Planets – Size Comparison
నాకు రోజుకు సగటున మూడు,నాలుగు ఫార్వార్డెడ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని సరదావి, కొన్ని ఆలోచింపచేసేవి, కొన్ని ఇన్స్పైర్ చేసేవి, కొన్ని అనవసరంగా భయపెట్టేవి, ఇంకొన్ని అత్యాశని పెంచేవి, ఇలా రకరకాలవి .
అన్ని మెయిల్స్ ని ఎప్పుడో ఒకప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటాను, ఈ ఒక్క మెయిల్ తప్ప.మూడేళ్ళ నుండి ఒక్క సారి కూడా డిలీట్ చెయ్యాలనిపించలేదు దీన్ని.
ఎందుకో నాకీ మెయిల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి ఫోటోస్ చూసినప్పుడు కలిగే ఒక రకం సంతోషం ఈ మెయిల్ చూసినప్పుడల్లా కలుగుతూ ఉంటుంది
. మూడ్ బాగా లేనప్పుడు చూస్తేనేమో - “ఇంత పెద్ద విశ్వంలో భూమెంత? ఈ భూమ్మీద నేనెంత? నాకొచ్చే ఈ కష్టాలెంత?” -అని ఒకరకం వైరాగ్యం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఒకట్రెండు నిమిషాల పాటు.
ఆల్రెడీ చాలా మంది చాలా సార్లు చూసేసి ఉంటారు దీన్ని, అయినా కూడా నా “తుత్తి” కోసం ఇంకోసారి చూడండి.
దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళెవరోగానీ వాళ్ళకే ఈ టపా అంకితం..




