బుజ్జి

Just another బ్లాగు weblog

నాకో డౌటు..

Filed under: నాకో డౌటు.. — bujjikanna at 8:48 am on Wednesday, January 14, 2009

ఈ మధ్య గవర్నమెంటు వారు సత్యం బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చెయ్యటం గురించి.

అసలు డైరెక్టర్లే వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ కంపనీనే ముంచేసి వెళ్ళారు.ఇప్పుడు అసలేమి సంబంధం లేని బయటి వాళ్ళు నిండా మునిగి పోయిన ఆ కంపనీ కోసం ఎందుకు కష్టపడతారు? ఏ లాభం లేకుండా వాళ్ళు ఆ కంపనీని ఎందుకు ఉద్ధరించాలి? వాళ్ళ సొంత పనులు, వ్యాపారాలు వాళ్ళకి ఉంటాయి కదా. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఈ కంపనీ కోసం వెచ్చించగలుగుతారా? ఏ ఆధారంతో వాటాదారులు వాళ్ళను విశ్వసించవచ్చు?వాళ్ళు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించరనే నమ్మకమేంటి?

నాకు దీపక్ పరేఖ్ మీదనో, కార్నిక్ మీదనో అనుమానం కాదు. ఇంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంటు బోర్డును రద్దు చెయ్యటం జరిగిందా? జరిగితే తర్వాత వచ్చిన బోర్డు ఎలా పని చేసింది? గవర్నమెంటు నియమించిన బోర్డు, కంపనీ తలరాతను మార్చిన ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అని తెల్సుకుందామనే.

వీటి గురించి బాగా తెల్సిన వాళ్ళు టపా రాస్తే తెల్సుకోవాలని ఉంది..

« Previous Page