చందమామ పాత కాపీలు దొరికాయోచ్

August 30th, 2009
భీష్మార్జునులు

భీష్మార్జునులు

చందమామ పిల్లల కథల పత్రికగా మొదలై ‘సాహిత్యాభిలాషలో పిన్నలకూ, పెద్దలకూ, స్త్రీలకూ, పురుషులకూ ఉండే వ్యత్యాసాలను సరిచేసిన పత్రిక’ గా, కుటుంబంలోని అందరి పత్రికగా 50 ఏళ్ల క్రితమే చరిత్రకెక్కిన విషయాన్ని 1960 జూన్ చందమామ సంపాదకీయం ఆధారంగా నా బ్లాగులో ‘అందరి చందమామ’ పేరుతో ఇవాళ ఓ కథనం పోస్ట్ చేశాను.

జలుబు, జ్వరంతో అన్ని పనులు మానుకుని విశ్రాంతిగా ఉండగా ‘చంపి’ సభ్యురాలు సుజాత గారు ఓ చల్లటి వ్యాఖ్య ఈ సాయంత్రం పంపారు. దాన్ని వ్యాఖ్యలాగా కథనం లోపల ఉంచటం కన్నా చందమామ అభిమానులందరూ పంచుకునేలా చేస్తే బాగుంటుందని భావిస్తూ ఇక్కడ ‘చందమామ పాత కాపీలు దొరికాయోచ్’ అనే పేరిట కొత్త కథనం పోస్ట్ చేస్తున్నాను. 1968-74 కాలం నాటి చందమామలు భద్రంగా దొరకడం అంటే మాటలా… ఈ గొప్ప వార్తను మీరూ చదవండి మరి…

Comment by సుజాత — 08/30/2009 @ 7:58 am |

రాజు గారు,
నిన్న మా చెల్లెలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో బ్లాగుల్లో చందమామ గురించి, చంపిల గురించి చెప్పాను. అప్పుడు తను ‘ఎవరికీ చెప్పనంటే ఒక విషయం చెప్తాను”అంటు తన వద్ద 1968-74 మధ్య కాలం నాటి చందమామలు కొన్ని ఉన్నాయని చెప్పి మతి పొగొట్టింది. కనీసం చూడ్డానికైనా ఇవ్వమని అడిగాను. చందమామల విషయంలో ఎవ్వర్నీ(నన్ను ఐనా సరే) నమ్మనంటూనే ఎలాగో ఒప్పుకుంది. త్వరలో వాటిని చూడ్డమే కాక, చదువుతాను కూడా! సంతోషం పట్టలేక ఇక్కడ పంచుకుంటున్నా!

ప్రతి వ్యాఖ్య
అమ్మా సుజాతమ్మ తల్లీ,
నాకు మతి పోతోందిక్కడ ఈ వార్త వింటూంటే. 68-74 చందమామలా? ఆహా… ఎంత గొ్ప్ప నిధి దొరికింది మీకు. అవి అలాగే జిరాక్స్ చేసి కాపీకి ఇంత అని అమ్మకం పెట్టినా అలాగే కొనేసేందుకు చాలామందే సిద్ధంగా ఉంటారు. అదేదో మీ చెల్లెలికి చెప్పి ఆ ఏర్పాట్లేవో మీరే చేస్తే బాగుంటుందేమో కదా. ఎంత మంచి వార్త.

10 రోజులు క్రితం చందమామ ప్రింట్ ఆన్ డిమాండ్ పాలసీ అమలు కావడం లేదు అని చెప్పి మీ అందరినీ నిరాశపర్చాను. కాని ఇప్పుడు అందుకు భిన్నమైన వార్త చెబుతున్నా. 60 సంవత్సరాల చందమామల డీటీపీ వర్క్ త్వరలోనే మొదలు కావచ్చు. అది పూర్తయిందంటే కోరిన వారికి కోరిన పాత చందమామలను ముద్రించి ఇచ్చే పని ఆమల్లోకి వస్తుంది. దీనికి మహా అంటే మరో 4 నెలల సమయం పడుతుందని అంచనా. అలాగే దాసరి సుబ్రహ్మణ్యం గారి 12 ధారావాహికలను విడివిడిగా ముద్రించి చందమామ ప్రచురణల పేరిట పాఠకులకు అందివ్వమని మా యాజమాన్యానికి ప్రతిపాదించబోతున్నాం. త్వరలో వీటిపై నిర్ణయం జరుగవచ్చు.

మొత్తం మీద ఆశ, నిరాశల మధ్య దోబూచులాడుతూ వస్తున్నాం కదా. మంచే జరుగుతుందని ఆశిద్దాం.

మీ వద్ద మంచి స్కానర్ లాంటిది ఉంటే ఆ పాత చందమామల రెండు కవర్ పేజీలను స్కాన్ చేసి (కనీసం 300 డీపీఐ) అభిమానులకు ఇస్తే బాగుంటుంది కదా…

చల్లటి వార్తకు ధన్యవాదాలు. ఇన్నాళ్లుగా పాత చందమామలను కాపాడిన మీ చెల్లెలు గారికి కూడా మరి!

Comment by chandamamalu — 08/30/2009 @ 8:43 am

RTS Perm Link


13 Responses to “చందమామ పాత కాపీలు దొరికాయోచ్”

 1. వేణు on August 30, 2009 2:03 PM

  ప్రింట్ ఆన్ డిమాండ్ కు సంబంధించి చందమామ అభిమానులకు ఆశా నిరాశల ఊగిసలాట తప్పటం లేదు. ఇలాంటి స్థితిలో చల్లని వెన్నెల్లాంటి పాత చందమామల కబురు అద్భుతంగా ఉంది! 1968-74 మధ్య కాలం నాటివి అంటే… కొడవటిగంటి సారథ్యం వహించిన చందమామ స్వర్ణయుగంలోనివి. నిస్సందేహంగా అమూల్యమైన నిధి!

 2. chandamamalu on August 30, 2009 2:45 PM

  స్వంత ఇల్లు, స్థిరజీవితం ఉంటే తప్ప పాత పత్రికలు, చందమామలు వంటివి సురక్షితంగా ఉండటం సాధ్యం కాదని నా అనుభవం. ఏదేమైనా ఇప్పుడు భూమ్మీద అత్యంత భాగ్యవంతులు సుజాత గారు, ఆమె సోదరి మాత్రమే అని వ్యాఖ్యానిస్తే చంపిలు ఏకీభవిస్తారనుకుంటున్నా. పూర్వ కాలం లంకెబిందెలు బయటపడితే అదృష్టం వరించినట్లే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఇంటి అటకల్లోనో, పాత పెట్టెల్లోనో, మరో చోటనుంచో చందమామలు బయటపడుతున్నాయి. అదీ అరుదైన చందమామలు.. అయినా, ‘భగవంతుడు’ వాళ్లిద్దరికే ఇంత భాగ్యం కలిపించాలా?

 3. సుజాత on August 31, 2009 3:12 AM

  “ఇప్పుడు భూమ్మీద అత్యంత భాగ్యవంతులు సుజాత గారు, ఆమె సోదరి మాత్రమే అని వ్యాఖ్యానిస్తే….”

  రాజు గారూ, మీరు మరీ అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు సుమా! ఆ కాపీలు ఈ వారాంతంలోపు నా దగ్గరికొస్తాయి. 1968-77 మధ్యలోవి అనుకుంటున్నాను. రాగానే వాటి ముఖచిత్రాలు కొన్నయినా స్కాన్ చేసి నా బ్లాగులో పెడతాను.

  ధన్యవాదాలు!

 4. chandamamalu on August 31, 2009 3:45 AM

  సుజాతగారూ,
  నాది అతిశయోక్తి కానే కాదు. రూ.1400 సకాలంలో చందమామ లైబ్రరీకి ఇవ్వలేకపోయినందుకు 2000-08 వరకు చందమామ కాపీలు పొందే అవకాశం చేతులారా పోగొట్టుకున్నా. ఇప్పుడు పాతకాపీలను అమ్మడం లేదు.

  నా వ్యాఖ్యలు అతిశయోక్తి కాదు అనేందుకు చక్కటి ఆధారం ఇక్కడ చూడండి. ఈరోజే ఆన్‌లైన్ చందమామకు ఓ సీనియర్ అభిమాని మెయిల్ పంపారు. ఆ విద్యుల్లేఖ సారాంశం ఇదీ..

  వీరభద్రరావు చముటూరి
  “నేను ౧౯౫౨ నుండి మా చందమామ చదువుతున్నాను. అప్పటినుండి చాల సీరియల్స్ సేకరించాను. అవి బౌండ్లుగా చేయించాను. కొన్ని సీరియల్స్ పోగోట్టుకోవడం కూడా జరిగినది. ఇపుడు నేను వ్రాసేదేమంటే మీరు ౧౯౮౦ డిసెంబర్ వరకే పాత చందమామలని ఇస్తున్నారు. ఆపై వాటిని ఎప్పుడు ఇస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సీరియల్స్ అన్నిటిని బౌండ్లుగా మీరే ఎందుకు ప్రచురించకూడదు? మీరే వాటిని మాకు తగిన ధరకు అమ్మవచ్చుగా? ఈ విషయం ఆలోచించి మాకు తెలియజేస్తే ఎంతో సంతోషిస్తాము. అలా జరిగితే నాకే మొత్తం సీరియల్‍‌లు అన్ని పంపవలెనని కోరుతున్నాను. సమాధానమిస్తారుగా..”

  నా వ్యాఖ్యలు అతిశయోక్తో కాదో ఈ ఉత్తరం చూసి మీరే నిర్ణయించుకోండి. అన్ని సీరియల్స్ సేకరించి బౌండ్లు కూడా సిద్ధంచేసి పదిలపర్చుకున్న రావుగారు…. సీరియల్స్ అన్నిటినీ చందమామ తిరిగి ప్రచురిస్తే మొత్తం సీరియల్‍‌లు అన్ని తనకే పంపాలని కోరుతున్నారు. పాఠకులు, అభిమానుల దృష్టిలో చందమామ నిజంగా అరుదైన సంపదే మరి. మీ చిరునామా తెలిస్తే ఆయన మీ వద్దకే భవతీ పుస్తక బిక్షాందేహీ అని వస్తారేమో మరి జాగ్రత్త…

  మీకు లభ్యమవుతోంది 1968-77 నాటి కాపీలు అయితే మరీ విలువైనవే. మీరు చందమామ ముఖచిత్రాలు తప్పక స్కాన్ చేసి మీ బ్లాగులో పెట్టండి. అప్పుడే అందరికీ కన్నుల పండుగ.

  వ్యాఖ్యకు ధన్యవాదాలు.

 5. రవి on August 31, 2009 4:58 AM

  సుజాత గారు, congratulations!

  నా దగ్గరా random గా పాతవి అనేకానేక చందమామలున్నాయి. కొన్ని బౌండ్, కొన్ని లూజ్ గాను.

  అన్నట్టు చందమామ రజతోత్సవ సంచిక (1972 లేదా 74 May)సంచిక చూడండి. అదో ఆణిముత్యం, ముఖచిత్రం, చివరి అట్టతో సహా. ఇప్పటి వరకు వచ్చిన చందమామల్లో ఓ పది ఏరమంటే, నా సెలెక్షనులో అది ఒకటి.

 6. chandamamalu on August 31, 2009 10:06 AM

  రవి గారూ, మీరూ ఆ భాగ్యవంతుల జాబితాలో చేరిపోయారు. బౌండ్‌లు సరే. లూజ్‌గా ఉన్న చందమామలు అస్సలు పోగొట్టవద్దు. కృష్ణబాలు అనే హైదరాబాదీ కన్సల్టెంట్ తన మొత్తం చందమామ కలెక్షన్లను సొంత బంధువే తస్కరించాడని బాథపడిపోతున్నారిక్కడ. ఈ వివరాలు తదుపరి టపాలో వివరిస్తాను. మీ బ్లాగ్ శతకానికి అభివందనలు. మీ బ్లాగ్ గతంలో కూడా చూస్తున్నప్పటికీ ఇప్పుడు మరింత ఆత్మీయంగా చూస్తున్నా..అలాగే బ్లాగాడిస్తూ పోండి..

 7. వేణు on August 31, 2009 10:30 AM

  చందమామ భాగ్యవంతుల జాబితా భలే పెరుగుతోందే!
  వీటికి తోడు సొంత బంధువులే చందమామల్ని తస్కరించే ఉపాఖ్యానాలా మళ్ళీ?

 8. chandamamalu on August 31, 2009 10:47 AM

  వేణుగారూ అది ఒక మహా విషాదగాధ. త్వరలోనే ఈ బ్లాగులోనే ఆ ఉదంతాన్ని చూడండి మరి.ఎక్కడైనా బావ గాని వంగతోట కాడ కాదు సామెతను కొంచెం మార్చి చదువుకోవలసి ఉందిప్పుడు. ఇకపై ‘బంధువులొస్తున్నారు జాగ్రత్త’ అని పాడుకోవాల్సి ఉంటుందేమో…

 9. shanmukhan on November 2, 2009 4:32 AM

  చందమామ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటానికి
  http://bhuvanavijayamu.blogspot.com/2009/06/how-to-download-chandamama-other-books.html

  already downloaded books

  http://cid-f86920f00c727cd1.skydrive.live.com/browse.aspx/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

 10. kanthisastry on November 12, 2009 6:03 AM

  sujatagaru,meeanta adrushtavantulu yevaru undarandi.apata chandamamalu anni reprint ayyi vaste konesukovalani yento korikaga vundi – kanthisastry.

 11. Lakshmi Narayana on February 16, 2012 6:55 AM

  Dear all,

  Sorry I cannot type in Telugu, So I am typing in Telugu.
  I request all of you to forgive me.

  Now What I am requesting you is , Kindly call me if any of you having double copies of any Telugu Chandamama back issues. My Mobile No is 07760972070.

  I am ready to exchange with double copies which I have otherwise, I am rady to pay for books.

 12. Lakshmi Narayana on February 16, 2012 7:00 AM

  Priyamaina Sujatha garu,

  I am Lakshmi Narayana HR. I am staying in Bangalore.I want to speak to you regarding Chandamama back issues you found. Can you give me your mobile. My mobile no is
  07760972070.

  Kind regards

 13. Lakshmi Narayana on February 16, 2012 7:02 AM

  Please read ” Can you give me your mobile ” as Can you give me your mobile No.

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind