బుజ్జి

Just another బ్లాగు weblog

నా బ్లాగు కథ ఏంటంటే…

Filed under: Uncategorized — bujjikanna at 1:39 pm on Saturday, September 13, 2008

ఇటీవల ఒక బ్లాగరు నా వ్యాఖ్యలు మొదట పబ్లిష్ చేసి, తర్వాత మళ్ళీ నేను అడిగిన ప్రశ్నలకు జవాబుగా నా వ్యాఖ్యలన్నీ delete చెయ్యటంతో నాకొచ్చిన చిరాకుకు ప్రతిరూపమే ఈ బ్లాగు..ఇంక ఆయన నా వ్యాఖ్యలను ”ఆయన బ్లాగు నుండి మాత్రమే” deletee చెయ్యగలరు..
ఆయన మాత్రం తెలంగాణా గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తారు, కానీ ఎవ్వరూ ఏమీ అడగకూడదు, అడిగితే ప్రాంతీయవాదం అంటారు.. నేను తెలంగాణా ప్రసక్తి తేనేలేదు అంటారు, నేను రాసిందంతా హైదరాబాదు గురించే అంటారు.. హైదరాబాదులో సమ్మక్క సారలమ్మ జాతర ఎక్కడ చూసారంటే మాత్రం వ్యాఖ్యలు delete చేసేస్తారు..క్రింద రాసింది basicగా ఆ బ్లాగరు కోసమే..
బ్లాగరు గారూ,
సమ్మక్క సారలమ్మ జాతర హైదరాబాదులో కాదు, వరంగల్ జిల్లా మేడారం గ్రామంలో చేస్తారని తెలుసా మీకు??ఒక వేళ తెలియకపోతే, మీరు delete చేసిన నా వ్యాఖ్యలలో చెప్పినట్టు సరిగ్గా తెలుసుకొని రాయటం మంచిది..ఒక వేళ తెలిసీ తెలంగాణా గురించే రాయాలని రాస్తే, ” నేను తెలంగాణా ప్రసక్తి తేనేలేదు. ” అని మీ వ్యాఖ్యలో రాయటం ఒక అబద్ధం, అది జనాలకి తెలియదనుకోవటం అతితెలివి..(ఆ వ్యాఖ్య, ప్రస్తుతానికి – ఈ టపా రాసే సమయానికి మీ బ్లాగులో ఉంది, తర్వాత దానికీ నా ఇతర వ్యాఖ్యలకి పట్టిన గతే పడుతుందేమోనని నా అనుమానం..ఐనా నా వ్యాఖ్యలన్నీ delete చేసి వాటికి మీ సమాధానం మాత్రం ఎందుకుంచినట్లో??)

మీరు జనాలని సరిదిద్దాలనుకునే ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి.లేకపోతే ”నాకు తెలిసిన మంచి చెప్పడం – అంతవఱకే నా బాధ్యత. వినడం వినకపోవడం మీ యిష్టం. చెప్పే హక్కు కూడా లేదంటే ఎట్లా ? మనుషులు ఒక వయసు వఱకే చెబితే వింటారు. ఆ తరువాత ఎవరికి వారు ఆలోచించుకుని సరిదిద్దుకోవాల్సిందే. ఇతరులు తమని సరిదిద్దబోతే మనసులోనే ఏడుస్తారు కొందఱు. పైకే తిరగబడతారు కొందఱు”–అని మీ మాటలు మీకే చెప్పాల్సొస్తుంది..