బుజ్జి

Just another బ్లాగు weblog

ఆంధ్ర నాయకులు..

Filed under: తెలంగాణా — bujjikanna at 4:58 am on Sunday, February 22, 2009

ఇవ్వాళ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వెంకయ్య నాయుడు ఇంటర్వ్యూ నుండి:

“రాజకీయాలలో ఉండే మోసాల గురించి కూడా నాకు అప్పుడే తెలిసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా మొదలైన ఆంధ్ర ఉద్యమం బాగా ఊపందుకున్న దశలో కాంగ్రెస్ నాయకులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడైతే ‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు నేను నా భార్య దగ్గరకు కూడా పోను ‘ అని ఏకంగా బహిరంగ సభలోనే ప్రకటించాడు. కానీ కొన్నాళ్ళకు అందరూ సైలెంట్ అయిపోయారు.విచారిస్తే తెలిసిందేమిటంటే .. పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి గద్దె దించాలన్నది వాళ్ళ డిమాండు. ఇందిరా గాంధీ ఆ డిమాండును ఆమోదించగానే ఉద్యమాన్ని వదిలేసి చల్లగా జారుకున్నారు.. అదీ సంగతి..    ”

ఆ ముగ్గురు తెలంగాణా ముఖ్య మంత్రులు ఏం చేసారు అని ప్రశ్నించే వాళ్ళు కొంచెం ఇలాంటివి కూడా గమనించటం మంచిది. అలాగే ఒక్కొక్క తెలంగాణా ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు పాలించాడో గమనించి మాట్లాడటం మంచిది.