బుజ్జి

Just another బ్లాగు weblog

కల – The Dream

Filed under: అవీ ఇవీ — bujjikanna at 1:59 pm on Monday, November 3, 2008

ఈ మధ్య వరుసగా మూడు రోజుల పాటు మన తెలుగు సినిమా వాళ్ళు కలల్లో నా మీద దాడులు చేసేసారు.నేనీ మధ్య అసలు సినిమాల మొహం చూడటం మానేసానని పగ పట్టారేమో తెలీదు,ఏకంగా ఒక తెలుగు సినిమానే వచ్చేసింది కలలో.అప్పుడనిపించింది కలల గురించి ఒక టపా రాద్దామని.

మొదట్నుంచీ నాకొచ్చే ప్రతి కల, రెగ్యులర్ కలనో, సీజనల్ కలనో, సినిమా కలలాంటి స్పెషల్ ఎఫ్ఫెక్టు కలనో అయ్యుండేది. అందుకని కలలకు అర్థాలు చెప్పే పుస్తకాలేమన్నా దొరికితే చదవాలని చాలా ఇంట్రెస్టు ఉండేది మొదట్నించీ.ఒకసారి అమీర్ పేట్ లో వెళ్తుంటే, రోడ్ పక్కన దొరికింది ‘The Interpretation of Dreams-Sigmund Fraud’

నేను ఆ పుస్తకాన్ని, ఫార్వార్డెడ్ మెయిల్ లాగా ఊహించుకున్నా.కాకి కల్లో వస్తే దాని మీనింగ్ ఇది,కుక్క వస్తే దాని మీనింగ్ ఇది,కలలో చేజింగ్ ఉంటే దాని మీనింగ్ ఇది అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మీనింగ్స్ అన్ని చెప్పేస్తాడేమో,ఇంక నా కలల మీనింగ్స్ అన్ని తెల్సుకోవచ్చు అనుకున్నా.ఒక 50 పేజీలు చదివే సరికి తెలిసింది అది ఫార్వార్డెడ్ మెయిల్ టైపు కాదు, మన ఫిజిక్స్,ఎలక్ట్రానిక్స్ పుస్తకాల టైపు అని.

So పుస్తకం మొత్తం చదవలేదు కానీ, నేను చదివిన భాగం లో నాకు సరదా అనిపించినవి, నాకు అనుభవం లోకి వచ్చిన చాలా కొన్ని ఇక్కడ :

-మమూలుగా లేచినప్పటి కంటే అలారం పెట్టుకుని లేచినప్పుడు వస్తున్న కలలు,మనల్ని ఎవరన్నా నిద్ర లేపుతున్నప్పుడు వస్తున్న కలలు బాగా గుర్తుంటాయి.

-మనం నిద్ర పోయేటప్పుడు కలిగే బాహ్య ప్రేరణలని(అన్నీ కాదు,కొన్ని మాత్రమే.) మన మెదడు మనకి మాగ్నిఫై చేసి కలలో చూపిస్తుంది.బయట కాకి అరుస్తుంటే,మనుషులు భయంతో గట్టిగా అరుస్తున్నట్టు కల రావొచ్చు.కప్పుకున్న దుప్పటి పక్కకు జరిగిపొతే మంచులో నిలబడి ఉన్నట్టు కల రావొచ్చు.
ఒక సారి మా అక్క కూతురు నన్ను నిద్ర లేపటానికి నా చెంప మీద మెల్లగా కొడుతుంది. అప్పుడే నా మొహాన్ని ఎవరో క్రికెట్ బాట్ తో బలంగా కొడుతున్నట్టుగా కలొచ్చింది.వెంటనే మెలకువ వచ్చేసింది.

-మనకి బయట నుండి కలిగే బాహ్య ప్రేరణ ని మన మెదడు కలలాగ చూపెట్టే ముందు అప్పటికప్పుడు ఒక కథ అల్లేసి, మనకి కలిగిన బాహ్య ప్రేరణని మాగ్నిఫై చేసి దాన్ని కూడా కథలో సంఘటన లాగా చూపెట్టగలదు.అంత తక్కువ టైం లో అంత కథను అల్లి, మనకు దాన్ని కంప్రెస్ చేసి ఎలా చూపిస్తుందో మరి.

ఇది కూడా ఒక సారి గమనించాను నేను. ఇంకో సారి మా అక్క కూతురే నన్ను నిద్ర లేపటానికి వచ్చి నా చెయ్యి మీద కాలేసి తొక్కింది. నాకేమో కలలో ఎడారిలో ఒక ఒంటె నన్ను కాసేపు చేజింగ్ చేసి, నేను కింద పడగానే నా చెయ్యి మీద కాలు పెట్టి కస కసా తొక్కేస్తున్నట్టు కల వచ్చేసింది. ఎడారి, ఒంటె ముందే కలలో వస్తున్నాయేమో, మా స్వీటీ నా చెయ్యి తొక్కేసరికి ఇలా కథ మారిందేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి.

-చాలా శాస్త్రాలల్లో వేసినట్టే అరిస్టాటిల్ కలల శాస్త్రం లో కూడా ఒక చెయ్యి వేసాడు.

-నిద్రపోతున్న సమయంలో మన మెదడు మన శరీరం లో కలిగే అంతర్గత ప్రేరణలని, మెలకువగా ఉన్నప్పటి కంటే ఎక్కువగా గ్రహిస్తూ ఉంటుంది. అంతర్గతంగా ఏదైనా తేలికపాటి నొప్పి ఎదన్నా ఉంటే దాన్ని మన మెదడు మాగ్నిఫై చేసి కలలో చూపిస్తుంది.మాగ్నిఫై చేసి చూపెట్టబడతాయి కాబట్టి కొన్ని రకాల అనారోగ్యాలని కలలని గమనించటం ద్వారా ప్రారంభ దశలోనే కనిపెట్టడానికి అవకాశం ఉంది అని అరిస్టాటిల్ చెప్పాడు.

-ప్రత్యేకించి గుండె, ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులతో బాధ పడే వారిలో ఊపిరాడనట్టు,చనిపోతున్నట్టు ఆందోళన కలిగించే కలలు రావటం జరుగుతుంది. so,ఇలాంటి కలల మీద ఒక కన్నేసి ఉంచండి.

ప్రస్తుతానికి ఈ అనుభవ భాగ్యం ఇంకా కలగలేదు నాకు.

-కలలని అధ్యయనం చేసే శాస్త్రాన్నిoneirology అంటారు.

-మరిన్ని విశెషాల కోసం వీలుంటే వికి (ఇంగ్లీషు) చూడండి. ప్రస్తుతానికి తెలుగు వికిలో కలల గురించి వ్యాసం లేదు.

« Previous Page