బుజ్జి

Just another బ్లాగు weblog

తాతగారు (కథ) – రవీంద్రనాథ్ ఠాగూర్

Filed under: కథలు — bujjikanna at 10:08 am on Monday, February 2, 2009

ఒకటేమో విందులు, నాట్య ప్రదర్శనలు, గుర్రప్పందాలంటూ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులన్నింటినీ తగలేసి, గత వైభవం మాత్రమే మిగిలిన కుటుంబం.మరొకటేమో బాగా కష్టపడి డబ్బులు,ఆస్తులు కూడబెట్టిసంఘంలో ఉన్నతిని సాధించిన కుటుంబం.

ఒకరేమో తన ప్రస్తుత లేమిని మరిచిపోయి పూర్వ పురుషుల ఘనతను వైభవాన్ని వర్తమానంగా కల్పించి చెప్పటంలో అసలు అలసటే రాని వృద్ధుడు.ఇంకొకరేమో శూన్య భాండారంలో పూర్వీకుల వైభవోజ్జ్వల చరిత్ర కంటే – ఇనప్పెట్టెలో పిత్రీయమైన బాండు పత్రాలనే విలువైనవిగా భావించే యువకుడు.

 తమ వంశపు కన్య కోసం వరుడు వెతుక్కుంటూ రావల్సిందే కానీ, వరుని కోసం ఇంకొకరి గడప తొక్కని తమ వంశాచారాన్ని భగ్నం చెయ్యదల్చుకోని వృద్ధుడొకరు.తనలాంటి అందం,చదువు,ఆస్తిపాస్తులన్ని మంచి యువకుని కంటే యోగ్యుడైన వరుణ్ణి ఆ వృద్ధుడు తన మనుమరాలికి ఎక్కడ తేగలడు, ఆయనే వచ్చి నన్ను అడగాలసిందే ఏదో ఒక రోజు – అని అతిశయం కలిగిన యువకుడొకరు.

మరి ఆ వృద్ధుడు తన మనుమరాలి కోసం తమ వంశాచారాన్ని భగ్నం చేసాడా, లేక ఆ యువకుడే తన అతిశయాన్ని వదిలేసి ఆ వృద్ధున్ని సంప్రదించాడా తెల్సుకోవాలంటే ఇక్కడ నొక్కండి.

*******************************************************************************************************

మమూలుగా ఠాగూర్ కథలన్నీ కొన్ని పదుల పేజీల సైజులో ఉంటాయి. ఇది మాత్రం అయిదారు పేజీల చిన్న కథ, అందమైన కథ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>