బుజ్జి

నేను చూసిన మూడు సినిమాలు..
Love Aaj Kal:

నాకు ఈ మధ్య కాలంలో విపరీతంగా నచ్చేసిన సినిమా ఇది. కూల్ టైం పాస్ మూవీ.కథ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ బాగుంది.సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మనల్ని లాక్కెళ్ళిపోతుంది, ఎక్కడా బోర్ కొట్టకుండా.

ఈ సినిమా లో దీపిక పదుకొణే నాకు విపరీతంగా నచ్చేసింది.దీపిక డైలాగ్ డెలివెరీ చాలా బాగుంది. especially,ఇండియా వచ్చేటప్పుడు సైఫ్ తో ఎయిర్ పోర్ట్ నుండి ఫోన్లో మాట్లాడే సీన్ లో నడిచే స్టైల్, మాట్లాడే స్టైల్ క్యూట్ గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లో “Angle naya hai,mujhe lagta hain isein aur discuss karna chaihiye” డైలాగ్ కి వచ్చేటప్పటికి నేను పూర్తిగా దీపిక ఫాన్ అయిపోయాను.ఈ డైలాగ్ కాజువల్ గా ఉన్నా, చెప్పేటప్పుడు గొంతులో వణుకు తెలుస్తూ ఉంటుంది.కానీ రోటీన్ హింది సినిమాలలో లాగా పూర్తిగా ఏడుస్తున్నట్టు కూడా ఉండదు.

దీపిక గురించేనా, సైఫ్ గురించి ఏం లేదా అంటే.. ఎందుకు ఉండదు?? as usually, సైఫ్ బాగా చేసాడు. especially, దీపిక పెళ్ళిలో కంఫ్యూసింగ్ డైలాగ్స్ చెప్పే సీన్ చాలా బాగుంటుంది.సైఫ్ రెండ్ రోల్స్ కి బాగా సెట్ అయ్యాడు. కొన్ని కొన్ని సీన్స్ లో కనిపించీ కనిపించనట్లు ఇచ్చిన expressions బాగున్నాయి.

-Chor bazaari.. పాట నాకు అన్నింటికంటే ఎక్కువ నచ్చేసింది..దీన్లో ఒకటి రెండు స్టెప్స్ వెరైటీగా బాగుంటాయి.

-Break-up-party comedy బాగుంటుంది.

-సినిమా స్టార్టింగ్ లో హీరో, హీరోయిన్ రిలేషన్ డెవెలప్ కావటాన్ని చూపించిన స్టైల్ బాగుంటుంది.

-సైఫ్, రిషి కపూర్ మధ్య డైలాగ్స్ బాగుంటాయి.

-ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ క్యూట్ గా ఉంది.

-Twist song ముందు వచ్చే మ్యూసిక్, అమ్మ, నాన్న, తమిళమ్మాయి లో ఒక పాటలో మ్యూసిక్ లా ఉంటుంది. ఎవరు ఎక్కడి నుండి కొట్టుకొచ్చారో మరి!!

మగధీర:

అందరు చెప్పిందే గ్రాఫిక్స్ బాగున్నాయి. రాం చరణ్ నోరు తెరవనంత వరకు బాగున్నాడు. కాలభైరవగా బాగనే సూట్ అయ్యాడు of course, నోరు తెరవనంత వరకే. ఎందుకో గుర్రపు స్వారీలొ చిరంజీవి స్టైల్ చిరంజీవికే బాగుందనిపించింది, రాం చరణ్ కంటే.  హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో క్యూట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో అసలు రాకుమారి ఛాయలే లేవు.సినిమా చేసే ముందు అరుంధతిని, జోధాభాయిని చూసుండాల్సింది .మరీ అంత ఠీవి చూపించాల్సిన అవసరం లేకపోయినా, రాకుమారి లాగా ఐతే అనిపించాలి కదా..ఫస్ట్ హాఫ్ కొంచెం సుత్తి తగ్గించి, ఫ్లాష్ బాక్ కొంచెం ముందే స్టార్ట్ చేస్తే బాగుండేది.అప్పుడు క్లైమాక్స్ ఆదరాబాదరాగా కాకుండా తీరిగ్గా ఉండేలా చేస్తే బాగుండేది.

ఆంజనేయులు:

చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. చూస్తే మీ ఖర్మ!!

శశిరేఖాపరిణయం
ఇవ్వాళే చూసా ఖర్మకాలి టీ.వీ. లో. చూస్తుంటేనే  అనిపించింది, ఎవరో చెప్పినట్టు ఇంక కృష్ణ వంశీ రిటైర్ కావటమే మంచిదని. కనీసం ఒక్క సీన్లో కూడా “అరే,ఈ సీనేదో కొత్తగా,ఫస్ట్ టైం చూసినట్టుందే” అనిపించలేదు. ఆనంద్ – మంచి కాఫీ లాంటి సినిమా లాగా, శశిరేఖా పరిణయం – పాచిపోయిన అన్నం లాంటి సినిమా.

అబ్బా.. చా..
గర్భిణులు సొనియా, వై.యస్. లాంటి బిడ్డలను కనాలి. గర్భిణులు మంచి కార్యక్రమాలు చూస్తే మంచి బిడ్డలు పుడతారు.

గంగాభవాని

(రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు)

మంచి పిల్లలు పుడ్తందుకు మంచి షార్ట్ కట్ చెప్పినవ్ గంగమ్మా.. ఆ డాక్టర్లకేం తెల్సు ఇంత మంచి సంగతి మన గంగమ్మ కనిపెట్టిందని.. గా పిచ్చి మొఖాలకు ఇంకా నీ కొత్త టెక్నలజీ తెల్వది,మంచి తిండి దిను అది ఇదని జెప్తరు. ఆళ్ళను గుడ అప్డేట్ జెయ్యు జర..

అవ్ గని గంగక్కా, ఓ డౌటు.. మంచి కార్యక్రమాలంటే ఏంటిది గంగక్కా? నువ్వు, గా రాజకుమారి అప్పుడప్పుడు మాట్లాడుకుంటరు సూడు గవ్వేనా??

ఆంధ్ర నాయకులు..
ఇవ్వాళ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వెంకయ్య నాయుడు ఇంటర్వ్యూ నుండి:

“రాజకీయాలలో ఉండే మోసాల గురించి కూడా నాకు అప్పుడే తెలిసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా మొదలైన ఆంధ్ర ఉద్యమం బాగా ఊపందుకున్న దశలో కాంగ్రెస్ నాయకులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడైతే ‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు నేను నా భార్య దగ్గరకు కూడా పోను ‘ అని ఏకంగా బహిరంగ సభలోనే ప్రకటించాడు. కానీ కొన్నాళ్ళకు అందరూ సైలెంట్ అయిపోయారు.విచారిస్తే తెలిసిందేమిటంటే .. పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి గద్దె దించాలన్నది వాళ్ళ డిమాండు. ఇందిరా గాంధీ ఆ డిమాండును ఆమోదించగానే ఉద్యమాన్ని వదిలేసి చల్లగా జారుకున్నారు.. అదీ సంగతి..    ”

ఆ ముగ్గురు తెలంగాణా ముఖ్య మంత్రులు ఏం చేసారు అని ప్రశ్నించే వాళ్ళు కొంచెం ఇలాంటివి కూడా గమనించటం మంచిది. అలాగే ఒక్కొక్క తెలంగాణా ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు పాలించాడో గమనించి మాట్లాడటం మంచిది.

Untouchable – Mulk Raj Anand
మాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నాన్-డిటెయిల్డ్ లో “Promoter Of Quarrels” అనే ఒక్క కథ తప్ప నాకు ముల్క్ రాజ్ ఆనంద్ గురించి పెద్దగా తెలీదు. కేవలం ఆ కథ రాసినాయన అనే నమ్మకంతో ఈ పుస్తకం కొన్నాను. కొనేటప్పుడు ఆలోచించలేదు Untouchables అంటే ఎవరి గురించి ఉంటుందీ అని.చదివి చూస్తే ఇది మరుగుదొడ్లు శుభ్రం చేసే “బాఖా” అనే యువకుని కథ.నవలే అయినా ప్రత్యేకించి కథేమీ లేదు ఇందులో. బాఖా జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనలే ఈ నవల.

స్వాతంత్ర్యం రాక పూర్వం నాటి కథ. “బాఖా” బ్రిటిష్ సైనిక రెజిమెంట్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే యువకుడు, అంటరానివాడు. వృత్తి ఎలాంటిదైనా కొంత సున్నిత మనస్తత్వం, ఉత్సాహం కలిగిన యువకుడు.బ్రిటిష్ దొరలలాగా ప్యాంటులు,షర్టులు,బూట్లు వేస్కోవాలి, ఫ్యాషనబుల్ గా ఉండాలి అని కలలుగనే వ్యక్తి.అలాగని పనిని నిర్లక్ష్యం చేసి తప్పించుకు తిరిగే రకం కూడా కాదు.

అలాంటి బాఖా ఒకరోజు రోడ్డు మీద ఒక పెద్దమనిషిని చూస్కోకుండా తాకి మైల పర్చడం, గుడి మెట్లెక్కి అపవిత్రం చెయ్యటం లాంటి కారణాల వల్ల అందరితో దారుణంగా తిట్లు తిని ఘోరంగా అవమానించబడతాడు. అదే రోజు అతడే ఆశ్చర్య పడే విధంగా ఇంకొందరు పెద్దమనుషుల జాలినీ, కరుణనూ చూరగొన్నా అవి అతనికి ఆ రోజు అయిన గాయాలని మాన్పలేకపోతాయి. ఆ రోజే గాంధీజీ ఆ ఊరికొస్తాడు.గాంధీజీ చేప్పింది పూర్తిగా అర్థం చేస్కోలేకపోయినా గాంధీజీలో తమకు నిజమైన సానుభూతి పరుణ్ణి చూస్తాడు. గాంధీ సభ అయిపోయిన తర్వాత,అంటరానితనం గురించి అక్కడ ఇంకో ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటాడు. Flush System వల్లా, సరైనDrainage Sytem వల్లా అంటరానితనం సమస్య కొంత వరకు పరిష్కరించవచ్చు అని విని ఆశ్చర్యపోతాడు. అలాంటి సిస్టం ఉంటుందా, ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ ఇంటికెళ్ళిపోతాడు. ఇది స్థూలంగా కథ.

నిజజీవితంలో బాఖా వృత్తి ఎలాంటిదైనప్పటికీ, బాఖా తనకోసం సృష్టించుకున్న మానసిక ప్రపంచం,అతని ఆశలు,కలల గురించి చెప్పిన తీరు ఇవన్నీ చాలా సహజంగా, కన్విన్సింగా ఉంటాయి. అయినప్పటికీ ఈ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం చాలా కష్టం. దానికి మొట్టమొదటి కారణం బాఖా వృత్తే. ముందు చదవగానే “అబ్బా, మరీ వీళ్ళ గురించా!!” అనిపించేసింది.ఇందులో చాలా విషయాలు మనం చదవటానికి ఇష్టపడనివో భరించలేనివో అయి ఉంటాయి.

ఉదాహరణకి బాఖా ఆ రోజు చపాతీ తింటూ ఉంటే మధ్యలో ఒక చపాతీ తడిగా తగుల్తుంది. అప్పుడు గుర్తొస్తుంది, ఆ చపాతీ ఇచ్చిన సైనికుడు అదే చపాతీ మీద చేతులు కడుక్కున్నాడనీ, తర్వాత తను అడగగానే అదే చపాతీని తనకేసి విసిరేసాడని. అది గుర్తుకు రాగానే ఆకలి చచ్చిపోతుంది.ఇంకొకావిడేమో రెండో అంతస్తు నుండి విసిరేస్తుంది చపాతీని, అది వెళ్ళి చెత్తకుప్పలో పడుతుంది. ఇలాంటివి చదివినప్పుడైతే చాలా కోపం వచ్చేసింది-మనుషులకి కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉండదా, ఎలాగూ ఇచ్చేదే అయినప్పుడు కొంచెం మంచిదే ఇవ్వొచ్చు కదా. అది కూడా తెలీదా-అనిపించింది. ఇంకో పెద్ద మనిషేమో బాఖా చెల్లెలితో misbehave చేస్తాడు – అబ్బా, వీళ్ళను కూడా వదలరా, ఏం మనుషులు వీళ్ళు- అనిపించేసింది.

“జీవితాంతం ఇలాగ అందరితోని అంటరానివాడిగా తిట్టించుకోవలసిందేనా, ఎప్పటికీ ఇదే పని చెయ్యాల్సిందేనా, మిగిలిన వారిలాగా గౌరవంగా బ్రతికే చాన్సే లేదా” అని బాఖా అలోచించినప్పుడల్లా చాలా బాధనిపించింది.అసలు ఇష్టం లేని, అందరూ అసహ్యించుకునే పనిని బ్రతకటానికి, చచ్చినట్టు చేసే తీరాలా – కేవలం పుట్టుక కారణంగా?

-తప్పదేమో. మొన్నే చదివాను ఏదో బ్లాగ్లో, మన దేశంలో dry latrines ఇంకా చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి అని.స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, కొందరు మనుషులు బ్రతకటానికి ఇలాంటి పనులు చెయ్యకతప్పటం లేదు. మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయబ్బా అనుకుంటుంటే ఈనాడులో కొన్ని నెలల క్రితం చదివిన ఒక వార్త గుర్తొచ్చింది.

మనదేశంలో డ్రైనేజీ పైపులలో ఏదైనా జాం అయితే ఇప్పటికీ మనుషులతోనే శుభ్రం చేయిస్తారట. ఒకవేళ పెద్ద పెద్ద పైపులలో గనక అలా జాం అయితే, వాళ్ళు నిండా ఆ మురికిలోకి దిగి జాం క్లియర్ చెయ్యాలట. వాళ్ళకి రక్షణగా ఇచ్చే తొడుగుల కోసం ఇచ్చే డబ్బులని అధికారులునొక్కేసి, ఏ రక్షణ లేకుండా వాళ్ళని ఆ మురికిలోకి దింపుతున్నారట. చదువుతుంటే helpless గా అనిపించేసింది, ఇలాంటి విషయాలల్లో కూడా కక్కుర్తేనా అని.

తాతగారు (కథ) – రవీంద్రనాథ్ ఠాగూర్
ఒకటేమో విందులు, నాట్య ప్రదర్శనలు, గుర్రప్పందాలంటూ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులన్నింటినీ తగలేసి, గత వైభవం మాత్రమే మిగిలిన కుటుంబం.మరొకటేమో బాగా కష్టపడి డబ్బులు,ఆస్తులు కూడబెట్టిసంఘంలో ఉన్నతిని సాధించిన కుటుంబం.

ఒకరేమో తన ప్రస్తుత లేమిని మరిచిపోయి పూర్వ పురుషుల ఘనతను వైభవాన్ని వర్తమానంగా కల్పించి చెప్పటంలో అసలు అలసటే రాని వృద్ధుడు.ఇంకొకరేమో శూన్య భాండారంలో పూర్వీకుల వైభవోజ్జ్వల చరిత్ర కంటే – ఇనప్పెట్టెలో పిత్రీయమైన బాండు పత్రాలనే విలువైనవిగా భావించే యువకుడు.

తమ వంశపు కన్య కోసం వరుడు వెతుక్కుంటూ రావల్సిందే కానీ, వరుని కోసం ఇంకొకరి గడప తొక్కని తమ వంశాచారాన్ని భగ్నం చెయ్యదల్చుకోని వృద్ధుడొకరు.తనలాంటి అందం,చదువు,ఆస్తిపాస్తులన్ని మంచి యువకుని కంటే యోగ్యుడైన వరుణ్ణి ఆ వృద్ధుడు తన మనుమరాలికి ఎక్కడ తేగలడు, ఆయనే వచ్చి నన్ను అడగాలసిందే ఏదో ఒక రోజు – అని అతిశయం కలిగిన యువకుడొకరు.

మరి ఆ వృద్ధుడు తన మనుమరాలి కోసం తమ వంశాచారాన్ని భగ్నం చేసాడా, లేక ఆ యువకుడే తన అతిశయాన్ని వదిలేసి ఆ వృద్ధున్ని సంప్రదించాడా తెల్సుకోవాలంటే ఇక్కడ నొక్కండి.

మమూలుగా ఠాగూర్ కథలన్నీ కొన్ని పదుల పేజీల సైజులో ఉంటాయి. ఇది మాత్రం అయిదారు పేజీల చిన్న కథ, అందమైన కథ.

Planets – Size Comparison
నాకు రోజుకు సగటున మూడు,నాలుగు ఫార్వార్డెడ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని సరదావి, కొన్ని ఆలోచింపచేసేవి, కొన్ని ఇన్స్పైర్ చేసేవి, కొన్ని అనవసరంగా భయపెట్టేవి, ఇంకొన్ని అత్యాశని పెంచేవి, ఇలా రకరకాలవి .

అన్ని మెయిల్స్ ని ఎప్పుడో ఒకప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటాను, ఈ ఒక్క మెయిల్ తప్ప.మూడేళ్ళ నుండి ఒక్క సారి కూడా డిలీట్ చెయ్యాలనిపించలేదు దీన్ని.

ఎందుకో నాకీ మెయిల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి ఫోటోస్ చూసినప్పుడు కలిగే ఒక రకం సంతోషం ఈ మెయిల్ చూసినప్పుడల్లా కలుగుతూ ఉంటుంది   . మూడ్ బాగా లేనప్పుడు చూస్తేనేమో -  “ఇంత పెద్ద విశ్వంలో భూమెంత? ఈ భూమ్మీద నేనెంత? నాకొచ్చే ఈ కష్టాలెంత?” -అని ఒకరకం వైరాగ్యం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఒకట్రెండు నిమిషాల పాటు.

ఆల్రెడీ చాలా మంది చాలా సార్లు చూసేసి ఉంటారు దీన్ని, అయినా కూడా నా “తుత్తి” కోసం ఇంకోసారి చూడండి.

దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళెవరోగానీ వాళ్ళకే ఈ టపా అంకితం..

సమాగమం (కథ)- వోల్గా
వాల్మీకీ ఆశ్రమంలో అరణ్యవాసం చేస్తున్న సీత అనుకోకుండా శూర్పణఖను కలవటం, శాశ్వతమైన కురూపితనాన్ని శూర్పణఖ ఎలా ఎదుర్కుందో తెలుసుకోవటమే ఈ కథ.

‘రామ లక్ష్మణులు శూర్పణఖ ముక్కూ,చెవులూ కోసేసిన సంఘటన గురించి సీత ఏమనుకుంటుంది’ అని నేనయితే ఎప్పుడూ అలోచించలేదు.ఒక వేళ ఆలోచించినా, మహా ఐతే ‘ఇంకో స్త్రీ గురించి ఆలోచించని రాముణ్ణి చూసి గర్వపడుతుందేమో’ అనుకునేదాన్నేమో ఈ కథ చదవకపోతే..

రామాయణంలో ఏమనుకుందో కానీ ఈ కథలో మాత్రం  సీత - అపరిమితమైన సౌందర్య కాంక్ష కలిగిన శూర్పణఖ ఈ శాశ్వతమైన కురూపితనాన్ని అసలు భరించగలదా అని జాలి పడుతుంది.ముక్కూ చెవులూ లేని కురూపిని ఎవరు మాత్రం ప్రేమిస్తారు, ఇక జీవితాంతం శూర్పణఖ ప్రేమరాహిత్యలో బ్రతకాల్సిందేనా అని బాధ పడుతుంది.తమని ఇష్టపడి వచ్చిన ఒక స్త్రీ విషయంలో రామ లక్ష్మణుల క్రూర పరిహాసానికి కలత చెందుతుంది. పురుషుల పగలు,ప్రతీకారాలు తీర్చుకోవటానికేన స్త్రీలుంది అని ఆవేదన చెందుతుంది.

రాముడికి ఆ పని చెయ్యడానికి గొప్ప కారణాలు, లక్ష్యాలు ఎన్నైనా ఉండొచ్చు గాక. ముక్కు చెవులు లేక భయంకరంగా మారిన మొహం వల్ల శూర్పణఖకి కలిగిన బాధ గురించి చదివినపుడు మాత్రం రాముడు చేసింది చాలా అన్యాయం అనిపించింది.ఈ మధ్య జరిగిన ఆసిడ్ దాడులు గుర్తొచ్చాయి. రాముడు తన లక్ష్యాలను సాధించుకోవటానికి ఇంకొంచెం మంచి మార్గాన్ని వెతుక్కుని ఉండాల్సిందనిపించింది.

అయినా శూర్పణఖ ఆ బాధ నుండి బయటపడుతుంది. జీవిత సౌందర్యాన్ని ప్రకృతి నుండి తెలుసుకుంటుంది. సౌందర్యాన్ని సృష్టించటం నేర్చుకుంటుంది, జీవిత పోరాటంలో గెలుస్తుంది.

నాకీ కథ చాలా నచ్చింది. ముఖ్యంగా కథ మొదట్లో లవకుశల బాల్యాన్నీ, అరణ్యవాసంలో సీత పడే వేదననూ కలిపి రెండు మూడు సంఘటనలో చెప్పిన తీరు హృద్యంగా ఉంది.కథ చదివిన తర్వాత, ఈ విషయంలో రాముడు చేసిన పనికి సీత సంతోషిస్తుందనో, గర్విస్తుందనో అనుకోవడం ఎంత ఇమ్మెచ్యూర్డ్ ఆలోచన కదా అనిపించింది.

ఈ కథ రచయిత్రి వోల్గా రచించిన “మృణ్మయనాదం” అనే పన్నెండు కథల కథా సంపుటిలో మొదటి కథ. మిగిలిన వాటిలో చాలా వరకు కూడా స్త్రీల గురించిన కథలే.మిగిలినవి మాత్రం దిగజారిపోతున్న హిందూ ముస్లిం సంబంధాలను గురించి, తరాల అంతరాలను గురించి, ప్రపంచీకరణ ప్రభావం గురించినవి.కథలన్నీ బాగున్నాయి, ఒకసారి మొదలుపెడితే చివరి వరకూ చదువుకుంటూ వెళ్ళిపొయేలా ఉన్నాయి. కానీ అన్నింటి కంటే ఎక్కువ నచ్చింది మాత్రం పైన చెప్పిన కథే.

నాకో డౌటు – తెలుగు
మామూలుగా మనం రాయటం శ్రీ’కృ’ష్ణుడు అని రాస్తాం కదా,

మరి మొన్న సినిమా పేరు శ్రీ’క్రి’ష్ణ పాండవీయం అని ఉందేమిటి?

నాకో డౌటు..
ఈ మధ్య గవర్నమెంటు వారు సత్యం బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చెయ్యటం గురించి.

అసలు డైరెక్టర్లే వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ కంపనీనే ముంచేసి వెళ్ళారు.ఇప్పుడు అసలేమి సంబంధం లేని బయటి వాళ్ళు నిండా మునిగి పోయిన ఆ కంపనీ కోసం ఎందుకు కష్టపడతారు? ఏ లాభం లేకుండా వాళ్ళు ఆ కంపనీని ఎందుకు ఉద్ధరించాలి? వాళ్ళ సొంత పనులు, వ్యాపారాలు వాళ్ళకి ఉంటాయి కదా. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఈ కంపనీ కోసం వెచ్చించగలుగుతారా? ఏ ఆధారంతో వాటాదారులు వాళ్ళను విశ్వసించవచ్చు?వాళ్ళు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించరనే నమ్మకమేంటి?

నాకు దీపక్ పరేఖ్ మీదనో, కార్నిక్ మీదనో అనుమానం కాదు. ఇంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంటు బోర్డును రద్దు చెయ్యటం జరిగిందా? జరిగితే తర్వాత వచ్చిన బోర్డు ఎలా పని చేసింది? గవర్నమెంటు నియమించిన బోర్డు, కంపనీ తలరాతను మార్చిన ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అని తెల్సుకుందామనే.

వీటి గురించి బాగా తెల్సిన వాళ్ళు టపా రాస్తే తెల్సుకోవాలని ఉంది..