బుజ్జి

Just another బ్లాగు weblog

ఆంధ్ర వాళ్ళకు అవసరం లేదా ఆత్మాభిమానం??

Filed under: Uncategorized — bujjikanna at 5:06 pm on Saturday, October 4, 2008

మళ్ళీ ఇంతకు ముందులాగానే ఇంకొకరి బ్లాగులో, తెలంగాణా విషయంలో నా వ్యాఖ్య డిలీట్ చెయ్యబడటంతో ఇంకో టపా రాయాల్సొచ్చింది. ఈ సారి వాదన లేకుండానే సింపుల్ గా నా వ్యాఖ్యలు, వాటితో పాటు అందరి వ్యాఖ్యలు డిలీట్ చెయ్యబడ్డాయి. హెడ్డింగ్ లో చెప్పినట్టు ”ఆంధ్ర వాళ్ళకు అవసరం లేదా ఆత్మాభిమానం” అనేది రాసినవారి ప్రశ్న.

సుళువుగా గుర్తుపట్టడం కోసం ఆయన పెట్టిన హెడ్డింగ్ నే నేనూ పెట్టాను.

అసలు విషయానికొస్తే,అది లగడపాటి రాజగోపాల్ ఆస్తులపై తెరాస నాయకులు దాడి చేసిన సంధర్భంలో రాసింది.అది బ్లాగరు వివిధ సంధర్భాలలో విన్న తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని గురించి చేసిన వ్యాఖ్యలకి రియాక్షన్ లాగా ఉంది. ఆయన ఉదహరించిన మూడు సంధర్భాలు, వాటికి నా సమాధానాలు/ప్రశ్నలే ఈ టపా. (అసలు ఈ విషయంలో టపా రాసే ఉద్దేశం నాకు లేదప్పుడు. కానీ వ్యాఖ్య డిలీట్ చెయ్యబడటంతో రాస్తున్నా.)

క్లుప్తంగా ఆయన టపా సారాంశం:

1.’కోస్తా వాళ్ళంతా తెలంగాణా భూములని చీప్ గా కొట్టేస్తున్నారు ‘ అనేది ఆయన మిత్రుడు ఆంధ్ర వాళ్ళపై చేసిన ఆరోపణ. మరి ‘మీరెందుకు అమ్ముతున్నరు, మీరమ్మితేనే కదా కొంటున్నాం’ అనేది ఆ ఆరోపణకి ఆ బ్లాగరు సమాధానం.
2.ఒక ఇంటర్మీడియెట్టు చదివిన అబ్బాయి, తనకు ఉద్యోగం రాకపొవటానికి కారణం ఆంధ్రవాళ్ళు అని చేసిన మరో ఆరోపణ.
3.ఎవరో తెలంగాణా ఆటో డ్రైవరు, ఎక్కినాయన ఆంధ్ర ఆయన అని తెల్సిన తర్వాత ఆయనతో మాట్లాడ్డం మానేయటం.

ఇన్ని మాటలంటుంటే మాకేం ఆత్మాభిమానం లేదా, వెళ్ళిపొతాం మేము అన్నట్టుగా రాసారు. పైన చెప్పిన సంధర్భాలలో తెలంగాణా వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళు ద్రోహం చేస్తున్నారా అనేది ఆ బ్లాగరు ప్రశ్న. ఇప్పుడు ఆ సంధర్భాలతో పాటు, ఆయనకి తెలియని , తెలిసీ మర్చిపోయిన ఇంకొన్ని సంధర్భాల సంగతులు కూడా మాట్లాడుకుందాం.

మెదక్ జిల్లా గురించి ఎంత మందికి ఎంత తెలుసో నాకు తెలీదు గానీ, మెదక్ జిల్లాలో ఆంధ్ర వాళ్ళు స్థిరపడ్డ గ్రామాలు చాలానే ఉన్నాయి. విచిత్రమేంటంటే అన్ని గ్రామాలు కూడా పెద్దా చిన్నా ఇర్రిగేషన్ కాలువల పక్కనే ఉంటాయి. ఇంకెక్కడా ఉండవు. ఎక్కడో కోస్తా జిల్లాల వాళ్ళు సడ్డెన్ గా మెదక్ జిల్లా పల్లెల్లో భూములు కొనటం మొదలు పెడతారు.’కాస్త మంచి ధరే’ ఇస్తారనుకోండి. అదేంటో వాళ్ళు కొనటం పూర్తి అయ్యీ అవగానే ఆ ప్రాంతంలో కట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరాలు, నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఆ కాలువలన్నీ వీళ్ళ భూముల పక్క నుండే వెళతాయి అదేంటో మరి. తర్వాత ఆ భూముల ధరలు వాళ్ళు ఇచ్చిన ‘కాస్త మంచి ధరకు’ కొన్ని పదుల రెట్లు మాత్రమే పెరుగుతాయి. అంతే.

తమకు సంబంధించిన వాళ్ళ కొనుగోళ్ళు పూర్తి అయ్యేవరకు,సామన్య జనాలకి ప్రాజెక్టుల సంగతి తెలియకుండా తొక్కిపెట్టే ఆంధ్ర అధికారులే దీనికి కారణం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటాను. ఇలాంటి భూములల్లో వ్యవసాయం చేసి మేమే తెలంగాణా వాళ్ళకి వ్యవసాయం నేర్పించాము అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. బోర్ల కింద చెయ్యమనండి అప్పుడు తెలుస్తుంది తెలంగణాలో వ్యవసాయం అంటే ఏంటి అని. ఇలాగ తెలంగాణా వాళ్ళు స్థిరపడ్డ అలాంటి ఆంధ్ర గ్రామాలు ఏవైనా ఉన్నాయా?

ఇక ఆ ఇంటర్మీడియట్టు అబ్బాయి సంగతి పక్కన పెడితే, 610 జీవో గురించి మనం చూస్తూనే ఉన్నాం,కొన్ని వేల మంది వెనక్కి పంపించాల్సిన అవసరం ఉన్నట్టు. ఆ ఒక్క మాటకే మీరింత బాధ పడితే, స్థానికేతరుల వల్ల ఉద్యోగాలు రాని కొన్ని వేల జీవితాల సంగతి ఏంటి,వాళ్ళెంత బాధ పడాలి మరి?

ఇక ఆటోవాడి సంగతి అంటారా, ఆ బ్లాగరు తనకు నచ్చని నా కామెంటుని డిలీట్ చేసినట్టు అతనూ ఆంధ్ర వాళ్ళతో మాట్లాడ్డం మానేసి ఉంటాడు. కొడితేనో ఇంకేమన్నా అంటేనో పట్టించుకోవాలి గానీ, అతని నిరసనని అతను అలా ప్రకటిస్తే పెద్ద నష్టం ఏముంది. అతనేం నష్టపొయాడో మరి ఆంధ్ర వాళ్ళ వల్ల, మనకు తెలీదు కదా.

ఇక నేను అదే టపాకు సంబంధించిన ఒక కామెంట్ ఏంటంటే ఇదంతా రాజకీయ నాయకులు సృష్టించిన hate propaganda వల్లనే అని అంతకుమించి ఏమి లేదు అని. ఇంతకు ముందు ఇంకో వ్యాఖ్యలో ఈ చదువుకున్న వాళ్ళే తెలంగాణ గురించి ఏదో ఊహించుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ రైతులు మాత్రం వాళ్ళ కరెక్ట్ గా ఆలోచించి వోటేస్తారు అని.. ఖచ్చితంగా ఇవే మాటలు కావు కానీ ఉద్దేశం ఇదే. బహుషా తెరాస ఓడిపొయిన ఉపఎన్నికలని దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు.

మెదక్ జిల్లాలో ఆంధ్ర వాళ్ళని నమ్మకూడదు అనే కాన్సెప్ట్ తెరాస పుట్టక ముందు నుండే, పైన చెప్పిన కారణాల వల్ల రైతులలో ఉంది. అది తెరాస సృష్టించింది ఎంత మాత్రం కాదు. ఆంధ్ర వాళ్ళకి భూమి కౌలుకి ఇవ్వటం కంటే బీడుగా వదిలెయ్యటమే మేలు అనుకునే చాలా మంది రైతులలో మా నాన్న కూడా ఒకరు. రైతులు తెలంగాణా గురించి పట్టించుకోరు అనేది పెద్ద భ్రమ, హైదరాబాదుని మాత్రమే చూసిన కొందరు ఆంధ్ర వాళ్ళు తయారు సిద్ధాంతం మాత్రమే. ఉద్యోగులతో సమానంగా వాళ్ళూ ప్రత్యేక తెలంగణాని కోరుకుంటున్నారు. .

7 Comments »

3

Comment by కె.మహేష్ కుమార్

October 4, 2008 @ 11:46 pm

సమాచారాన్ని తమ వ్యాపారానికి అనుగుణంగా మలుచుకోవడం,వీలైనంత లాభం గడించుకోవడం అన్నిరంగాలలో,ప్రాంతాలలో,వ్యక్తులలో జరిగే విషయమే. దానికి ప్రత్యేకంగా ఆంధ్రా,తెలంగాణా తేడాలుండవు. వెతికితే ఇలాంటిపనే చేసిన తెలంగాణా బడాబాబులు మీకు కనబడొచ్చు.

కాబట్టి, ఈ ఒక్క వాదన ద్వారా ఆంధ్రావాళ్ళదంతా అతితెలివీ, తెలంగాణావాళ్ళదంతా మోసపోయే అమాయకత్వం అనే ఆర్గ్యుమెంట్ చాలా juvenile గా ఉంది.

4

Comment by teja

October 5, 2008 @ 4:23 am

vyasayam cheyatam ravale kaani ekkadaina pandinchavachhu,,,ongole lanti area lo kadavalatho water mosi pandistunnaru,,,,okka telangana ke kadu problem …guntur lo krishna nadi pakkana unchu koni kalavalu raaka andaru cotton vestunnaru paddy ki badulu….. dont high light these kind of things ,if u dont know about agriculture first know about it . Dont ever think whole coasta is as it is in movies ,,,ok .one or two districts are better thats it….
we are also struggling a lot ..

5

Comment by శశాంక

October 5, 2008 @ 10:44 am

“నా వ్యాఖ్య డిలీట్ చెయ్యబడటంతో ఇంకో టపా రాయాల్సొచ్చింది”
బుజ్జి గారు మీ వ్యాఖ్య దానికి నా సమాధానం రెండూ యధా స్థితిలో అలాగే వున్నాయండీ. ఈ లంకె చూడండి

http://sashanka.wordpress.com/2008/09/26/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6/

నేను వర్డుప్రెస్ నుండి బ్లాగరుకి మారానండి. దీనిమీద నా కొత్త/పాత బ్లాగులో ఓ టపా కూడా రాసాను. ఆ టపా చివరి వాక్యం లో ‘Comments Export’ గురించి వ్రాశాను చూడండి.

ఆ టపాకి లంకె: http://sashanka.blogspot.com/2008/10/blog-post.html

కొత్త బ్లాగు: http://sashanka.blogspot.com/
పాత బ్లాగు: http://sashanka.wordpress.com/

ఇక Comments విషయానికి వస్తే, Comments ని Delete చేసినంతమాత్రాన వాస్తవాలు మరుగున పడిపోవండీ. అది పిరికివాళ్ళు చేసే పని.

ఇంచుమించు మీరడిగిన అన్ని అంశాలమీద నా అభిప్రాయాలు అక్కడే వ్రాసాను గమనించగలరు.

“అతని నిరసనని అతను అలా ప్రకటిస్తే పెద్ద నష్టం ఏముంది”

దేనికి నా మీద నిరసన. అతను మీరన్నట్టు కనీసం రైతు కూడా కాదుకదా ఆంద్రావాళ్ళ వల్ల నష్టపోయాడని చెప్పుకోవడానికి.

“ఇదంతా రాజకీయ నాయకులు సృష్టించిన hate propaganda వల్లనే అని అంతకుమించి ఏమి లేదు అని.”

దీనిమీద మహేష్ గారికి నేనిచ్చిన రిప్లైలో చూడగలరు.

“ఆంధ్ర వాళ్ళకి భూమి కౌలుకి ఇవ్వటం కంటే బీడుగా వదిలెయ్యటమే మేలు అనుకునే చాలా మంది రైతులలో మా నాన్న కూడా ఒకరు.”

ఇది మీ పరిధిలో ఉన్న ఒక అంశం మాత్రమే (అలాగే నేను చెప్పినవి కూడా). మరి మిగతా తెలంగాణా ప్రాంతాల మాటేమిటి. అక్కడ కూడా ఇలాగే జరుగుతుందా. ఇలా ఎంతమంది ఆంధ్రావాళ్ళు అక్కడ భూములు కొన్నారు. ఆంధ్రావాళ్ళు అందరూనా ? ప్రత్యేక తెలంగాణా ఇస్తే అ ప్రాంత రైతుల సమస్యలు ఏరకంగా తీరతాయో మీరు చెబుతారా.

తెలంగాణా వెనకబడి ఉండటానికి గల శతకోటి అంశాల్లో ఆంధ్రా పాలకులు( రాజకీయ నాయకులు ) ఒక అంశం మాత్రమే. దానికి ఆంధ్రా వాళ్ళు ఎంతవరకు బాధ్యులు.

6

Comment by sujata

October 5, 2008 @ 1:22 pm

Interesting. We are from Orissa and are now settled in AP. I see lot of Oriya and Bengali speaking work force in Hyderabad, than locals. It intersts me, to know about Telangana and Andhra dispute and its all possible outcomes, since I feel that it affects us to a large extent.

7

Comment by bujji

October 6, 2008 @ 12:55 pm

@mahesh garu
నేను భూములు చీప్ గా కొనడానికి సంబంధించి అది కేవలం ‘వీళ్ళు అమ్మటం- వాళ్ళు కొనటం’ మాత్రమే కాదు అంతకు మించిన విషయమే అని చెప్పటానికి రాసాను. అది కూడా చెప్పకూడదంటే ఎలా?
కానీ ఎక్కడైనా మోసం చేసేవాళ్ళు అతితెలివి ఉన్నవాళ్ళు, మోసపొయేవాళ్ళు అమాయకులు లేదా ఎదిరించలేనివాళ్ళు మాత్రమే అవుతారండీ.
మీ ఊళ్ళో ఎవరైనా ఇలాగే చేస్తే, ఇది చాలా సహజమైన విషయం, ఎవరైన ఇలాగే చెస్తారు, మా ఆంధ్ర బడా బాబులు తెలంగాణా లో ఇలాగే చేస్తున్నారు అనేసి మాట్లాడకుండా ఊరుకుంటారా? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వివక్షకి గురైనప్పుడు అంధ్ర వాళ్ళు ఇది చాలా సహజమైన విషయం అని సర్దుకుపోయారా?

@teja
vyasayam cheyatam ravale kaani ekkadaina pandinchavachhu,లాంటి డైలాగులు బ్లాగులలో ఎన్నన్నా రాయొచ్చు. అసలు కష్టం అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది.నేను ఆంధ్రలో అసలు కష్టాలే లేవనలేదే? అంత ఎందుకు ఆవేశపడుతున్నారు? మా ప్రాంతం గురించి నాకు తెల్సిన విషయాలు నేను చెప్పాను. మీరు కావలనుకుంటే ఒంగోలు-కడవలు-కష్టాల గురించి కథలు రాయండి నాకేం అభ్యంతరం లేదు. నేనూ చదువుతాను. ఇక్కడి వాళ్ళూ కష్టపడే పని చేస్తున్నారు, కాకపోతే ఫలసాయం అంత విద్యుత్ బోర్డుకి సమర్పించుకుంటున్నారు అనేదే నా బాధ.
మా నాన్న కూడా వ్యవసాయదారుడే. వ్యవసాయం గురించి నాకు కొంత తెలుసు. మీరేమన్నా కొత్తగా చెప్తే నేర్చుకొవటానికి నాకేం అభ్యంతరం లేదు.

8

Comment by bujji

October 6, 2008 @ 1:45 pm

@Sasanka garu,
Firstly, I am sorry for the mistake. export గురించి రాసిన పోస్ట్ చదవటం మిస్సయ్యాను.
విషయానికొస్తే,ఆ ఆటొవాడు ఏం నష్టపోయాడో మీకు తెలీదు కదండీ. మనం నేరుగ నష్టపొతేనే బాధ కలుగుతుందా చెప్పండి? ఇండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపొతే కూడా బాధ పడతాం కదా. ఎందుకు, మనం స్వయంగా ఆడుతున్నామనా? ఇదీ అంతే.
భూమినీ,జీవనాధారాన్నీ కోల్పోయిన ప్రజలు ఇంకా ఎందుకు నమ్మాలో నాకర్థం కావట్లేదు. నమ్మటనికి ఏదో ఒక్క రీజనన్నా ఉండాలి కదా. నమ్మదగ్గ విషయాలు ఏమున్నాయని నమ్మమంటారు?
ఆంధ్ర వాళ్ళు అందరూ కొంటే తప్ప అన్యాయం అని అనిపించదా అండీ మీకు?
‘కృష్ణా నీళ్ళు సీమకి,గోదావరి నీళ్ళు డెల్టాకి ‘ అని బహిరంగ సభలల్లోనే ప్రకటించేసే వై.యెస్. లాంటి ముఖ్యమంత్రులు వెళ్ళిపోవటం వల్ల రైతులకి మంచే జరుగుతుంది. ఆయన తెలంగాణా ని ఏం చేస్తాడో ఈ ఒక్క స్టేటెమెంట్ ని చూస్తేనే తెలుస్తుంది.
ఇక మీబ్లాగులో మీరు చెప్పిన విషయాలకు:
”ఎవరో కొంతమంది స్వార్ధపరులు చేసిన పనికి అందరినీ అనడం ఎంతవరకు న్యాయమండీ !”
నా ఉద్దేశం కూడా పొట్ట కూటికి హైదరాబాద్ కి వచిన వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు. ఆ కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వెళ్ళిపొవాలనే. ఎంత మోసపోయినా ఇక్కడివాళ్ళు ఇక్కడి ఆంధ్ర సెట్లర్స్ తో ప్రశాంతంగా జీవిస్తున్నారు, గమనించండి.మాకు కావలసింది అక్కడి రాజకీయ నాయకులు వెళ్ళిపోవటమే.

”వ్యక్తిగత ప్రతిభే ఉద్యోగానికి సరైన అర్హత అని నా అభిప్రాయము. ఇక 610 జీవో విషయానికి వస్తే, కేవలం ఆ జోన్ కి సంబంధించిన ఉద్యోగాలకి దీనిని అమలుచేయడం న్యాయం. కానీ మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ లో దీన్ని అమలు చేయడం ఎంతవరకు సబబు. రాష్ట్ర రాజధాని అయినందువల్ల హైదరాబాద్ లో చాలా ఉద్యోగాలు ఉంటాయి. మరి వాటిని ఏవో కొన్ని ప్రాంతాలవారికి పరిమితం చేయడం ఎంతవరకు న్యాయం”

మీకు తెలుసో లేదో కాని అన్ని ఉద్యోగాలు ఈ జివొ పరిధి కిందకు రావు. గెజిటెడ్ స్థాయికి తక్కువ ఉన్న పోస్టులు మాత్రమే దీని పరిధి కిందకు వస్తాయి.
కానీ, దీన్ని అమలు చేయాల్సిన అక్కడి అధికారులు ఏం చేసారు మరి, జీవొ అమలు చేయాల్సొచినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు కావలసిన పోస్టులనన్నీ గెజిటెడ్ పొస్టులుగా మార్చేసారు.
ఈ జోనల్ సిస్టం పెట్టినప్పుడు దిగువ స్థాయి పోస్టులకి, 85% లోకల్ అని 15% ఓపెన్ కాటగిరి అని ఇచ్చారు. కానీ దాన్ని అతితెలివి అధికారులు, 85%లోకల్ అని మిగిలిన 15% నాన్ లోకల్ కి రిజర్వుడ్ అని అతి తెలివి ఇంటర్ ప్రీట్ చేసి మళ్ళీ అన్యాయమే చేసారు.
ఇవన్నీ ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి?
వెళ్ళిపోవాల్సింది ఇలాంటి అతితెలివి రాజకీయ నాయకులు, అధికారులే. అందుకే తెలంగాణా.

9

Comment by badaa babu

November 4, 2008 @ 12:28 am

Hello everyone think I am “badaa babulu (from Andhra)”. As per author now I am buying land with help of politicians (Minsters will give blue print of project before they start).

I do same thing after getting Telaganaa state (with much cheaper), let me known “what hell he will do?”

May be he will flight for separate మెదక్ state.

I do same thing (with much more cheaper)…

May be he will flight for what ….

Where it ends??

Educate (real life education) your children, please dont deep there life with your stupid policy. Tell them “does not matter where his/her FROM, only matter his/her good person or bad person”

Here I am just showing your glass half full, you write in tapaa “your glass half empty”.

Think with your mind.

I_dont_visit_again@andhra.com

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>