారికి అప్పులు తీరవు. వైద్యానికి పెట్టిన ఖర్చులు. ఇది మారకుంటే, ఈ పరిస్థితి మారకుంటే మన రైతాంగం ఎన్నటికీ బాగుపడదు.

అందుకే ఆరోగ్యశ్రీ పథకంమీద ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పుటికీ వైఎస్ మడమ తిప్పలేదు.

ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు దేశానికే అనుసరణీయమైన మార్గమయ్యింది.

ఉచిత విద్యుత్ అందించలేమని దేశంలో అన్ని రాష్ట్రాలూ చేతులెత్తేసినప్పటికీ 5 ఏళ్లుగా ఉచిత విద్యుత్తును అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.

జాతీయ రాజకీయాలపే వైఎస్ చెరగని ముద్రకు ఆయన మరణం పట్ల ప్రపంచం స్పందనే సాక్షి. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వైయస్‌ని చివరి సారిగా చూడాలని తరలివచ్చారు. బిబిసి నుంచి మాస్కో వరకు ప్రపంచ ప్రసార సాధనాలన్నీ ఆయన మరణ వార్తను పదే పదే ప్రసారం చేశాయి.

ఇప్పుడు ప్రతి రాష్ట్రమూ చివరకు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజా సంక్షేమ చర్యలను ప్రధానంగా తీసుకుంటోందంటే వైఎస్ వెలిగించిన స్పూర్తే దానికి కారణం..

కేంద్ర ప్రాయోజిత పథకాలు
కేంద్రం చాలా పథకాలను ప్రకటించి వదిలేస్తుంది. దాన్ని ఏ రాష్ట్రం ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్రం పరిస్థితి మెరుగుపడుతుంది. గత అయిదేళ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎక్కువగా ఉపయోగించుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డిల్లీకి పోయినప్పుడు మనం ఎలా ఫెర్‌పార్మన్స్ చేసామనే విషయమే కీలకమైందని వైఎస్ మాకు పదే పదే చెప్పేవారు. నచ్చచెప్పడం, కేంద్రస్థాయి సంస్థలతో సఖ్యతతో ఉండటం ఇక్కడ మన ఫెర్మాన్సెస్ ఎంత చక్కగా ఉంటే అన్ని ప్రయోజనాలు మనకు లబిస్తాయిని ఆయన ముందే మమ్మల్ని అలర్ట్ చేసేవాడు.

ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఆంద్రప్రదేశ్ ‘అబివృద్ది విషయంలో ఎకనమిక్స్ గురించి మీనుంచే రెండు గంటలు కూర్చుని నేర్చుకోవాలని అనుకుంటున్నా’ అని మొన్ననే చెప్పారు. ‘స్కూలు పిల్లల్లాగా ఉత్సాహపడుతున్నారు. మీ పథకాలు అమలయితే రాష్ట్ర ఆర్తికవ్యవస్తే కొలాప్స్ అవుతుంది’ అని ఈయన కొన్నేళ్ల క్రితం కామెంట్ చేశారు. కాని గత మూడేళ్లుగా కేంద్రం ప్రకటిస్తున్న గణాంకాల ప్రకారం ప్రతి రంగంలోనూ, ప్రతి పధకంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటోంది. ఇది ఎలా సాద్యమయిందిమీకు, మీరు సృ,ష్టించిన మిరకిల్ ఏమిటి అని తను రెట్టించారు.

‘మీరు మొత్తంగా కొలాప్స్ అయిపోతారు, దెబ్బతినిపోతారు అనుకున్నాం., కానీ 5 ఏళ్లలో మీరు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఎలా సాధించారు’ అని ఆయన అడిగారు. ‘వ్యవసాయ, పారిశ్రామిక, మానవాబివృద్ది, వైద్య, విద్యా రంగాల్లో దేన్ని చూసుకున్నా ఆంద్రప్రదేశే ముందుపీఠంలో ఉంది. ఎలా సాధ్యమైంది ఇది. అందుకే మీనుంచి నేను రెండుగంటలు ఎనకమిక్స్ గురించి నేర్చుకోవాలని అనుకుంటున్నా’ అని ప్రణాళికాసంఘం సభ్యుడు చెప్పారు.

వ్యవసాయ ప్రాజెక్టులు

35 కోట్లమందికి గతంలో భోజనం పెట్టలేని దేశం ఇప్పుడు 125 కోట్లమందికి తిండిపెట్టగలుగుతోంది. దీనికి నెహ్రూగారి కాలంనుంచి దేశంలో కడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులే కారణం. ఇరిగేషన్ పెంచకపోతే వ్యవసాయం బాగుపడదు. రాజశేఖర రెడ్డి గొప్పదనం ఇక్కడే ఉంది.

చిన్నపిల్లలకంటే ఎక్కువ సంతోషంగా వ్యవసాయానికి సంబంధించిన మంచివార్తలను మాతో పంచుకునేవారాయన. మేమింకా పేపర్ చదవలేదంటే ఆయనే అప్పటికప్పుడే చదివి మాకు వినిపించేవారు.

రాజశేఖర రెడ్డి మరణం… నా జీవితంలోనే అతి పెద్ద నష్టం.
It is the greatest personal loss to me. To the people too.

వ్యవసాయంలో ఏటా 4 శాతం అభివృద్ది జరగందే దేశం బాగుపడదు అనేవిషయం వైఎస్ పదే పదే వివిధ కేంద్ర బృందాలతో చెప్పేవారు. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం 6.5 శాతం అభివృద్దితో ముందుకు పోతోంది. అయిదేళ్లలో వైఎస్ సాధించిన ఘనత. ఇది భారత రికార్డే కాదు. వరల్డ్ రికార్డు కూడా. ప్రపంచంలో ఏ దేశమూ ఇంత వేగంగా వ్యవసాయరంగంలో అబివృద్ది సాధించలేదు.

వైఎస్ తన చివరి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు (02-09-09 ఉదయం 8 గంటలకు హెలికాప్టర్‌ ఎక్కేముందు క్యాంప్ ఆపీస్‌లో సాక్షి విలేఖరితో వైఎస్ మాట్లాడిన చివరి మాటలివి.

గవర్నమెంట్‌కు సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజమ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కనుక్కోవడమే రచ్చబండ కార్యక్రమం లక్ష్యం. ప్రభుత్వ యంత్రాంగం, సరఫరా వ్యవస్తలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేవిషయం స్వయంగా నాకు నేనే కనుక్కోవాలనే ఉద్దేశ్యంతోటే రచ్చబండకు వెళుతున్నా. ఇది పల్లెలో మీటింగ్ పెట్టడం కాదు. వారితో నేరుగా మాట్లాడటం, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు మీకు చేరుతున్నాయా లేదా అని కనుక్కోవడమే దీని ఉద్దేశం

he is an extremely family man. very emotonally, and attachmented man he is….

ఇవల్యూషనరీ చేంజెస్‌లో భాగంగానే ప్రీమార్కెట్ ఎకానమీ, కమాండ్ ఎకానమీలు పరస్పరం పలు దేశాల్లో చేతులు మార్చుకుంటున్నాయి. ప్రీ మార్కెట్ ఎకానమీ లోపాల్లోంచే కమాండ్ ఎకానమీ (సోవియట్ తరహా వ్యవస్త) ఉనికిలోకి వచ్చింది. దాంట్లో కొన్ని తీవ్రలోపాలు ఎదురైనప్పుడు, వాటికి పరిష్కారంగా మళ్లీ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఎంటరవుతోంది.

దాంట్లో భాగంగానే 92లో ఆర్థిక సంస్కరణలను తీవ్రంగా చేపట్టాల్సి వచ్చిందని పీవీ నరసింహారావు అప్పట్లో పదే పదే చెప్పేవారు. అయితే ఈ రెండు ఎకానమీల మధ్యేమార్గంగా మేం స్వీకరించిన మిక్స్‌డ్ ఎకానమీని ఎప్పటికీ వదిలేది లేదని, మా దేశ ఆర్తిక, రాజకీయ, సామాజిక పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతుందని పీవీ అనేవారు. దీన్నే మేం మళ్లీ ఓ బృందంగా అధ్యయనం చేశాం మళ్లీ..

వుయ్ ఆర్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ ఆఫ్ యు సర్ అని పదే పదే ఆయనతో అనేవారం.

ఇవ్వాల రైతుబాంధవుడిగా ప్రజలు ఆయన్ను గుర్తు పెట్టుకుంటున్నారు. ఈయన మా మనిషి అనే భావం రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయి ఉంది. ఓ ప్రజాస్వామిక దేశంలో ఏ నేతా ఇంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన చరిత్ర ఇటీవలికాలంలో మనం చూడలేదు. ఇదే వైఎస్ వ్యక్తిత్వం.

ముఖ్యమంత్రి కాకముందు తనను రోజూ కలిసే రైతుల ప్రజల బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసాడు, విన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక క్యాంపు ఆపీసులో రోజు జరిగే ప్రజలతో భేటీలో వారు చెప్పుకుంటున్న బాదలను విన్నాడు. ఇవే ఆయనలో ఓ గొప్ప మార్పును తీసుకువచ్చాయి. వ్యవసాయరంగంలో ఆయన చేపట్టిన అన్ని చర్యలకు ప్రత్యక్షంగా కొన్ని సంవత్సరాలుగా ఆయన వింటూ వచ్చిన ప్రజల బాధలే ప్రాతిపదిక.

రైతుల బాధలు పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్తు లేదనే గొప్ప సత్యాన్ని ఆయన కనుగొన్నాడు. ఆయన శవాన్ని తీసుకుపోవడానికి చివరకు 108 అంబులెన్సే రావడం చూసినప్పుడు ప్రజల గుండెలు నిజంగా అవిసిపోయాయి.

మతములన్నియు మాసిపోవును, మంచియన్నది నిలిచిపోవును అని గురజాడ అన్నారు. ఇది వైఎస్‌కు వర్తించినట్లుగా ప్రపంచంలో మరెవ్వరికీ వర్తించదేమో.. ఆంధ్రదేశంలోని అన్ని మతాల ప్రజలు ఆయన జ్ఞాపకాల చిత్తడిలో కరిగి నీరవుతున్నారివ్వాళ.

అర్ధాంతరంగా నింగికెగిసిన వైఎస్‌కు ముక్తకంఠంతో జోహార్లు పలుకుతోంది నేడు ఆంద్రావని.
———————-
09-09-09 న సాక్షి టీవీలో జర్నలిస్టుల నివాళి

ఐ. వెంకట్రావు, రామచంద్రమూర్తి, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, అమర్ తదితరుల నివాళి

జర్నలిస్టుల నేస్తం వైఎస్

20 సంవత్సరాలకు సంబంధించిన పథకాలు వేసుకుని ఎవరో వెనుకనుంచి తరుముతున్నట్లుగా పరుగెత్తి ప్రారంభించిన జననేత రాజశేఖరరెడ్డి.

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేకపోయినందుకు, నాటి తరం వారిని చూడలేకపోయినందుకు బాధపడేవారం. కాని 50 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇంతటి మహానేత, జననేత బతికి ఉన్న తరంలో ఉన్నందుకు మేమిప్పుడు గర్వపడుతున్నాం.
పేదల ప్రజల ఆకలి చప్పుడు విన్నారు వైఎస్. అందుకే ఆయనకు ఇంతటి ప్రజాదరణ.

ఆయన డాక్టర్, గతంలో రూపాయి డాక్టరు అని పేరు పొందారు. రూపాయి పీజు తీసుకున్నారు కాబట్టి ఆయనకు ఈ పేరు వచ్చింది. ఆయన స్టెతస్కోపు పెట్టి జనం గుండె చప్పుడు వినలేదు. ప్రజల ఆకలి కేకల చప్పుడు విన్నారు. అందుకే ఇన్ని రకాల పథకాలు, సేవలు ఆయన పాలనలో జనాన్ని ముంచెత్తాయి. — పరుచూరి వేంకటేశ్వరరావు.

————

2004లో వైఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తన రాజకీయ నేపధ్యం గురించి విమర్శనాత్మకంగా వచ్చిన రెండు భిన్నాభిప్రాయాలను కింది లింకులలో చూడగలరు.

http://www.hvk.org/articles/0704/142.html
http://timesofindia.indiatimes.com/articleshow/msid-782107,flstry-1.cms

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind